
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ మరో బిగ్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు.
రేపు(సోమవారం) ఉదయం 10.08 నిమిషాలకు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ బ్లాస్ట్ ఏంటో తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.
The FUN BOMB is ready to EXPLODE 💣
— Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2022
Blasting Tomorrow @ 10:08 AM💥#F3Movie #F3OnMay27 @VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @sonalchauhan7 @Mee_Sunil @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/rI6H4NtJ5A