
Puneeth Rajkumar Funerals: పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి జూ. ఎన్టీఆర్ నివాళులర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ఆయన పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను ఓదార్చారు. మరికాసేపట్లో చిరంజీవి బెంగళూరుకు చేరుకోనున్నారు.ఇప్పటికే బాలకృష్ణ పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటునరేశ్, శివబాలాజీ పునీత్‌కు నివాళులు అర్పించారు.
పునీత్ రాజ్‌కుమార్‌న కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. పేరుకు కన్నడ హీరో అయినప్పటికి పునీత్ రాజ్‌కుమార్‌కు టాలీవుడ్ హీరోలతో మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయనను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.
చదవండి: Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ ఇదే!
శోక సంద్రంలో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు... వారి భయమే నిజమైంది