
విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘ఎల్‌సీ’
● యాప్‌తో సిబ్బంది భద్రతకు భరోసా
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా మానవ తప్పిదాల వల్ల ప్రమాదాల నివారణకు టీజీఎన్‌పీడీసీఎల్ సంస్థ ఎల్‌సీ (లైన్ క్లియర్) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్‌సీ తీసుకొని పనులు చేపడుతున్న సమయంలో చాలా మానవ తప్పిదాలు చోటుచేసుకోవడం, ఒక ఫీడర్‌కు బదులు మరో ఫీడర్ ఎంచుకోవడం, సమాచార లోపం తదితర కారణాల వల్ల ఉద్యోగులు ప్రమాదా లకు గురవుతున్నారు. దీంతో యాజమాన్యం ఎల్‌సీ యాప్‌ను రూపొందించింది.
ఎల్‌సీ యాప్ అమలు విధానం
మొదట ఎల్‌సీ తీసుకోవాలనుకునే లైన్‌మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్‌లో ఎల్‌సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించాలి. ఏఈ లైన్‌మెన్ విన్నపాన్ని ప రిశీలించి ఆ ఫీడర్‌లో ఎల్‌సీ ఇవ్వచ్చా, లేదా.. అత్యవసర అ వసరాలేమైనా ఉన్నాయా, మరే ఇతర షెడ్యూల్ చేయబ డిన పనులు ఉన్నాయా అని ఆలోచించి నిర్ణయం తీసుకో వాల్సి ఉంటుంది. ఏఈ అనుమతి ఇవ్వగానే సంబంధిత లై న్‌మెన్‌కి సమాచారం వెళ్తోంది. అలాగే సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు ఏ ఫీడర్ ఇవ్వాలో యాప్ ద్వా రా తెలుస్తోంది. ఎల్‌సీ ఇవ్వాల్సిన సమయంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఏమరపాటుగా చేసే పొరపాట్లను నివారించుటకు యాప్ తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తుంది. అనగా.. హెల్మెట్ పెట్టుకోవాలని, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వెయ్యాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అన్న విషయాలను యాప్ గుర్తు చేయనుంది. వీటన్నింటినీ సబ్ స్టేషన్ ఆపరేటర్ ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ ఫొటోను యాప్ ద్వారా లైన్‌మెన్ చూసుకొని ఆ ఫొటోలో కన్పిస్తున్న ఫీడర్, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అని ధ్రువీకరించుకొని పనికి ఉపక్రమించాల్సి ఉంటుంది. పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైతం యాప్‌లో సూచించనున్నాయి. లైన్‌మెన్ ఎంత మంది సిబ్బంది చేత పని చేయిస్తున్నాడో వారి పేర్లు యాప్‌లో పొందుపరచాలి. పని పూర్తికాగానే లైన్‌మెన్ ఆ పనికి సంబంధించిన ఫొటో, సిబ్బంది వచ్చారా లేదా అని యాప్‌లో పొందుపరచి ఎల్‌సీ రిటర్న్ చేయాల్సి ఉంది. దీంతో సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా ఎల్‌సీ రిటర్న్ ఆదేశాలు వెళ్లనున్నాయి. అప్పుడు సబ్ స్టేషన్ ఆపరేటర్ ఎల్‌సీ రిటర్న్ చేసే క్రమంలో ఎర్త్ రాడ్ తీసారా, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అని యాప్ అడుగుతోంది. ఇలా ఎల్‌సీ పూర్తయి సంబంధిత ఏఈకి సమాచారం వెళ్తుంది.
ప్రమాదాల నివారణకు..
విద్యుత్ సేవల్లో భాగంగా మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు సంస్థ ఎల్‌సీ యాప్‌ను రూపొందించింది. యాప్‌తో ఉద్యోగుల మధ్య సమన్వయంతో పాటు ఏ లైన్‌పై పనులు చేపడుతున్నారో తెలియజేయనుంది. దీంతో భద్రతా ప్రమాణాలు పెరిగి ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే అనవసరమైన ఎల్‌సీలను తగ్గించవచ్చు.
– రమేశ్‌బాబు,
ఎస్‌ఈ, కరీంనగర్ సర్కిల్

విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘ఎల్‌సీ’