
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
(ఇది చదవండి: 'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు)
అయితే ఊహించని విధంగా జాట్ మూవీకి కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోతోంది. తొలిరోజు కేవలం రూ.11 కోట్లకే పరిమితమైన జాట్ .. నాలుగు రోజులైనా ఇప్పటి వరకు యాభై కోట్ల మార్క్ దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో(Day 3 Collection) కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈనెల 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో కేవలం రూ.49.3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. కాగా.. ఈ చిత్రం విలన్‌గా రణ్‌దీప్ హుడా నటించారు.
A SENSATIONAL FIRST WEEKEND for #Jaat at the box office ❤️🔥#JAAT collects 49.3 CRORES+ DOMESTIC GBOC in 4 days 💥💥
Book your tickets for the MASS FEAST now!
▶️ https://t.co/sQCbjZ5zOE#BaisakhiWithJaat
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand… pic.twitter.com/BNlBTSjYZX— Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2025