‘భూ భారతి’కిమద్దూరు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘భూ భారతి’కిమద్దూరు ఎంపిక

Published Tue, Apr 15 2025 12:21 AM | Last Updated on Tue, Apr 15 2025 12:21 AM

‘భూ భారతి’కిమద్దూరు ఎంపిక

‘భూ భారతి’కిమద్దూరు ఎంపిక

పైలెట్‌ ప్రాజెక్టుగా అందుబాటులోకి..

పోర్టల్‌పై నేటి నుంచి అవగాహన సదస్సులు

నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్‌ ను సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ బెన్‌షాలం సూచనలతో తహసీల్దార్‌ మహేశ్‌ గౌడ్‌, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు.

● మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్‌, చెన్నారెడ్డిపల్లి, చింతల్‌దిన్నె దమ్‌గన్‌పూర్‌ దొరెపల్లి, జాదరావ్‌పల్లి, ఖాజీపూర్‌, లక్కాయపల్లి, మద్దూర్‌, మల్కిజాదవ్‌రావ్‌పల్లి, మొమినాపూర్‌, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్‌, పల్లెర్ల, పర్సపూర్‌, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నా యి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండలంలో 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్‌ఐ, ఒకరు సర్వేయర్‌ విధుల్లో ఉన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూరుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement