
తాగునీటి అవసరాలకే..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