కనుల పండువగా రామయ్య పట్టాభిషేకం
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఇల్లందకుంట రాములోరి పట్టాభిషేకం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రామయ్యకు కిరీటాన్ని ధరించారు. వివిధ నదుల తీర్థాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై స్వామివారిని ఊరేగింంచారు. 108 స్వర్ణ పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు వంశీధరచార్యులు, సీతారామాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారు హంసవాహనంపై దర్శనమిచ్చారు.
పట్టువస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి
కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టభిషేకానికి హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు అందజేజేసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, కడారి కుమారస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు అనిల్‌రెడ్డి, రమణారెడ్డి, సంపత్‌రావు, శ్రీరామ్ శ్యాం, మల్లేశ్, పల్లపు రవి, పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– ఇల్లందకుంట
న్యూస్‌రీల్
కనుల పండువగా రామయ్య పట్టాభిషేకం
కనుల పండువగా రామయ్య పట్టాభిషేకం


