
బాలీవుడ్ నటుటు అమితాబ్ బచ్చన్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సరదా పోస్టులతో అలరిస్తుంటారు. అయితే ట్విటర్ వేదికగా మరోసారి తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు బిగ్ బీ. ఈ సందర్భంగా తన ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలో సలహా ఇవ్వండని కోరారు. ప్రస్తుతం నాకు 49 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని.. ఆ సంఖ్యను పెంచేందుకు సలహా ఇవ్వమని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ తమకు నచ్చిన విధంగా అమితాబ్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులతో నింపేస్తున్నారు. మరి వారిచ్చిన సలహాలేవో చూసేద్దాం పదండి.
అయితే అమితాబ్ పోస్ట్‌కు పలువురు నెటిజన్స్ స్పందించారు. కొందరైతే మీ సతీమణి జయాబచ్చన్‌తో ఓ వీడియో చేసి పోస్ట్ చేయండని సలహా ఇచ్చారు. మరికొందరేమో కేవలం పెట్రోల్ ధరల గురించి మాట్లాడితే ఒక్కరోజులో మీ సంఖ్యం 50 మిలియన్ల మంది ఫాలోవర్లు దాటిపోవడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ఏకంగా నటి రేఖను పెళ్లి చేసుకోవాలని సరదాగా పోస్ట్ చేశాడు. ఒకరేమో జయా బచ్చన్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయండని వారికి తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.

అయితే చాలా మంది నటి రేఖ పేరు ప్రస్తావించడంపై నెట్టింట చర్చ మొదలైంది. దీనికి కారణం వీరిద్దరు కలిసి గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అమితాబ్- రేఖ.. దో అంజానే, అలాప్, ఖూన్ పసీనా, గంగా కీ సౌగంద్, రామ్ బలరామ్, సిల్‌సిలా లాంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు. వీరి జోడీపై గతంలో చాలా రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తర్వాత అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ ఆయన జయా బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా కల్కిలో కనిపించిన అమితాబ్.. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షోకు హోస్ట్‌గా పనిచేశారు.
T 5347 - बड़ी कोशिश कर रहे हैं, लेकिन ये 49M followers का नंबर बढ़ ही नहीं रहा है ।
कोई उपाय हो तो बताइए !!!— Amitabh Bachchan (@SrBachchan) April 13, 2025