funerals
-
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ
మల్కాపురం: మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను -
ముగిసిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు
-
అంత్యక్రియలయ్యాక నాలుగు రోజులకు..
ఇల్లంతకుంట(మానకొండూర్): ఓ వ్యక్తి అంత్యక్రియలు పూర్తయిన నాలుగు రోజులకు మృతుడి ఎముకలు సేకరించిన ఘటన ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం గ్రామానికి చెందిన పెంటల శ్రీనివాస్(35) గత శుక్రవారం రాత్రి ఇంట్లోనే నిద్రించాడు. శనివారం ఉదయం అతను మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అదేరోజు సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, శ్రీనివాస్ మృతిపై అనుమానం ఉందని బంధువుల్లో ఒకరు ఇల్లంతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో తహసీల్దార్ ఎంఏ.ఫారుక్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు ఫాతిమా మంగళవారం ఓబులాపురం చేరుకున్నారు. మృతుడిని దహనం చేసిన స్థలానికి వెళ్లి, వైద్య సిబ్బంది సహకారంతో ఎముకలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. -
నోయెల్ టాటాకు మోదీ ఫోన్.. అంత్యక్రియలకు అమిత్‌షా
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి.. విలువలు, దాతృత్వానికి పెట్టింది పేరు. విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడంతోపాటు మంచి స్వభావం గల వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మన మధ్యలేరనే నిజాన్ని అంగీకరించడం ఎవరి వల్ల అవ్వడం లేదు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు భారత్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ముంబైలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని నోయెల్‌కు మోదీ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల లావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రతన్ టాటా అంత్యక్రియలను అమిత్ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata being taken to NCPA lawns for the public to pay their last respectsHe will be accorded state funeral this evening. pic.twitter.com/6JUgirUqkG— ANI (@ANI) October 10, 2024మరోవైపు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పార్దివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. అనంతరం ఉదయం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) గ్రౌండ్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. వ్యాపార దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికేందుకు సామాన్య ప్రజలు, ప్రముఖులు బారులు తీరనున్నారు.అంతకముందు రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన ధోరణి ఆచరణాత్మకమని, దయార్ద్ర హృదయంతో మెరుగైన సమాజం కోసం అనుక్షణం తపించే వారిని ప్రధాని కొనియాడారు. -
చిట్టితల్లి చేతికి చితికుండ
మిరుదొడ్డి(దుబ్బాక): ఆరేళ్ల ప్రాయం.. లోకమేమిటో తెలియని చిన్నారి.. చితి కుండ పట్టుకుంది. తండ్రికి తలకొరివి పెట్టింది. వివరాలివి. మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన బోయిని నాగరాజు (28)గురువారం గుండె పోటుతో మృతి చెందాడు. అతనికి భార్య నవ్య, ఆరేళ్ల కూతురు శివాని ఉన్నారు. కొడుకుల్లేక పోవడంతో శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల్లో కూతురు శివాని తలకొరివి పెట్టింది. తండ్రి శవయాత్రలో చితికుండతో నడుస్తున్న ఆమెను చూసినవారు కంటతడి పెట్టారు. -
ప్రభుత్వ లాంఛనాలతో నేడు అగర్వాల్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/సంతోష్‌నగర్: అగ్ని క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్, దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. గురువారం కన్ను మూసిన అగర్వాల్ అంత్యక్రియలు శనివారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక క్షిపణి తయారీ కార్యక్రమంలో డాక్టర్ అరుణాచలం, డాక్టర్ అబ్దుల్ కలాంతో కలసి అగర్వాల్ పనిచేశారు. అగర్వాల్ హైదరాబాద్‌లోనే నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు. ఇదిలా ఉండగా డీఆర్డీఓ హైదరాబాద్ ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ ఆర్అండ్డీలో ఉద్యోగులు శుక్రవారం అగర్వాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ అండ్ ఎస్టేట్ మేనే జర్ షేక్ గౌస్ మోహినుద్దీన్ పాల్గొన్నారు. -
నావల్నీ అంత్యక్రియలకు చర్చిలు నిరాకరించిన వేళ..
మాస్కో: ఇటీవల అనుమానాస్పదంగా జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు చర్చిలేవీ స్వచ్ఛందంగా ముందుకు రావడ లేదు. అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహిస్తారన్న భయమే ఇందుకు కారణమని నావల్నీ సంస్థ అధికార ప్రతినిధి ఆరోపించారు. ‘‘నావల్నీ పేరు చెప్పగానే ఇప్పటికే బుకింగ్ అయిపోయాయంటూ చాలా చర్చిల నిర్వాహకులు తప్పించుకున్నారు. ఎట్టకేలకు మాస్కో శివార్లలోని మేరీనో పట్టణంలో ఉన్న మదర్ ఆఫ్ గాడ్ క్వెంచ్ మై సారోస్ చర్చి నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు ముందుకొచ్చింది’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘వాస్తవానికి గురువారమే అంత్యక్రియలు పూర్తిచేద్దామనుకున్నాం. కానీ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగం ఉండటంతో ఆ రోజు అంత్యక్రియలకు చర్చిలేవీ ముందుకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం ఖననం చేయనున్నాం’ అని చెప్పారు. -
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్‌కరణ్‌సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్‌కరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్‌కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్‌కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్‌వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్‌కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
సుశాంత్ ఆత్మహత్య.. అందుకే వెళ్లలేదన్న మాజీ ప్రియురాలు!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎంస్ ధోని సినిమాతో సినీ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా సుశాంత్ మరణించారు. ముంబయిలోని తన గదిలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్-17 జరుగుతోంది. ఈ రియాలిటీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో బాలీవుడ్ నటి, సుశాంత్ ప్రియురాలు అంకితా లోఖాండే కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఉన్న ఆమె తన మాజీ ప్రియుడు సుశాంత్‌ను గుర్తుకు తెచ్చుకుంది. అతని గురించి మరో కంటెస్టెంట్ మునావర్ ఫారూఖీతో మాట్లాడింది. అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. మునావర్ ఫరూఖీతో మాట్లాడుతూ.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సుశాంత్ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్లే నేను అతని అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఈ విషయం తెలిసి కూడా నేను వెళ్లలేకపోయాను. ఆ పరిస్థితిలో నేను సుశాంత్‌ను చూడలేను. విక్కీ నన్ను వెళ్లమని చెప్పాడు. కానీ నేనే నిరాకరించాను. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదు. మొదటిసారి మా నాన్నని అలా చూశా. ఒక వ్యక్తిని కోల్పోతే కలిగే నష్టాన్ని నేను గ్రహించా. కాగా.. అంకిత తండ్రి శశికాంత్ లోఖండే ఈ ఏడాదిలోనే మరణించారు. అంకిత ప్రస్తుతం బిగ్ బాస్ -17లో తన భర్త విక్కీ జైన్‌తో కలిసి పాల్గొంది. వీరిద్దరు 2021లో పెళ్లి చేసుకున్నారు. #AnkitaLokhande talks abt SSR, what a great man he was, his funeral, how it’s difficult talking abt him in past tense n breaks down remembering him n her dad ❤️#BB17 #BiggBoss17 pic.twitter.com/MWUshVXPG0 — Rachit (@rachitmehra_2) November 20, 2023 -
అవయవదాతలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదాతల అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని ప్రకటించారు. అవయవదానంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని స్టాలిన్ తెలిపారు. తాజా ప్రకటన అవయవదానానికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే తమిళనాడు ఈ స్థానంలో ఉందని స్టాలిన్ కొనియాడారు. అవయవదాతలకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు -
అనంతనాగ్ ఎన్కౌంటర్లో మేజర్ ఆశీష్ వీరమరణం
-
గుండె బరువుతో పాటకు సెలవు..
సాక్షి, సిటీబ్యూరో/అల్వాల్/ గన్‌పౌండ్రి: ప్రజా యుద్ధనౌక ఇక సెలవంటూ తరలివెళ్లింది. తన పదనునైన గళంతో, ఉర్రూతలూగించే పాటలతో అర్ధ శతాబ్దం పాటు యావత్ సమాజాన్ని ప్రభావితం చేసిన సాంస్కృతిక యోధుడు, ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం అల్వాల్ భూదేవినగర్‌లో ఆయన స్థాపించిన మహాబోధి పాఠశాలలో ముగిశాయి. వేలాదిమంది అభిమానులు, వివిధ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలమైన భూమికను పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేసిన గద్దర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. బౌద్ధమత సాంప్రదాయం ప్రకారం గద్దర్ తనయుడు సూర్య అంత్యక్రియల క్రతువును నిర్వహించారు. బౌద్ధమత గురువులు పంచశీల సూత్రాలను పఠించారు. అనంతరం గద్దర్ పార్థివదేహాన్ని సమాధి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. గద్దర్ భార్య విమలను, కుటుంబసభ్యులను పరామర్శించారు. మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, తలసాని తదితరులు సీఎం వెంట ఉన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా అల్వాల్‌లో గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు దానం నాగేందర్, టి.రాజయ్య, జీవన్‌రెడ్డి, మంచు మోహన్‌బాబు, మనోజ్, అలీ, నాగబాబు, నిహారిక, పరుచూరి గోపాలకృష్ట, ఆర్.నారాయణమూర్తి, ప్రొఫెసర్ కోదండరాం, జయప్రకాశ్ నారాయణ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, అనగాని సత్యప్రసాద్, జనార్ధన్, పరిటాల శ్రీరామ్, వివేక్, మోత్కుపల్లి నరసింహులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. భూదేవినగర్, వెంకటాపురం ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. అంత్యక్రియలకు ప్రముఖులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మల్లు రవి ,శ్రీధర్‌బాబు, మాభూమి చిత్ర దర్శకులు నర్సింగ్ రావు, ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య, జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్, విమలక్క, బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న, బాల్క సుమన్, క్రాంతి, గెల్లు శ్రీనివాస్, పల్లె రవి, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జర్నలిస్టు పాశం యాదగిరి, వేదకుమార్, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దారంతా జన ప్రభంజనం తెలుగు ప్రజల సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ అంతిమయాత్ర మహాజన ప్రభంజనాన్ని తలపించింది. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు రహదారులు జసందోహంతో పోటెత్తాయి. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన గద్దర్ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ (అంబేడ్కర్ విగ్రహం), సికింద్రాబాద్ మీదుగా సాయంత్రం 4 గంటలకు అల్వాల్‌కు చేరుకుంది. వాహనానికి జై భీం జెండాలతో పాటు బుద్దుడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద కళాకారులు పాటలతో శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ పార్థివదేహాన్ని ఉంచిన వాహనానికి ముందు, వెనుక వేలాదిగా కదిలివచ్చిన అభిమానులు ‘అమర్ రహే గద్దర్’, ‘జోహార్ గద్దరన్న’ అంటూ ఇచ్చిన నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఎల్బీ స్టేడియంలో ఘన నివాళులు ఎల్బీ స్టేడియంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రి జానారెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రత్యేక వేదికలు.. కటౌట్లు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. ఎక్కడికక్కడ వాహనాన్ని నిలిపివేసి ఆయన భౌతికకాయానికి నమస్కరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. దారి పొడవునా అక్కడక్కడా పెద్ద ఎత్తున గద్దర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రజా నాట్యమండలి, జన నాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన కళాకారుల ఆట, పాటల నడుమ గద్దర్ అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో విషాదం సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ కన్నుమూత గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో అల్వాల్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చిక్కుకున్న సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (63) తీవ్రమైన నీరసంతో జనంమధ్యలో పడిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు చెప్పారు. గద్దర్‌కు సన్నిహితుడైన జహీరుద్దీన్ ఆదివారం నుంచి ఆయన భౌతికకాయం వద్దే ఉన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్ర, ఆయన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన ఉర్దూ పత్రికారంగానికి ఎనలేని సేవలు చేశారన్నారు. జహీరుద్దీన్ కుటుంబసభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జహీరుద్దీన్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఆకస్మిక మరణం పట్ల, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర వహించి చెరగని ముద్ర వేశారని, దేశంలోని ఉర్దూ జర్నలిజానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు. వ్యక్తిగతంగా జహీరుద్దీన్ అలీఖాన్‌తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గుర్తు చేసుకున్నారు. అతని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కలి్పంచాలని భగవంతుడిని కోరారు. జహీరుద్దీన్ మృతిపై ఇంకా ఏఐఎంఎస్ఎస్ రాష్ట్ర ఇన్చార్జి సీహెచ్.