
మెట్‌పల్లిలో లారీ, కంటైనర్ ఢీ
మెట్‌పల్లి: పట్టణంలోని జాతీయ రహదారిపై శనివారం ఓ లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కపోయాడు. సుమారు రెండు గంటల పాటు తీవ్ర అవస్థలు పడగా.. పోలీసులు శ్రమించి అతడిని బయటకు తీశారు. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ కరీంనగర్ నుంచి గ్రానైట్ లోడ్‌తో మహారాష్ట్ర వైపు వెళ్తోంది. మార్గమధ్యంలో మెట్‌పల్లి ఎస్సారెస్పీ వంతెన మీదకు రాగానే ఎదురుగా కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో గ్రానైట్ లారీ ముందు భాగం దెబ్బతింది. అందులో ఉన్న డ్రైవర్ పరదేశీ కుడికాలు అందులోనే చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న డీఎస్పీ రాములు, ఎస్సైలు కిరణ్‌కుమార్, అనిల్ అక్కడకు చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు గ్రానైట్ లారీని అక్కడి నుంచి తొలగించడం కష్టంగా మారడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు రెండు క్రేన్ల సహాయంతో తొలగించారు. ట్రాన్స్‌పోర్టు సూపర్‌వైజర్ వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్
రెండు గంటల పాటు నరకయాతన

మెట్‌పల్లిలో లారీ, కంటైనర్ ఢీ