అమ్మా.. ఆలకించరూ!
● ప్రజావాణిలో కలెక్టర్‌తో బాధితుల ఏకరవు ● సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు
కరీంనగర్ అర్బన్: సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ బాట పట్టారు బాధితులు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సాంత్వన కరవైందని వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్‌లు అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల అర్జీలే ఎక్కువగా వచ్చాయి. మొత్తం 246 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో సుధాకర్ తెలిపారు.
ప్రజావాణికి వచ్చిన అర్జీలు: 246
ఎక్కువగా మునిసిపల్ కార్పొరేషన్,
కరీంనగర్: 41, ఆర్డీవో కరీంనగర్: 18
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 13
డీపీవో: 13, వీణవంక తహసీల్దార్: 9