ప్రమీల, ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌రాజ్, ఏఐడీవైఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వై.నాగరాజు సంతాపం తెలిపారు. కలం.. గళం 24 గంటల్లోనే లోకాన్ని విడిచిన ఆప్తమిత్రులు ప్రజాయుద్ధనౌక గద్దర్, ‘సియాసత్’జహీరుద్దీన్ సాక్షి, హైదరాబాద్: అవును వారిద్దరూ ఆప్తమిత్రులు... ఎన్నో ఆలోచనలు..మరెన్నో చర్చలు..ఇద్దరూ సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన వారే.. 24 గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లారు. వారిలో ఒకరు తన ఆటాపాటతో విప్లవ, తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిలూదితే.. మరొకరు పత్రిక ద్వారా మైనారిటీ, బడుగు బలహీనవర్గాల పక్షాన నిలిచారు. వారే ప్రజాయుద్ధనౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు.. మరొకరు సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్. వారిద్దరూ సియాసత్ కార్యాలయంలో గంటల తరబడి చర్చల్లో మునిగితేలేవారు. గద్దర్ వారానికోసారైనా సియాసత్ కార్యాలయానికి వెళ్లడం అక్కడ సామాజిక, రాజకీయ అంశాలే కాకుండా ప్రజానీకం సమస్యలపై తరచు చర్చలు సాగించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వీరిద్దరూ కీలకభూమిక పోషించారు. సియాసత్ తరఫున నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు సంబంధించి జహీరుద్దీన్అలీఖాన్ గద్దర్‌తో చర్చించేవారు. గద్దర్ మరణించిన వార్త తెలిసి జహీరుద్దీన్ చలించిపోయారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్‌లోని వెంకటాపూర్ వరకు పార్థివదేహం వెళ్లిన వాహనంలోనే ఆయన వెళ్లారు. అక్కడ దిగిన తర్వాత గద్దర్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో ఒక్కసారిగా జనం తోపులాట ఎక్కువ కావడం, ఆ మధ్యలోనే జహీరుద్దీన్ పడిపోవడం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. దగ్గర్లోని ఆస్పత్రికి ఆయన్ను తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అందరివాడు గద్దర్ అన్ని రంగాలు, వర్గాలతో సన్నిహితంగా మెలిగిన ప్రజాగాయకుడు సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం..పీడిత వర్గాల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించిన గొంతు అది..పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులను సైతం లెక్క చేయక నిలబడి కొట్లాడిన గళం అది..అయినాసరే గద్దర్ అజాత శత్రువుగానే బతికారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు తన విధానాన్ని సుస్పష్టం చేశారు. తన వ్యవహార శైలితో సమాజంలోని అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. రాజకీయ పారీ్టలకతీతంగా ప్రముఖ నాయకులందరితోనూ సాన్నిహిత్యాన్ని సంపాదించారు. కళాకారుడిగా, రచయితగా సినీరంగంతోనూ ఆయన అనుబంధం కొనసాగింది. గద్దర్ మరణ వార్తతో అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక సోమవారం జరిగిన గద్దర్ అంతిమయాత్ర ఆసాంతం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. 1972 నుంచి 2012 వరకు నాలుగు దశాబ్దాల విప్లవ ప్రస్థానంలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ గద్దర్ తన పాటలతో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదారు. ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాట గొంతుకగా నిలిచారు. నిక్కచ్చిగా మాట్లేడే తత్వమే గద్దర్‌కు ఎంతో మందిని దగ్గర చేసింది. మావోయిస్టు ఉద్యమాలకు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన అందించిన తోడ్పాటును గుర్తుచేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా బాధించిందని పేర్కొంది. మరోవైపు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రశ్నించిన ప్రజాయుద్ధ నౌక అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వమే అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఉద్యమ సమయంలో, అనేక ఎన్కౌంటర్ల సమయంలో పోలీసులతో ఎన్నో అంశాలపై కొట్లాడిన గద్దర్‌కు నివాళులర్పించేందుకు ఒకప్పటి ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్ సైతం వచ్చారు. గద్దర్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయన అభిమానులు, తోటి రచయితలు, అంతిమయాత్రలో పాదం కలిపారు. మావోయిస్టు ఉద్యమంతో దశాబ్దాలు గడిపిన గద్దర్‌కు చివరి గడియల్లో పోలీసు తుపాకులు గౌరవ వందనం సమర్పించడం.. ఆయన అందరివాడన్న దానికి మరో నిదర్శనంగా నిలిచింది. -
రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో జూన్ 18న ఆదివారం ఆకస్మాత్తుగా మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి సాయంగా నిలిచిన డ్యాన్స్ మాస్టర్ మృతిని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. (ఇది చదవండి: Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్) టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అలాంటి మాస్టర్‌కు తోటి కొరియోగ్రాఫర్స్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ హైదరాబాద్‌లోని బోరబండలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషాద సమయంలో ఆయనతో పనిచేసిన కొరియోగ్రాఫర్స్, స్టూడెంట్స్ సగర్వంగా తుది వీడ్కోలు పలికారు. సత్య, బషీర్ మాస్టర్‌తో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ చేస్తూ సాగనంపారు. రాకేశ్ మాస్టర్ అంత్యక్రియల్లో భారీగా అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
నాడు కరోనాతో భర్త మృతి.. ఇప్పుడు సమాధి తవ్వి అస్తికలు తీసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన తన భర్త అస్తికల కోసం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన భర్తను ఖననం చేసిన ప్రాంతంలో ఏకంగా తవ్వకాలు జరిపింది. అనంతరం, అతడి అస్తికలను స్వగ్రామంలో ఖననం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన జే పాల్, జాలీ పాల్ జంట యూపీలోని ఫరూఖాబాద్‌లో నివాసం ఉంటోంది. అయితే, కరోనా సమయంలో వైరస్ కారణంగా భర్త ఈజే పాల్ మృతి చెందాడు. లాక్డౌన్ కారణంగా భర్త మృత దేహాన్ని ఆమె కేరళలోని అతని స్వగ్రామానికి తీసుకువెళ్లలేకపోయింది. భర్త మరణానంతరం ఆమె మాత్రం తిరిగి కేరళ వెళ్లిపోయింది. అయితే, ఆమె తన భర్త అందించిన ప్రేమను మరచిపోలేకపోయింది. దీంతో, జాలీ పాల్ తన భర్త అస్థికలను కేరళ తీసుకువెళ్లి, అక్కడ తిరిగి ఖననం చేసేందుకు ఫరూఖాబాద్‌లోని శ్మశాన వాటికలో తవ్వకాలు జరిపేందుకు జిల్లా అధికారుల అనుమతి కోరింది. ఆమె వినతిని స్వీకరించిన అధికారులు పాల్ సమాధిని తవ్వేందుకు అనుమతినిచ్చారు. స్థానిక మెజిస్ట్రేట్ సమక్షంలో పాల్ సమాధి తవ్వకాలు జరిపి, అస్థికలను వెలికితీశారు. ఇప్పుడు జాలీ పాల్ వీటిని తీసుకుని కేరళ వెళ్లి, అక్కడ వాటిని ఖననం చేయనుంది. ఈ సందర్భంగా జాలీ పాల్ మాట్లాడుతూ తన భర్త పాల్ సెంట్ ఏంథనీ స్కూలులో టీచర్ అని తెలిపింది. కరోనా కాలంలో తన భర్త మృతి చెందాడని, లాక్డౌన్ కారణంగా తన భర్త మృతదేహాన్ని కేరళ తీసుకువెళ్లలేకపోయానని పేర్కొంది. అందుకే ఇప్పుడు భర్త అస్థికలను కేరళ తీసుకువెళ్లేందుకు అధికారుల అనుమతి తీసుకున్నానని స్పష్టం చేసింది. వాటిని కేరళలోని తమ స్వగ్రామంలో ఖననం చేయనున్నానని పేర్కొంది. ఇది కూడా చదవండి: రెండేళ్ల ప్రేమ, పెళ్లి మండపం నుంచి వరుడు పరార్.. చివరకు.. -
శరత్ బాబుకు తుది వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
సీనియర్ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, సన్నిహితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాగా.. శరత్ బాబు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబు కోలుకోలేక మృతి చెందారు. (ఇది చదవండి: చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో..) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. -
కుమారుడి సమాధి పక్కనే అతీక్ ఖననం.. పటిష్ఠ భద్రతతో అంతిమయాత్ర
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని కసారి మసారి శ్మశాన వాటికలో ఇద్దరిని ఖననం చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ, అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసు, ఆర్‌ఎఎప్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే శ్మశాన వాటికలో అతీక్ కుమారుడు అసద్‌ను కూడా ఖననం చేశారు. ఆ సమాధి పక్కనే తండ్రిని ఖననం చేశారు. అతీక్ తల్లిదండ్రులను సమాధులు కూడా ఇదే శ్మశానవాటికలో ఉన్నాయి. Uttar Pradesh | Bodies of mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed brought to Kasari Masari burial ground in Prayagraj where they will be buried. They were shot dead yesterday, in Prayagraj, by three shooters while they were surrounded by bevy of police… pic.twitter.com/kqtaWfy9ir — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2023 శనివారం రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన అతీక్, అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా, పోలీసుల ఎదుటే ముగ్గురు యువకులు వీరిపై తుపాకులతో దాడి చేసి పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. అనంతరం ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా.. పేరు ప్రఖ్యాతుల కోసమే తాము అతీక్, అతని సోదరుడ్ని అందరిముందే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. వీరు ఏం పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసయల్యారని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
అసద్ అంత్యక్రియలు .. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియుల ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల అసద్‌ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఝాన్సీలో గురువారం ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని కూడా ఈ ఎన్కౌంటర్లో హతమార్చారు. అనంతరం అసద్ భౌతికకాయాన్ని పోలీసులే ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. అంత్యక్రియల్లో అతికొద్ది మంది బంధువులే పాల్గొన్నారు. కాగా.. తన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతిఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్ కోర్టును కోరగా అతనికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో కుమారుడిని కడసారి చూసుకోలేకపోయానని అతడు మనోవేధనకు గురైనట్లు తెలుస్తోంది. ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ 50 రోజులు పరారీరో ఉన్నాడు. అయితే తన తండ్రిని పోలీసులు అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ తరలిస్తున్నారని తెలిసి అతడ్ని తప్పించేందుకు ప్లాన్ చేసి దొరికాడు. ఈ క్రమంలో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా? -
సతీష్ కౌశిక్‌కు బాలీవుడ్ తారల కన్నీటి నివాళి (ఫొటోలు)
-
ముగిసిన వాణీజయరాం అంత్యక్రియలు.. నివాళులర్పించిన సీఎం
అధికారిక లాంఛనాలతో ప్రముఖ గాయని వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. చెన్నైలోని బేసంట్నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. వాణీజయరాం మృతిపై సీఎం సంతాపం తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. ' ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందా. వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డ్ కూడా ప్రకటించింది. ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె మరణించడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని అన్నారు. కాగా.. శనివారం చెన్నైలోని ఆమె నివాసంలో మరణించారు. దేశవ్యాప్తంగా దాదాపు 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు ఆలపించారు. అయితే ఆమె మృతిపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాణీ భర్త జయరామ్ ఐదేళ్ళ క్రితం (2018లో) మరణించారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. సంగీతమే తమకు పిల్లలు లేని లోటు తీర్చిందని ఆమె చెబుతూ ఉండేవారు. బంధువులే వారసులై ఈ రోజు వాణీ జయరామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముకరం జా అంతిమ సంస్కారాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూసిన ఎనిమిదో నిజాం ముకరం జా అంతిమ సంస్కారాలు బుధవారం మక్కా మసీదు ప్రాంగణంలో జరగనున్నాయి. వీటి నేపథ్యంలో పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ జి.సుధీర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి అంతిమ సంస్కారాల తంతు పూర్తయ్యే వరకు ఓల్గా జంక్షన్, ముర్గీ చౌక్, చెలాపుర మహిళ ఠాణా, మిట్టీకా షేర్, మూసాబౌలి జంక్షన్, హిమ్మత్‌పుర జంక్షన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోపక్క బుధవారం ఉప్పల్‌లో జరిగే భారత్–న్యూజిల్యాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. నగరంలోని వివిధ హోటళ్లలో బస చేసిన క్రికెటర్లు రోడ్డు మార్గంలో ఉప్పల్ వెళ్తున్నారు. వీరి రాకపోకల నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్య సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట, రసూల్‌పురా, సీటీఓ, ఎస్బీఐ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, ఆలుగడ్డ బావి, మెట్టగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్ మార్గంలో కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు..
కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్7 డ్రాగన్ దేశంలో విస్తృతంగా వ్యాప్తిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే మహమ్మారి విషయంలో చైనా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరోనా లెక్కలు వెల్లడించకుండా దాచేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతోంది. దీంతో చైనా కేసులు, మరణాలు వివరాలు బయటికి రావడం లేదు. చైనాలో కరోనా పరిస్థితులు ఊహకందని విధంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కోవిడ్ రోగులతో ఆసుపత్రులు అన్నీ కిక్కిరిపోతున్నాయి. రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు సరిపోవడం లేదు. మరోవైపు శవాల కుప్పలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. చాలా మంది మృతదేహాలను మార్చురీలోనే వదిలేస్తున్నారు. ఇక రాబోయే నెలల్లో చైనాలో 2 మిలియన్లకుపైగా కోవిడ్ మరణాలు సంభవించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనాకు సంబంధించి చైనా నుంచి వెలువుడుతున్న దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి కొన్ని భయంకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడ కోవిడ్ మరణాలు పెరిగిపోవడంతో శ్మశాన వాటికలు నిండిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం ఫ్యూనరల్ హోమ్ వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించే వారు(ఫ్యూనరల్ హోమ్స్) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలే తమ సొంత ఖర్చులతో మృతదేహాలను వీధుల్లో దహన సంస్కరాలను నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు జరిపేస్తున్నారు కుటుంబ సభ్యులు. చదవండి: భారత్‌లో కోవిడ్ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత? I've seen quite a few similar videos, but haven't posted any until now. Given what we learned from other sources about how difficult & expensive to cremate a body in a #crematorium in #CCPChina, I'm not surprised if someone in the countryside chose to do this.#ChinaCovidDeaths pic.twitter.com/hxhGdhPriS — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 ‘ఓ వ్యక్తి వాళ్ల తండ్రి కరోనాతో మృతిచెందాడు. శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేయడం ఖరీదుతో కూడుకుంది.దహన సంస్కారాలకు అయ్యే ఖర్చులను భరించలేక అతను తన తండ్రి మృతదేహాన్ని బహిరంగ స్థలాన్ని ఎంచుకొని అంత్యక్రియలు జరిపించాడు. ఇకపై అన్ని ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధానాన్ని ఎంచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ స్థానికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. This is not a #BlackFriday rush. This is at #Suzhou Funeral Home, at 6am on Dec 30, 2022, people rushed to get a number as soon as the Funeral Home opened for registration. These ppl had been waiting since 9:00 pm on the previous night. #ChinaCovidSurge #ChinaCovidDeaths pic.twitter.com/vsh6h4HFOL — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 At Zhangjiagang, Suzhou City crematorium. Early in the morning, long line of funeral cars queuing. This is already 1 km away from the crematorium. #CCPChina #ChinaCovidCases #ChinaCovidDeaths #ChinaCovidSurge pic.twitter.com/LHM1Yko8Z0 — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 -
ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు
నటుడు చలపతిరావు అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి. కుమారుడు రవిబాబు చలపతిరావు కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.కుటుంబ సభ్యులతో పాటు హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు శ్రీవాస్, నటుడు గౌతమ్ రాజు మరియు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈనెల 24 గుండెపోటుతో చలపతి రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న కుమార్తెలు రాక ఆలస్యం కావడంతో చలపతిరావు భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు రవిబాబు చలపతిరావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాదాపు 1200 పైగా చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు చలపతిరావు. -
తండ్రి కర్మకాండలకు నిరాకరించిన కొడుకు.. నిర్వహించిన కూతురు!
వేటపాలెం: కొడుకు ఉన్నప్పటికీ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తండ్రికి కర్మకాండలు చేసేందుకు నిరాకరించాడు. దీంతో కుమార్తే తన తండ్రికి కర్మకాండలు నిర్వహించింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని నాయినపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పోలేరమ్మ దేవస్థానం దగ్గర నివాసం ఉండే సూరిశెట్టి సాంబశివరావు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. కుమార్తె, కుమారుడు సంతానం కాగా, ఇద్దరికీ వివాహం చేశాడు. కుమారుడు విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబశివరావు బుధవారం మరణించాడు. గురువారం కర్మకాండలు నిర్వహించాల్సి ఉంది. అయితే, తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారుడు నిరాకరించాడు. దీంతో మృతుడి కుమార్తె శ్రీలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది. -
తండ్రి అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తప్పు చేశాడా?
సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తీసుకున్న నిర్ణయంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ అభిమానులతో పాటు టాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులు మహేశ్ బాబు తీరును తప్పుబడుతున్నారు. ఈ విమర్శలకు కారణం.. తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలను ‘మహాప్రస్థానం’లో నిర్వహించడమే. ఈ విషయంలో మహేశ్‌బాబు తన కుటుంబ సభ్యుల మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, స్మారక చిహ్నం నిర్మించే విధంగా ప్రైవేట్ స్థలంలో దహనసంస్కారాలు చేయాలని మహేశ్ ఎందుకు ఆలోచించలేదని కృష్ణ ఫ్యాన్స్ అంటున్నారు. సోసైటీలో ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు మరణిస్తే.. వాళ్ల అంత్య క్రియలు వారి ప్రైవేట్ స్థలంలో నిర్వహిస్తుంటారు. ఇటీవల రెబల్‌స్టార్ కృష్ణ మరణిస్తే.. ఆయన పాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు దహన సంస్కారాలను అన్నపూర్ణ స్డూడియోలో నిర్వహించారు. ఎన్టీఆర్ మరణించినప్పుడు ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించి, ఎన్టీఆర్ ఘాట్‌ని ఏర్పాటు చేశారు. కృష్ణ సతీమణి విజయనిర్మలకు గుర్తుగా ఆమె కుమారుడు నరేశ్ స్మారక మందిరం కట్టించిన సంగతి తెలిసిందే. కృష్ణ అంత్యక్రియలను కూడా పద్మాలయ స్టూడియోస్‌లో నిర్వహించి, స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే గొప్పగా ఉండేదని కృష్ణ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం మహేశ్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాదిలో మరణించిన కృష్ణ సోదరుడు రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవిల అంత్యక్రియలు కూడా మహా ప్రస్థానంలోనే జరిగాయని.. అందుకే తండ్రి దహనసంస్కారాలు కూడా అక్కడే నిర్వహించాడేమోనని అంటున్నారు. అయితే తండ్రి కృష్ణ విషయంలో మహేశ్ బాబు ఆలోచన మాత్రం మరోలా ఉంది. కృష్ణ కోసం స్మారక చిహ్నం కాకుండా ఒక మెమోరియల్ ఏర్పాటుకి మహేశ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. -
జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు కన్నీటి వీడ్కోలు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య తెలుగు తెరపై ‘ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్’ భువి నుంచి దివికేగారు. అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ క్రతువును నిర్వహించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు అశ్రునయనాలతో తమ అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు బారులు తీరిన కార్లలో ఊరేగింపును అనుసరించారు. పెద్దసంఖ్యలో ప్రజలు జేజేలు పలుకుతూ మహాప్రస్థానానికి చేరుకున్నారు. పరిమిత సంఖ్యలో లోపలికి అనుమతి వైకుంఠ మహాప్రస్థానంలోకి వెళ్లేందుకు పోలీసులు తొలుత పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మహేష్‌బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని, పద్యావతితో పాటు నటుడు నరేష్, సుధీర్‌బాబు, సంజయ్, గల్లా జయదేవ్ తదితర సమీప బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నందిగామ ఎమ్మెల్సీ అరుణ్, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు, సినీ ప్రముఖులు మురళీమోహన్, దిల్‌రాజు, శివపార్వతి తదితరులు కూడా లోనికి వెళ్లారు. అభిమానులు, సామాన్య ప్రజలను మాత్రం క్రతువు ముగిసే వరకు అనుమతించలేదు. దీంతో మహాప్రస్థానం పరిసరాలన్నీ జనçసంద్రంగా మారి పోయాయి. నినాదాలతో మారుమ్రోగిన పరిసరాలు భారీగా గుమిగూడిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘కృష్ణ అమర్ రహే, సూపర్‌స్టార్ కృష్ణ అమర్ రహే, జోహర్ కృష్ణ, జై కృష్ణ..జైజై కృష్ణ ’ అంటూ హోరెత్తించారు. ఒక దశలో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కుటుంబసభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయిన తర్వాత అభిమానులను అనుమతించారు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తలసాని కృష్ణ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ముందుగానే మహాప్రస్థానానికి చేరుకుని పోలీసులు, అధికారులకు పలు సూచనలు చేశారు. గవర్నర్ సహా ప్రముఖుల నివాళులు కృష్ణ పార్థివ దేహానికి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రాహ్మణి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిర్మాత అల్లు అరవింద్, నటుడు కోట శ్రీనివాసరావు, సినీ నటి జయప్రద, ఏపీ మంత్రి రోజా, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు కృష్ణ భౌతికకాయయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంతిమయాత్ర మొదలైంది. సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియలు ముగిసాయి. ఇదీ చదవండి: సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. అసలు విషయం ఏంటంటే.. -
యూఎస్ రోడ్డు ప్రమాదంలో ప్రేమ్‌కుమార్‌రెడ్డి మృతి.. 9 రోజుల తర్వాత..
సాక్షి, రామగిరి(నల్లగొండ): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి(26) అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదోరిగూడెం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని న్యూయార్క్ సాక్కిడ్‌హార్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి ఆగస్టు 23న వెళ్లాడు. ప్రేమ్‌కుమార్‌రెడ్డి స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా అక్టోబర్ 25న తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ప్రేమ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. స్వగ్రామంలో.. తిప్పర్తి మండలం గోదోరిగూడేనికి చెందిన ప్రేమ్‌కుమార్‌రెడ్డి తల్లితండ్రులు లక్ష్మారెడ్డి లలితలు హైదారాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి హైదరాబాద్‌లో రైస్ బిజినెస్ చేస్తాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉంది.ప్రేమ్‌కుమార్‌రెడ్డి పెద్దవాడు ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించారు. పోయి రెండు నెలలు గడవకముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు తొమ్మిరోజుల తర్వాత మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు ప్రేమ్‌కుమార్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా ప్రేమ్‌కుమార్‌రెడ్డి డెడ్‌బాడీని స్వగ్రామం గోదోరిగూడేనికి తరలించారు. కుటుంబ సభ్యులు బంధువుల రోదనల నడుమ బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురు ప్రేమ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు దంపతులు, మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ గోదా క్రిష్ణారెడ్డి ఉన్నారు. -
తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయిన మరునాడే ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టారు అఖిలేశ్ యావద్. ఆయన లేని తొలి రోజు సూర్యుడు ఉదయించకుండానే తెల్లవారినట్లు ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. ములాయం అంత్యక్రియలకు సంబంధించి రెండు ఫోటోలను షేర్ చేశారు. आज पहली बार लगा… बिन सूरज के उगा सवेरा. pic.twitter.com/XlboMo8G2V — Akhilesh Yadav (@yadavakhilesh) October 12, 2022 ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యావద్(82) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం సైఫాయ్‌లో మంగళవారం నిర్వహించారు. భారీ జనసందోహం, అశ్రునయానాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. ములాయం అంత్యక్రియలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. అఖిలేశ్ యాదవ్‌కు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానభూతి తెలిపారు. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్ -
అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరిగాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది. అంతకుముందు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ములాయం భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది వెళ్లారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసుకున్నారు. అనంతరం ములాయం భౌతికకాయాన్ని ఓ వాహనంలో అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సహా కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3 — ANI (@ANI) October 11, 2022 గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశంలోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం భౌతికకాయాన్ని హోంమంత్రి అమిత్‌షా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఘన నివాళులు అర్పించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా ప్రపంచదేశాలకు చెందిన 217 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అబే అంత్యక్రియలను నిర్వహించింది. మూణ్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. #WATCH | Prime Minister Narendra Modi pays respect to former Japanese PM Shinzo Abe at the latter's State funeral in Tokyo "India is missing former Japanese PM Shinzo Abe," said PM Modi earlier today (Source: DD) pic.twitter.com/8psvtnEUiA — ANI (@ANI) September 27, 2022 అంతకుముందు జపాన్ ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు మోదీ. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. షింజో అబే సేవలను భారత్ ఎంతగానో మిస్ అవుతోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. Prime Minister Narendra Modi pays respect to former Japanese PM Shinzo Abe at the latter's State funeral in Tokyo "India is missing former Japanese PM Shinzo Abe," said PM Modi earlier today (Source: DD) pic.twitter.com/cO5SnswgGQ — ANI (@ANI) September 27, 2022 చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత -
అబే అంత్యక్రియల కోసం జపాన్‌కు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జపాన్ దివంగత ప్రధాని షింజొ అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి టోక్యో బయలుదేరి వెళ్లారు. మంగళవారం అంత్యక్రియల అనంతరం జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా, అబే భార్య అకీతో మోదీ భేటీ అవుతారు. మూణ్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్ -
నన్ను ఏమార్చారు.. నా కూతుర్ని కడసారి చూసుకోనివ్వలేదు
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ అంకిత భండారీ గతవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య యువతి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. అయితే తన కూతుర్ని కడసారి కూడా చూసుకోనివ్వకుండా తనను ఏమార్చారని అంకిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనను అధికారులు ఎలా మోసం చేశారో ఓ వీడియోలో చెప్పారు. అంకిత మృతి వార్త తెలిసి ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని ఆమె వెల్లడించింది. తన కూతుర్ని చూపిస్తామని చెప్పి నలుగురు వచ్చి అడవిలో ఉన్న తమను తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత తనతో అబద్దాలు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లి, వీల్‌ఛైర్‌లో బలవంతంగా కూర్చొబెట్టారని పేర్కొన్నారు. అనంతరం సెలైన్ పెట్టి ఫోటోలు తీసుకున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నా కావాలనే ఇదంతా చేశారని వివరించారు. తాను ఎన్నిసార్లు అడిగినా తన కూతురి దగ్గరికే తీసుకెళ్తున్నట్లు చెప్పి నమ్మించి మోసం చేశారని వాపోయారు. మరోవైపు తన భర్తను బలవంతంగా అంకిత మృతదేహం వద్దకు తీసుకెళ్లారని తల్లి ఆరోపించారు. తనను మాత్రం అంకితను కడసారి చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. బీజేపీ నేత కుమారుడే.. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో అంకిత భండారీ రిసెప్షనిస్టుగా పనిచేసేది. గత ఆదివారం ఆమె అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. నిందితుడు అంకిత్ ఆర్యతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని అరెస్టు చేశారు. శనివారం అంకిత మృతదేహం కాలువలో లభించింది. మొదట అంత్యక్రియలు నిర్వహించేందుకు ససేమిరా అన్నారు అంకిత తండ్రి. ఆ తర్వాత సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇచ్చిన హామీతో మనసు మార్చుకుని ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ఇదే.. -
నిమ్న కులానికి చెందిన వైద్యుడు పోస్టుమార్టమ్ చేశారని..
