
ఒలింపియాడ్‌లో అల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు
కొత్తపల్లి: అల్ఫోర్స్ ఈ– టెక్నో పాఠశాల విద్యార్థులు జోనల్‌స్థాయి అంతర్జాతీయ సాంఘికశాస్త్ర ఒలింపియాడ్ పోటీల్లో బంగారు పతకాలను సాధించడంతో వారిని అల్ఫోర్స్ విద్య సంస్థల ఆధినేత వి.నరేందర్‌రెడ్డి శనివారం అభినందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు బొంగోని కార్తికేయ, హరిశ్రీ హరిణి, ఎం.విఘ్నేష్చంద్ర, హిమేశ్‌చంద్ర బంగారు పతకాలను సాధించడం జరిగింది.
టైనీటాట్స్‌లో గ్రాడ్యుయేషన్ డే
అల్ఫోర్స్ టైనీటాట్స్ పాఠశాలలో శనివారం యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యూయేషన్ డే నిర్వహించారు. అల్ఫోర్స్ విద్య సంస్థల ఆధినేత వి.నరేందర్‌రెడ్డి చిన్నారులకు పట్టాలు అందజేశారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.