బరఘా: కుల వివక్ష వెర్రి తలలు ఎలా వేస్తోందో చెప్పే ఉదంతమిది. ఒడిశాలోని బరఘా జిల్లాలో ముచును సంధా అనే వ్యక్తి ఆస్పత్రిలో మరణించారు. పోస్టుమార్టం చేసిన వైద్యడు నిమ్న కులానికి చెందిన వ్యక్తి కావడంతో గ్రామస్తులు ఏకంగా అంత్యక్రియలను బహిష్కరించారు. కనీసం బంధువులెవరూ అటువైపు తొంగి కూడా చూడలేదు. దాంతో గ్రామ సర్పంచ్ భర్త సునీల్ బెహరా ఇలా బైక్ మీద మృతదేహాన్ని తీసుకువెళ్లి ఒకరిద్దరి సహకారంతో అంతిమ సంస్కారం నిర్వహించారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా -
Elizabeth-2: అంత్యక్రియలకు వెళ్లి సెల్ఫీకి పోజులా? అదేమైనా బర్త్‌డే పార్టీనా?
లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు. 'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్‌డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు. En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo — Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022 చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాణి భౌతికకాయం వెస్ట్‌మినిస్టర్ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. Prince Harry not singing the national anthem 👀 #queensfuneral pic.twitter.com/laNk5JMZ6R — Kieran (@kierknobody) September 19, 2022 ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు. మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు -
బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాణి భౌతికకాయం ఉన్న వెస్ట్‌మినిస్టర్ అబెలో కుటుంబసభ్యులు సోమవారం తుది ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ జన సందోహం మధ్య ఆమె శవపేటికను విండ్సోర్ కాస్టిల్‌కు తరలించారు. అక్కడే ఖననం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల అధినేతలు కలిపి మొత్తం 2000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లండన్‌లోని 125 థియేటర్లరో రాణి అంత్యక్రియలను లైవ్ ప్రదర్శన చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా ఉన్న 96 ఏళ్ల ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ దేశాలు రాణి మృతి పట్ల సంతాపం తెలిపాయి. రాణి వారసుడిగా ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి! -
రాణి అంత్యక్రియలకు సర్వం సిద్ధం
లండన్: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ఉదయం జరగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు 500 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు ఒక్కొక్కరుగా బ్రిటన్ చేరుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతమంది దేశాధినేతలు ఒక్కచోట కలుస్తున్న సందర్భం ఇదే కానుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలను 70 ఏళ్లపాటు సుదీర్ఘంగా పాలించిన 96 ఏళ్ల ఎలిజబెత్–2 సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తమ ప్రియతమ రాణిని కడసారి చూసుకునేందుకు గడ్డ కట్టించే చలిలోనూ బ్రిటన్వాసులు బారులు తీరుతూనే ఉన్నారు. రాణి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి దేశవ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి ముర్ము ఆదివారం లాంకెస్టర్ హౌస్‌ను సందర్శించారు. నివాళుల పుస్తకంలో భారత ప్రభుత్వం తరఫున శోక సందేశం రాశారు. అనంతరం వెస్ట్‌మినిస్టర్ హాల్లో రాణి భౌతికకాయానికి రాష్ట్రపతితో పాటు బైడెన్ దంపతులు కూడా నివాళులు అర్పించారు. ఇలా జరుగుతుంది... ► సోమవారం ఉదయం ఆరింటికల్లా రాణి సందర్శనకు వస్తున్న సందర్శకులను నిలిపేస్తారు. ► అనంతరం తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది. ► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది. ► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్‌లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్‌లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్‌లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్‌కు వస్తారని అంచనా. -
జూబ్లిహిల్స్‌లోని ఇంటికి చేరుకున్న కృష్ణంరాజు భౌతికకాయం
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు. అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలాదేవీ కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రలు కిషన్‌రెడ్డి, సినీ నటులు మోహన్ బాబు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలఓనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. చదవండి: మా ఊరి హీరో కృష్ణంరాజు.. నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి -
సాయిచరణ్‌కు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లగొండ క్రైం: అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో మరణించిన నక్క సాయి చరణ్ మృతదేహం మంగళవారం నల్ల గొండకు తీసుకువచ్చారు. నల్లగొండ పట్టణంలోని వివేకానంద నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు నక్క సత్యనారాయణ– పద్మ కుమారుడు సాయిచరణ్(25) ఈ నెల 20న అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ సిటీలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. సాయి చరణ్ మృతదేహం మంగళవారం ఉదయం నల్లగొండలోని నివాసానికి ప్రత్యేక వాహనంలో రాచకొండ సీపీ మహెష్ భగవత్ చేర్చారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి, తండ్రి గుండెలవిసేలా రోదించారు. కుమారుడి పార్థీవదేహాన్ని చూసి రోదిస్తున్న తల్లి గొప్పోడివయ్యావనుకుంటే.. కానరాని లోకాలకు వెళ్లిపోతివా కొడుకా అంటూ వారి రోధించిన తీరు అందరినీ కలిచివేసింది. డిసెంబర్లో వస్తానని చెప్పి శవమై వస్తివా అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘డాడీ నేను ఉండేది అమెరికా దేశంలో. డేంజర్ జోన్ 5లో ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను ఉండే ప్రాంతం నుంచి ఉద్యోగాన్ని మార్చుకుంటా’ అని చెప్పాడని సాయిచరణ్ తండ్రి సత్యనారాయణ తెలిపారు. ఆ ప్రాంతం నుంచి కొన్నిరోజులు ముందుగా మారినా తన కుమారుడి ప్రాణం దక్కేదని విలపించాడు. చదవండి👉🏻బస్టాండ్ బాత్రూంలో ప్రసవం.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు మృతి నాలుగు గంటలు రోడ్డుపైనే సాయిచరణ్.. స్నేహితుడిని కారులో తీసుపోయి ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి వస్తుండగా ఇంటర్స్టెట్–95 లోని కెటన్ అవెన్యూ చివరికి చేరుకోగానే ఓ నల్లజాతీయుడు కారుపై కాల్పులు జరిపడంతో ముఖం కుడివైపు బుల్లెట్ తగిలిందని, ఆ వెంటనే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిసింది. ఇతరుల సాయం కోసం సాయిచరణ్ కారు డోర్ తీసి కిందపడిపోయాడు. కాల్పులు జరిగిన 4గంటల తర్వాత పోలీస్ పెట్రోలింగ్ గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స మొదలైన రెండు గంటల్లోనే సాయి చరణ్ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. వాట్సాప్ ద్వారా సమాచారం.. సాయిచరణ్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే విషయంపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేశారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరితో, సాయిచరణ్ కుటుంభ సభ్యులతో సీపీ ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సాయి మృతదేహన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. చదవండి👉🏻దేశ్‌కీ నేతా! బీఆర్ఎస్ ఏమైంది? అండగా ఉంటాం.. సాయి చరణ్ కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మృతుని కుటుంబాన్ని పరామార్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వారి కుటుంబానికి తగిన సహకారం అందించాలని కోరారు. -
ఊరంతా విషాదమే
నిజాంసాగర్ / పిట్లం (జుక్కల్) / నిజామాబాద్ అర్బన్: కామారెడ్డి జిల్లాలోని బాన్సు వాడ – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై అన్నా సాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్ ట్రాలీ ఆటో, బియ్యం లారీ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా మృతుల్లో ఆరుగురు చిల్లర్గి గ్రామస్తులే కావడంతో ఊరు ఊరంతా గొల్లుమంది. మృతులు, క్షతగాత్రుల కుటుంబాల రోదన లు మిన్నంటాయి. ఆటో ట్రాలీలో ఉన్న 25 మందిలో 23 మంది చిల్లర్గి గ్రామానికి చెందినవారే కావడం గమనార్హం. సోమవారం గ్రామంలో చౌదర్పల్లి లచ్చవ్వ, వీరవ్వ, పో చయ్య, వీరమణి, సాయవ్వ, గంగవ్వ మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకేసారి ఆరుగురు చనిపోవడంతో.. కులమతాలకు అతీతంగా వందల సంఖ్యలో ప్రజ లు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇలావుండగా, పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లిలో ఎల్లయ్య, తుప్దల్ గ్రామంలో డ్రైవర్ సాయిలు, బాన్సువాడలో అంజవ్వ మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు అత్తాకోడళ్లు మృతి చిల్లర్గి గ్రామంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృతి చెందగా ఇందులో రెండు కుటుంబాలకు చెందిన అత్తాకోడళ్లు ఉన్నారు. గ్రామానికి చెందిన చౌదర్పల్లి లచ్చవ్వ, వీరమణి అత్తా కోడళ్లు కాగా, మరో కుటుంబానికి చెందిన చౌదర్పల్లి వీరవ్వ, గంగవ్వ కూడా అత్తా కోడళ్లే.. ఎంపీ, కలెక్టర్ ఆర్థికసాయం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వం తరఫున కలెక్టర్ జితేష్ వి పాటిల్.. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున వేర్వేరుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఇద్దరి పరిస్థితి సీరియస్: ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఏడుగురు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 11 మందిని ఇక్కడికి తీసుకురాగా ఆదివారం ముగ్గురు మరణించారు. గంగవ్వ అనే మహిళ కోలుకోవడంతో ఇంటికి పంపారు. దీంతో మిగిలిన ఏడుగురిలో శ్రావణి, కార్తిక్ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రులంతా ఎంఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదంపై ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ/నిజాంసాగర్ (జుక్కల్): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఏస్ ట్రాలీ ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు సోమవారం ట్విట్టర్ ద్వారా ఆయన సంతాపం తెలిపారు. మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటిం చారు. అన్నాసాగర్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారి ఒక్కో కుటుంబానికి రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సహాయం, గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున తక్షణ సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన ఏడేళ్ల చిన్నారి
భీమడోలు(ఏలూరు జిల్లా): కన్న తండ్రికి ఏడేళ్ల కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన గుండుగొలనులో మంగళవారం జరిగింది. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆభం శుభం తెలియని ఏడేళ్ల వయస్సు ఉన్న పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించి కన్న రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. గుండుగొలనులోని బీసీ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ కాకర్ల శ్రీనివాసరావు (42) ఆనారోగ్యంతో ఇంటి వద్దనే మృతి చెందాడు. చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు.. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు ప్రియదర్శిని (7), సంజన (5) ఉన్నారు. కుమారులు లేకపోవడంతో శ్రీనివాసరావుకు మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు బంధువులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పెద్దలు తండ్రి చితికి పెద్ద కుమార్తె ప్రియదర్శినితో తలకొరివి పెట్టించారు. భార్య పార్వతీ, కుమార్తెలిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. -
కలహాలతో పిల్లలు బలి.. కన్న పేగుతో కాటికి..
నవమాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లి తాను ఆత్మహత్య చేసుకుని మరణిస్తే తన పిల్లలను చూసుకునే వారు ఉండరని భావించింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఆ తల్లి కడుపున పుట్టిన పిల్లలను సైతం తన తోడు తీసుకెళ్లాలని భావించి వారిని తన కొంగుతో చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం భర్త వేధింపులు తాళలేక ముగ్గురు పిల్లలతో సహా ఆ మహిళ చెరువులో దూకింది. ఇద్దరు చిన్నారులతో సహా ఆమె మరణించిన విషయం విదితమే. మేడ్చల్‌రూరల్: ఈ ఘటనలో శివరాణి పెద్ద కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు చిన్నారుల(దీక్షిత్, ప్రణీత)తో పాటు ఆమె మృతి చెందారు. శివరాణి మృతికి కారణమైన భర్త(భిక్షపతి)కు మృతురాలి బంధువులు దేహశుద్ధి చేశారు. మేడ్చల్ పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురికి తరలించారు. కలహాలతో పిల్లలు బలి.. భార్యాభర్తల మధ్య గొడవ అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. మేడ్చల్ పోలీసులు భర్త భిక్షపతి, అత్త రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వారిపై 498ఏ, 302, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో విషాదఛాయలు.. శివరాణి, పిల్లలు దీక్షిత్, ప్రణీతల మృతదేహాలకు గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు రాజబొల్లారం గ్రామానికి మృతదేహాలు చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతదేహాలను మృతురాలి తండ్రి, బంధువులు తమ చేతుల్లో పట్టుకుని తీసుకెళ్లిన దృశ్యం అందరినీ కలచివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలతో బయటపడిన మరో కుమారుడు జగదీశ్‌ను మృతురాలి తల్లిదండ్రులు చెంత ఉన్నాడు. అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి: జూబ్లీహిల్స్: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి.. -
అక్కడ మౌనం పాటించండి.. ఫోటోలు తీశారో.. భారీ జరిమాన
స్మశాన వాటికల దగ్గర ఎవరైనా కెమెరాలతో హడావుడి చేస్తే చెల్లదంటూ తేల్చి కువైట్ ప్రభుత్వం చెప్పింది. అంత్యక్రియల దగ్గర పాటించాల్సిన నిబందనలను తాజాగా సవరించింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యూనరల్ డిపార్ట్మెంట్ కువైట్ తెలిపిన వివరాల ప్రకారం స్మశానాల్లో ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీయడం, దిగడం చేస్తే 5,000 కువైటీ దినార్లు జరిమానాగా విధిస్తామని పేర్కొంది. రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, ఇతర సెలబ్రిటీలు చనిపోయినప్పుడు స్మశానాల దగ్గర కెమెరాల హడావుడి ఎక్కువైంది. అంత్యక్రియల దగ్గర కెమెరాల కారణంగా వాతావరణం పాడైపోతుంది. దీంతో కువైట్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంత్యక్రియల కోసం ఉపయోగించిన స్మశానంలో ఇతర కార్యక్రమాలు చేపట్టినట్టు తేలితే కనిష్టంగా రెండు వేల దినార్లు గరిష్టంగా 5 వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. -
నేడు నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/ నర్సంపేట రూరల్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరగనున్నాయి. తెలుగు సినిమాలకు వేల పాటలు రాసిన ఆయన.. కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఫిలిం చాంబర్లో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పార్థివదేహాన్ని సందర్శించుకున్నారు. తక్కువ కాలం జీవించి, ఎక్కువ కాలం జీవించే కవిత్వాన్ని రాసిన తెలంగాణ పాటల పూదోట కందికొండ యాదగిరి అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ఈ సందర్భంగా కొనియాడారు. కందికొండ అందరివాడని, ఆయన లేనిలోటు తీర్చలేమని పేర్కొన్నారు. అభిమానుల సందర్శన అనంతరం కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య కందికొండ మృతదేహాన్ని స్వగ్రామం నాగుర్లపల్లికి తరలించారు. మధ్యలో అంబులెన్సును నర్సంపేట పట్టణంలోని అమరువీరుల స్థూపం వద్ద కాసేపు ఆపారు. పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు, కళాకారులు, అభిమానులు పూలు చల్లి నివాళులు అర్పించాక.. నాగుర్లపల్లికి తీసుకెళ్లారు. అక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కందికొండ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తాం: తలసాని కందికొండ యాదగిరి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పాటలెన్నో కందికొండ రాశారని.. ఆయన మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వారి కుటుంబానికి మంత్రి కేటీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని, కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఏ జన్మ సంబంధమో..
వారి సావాసం శవాలతో.. వారి సంపాదన అంత్యక్రియలతో.. వారి నిత్య సంభాషణ ముడిపడేది చావుతో.. రైలు పట్టాల నుంచి రుద్రభూమి వరకు వారే. ఆఖరి దశ నుంచి అంత్యక్రియల వరకు వారే. రైలు తాకిడికి ఖండితమైపోయిన దేహాలకు, లోకం కంట పడకుండా పాడైపోయిన శరీరాలకు దిక్కూమొక్కూ వారే. ఎప్పటి రుణానుబంధమో అనాథ మృతదేహాలకు అన్నీ తామే అయ్యి సద్గతులు అందిస్తున్నారు వారు. ఏ జన్మ సంబంధమో వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. ఈ పని చేసే వారిని ‘తోటి’ అని పిలుస్తారు. కోటికొకరు ఎన్నుకునే ఈ వృత్తిలో జిల్లా వారూ ఉన్నారు. జలుమూరు: రైలు కింద పడి ఒకరు మృతి చెందారు.. తోటీ రావాలి. రైలు ప్రమాదంలో ఒకరి మృతదేహం దొరికింది.. తోటీ రావాలి. ఒకరి శవం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.. తోటీని పిలవాలి. ముక్కలైపోయిన శరీరమొకటి పట్టాల పక్కన ఉంది...తోటీ రావాల్సిందే. శవం అన్న పేరు వినడానికి చాలా మంది భయపడతారు. అనడానికి కూడా ఆందోళన చెందుతారు. చూసేందుకు జంకుతారు. కానీ ఈ తోటీల బతుకంతా శవాలతోనే. జీతమెంత తీసుకుంటారో గానీ ఈ సత్కార్యాలు చేసి బోలెడంత పుణ్యంతో పాటు వారి కుటుంబీకుల ఆశీస్సులు కూడా అందుకుంటున్నారు వీరు. తెలిసిన వారి దహన సంస్కారాల్లో పాల్గొనడానికి మొహమాట పడే రోజుల్లో.. నిత్యం ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న గొప్ప మనుషులు వీరు. అనాథ శవాల పాలిట సంస్కార ప్రదాతలు ఈ ‘తోటీ’లు. పది మంది బృందం శ్రీకాకుళం జిల్లా తిలారు నుంచి శిర్లపాడు (ఇచ్ఛాపురం) వరకు, తిలారు నుంచి విజయనగరం వరకు పది మంది తోటీలు ఈ పని చేస్తుంటారు. స్టేషన్ల మధ్య జరిగే ప్రమాదాల సమాచారం అందుకున్న క్షణాల్లో ఇద్దరు చొప్పున అక్కడ ప్రత్యక్షమై అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. రైలు పట్టాల వెంబడి.. తోటీల అవసరం ఎక్కువగా ఉండేది రైలు పట్టాల వద్దే. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా మారిన వారికి వీరే దిక్కు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ వీరు ఠక్కున అక్కడ ప్రత్యక్షమవుతారు. సొంత మనుషుల్లా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం జంకు, సంకోచం లేకుండా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. వృత్తి సంతృప్తినిస్తోంది.. 15 ఏళ్లుగా ఈ వృత్తి చేస్తున్నాను. మొదటి ఏడాదిలో కొంత భయం ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం పవిత్రంగా భావిస్తాం. ఈ వృత్తి సంతృప్తినిస్తోంది. – రాజారావు బంధువుల అంత్యక్రియల్లోనూ.. అనాథ శవాలతోపాటు కొన్ని సందర్భాల్లో మా బంధువుల మృతదేహాలకు కూడా దహన సంస్కారాలు చేశాను. అలాంటి సమయాల్లోనే మద్యం అలవాటైపోయింది. తెగిపడిన మృతదేహాలను ఏరి పోగు చేసి ఒక్క చోట చేర్చడానికి ధైర్యం కావాలి. ఈ 17 ఏళ్లలో వందల శవాలకు అంతిమ సంస్కారాలు చేశాను. – వెంకటరావు వారి సేవలు వెలకట్టలేనివి.. తోటీల సేవలు వెలకట్టలేనివి. మేం డబ్బులు ఇచ్చినా అనాథ శవాలకు దహన సంస్కారాలు, పాతిపెట్టడం వంటివి చేయడం సాధారణ విషయం కాదు. కొన్ని సందర్భాల్లో సొంత వారు కూడా దగ్గరకు రాలేని దుస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఎంతో ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ పనులు చేస్తున్నారు. వారికి నిజంగా చేతులెక్కి మొక్కాలి – ఎస్.కె షరీఫ్, పలాస జీఆర్పీ ఎస్ఐ -
గానకోకిల లతా మంగేష్కర్‌కు కన్నీటి వీడ్కోలు..
Lata Mangeshkar funeral live updates: ముగిసిన అంత్యక్రియలు ►కన్నీటి వీడ్కోలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ►లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. లతాజీ భౌతికకాయానికి మోదీ నివాళులు అర్పించారు. ►సచిన్ టెండ్కూర్ ఆయన సతీమణి లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. లెజెండరీ సింగర్, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు ముంబైలోని లతాజీ నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్‌కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాడెపై తల్లి.. తనయుల ఆస్తి లొల్లి
జమ్మికుంట: అనారోగ్యంతో తల్లి చనిపోతే అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన తనయులు శవాన్ని ఇంటిముందే ఉంచుకుని పంపకాల పంచాయితీ మొదలుపెట్టారు. కన్నతల్లి శవాన్ని కాటికి పంపక ముందే ఖర్చుల విషయంలో గొడవపడ్డారు. ఈ అమానవీయ ఘటనను చూడలేకపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నివసించే సూదం అనసూర్య (85)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన భర్త రాజవీరు గతంలోనే చనిపోయారు. అప్పటినుంచి డిపెండెంట్ పింఛన్ అధారంగా అనసూర్య జీవనం సాగిస్తోంది. కొన్నినెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో జమ్మికుంటలోని చిన్నకొడుకు వద్ద ఉంటూ.. బుధవారం సాయంత్రం చనిపోయింది. వీణవంక మండలం గన్ముకులలో స్థిరపడిన మిగతా ముగ్గురు కొడుకులు జమ్మికుంటకు చేరుకున్నారు. తల్లి అంత్యక్రియలు, కర్మకాండలకు అయ్యే ఖర్చు, తల్లికి వస్తున్న పింఛన్, నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆస్తుల విషయం గురువారం నలుగురు కొడుకుల మధ్య గొడవకు దారితీసింది. చిన్నకొడుకు మిగతా ముగ్గురిని అంత్యక్రియల తరువాత వెళ్లిపోవాలని సూచించడంతో నలుగురి మధ్య పంచాయితీ ఏర్పడింది. తల్లి మృతదేహాన్ని ఇంటిముందు ఉంచుకుని గొడవలేంటని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సతీశ్ అక్కడకు చేరుకుని మృతురాలి కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి కార్యక్రమం పూర్తిచేసేలా చూశారు. -
Rosaiah Last Rites : మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
-
ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
Live Updates ► మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లి రోశయ్య ఫాంహౌస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివ సుబ్బారావు నిప్పంటించారు. ►ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చితి వద్దకు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ►అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కడసారి చూసేందుకు నేతలు భారీగా తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ►గాంధీభవన్ నుంచి ప్రారంభమైన రోశయ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ►రోశయ్య పార్థివదేహం గాంధీభవన్‌కు చేరుకుంది. కాసేపట్లో దేవరయాంజాల్ ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రోశయ్య పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్,పేర్ని నాని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలను మధ్యాహ్నం ఒంటిగంటకు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. రోశయ్య పార్థవదేహాన్ని ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలమైన గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. సందర్శన తర్వాత హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇక సెలవు.. మహాప్రస్థానంలో ముగిసిన 'సిరివెన్నెల' అంత్యక్రియలు
Sirivennela Sitaramasastry: అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైన సిరివెన్నెల అంతియాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. అంతిమయాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. సిరివెన్నెలను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సిరివెన్నెల ఇక మనమధ్య లేరని తెలిసి కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నసిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించిన ఆయన సిరివెన్నెల సినిమాతో పాటల ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా ఇప్పటివరకు మూడువేలకు పైగా పాటలు రాశారు. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది. -
‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యజమాని కొట్టాడని జంప్.. తిరిగి వచ్చేసరికి తనకు అంత్యక్రియలు, అంతా షాక్!
చర్ల (భద్రాద్రి కొత్తగూడెం): కుటుంబ సభ్యుడు ఒకరు అదృశ్యమయ్యాడు.. ఇంతలోనే గుర్తు పట్టలేని స్థితి మృతదేహం లభించింది. తమ వాడేనని ఆ కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. ఇది జరిగిన 12 గంటలకు సదరు వ్యక్తి గ్రామంలో ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడుకు చెందిన బొడ్డు ప్రసాద్ ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామంలోనే ఓ వ్యక్తి వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల యజమాని.. ప్రసాద్‌ను కొట్టాడు. తర్వాత చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అయితే, కొన్ని రోజులకు డ్రైవర్ ప్రసాద్ అదృశ్యం కాగా.. ఆయన తల్లి ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు విచారణ సాగిస్తుండగానే ఈనెల 3న తాలిపేరు ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఈ మృతదేహాన్ని గురువారం వెలికితీసి ప్రసాద్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. (చదవండి: Jubilee Hills: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ) అప్పటికే కుళ్లిన స్థితిలో ఉండటంతో అది ప్రసాద్దిగానే భావించి రాత్రి ప్రాజెక్ట్ సమీపానే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసాద్ పనిచేసిన ట్రాక్టర్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం ప్రసాద్ చర్లలో ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అవాక్కయ్యారు. ట్రాక్టర్ యజమాని మళ్లీ కొడతాడేమోననే భయంతో తాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో తలదాచుకున్నట్లు వివరించాడు. కాగా, రిజర్వాయర్‌లో ప్రత్యక్షమైన మృతదేహం ప్రసాద్‌ది కాదని తేలడం, మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో ఎవరినో హత్య చేసినట్లు భావిస్తూ కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రయాణికులకు బస్సు డ్రైవర్ షాక్.. ఏం చేశాడంటే..!) -
పునీత్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా!
Why Tamil Heros Not Attend Puneeth Rajkumar Funerals: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం యావత్ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ హఠాన్మరణం చెందడం అందరిని కలిచివేస్తుంది. పేరుకు కన్నడ హీరో అయినా అందరితో ఎంతో సత్సంబంధాలు కొనసాగించేవారు. పునీత్ ఇకలేరని తెలిసి కన్నడ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సహా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. చదవండి: పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్ ఇక పునీత్ అంత్యక్రియలకు లక్షలాది అభిమానులు సహా టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే కోలీవుడ్ నుంచి మాత్రం ఒక్కరు కూడా హాజరుకాలేదు. నిజానికి విశాల్, సూర్య, విజయ్ వంటి హీరోలతో పునీత్‌కి మంచి స్నేహం ఉంది. అయినా వాళ్లు కడసారి చూపుకు రాలేదు. దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం నడుస్తుంది. ఆ మధ్య తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు. దీంతో ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్ హీరోలు హాజరు కాలేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి:నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం -
అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
Puneeth Rajkumars Last Rites At Kanteerava Studios:కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి.అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ అన్న రాఘవేంద్ర కుమారుడు వినయ్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో రాఘవేంద్ర చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. కంఠీరవ రాజ్‌కుమార్‌కు మొత్తం ముగ్గురు కుమారులు. వారిలో పునీత్ చిన్నవాడు. శివరాజ్ కుమార్ పెద్దకొడుకు కాగా, రాఘవేంద్ర రెండోవాడు. ఆయన కుమారుడే వినయ్ రాజ్‌కుమార్. అతని చేతుల మీదుగా పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ హీరోగా ఎదగడానికి కూడా పునీత్ ఎంతో సహాయపడ్డారు. కర్ణాటక సీఎం సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు.. -
తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు..
Puneeth Rajkumar Funeral: అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం సహా అనేక మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు బరువెక్కిన గుండెలతో పునీత్ కడసారి వీడ్కోలు పలికారు. చదవండి: (Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు) కాగా, కోట్లాది మంది ఆత్మీయ బంధువు, విలక్షణ నటుడు, కన్నడ సినీ పరిశ్రమ ముద్దుబిడ్డ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన ఇకలేరనే విషయం తెలుసుకున్న ప్రజలు కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో తరలివచ్చారు. పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే. -
చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి
Puneeth Rajkumar Funerals : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చిన్న వయసులోనే పునీత్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్ అన్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించిన ఎన్టీఆర్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. వీరితో పాటు శ్రీకాంత్, అలీ కూడా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ మరణం తీరని లోటన్న శ్రీకాంత్.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. మరోవైపు పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి రాజ్‌కుమార్ బెంగళూరుకు చేరుకుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు పునీత్ అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య! పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. -
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు
సాక్షి, బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన అప్పూ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక విషయాన్ని ప్రకటించారు. కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను,యాప్‌ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్‌ను లాంచ్ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆయన మరణం తమతోపాటు, సినీ రంగానికి, ముఖ్యంగా యువతకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్‌కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్త్నుట్లు ఆయన ప్రకటించారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు) కాగా శుక్రవారం తమిళనాడులోని గాజనూరులో పునీత్ రాజ్‌కుమార్ పర్యటించాల్సి ఉంది. దీంతో ఆయన అభిమానులు పునీత్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అప్పూ ఇక లేడన్న వార్త వారిని శోకసంద్రంలో ముంచేసింది. మరోవైపు పునీత్ భౌతిక కాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచి కడసారి దర్శించు కునేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పునీత్‌కు తుది నివాళులర్పించేందుకు అభిమాన జనం వేలాదిగా తరలివచ్చారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) On Thursday, he (#PuneethRajkumar) had asked me to release a website regarding Karnataka tourism. I would have launched his app on Nov 1 but he's not between us. It is so shocking. State, cinema, and youths will miss him: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/TfLOCrT4Am — ANI (@ANI) October 30, 2021 Karnataka CM Basavaraj Bommai announces postponement of actor Puneeth Rajkumar’s funeral to Sunday, 31 October. Postponement taking into consideration the sentiment of fans who are still flocking in to pay homage. @TheQuint pic.twitter.com/eSKpHu5xEU — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021 -
పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించిన ఎన్టీఆర్
Puneeth Rajkumar Funerals: పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి జూ. ఎన్టీఆర్ నివాళులర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ఆయన పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను ఓదార్చారు. మరికాసేపట్లో చిరంజీవి బెంగళూరుకు చేరుకోనున్నారు.ఇప్పటికే బాలకృష్ణ పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటునరేశ్, శివబాలాజీ పునీత్‌కు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్‌కుమార్‌న కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. పేరుకు కన్నడ హీరో అయినప్పటికి పునీత్ రాజ్‌కుమార్‌కు టాలీవుడ్ హీరోలతో మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయనను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. చదవండి: Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ ఇదే! శోక సంద్రంలో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు... వారి భయమే నిజమైంది -
పామేడు– కొండపల్లి మధ్య ఆర్కే అంత్యక్రియలు
చర్ల/టంగుటూరు: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆర్కే మృతిపై గురువారమే కథనాలు వచ్చినా పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం శుక్రవారం వెలువడింది. ఆయన గురువారం ఉదయం కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందగా శుక్రవారం మధ్యాహ్నం పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియల ఫొటోలు, వీడియోలను శనివారం మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి సమాచారాన్ని పార్టీ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తెలియజేయడంతో పాటు మిలీ షియా, గ్రామకమిటీ సభ్యుల ద్వారా వివిధ గ్రామాలకు చేరవేసి అంత్యక్రియలకు రావాలని సూచించడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరలి వచ్చిన ఆదివాసీలతో పాటు మావోయిస్టులు ఆర్కేకు నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన ఆర్కే మృతదేహాన్ని చూసి ఆదివాసీలు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. ఆర్కేకు ఘన నివాళి ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు శనివారం ఆర్కేకు నివాళులర్పించారు. ‘ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’అని ఈ సందర్భంగా శిరీష అన్నారు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారని విరసం నేత కల్యాణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని భార్య శిరీష, కుటుంబ సభ్యులు విలపించారు. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసులకు లొంగిపోయుంటే ఆయనకు మంచి వైద్యం అందేదని, బతికేవాడని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. మంచి వైద్యం అందించినా.. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య వచ్చిందని, డయాలసిస్ చేయిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మృతి చెందారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు పార్టీ తరఫున మంచి వైద్యం అందించినా దక్కించుకోలేకపోయామని తెలిపారు. ఆర్కే మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారని లేఖలో వెల్లడించారు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినా కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారని పేర్కొన్నారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యే శ్రద్ధాంజలి ఘటించి అంత్యక్రియలు పూర్తిచేశామని తెలిపారు. కామ్రేడ్ రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించారని కొనియాడారు. పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించారని వివరించారు. ఆర్కే సాధారణ జీవితం, ప్రజల పట్ల ప్రేమ, సహచరులపై ఆప్యాయత, విప్లవం పై స్పష్టత, దూరదృష్టి నుంచి యావత్ పార్టీ కేడర్ ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. -
ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపింది. పామేడు-కొండపల్లి సరిహద్దులో నిర్వహించిన ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిచేసినట్టు తెలిసింది. -
వరంగల్‌లో రాజు అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు రాజు మృతిపై వస్తున్న వార్తలకు ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం వైద్యులు చెబుతున్న దాన్ని బట్టి రాజు ఆత్మహత్యేగా స్పష్టంగా తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న రాజు మృతదేహాన్ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మొదటి రాజు కుటుంబసభ్యులకు చూపించారు. ఆ మృతదేహం రాజుదేనని ధ్రువీకరించడంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి కాకుండా వరంగల్‌లోని పోతన కాలనీ శ్మశాన వాటికలో బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. తల్లి కుమారుడి చితికి నిప్పటించారు. భార్య కూడా హాజరయ్యారు. కాగా నిందితుడి పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. రాజు మృతదేహానికి గంటపాటు ఫోరెన్సిక్ వైద్యులు రజా మాలిక్, ఫోరెన్సిక్ వైద్యుడు, వరంగల్ ఎంజీఎం రాజు పోస్టుమార్టం చేశారు. అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు. మృతదేహంపై ట్రైన్ గాయాలు, గ్రీజు ఉన్నాయని చెప్పారు. రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు తెలిపారు. మృతదేహంపై ఇతర గాయాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించినట్లు వివరించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు. డీఎన్ఏ టెస్ట్ కోసం రాజు ఎముకలు సేకరించినట్లు పేర్కొన్నారు. రాజు మత్తు పదార్థాలు సేకరించాడా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
మరో సౌదీ విషాద ఘటన: చివరి చూపూ దక్కలేదు..
మోర్తాడ్ (బాల్కొండ): కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి సౌదీ అరేబియాకు వెళ్లిన మోర్తాడ్ మండలం పాలెం వాసి షేక్ మదర్(50) అనారోగ్యంతో అక్కడే కన్నుమూశాడు. కరోనా వైరస్ ఉధృతితోనే విదేశాల్లో మరణించినవారి మృతదేహాలను తెప్పించడం కష్టంతోపాటు ఖర్చుతో కూడుకున్నది కావడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో సౌదీలోనే మదర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ కుటుంబ పెద్ద కడసారి చూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని మదర్ కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు) ఎన్నో ఏళ్ల నుంచి మదర్ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల కింద ఆజాద్ వీసాపై సౌదీకి వెళ్లి అక్కడ సైకిల్ రిపేరింగ్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. నెల రోజుల కిందట మదర్ అనారోగ్యానికి గురవడంతో ఈనెల 6వ తేదీన మరణించాడు. మదర్ మృతదేహాన్ని ఇంటికి పంపించాలంటే ఎంతో ఖర్చు అవుతుందని అతడికి ఆజాద్ వీసా స్పాన్సర్ చేసిన సౌదీవాసి తెలిపాడు. మక్కా ఉన్న సౌదీలోనే మదర్ మృతదేహానికి ఖననం చేస్తే అతని ఆత్మకు శాంతి చేకూరుతుందని పలువురు సూచించడంతో కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈనెల 25 ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. రావడానికి ఒక్కరోజు ముందుగానే మృతి సౌదీలో మరణించిన మదర్ ఈ నెల 7వ తేదీన స్వదేశం రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మధుమేహం, బీపీ ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడు ఇంటికి రావడానికి విమాన టికెట్‌ను తీసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఒకరోజు ముందుగానే తీవ్ర అనారోగ్యానికి గురై సౌదీలోనే మరణించడం, అక్కడే అంత్యక్రియలు ముగిసిపోవడంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మదర్‌కు భార్య, నలుగురు కొడుకులు ఉన్నారు. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
అంతిమ ‘సంస్కారం’ ఉండాల్సిందే: హైకోర్టు
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ దహన, ఖనన సౌకర్యాలు లేక కొన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటం దురదృష్టకరమని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గౌరవంగా, హుందాగా జీవించడం రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగమని పేర్కొంది. ఇది జీవించి ఉన్నవారికే కాకుండా.. మృతదేహాలకు కూడా వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో నొక్కి వక్కాణించిందని గుర్తు చేసింది. ఈ అంశం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని.. కుల, మత, ప్రాంత, లింగ బేధాలతో సంబంధం లేకుండా మరణించిన వ్యక్తుల అంతిమ సంస్కారాలు వారి వారి కట్టుబాట్లు, విశ్వాసాల ప్రకారం జరిగేలా దహన, ఖనన వాటికలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలను ఆదేశించింది. గుంటూరు జిల్లా పెదకాకానిలో సర్వే నంబర్ 153లోని భూమిని ఎస్సీల శ్మశాన వాటికకు కేటాయించేందుకు సర్వే చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. ఒకవేళ ఆ భూమి కబ్జాకు గురైతే కబ్జాదారులను ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తాజాగా తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... గుంటూరు జిల్లా పెదకాకానిలో సర్వే నం.153లోని 0.95 సెంట్ల భూమిలో 0.71 సెంట్ల భూమిని హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించారు. మిగిలిన 0.24 సెంట్లను తమ శ్మశాన వాటికకు కేటాయించాలని ఎస్సీలు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ గొట్టిముక్కల రామయ్య, మరికొందరు పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. కోర్టు ఆదేశాల మేరకు పెదకాకాని తహసీల్దార్ కౌంటర్ దాఖలు చేశారు. 0.24 సెంట్ల ప్రభుత్వ భూమిని పిటిషనర్లు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. గత 50 ఏళ్లుగా ఎస్సీలు సదుపాయాలు లేక చెరువు కట్టపైనే అంతిమ సంస్కారాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. ఐపీసీ సెక్షన్ 297 శ్మశాన వాటికల దురాక్రమణ నుంచి, అంతిమ సంస్కారాలు సక్రమంగా సాగించే విషయంలో తగిన రక్షణ కల్పిస్తోందన్నారు. శ్మశానాలకు భూమి కేటాయింపు, వాటి నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలపై ఉందన్నారు. -
కొడుకు తలకొరివి పెట్టనన్నాడు.. కూతురు రుణం తీర్చుకుంది..
అశ్వారావుపేట రూరల్: పదహారేళ్ల కుమారుడిని సక్రమ మార్గంలో నడిపించేందుకు తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించాడు. కానీ తన మంచి కోసమే ఆ పనిచేశాడని మరిచిపోయిన ఆ కుమారుడు తండ్రిపై కోపం పెంచుకుని ఆయన మరణిస్తే తలకొరివి పెట్టేందుకూ ఒప్పుకోలేదు. దీంతో కూతురే తండ్రికి తలకొరివిపెట్టి రుణం తీర్చుకుంది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన లింగిశెట్టి నీలాచలం (38) స్థానికంగా సెలూన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన అప్పులు పెరగడం, తీర్చే మార్గం లేకపోవడంతో బుధవారం రాత్రి తన ఇంట్లోని పక్క పోర్షన్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గురువారం గుర్తించిన ఆయన భార్య లక్ష్మి స్థానికుల సాయంతో కిందకు దించగా...అప్పటికే నీలాచలం మృతి చెందాడు. అనంతరం నీలాచలం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కొడుకు (16) చేత తలకొరివి పెట్టించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా, తాను పెట్టనని నిరాకరించాడు. గతంలో జులాయిగా తిరుగుతున్నాననే నెపంతో తన తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించాడని, అందుకే తలకొరివి పెట్టబోనని మొండికేశాడు. బంధువులు, పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో కుమార్తె మీనాక్షి తలకొరివి పెట్టింది. -
తోటి వారిని కోల్పోయి.. బరువెక్కిన హృదయాలతో తిరుగు ముఖం
రేపల్లె (గుంటూరు): ఆ వలస కూలీలంతా కలిసే వచ్చారు. అగ్ని కీలల రూపంలో విరుచుకుపడిన ఆ కాళరాత్రి తమలో ఆరుగుర్ని సజీవ దహనం చేయడంతో భయకంపితులయ్యారు. అస్థికలుగా మారిన తోటి వారికి బరువెక్కిన హృదయాలతో అంత్యక్రియలు జరిపించారు. ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని తట్టుకోలేక.. తమతో వచ్చిన వారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక విలపిస్తూనే సొంతూళ్లకు పయనమయ్యారు. గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బ గ్రామంలోని బెయిలీ ఆక్వా ఫామ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర ప్రమాదంలో సజీవ దహనమైన ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన యువకులు నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అíస్థికలకు ఘటనా స్థలంలోనే ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి కూలీలు అదే గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. బావురుమన్న తల్లిదండ్రులు, బంధువులు ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఒడిశా నుంచి శనివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని కీలల్లో కాలిబూడిదైన అస్థికలను చూసి బావురుమన్నారు. మమ్మల్ని పోషించడం కోసం ఇంత దూరం వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ రోదించారు. వారితోపాటు వచ్చిన ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునాథ్ గుమెంగో ప్రమాదానికి గల కారణాలను ఇక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన గదిలోంచి బయటపడ్డ నలుగురు కూలీల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులు, బెయిలీ ఆక్వా ఫామ్ యాజమాన్యాన్ని కోరారు. ఒడిశా నుంచి మొత్తం 25 మంది వలస కూలీలు ఆక్వా ఫామ్‌లో పని చేసేందుకు 15 రోజుల క్రితం రాగా.. గురువారం రాత్రి 10 మంది ఒక గదిలోను, 15 మంది మరో గదిలోను నిద్రించిన విషయం విదితమే. 10 మంది నిద్రించిన గదిలో ఆరుగురు అగ్ని కీలల్లో సజీవ దహనం కాగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటంతో భయాందోళనకు గురైన మిగిలిన 19 మంది కార్మికులు శనివారం సాయంత్రం తమ వారు లేరన్న బాధతో రోదిస్తూ స్వగ్రామాలకు పయనమయ్యారు. సమగ్ర విచారణకు డిమాండ్ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. శనివారం లంకెవానిదిబ్బ గ్రామానికి చేరుకున్న సీపీఎం, సీపీఐ (ఎంఎల్) నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఆరుగురి మృతిపై సమగ్ర విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇదిలావుండగా.. ప్రమాదానికి రొయ్యల చెరువు యజమాని నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గఫూర్, కార్యదర్శి నరసింగరావు శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. యజమానిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
ఈ ఫేస్బుక్ పేజీ ‘మానవత్వ ధీర’
విజయనగరం క్రైమ్: కోవిడ్‌తో బాధపడుతూ మృతి చెందిన వారిని ‘విజయనగరం యూత్ ఫేస్బుక్ పేజీ’ పేరుతో తమవంతు బాధ్యతగా అంత్యక్రియలు నిర్వహించి పలువురి మన్ననలు పొందిన ఫేస్బుక్ పేజీ బృందాన్ని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విశేషమైన సేవలందించిన స్వచ్ఛంద సంస్థలతో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్ సమయంలో సంస్థలు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని, అభినందించి, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ఉన్నతికి పాటుపడాలన్నారు. జాతి, కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా మానవత్వమే పరమావధిగా వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించి, బాధితుల కుటుంబాల పట్ల ఆపద్బాంధువులయ్యారన్నారు. (విజయనగరం యూత్ ఫేస్బుక్ పేజీ) ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా పోలీసుశాఖకు పంపిన ‘మానవత్వ ధీర’ అవార్డును ఎస్పీ బి.రాజకుమారి విజయనగరం యూత్ ఫేస్బుక్ బృందం సభ్యులు షేక్ ఇల్తమాష్, నడుకూరి ఈశ్వరరావు (శివ), అయ్యప్ప, అమర్‌లకు అందజేశారు. వారిని అభినందించి, శాలువాలతో సత్కరించారు. రెండేళ్లుగా అనేక రకమైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను ఈ పేజీ సభ్యులు పొందారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఎస్పీ పీఏ కె.కృష్ణమూర్తి, పోలీసు పీఆర్ఓ కోటేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మానవత్వ ధీర అవార్డును ఫేస్బుక్ పేజీ ప్రతినిధులకు అందిస్తున్న ఎస్పీ రాజకుమారి -
Heart Touching Video : వెళ్లిరా.. మావటి !
కొల్లాం: వందల ఏళ్లుగా మనుషులుకు అడవి జంతువులకు మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంది. అదే సమయంలో మనుషులు, అడవి జంతువుల మధ్య అంతులేని అనుబంధం పెనవేసుకుపోయింది. అలాంటి ఓ సంఘటనే కేరళలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల పాటు తన ఆలనాపాలన చూసిన మావటి చనిపోతే కన్నీరు పెట్టుకున్నాడు ఓ గజరాజు. అతని అంత్యక్రియలకు హాజరై చివరి సారిగా నిండైన మనసుతో నమస్కారాలు చెప్పాడు. గజరాజు దండాలు కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన ఓమనచెట్టన్ అనే మావటి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ జూన్ 3న మరణించాడు. అంతకు ముందు అతను పాతికేళ్లపాటు పల్లాట్ బ్రహ్మదత్తన్ అనే ఏనుగుకు మావటిగా వ్యవహరించాడు. మావటి చనిపోయిన రోజు అతని ఇంటికి వచ్చిన బ్రహ్మదత్తన్ కన్నీటితో వీడ్కోలు పలికాడు. తొండమెత్తి దందాలు పెట్టాడు. ఈ దృశ్యం చూసిన స్థానికుల గుండెలు ద్రవించిపోయాయి. ఈ వీడియోలో ఏనుగు ప్రేమాభిమానాలు చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు. -
వృద్ధురాలికి అంత్యక్రియలు... మానవత్వం చాటుకున్న తహసీల్దార్
సాక్షి, గడివేముల: కుటుంబ సభ్యులంతా కరోనా బారినపడి కోవిడ్ కేర్ సెంటరులో ఉండగా.. ఇంటి వద్ద అనాథలా మృతిచెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదు. కానీ స్వయాన మండల తహసీల్దార్ కన్నబిడ్డలా ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సంఘటన గడివేముల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొరటమద్ది గ్రామానికి చెందిన వడ్డు లక్ష్మిదేవమ్మ(85) కుమారుడు, కోడలు, మనవడు, మనవడి భార్య మూడు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిని వైద్యసిబ్బంది చికిత్స నిమిత్తం నంద్యాలలోని కోవిడ్ కేర్ సెంటరుకు తరలించారు. అప్పటి నుంచి లక్ష్మిదేవమ్మ ఒక్కరే ఇంట్లో ఉండేవారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు కోవిడ్ కేర్ సెంటరులో ఉండిపోవడం, కరోనా భయంతో స్థానికులెవరూ ఆమె అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని విషయం తహసీల్దార్ నాగమణి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె మంగళవారం సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఒక కూతురిలాగా లక్ష్మిదేవమ్మ మృతదేహాన్ని సిబ్బందితో కలిసి మోసుకుంటూ వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అంత్యక్రియలలో తహసీల్దార్‌కు గ్రామ సర్పంచ్ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు సహకరించారు. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి.. భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య -
GHMC: ఎట్టకేలకు కదిలారు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని శ్మశానవాటికల్లో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. అంత్యక్రియలకు ఎంత చార్జి చెల్లించాలో బల్దియా ఖరారు చేయకపోవడంతో ఇష్టానుసారం వసూళ్లు చేస్తున్నారు. అంత్యక్రియలు జరిగాక, రసీదు కోసం సంబందీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అంటూ తిప్పుతున్న వారివల్ల డెత్ సర్టిఫికెట్ అత్యవసరమైన కుటుంబీకుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మెజార్టీ శ్మశానవాటికల్లో ఇదే తంతు జరుగుతోందనే అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్మశనవాటికల్లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. దహనానికి నిర్ణీత ధరల్ని నిర్ణయించింది. కేటీఆర్ దృష్టికి... శ్మశానవాటికల్లో రసీదు పుస్తకాలు కూడా లేని పరిస్థితుల గురించి, డెత్ సర్టిఫికెట్ల కోసం ‘యుద్ధం’ చేయాల్సిన పరిస్థితుల గురించి పలువురు మున్సిపల్ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ల దృష్టికి తెచ్చారు. దీంతో అసలు శ్మశానవాటికల్లో ఏం జరుగుతోందో పరిశీలించి చక్కదిద్దాల్సిందిగా వారు ఆదేశించారు. అంత్యక్రియలకు అధికచార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని, ప్రజల ఇబ్బందులు తొలగించాలని వారు పేర్కొన్నారు. దీంతో శ్మశానవాటికల్లో దహనాల చార్జీలను ఖరారు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో నగరంలోని కొన్ని శ్మశానవాటికలను అధికారులు పరిశీలించారు. కట్టెలతో దహనం చేస్తే ఎంత, విద్యుత్‌తో దహనం చేస్తే ఎంత, గ్యాస్‌తో అయితే ఎంత తీసుకోవాలో ధరలు నిర్వాహకులకు తెలిపారు. ధరల డిస్ప్లే... ఆయా శ్మశానవాటికల్లో నిర్ణీత దహన చార్జీలు ప్రజలకు తెలిసేలా బ్యానర్లు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.అధిక ధరలు వసూలు చేసినా, ఇతరత్రా ఫిర్యాదులున్నా ఫోన్ చేయాలంటూ జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్‌ను 040– 21 11 11 11 ఇచ్చారు. ∙కొన్ని శ్మశానవాటికల వద్ద సంబంధిత డిప్యూటీ కమిషనర్, ఏఎంఓహెచ్, శానిటరీ జవాన్ల ఫోన్ నెంబర్లు కూడా బ్యానర్లపై పేర్కొనడమే కాక హెల్ప్‌డెస్క్‌లు సైతం ఏర్పాటు చేశారు. ∙ఆయా శ్మశానవాటికల వద్ద ప్రదర్శించిన ఈ ధర ల కంటే ఎక్కువ డిమాండ్‌చేస్తే ఫిర్యాదు చేయవచ్చునని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ∙ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లేందుకు అంబులెన్సు చార్జీ రూ.4 వేలుగా పేర్కొన్నారు. ∙ప్రభుత్వాస్పత్రుల్లో మరణించే కోవిడ్ మృతదేహాలకు తాము అంత్యక్రియలు నిర్వహించలేమని కుటుంబీకులు తెలియజేస్తే, జీహెచ్ఎంసీయే శ్మశానవాటికకు తరలించిఅంత్యక్రియలు నిర్వహిస్తుంది. నిర్ణీత చార్జీలను చెల్లిస్తుంది. డెత్ సర్టిఫికెట్ జారీలో జాప్యంపైనా దృష్టి.. డెత్ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న జాప్యంపైనా అధికారులు దృష్టి సారించారు. సర్టిఫికెట్ అవసరమైన వారి నుంచి డబ్బులు గుంజేందుకుగాను జారీలో జాప్యం జరిగేలా ఇబ్బందులు సృష్టిస్తున్న వారిపై, అంత్యక్రియలు ముగిశాక వెంటనే రసీదు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న శ్మశానవాటికలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
పీపీఈ కిట్లతో అంత్యక్రియల నిర్వహణ
పెదబయలు: కోవిడ్‌పై గ్రామాల్లో అవగాహన పెరుగుతోంది. లేనిపోని భయాలు తగ్గి..తగు జాగ్రత్తలతో మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి బాంధవ్యాలను, మానవత్వాన్ని మాయం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితులలో ఈ పరిణామం ఊరట కలిగిస్తోంది. విశాఖ జిల్లా పెదబయలుకు చెందిన గంప చినగుండన్న (68) కొంతకాలంగా దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. ఈ ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో మృతుడికి కూడా కోవిడ్ సోకే అవకాశం ఉందన్న భావనతో వైద్య సిబ్బంది దగ్గర పీపీఈ కిట్లు తీసుకొని నలుగురు కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. మృతుడికి కరోనా ఉందో లేదో తెలియదని..ఉంటే దహన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కోవిడ్ సోకే ప్రమాదం ఉందని అందుకే జాగ్రత్తలు తీసుకుని నలుగురితోనే అంత్యక్రియలు ముగించామని కుటుంబీకులు తెలిపారు. -
ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’
పేరున్న కుటుంబం.. ఊరంతా బంధువులే.. కానీ కరోనా వచ్చి మృత్యువాత పడితే పట్టించుకునే వారే ఉండరు. అయినవారే కాదనుకుని వెళ్లిపోతుండగా.. ముక్కూమొహం తెలియని వారే మానవత్వం చూపుతున్నారు. అన్నీతామై అంతిమసంస్కారాలు చేస్తున్నారు. ఏ జన్మసంబంధమో తెలియదు గానీ చితికి నిప్పుపెట్టో.. గుప్పెడు మట్టి పోసో ఆత్మబంధువులవుతున్నారు. ముదిగుబ్బ/కదిరి/నల్లమాడ: బంధాలను కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేస్తోంది. మానవత్వం మంట గలుస్తోంది. అంతవరకూ తామున్నామంటూ భరోసా ఇచ్చిన వారే పాజిటివ్ వచ్చిందనగానే దూరమైపోతున్నారు. ఇక కరోనా కాటుకు బలైపోతే అంత్యక్రియలు చేసేందుకూ వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు యువకులు ఆత్మబంధువులయ్యారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి అంతిమసంస్కారాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృష్ణమ్మకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ముదిగుబ్బకు చెందిన కృష్ణమ్మ (65) కరోనాతో పోరాడి బుధవారం తుదిశ్వాస విడించింది. అయితే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ‘ఇస్లామిక్ హెల్పింగ్ హ్యాండ్స్’ ప్రతినిధులు అమీర్, బాబా, తలహ, ఆదిల్, సుజార్లు ముందుకొచ్చారు. వృద్ధురాలి అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. భార్యా కుమారుడు ముఖం చాటేసినా... కదిరి రూరల్ మండలం నాగూరుపల్లికి చెందిన ఆంజనేయులు(45) కొన్నేళ్లుగా నల్లమాడలో ఒంటరిగా ఉంటూ భవన నిర్మాణ కారి్మకుడిగా జీవనం సాగించేవాడు. కొన్నిరోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం అధికం కావడంతో బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అనంతరం ఆస్పత్రి బయట అరుగుపై కూర్చొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భార్య, కుమారుడు నల్లమాడకు చేరుకున్నారు. కరోనా సోకవడం వల్లే ఆంజనేయులు మృతిచెందినట్లు ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణ తెలిపారు. నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. భయాందోళన చెందిన వారు ఆంజనేయులు మృతదేహాన్ని అక్కడి వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ రాత్రి, గురువారం ఉదయం వరకు సుమారు 20 గంటల పాటు మృతదేహం ఆస్పత్రి ఆవరణలోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, స్థానిక పోలీసుల సహకారంతో ఓడీ చెరువుకు చెందిన ‘హెల్పింగ్ హ్యాండ్స్ తలబా’ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పంచాయతీ పారిశుధ్య కారి్మకులతో కలిసి ఆంజనేయులు అంత్యక్రియలను నిర్వహించారు. కుటుంబీకులే భయపడినా.... కదిరి: కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన ఓ వ్యక్తి బుధవారం కరోనాతో మృతి చెందాడు. అయితే వైరస్ భయంతో కుటుంబీకులు ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకాడారు. విషయం తెలుసుకున్న కదిరి పట్టణానికి చెందిన నిజాంవలీ, ఇర్ఫాన్‌ఖాన్, ఆషిక్, సాదిక్ బాషా, ఇర్షాద్, అక్బర్‌ఖాన్ మరికొందరు వెంటనే అక్కడికి చేరుకుని ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కూడా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోవడంతో అంతిమ సంస్కారాలు చేశారు. తమకు కుల, మత భేదాలు లేవని ఎవరైనా తమను సాయం అర్థిస్తే తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బృందంలోని సభ్యుడు అక్బర్ ‘సాక్షి’ తెలియజేశారు. చదవండి: వ్యాక్సిన్ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే 1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు -
కరోనా కాలంలో ఖాకీల కారుణ్యం
సాక్షి, అమరావతి: కరోనాతో మృతి చెందిన వారిని అయిన వాళ్లే వదిలేసినా..వారి అంత్యక్రియలను పోలీసులు అన్నీ తామై చేయిస్తూ మానవత్వం ఖాకీ యూనిఫాం రూపంలో ఉందని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామానికి చెందిన షేక్ సుభాని(35)కు కరోనా కారణంగా ఊపిరి ఆడకపోవడంతో మంగళవారం అంబులెన్సులో తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. సుభానిని అయిన వారు సైతం పట్టించుకోకపోవడంతో 2 గంటల పాటు రోడ్డు పక్కనే మృతదేహం ఉండిపోయింది. విషయం తెలుసుకున్న తిరువూరు సీఐ శేఖర్‌బాబు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలుగోటి యూత్ సభ్యులకు అప్పగించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. అలాగే, కంచికచర్ల మండలం గండేపల్లిలో 10 రోజులుగా మతిస్థిమితం లేకుండా యాచక వృత్తి చేసుకుంటూ తిరుగుతోన్న వృద్ధురాలు సోమవారం మృతి చెందగా ఆమె అంత్యక్రియలను ఎస్ఐ రంగనాథ్ నేతృత్వంలో సిబ్బంది, గ్రామస్తులు నిర్వహించారు. ముసునూరు మండలం గోపవరంలో సోమవారం మరణించిన ఒక వృద్ధుడికి, సూరేపల్లి దిబ్బగూడెంలో మంగళవారం మృతి చెందిన వృద్ధురాలికి ఎస్ఐ రాజారెడ్డి నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఒక మహిళ మంగళవారం ఎండకు సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోగా చిలకలపూడి ఎస్ఐ నాగేంద్ర, ఏఎస్ఐ బలరాం, ట్రాఫిక్ కానిస్టేబుల్ హర్ష వచ్చి ఆమెను రోడ్డు పైనుంచి తీసి బెంచిపై కూర్చోబెట్టి నీళ్లు పట్టించి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను 108లో ఆసుపత్రికి తరలించారు. -
ఆ నలుగురే అంతిమ బాంధవులు!
సోమశిల: కరోనా బారిన పడి ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబసభ్యులు భయపడి అంతిమ సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో గ్రామ సచివాలయ అధికారులు ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడుకు చెందిన పులివర్తి కొండమ్మ (57)కు కోడలు, ఇద్దరు మనువరాళ్లు ఉన్నారు. ఇటీవల కొండమ్మకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుటుంబీకులు భయపడి మృతదేహానికి ఖననం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో గ్రామ సర్పంచ్ బుట్టి భారతమ్మ సహకారంతో పంచాయతీ కార్యదర్శి రమణరావు, వీఆర్వో ఉదయ్‌భాస్కర్, ఏఎన్ఎం సుశీల, ఆశా వర్కర్లు పీపీఈ కిట్లు ధరించి కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ మృతదేహాన్ని ఖననం చేశారు. -
డైరెక్టర్ కేవీ ఆనంద్‌కు కన్నీటి నివాళి
చెన్నై : ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కేవీ ఆనంద్(54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కేవీ ఆనంద్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచారు. నటులు రజనీకాంత్, కమల్ హాసన్, ధనుష్, గీత రచయిత వైరముత్తు, ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, నిర్మాతలు అఘోరం, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, తమిళ నిర్మాతల మండలి ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్‌కుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని ఆయన ఇంటి వద్ద కాసేపు సందర్శనార్థం ఉంచారు. స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదీ సినీ నేపథ్యం.. కేవీ ఆనంద్ ఛాయాగ్రాహకుడుగా, దర్శకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. చెన్నై లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ పూర్తిచేసిన ఈయన సినీ రంగంపై ఆసక్తితో తొలి రోజుల్లో నిశ్చల ఛాయాగ్రహకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. తమిళ వారపత్రికలో ఫోటో జర్నలిస్టుగా కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ వద్ద సహాయకుడిగా చేరారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం తెన్ మావిన్ కొంబత్తు చిత్రం ద్వారా ఛాయగ్రాహకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రం తోనే 1994లో జాతీయ ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డును అందుకున్నారు. ఆపై తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సత్తా చాటారు. తమిళంలో శంకర్, మణిరత్నం చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. తెలుగులో పుణ్యభూమి నాదేశం చిత్రం ద్వారా ఛాయాగ్రహాకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిగా శ్రీకాంత్ కనా కండేన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరు సూర్య హీరోగా అయన్, మాట్రాన్, కాప్పాన్ చిత్రాలతోపాటు జీవా కథానాయకుడు నటించిన కో, ధనుష్ హీరోగా అనేగన్, విజయ్ సేతుపతి హీరోగా కవన్ చిత్రాలను తెరకెక్కించారు. ఈయన దర్శకత్వం వహించిన చివరి కాప్పాన్. శింబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఆలోపే ఆయన కన్నుమూశారు. మరో సీనియర్ నటుడు కన్నుమూత మరో సీనియర్ నటుడు సెల్లదురై(84) గురువారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన జాన్సన్, శివాజీ, కత్తి, మారి, రాజారాణి, మనిదన్ వంటి చిత్రాల్లో నటించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ సర్వే డిపార్ట్మెంట్లో పదవీ విరమణ చేసిన తరువాత సినీరంగ ప్రవేశం చేశారు. అంతేకాకుండా సెల్లదురై రంగస్థల నటుడు కూడా. ఈయన భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం స్థానిక కీలప్పాకం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
కరోనా : అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన యంగ్ హీరో
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. కరోనా రోగులకు సహాయం అందించడానికి ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అర్జున్ అంబులెన్స్ సేవలలను ప్రారంభించాడు. ఇప్పటకే సోనూ సూద్, ప్రియాంక చోప్రా, ఆలియాభట్, సహా పలువురు నటులు కరోనా రోగులకు సహాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు అర్జున్ గౌడ మరో అడుగు ముందుకేసి స్వయంగా అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. గత రెండు రోజులుగా అంబులెన్స్‌ను స్వయంగా నడుపుతూ పలువురు కోవిడ్ రోగులకు సహాయం అందించాడు. ఈ సందర్భంగా అర్జున్ గౌడ మాట్లాడుతూ..తాను ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’..అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగులను హాస్పిటల్స్‌కు తరలించడం సహా కోవిడ్ కారణంగా చనిపోయినవారికి అంత్యక్రియలను సైతం నిర్వహిస్తుందని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు తానే స్వయంగా ఆరుగురికి అంత్యక్రియలు జరిపించానని వెల్లడించాడు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మతానికి చెందిన వారు అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ సహాయం చేస్తానని తెలిపాడు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీంతో రానున్ను రెండు నెలల వరకు ఈ ఆంబులెన్స్ సర్వీసులు కొనసాగించాలని యోచిస్తున్నట్లు వివరించాడు. తనకు వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌవరంగా భావిస్తానని చెప్పాడు. ‘యువరత్న’, ‘రుస్తుమ్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన అర్జున్ గౌడ చేస్తోన్న మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అర్జున్ గౌడను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చదవండి : ఐసీయూలో కరీనా కపూర్ తండ్రి రణదీర్ KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత -
కల్లోలం: ఎర్రగడ్డలో ఒక్కరోజే 32 శవాల అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పాటు రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. ఎర్రగడ్డ ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో రోజు పెద్ద సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 32 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 32 కరోనా బారినపడిన మృతిచెందిన వారికి అంత్యక్రియలు చేశారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ మరణించినవారే ఉన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ శ్మశానవాటికలో వాటికి దహన సంస్కారాలు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఒక్క ఎర్రగడ్డ శ్మశానం లెక్కలు మాత్రమే. అధికారికంగా ప్రకటించిన లెక్కలే ఇంత ఉంటే అనధికారికంగా ఎన్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ఎంత సంఖ్యలో కరోనా మృతులు సంభవిస్తున్నాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త -
ముగిసిన నటి మాలాశ్రీ భర్త అంత్యక్రియలు
యశవంతపుర(కర్ణాటక): ప్రముఖ కన్నడ సినీ నిర్మాత, నటీమణి మాలాశ్రీ భర్త కోటి రాముకు కన్నీటి వీడ్కోలు పలికారు. కరోనాతో సోమవారం బెంగళూరులో కన్నుమూయడం తెలిసిందే. మంగళవారం ఆయన స్వస్థలమైన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కోడిగేహళ్లి జరిగాయి. కన్నడ సినిమా రంగంలో మూడు దశాబ్దాల పాటు సినిమాలను నిర్మించి కోటి రాముగా పేరు గాంచారు. అక్కడి ఫాం హౌస్‌లో అంతిమ సంస్కారాలు జరిపించారు. సతీమణి మాలాశ్రీ, ఇద్దరు సంతానం, బంధువులు పాల్గొన్నారు. జేడీఎస్ నేత నిఖిల్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు. -
కరోనా భయం: ముస్లిం యువకుల మానవత్వం
మిర్యాలగూడ: ఓ వ్యక్తి చనిపోతే కరోనా భయంతో చివరిచూపు చూసేందుకు కూడా బంధువులు రాని నేపథ్యంలో కొందరు ముస్లిం యువకులు పాడె మోసి, అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. మతాలు మాత్రమే వేరని, మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఇస్లాంపురకు చెందిన చంద్రశేఖరాచారి (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ భయంతో సమీప బంధువులు ఎవరు కూడా భౌతికదేహాన్ని కడసారి చూసేందుకు రాలేదు. దీంతో మృతుడి తల్లికి తోడుగా ఆ కాలనీకి చెందిన ముస్లిం యువకులు నాయబ్, బురాఖాన్, వసీం, ఖయ్యూమ్, జుబేర్, అబ్బూలు అంతిమ యాత్రలో పాడె మోశారు. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ ఏర్పాటు చేసిన వైకుంఠ రథంలో హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా! చివరికి
జగిత్యాల : వ్యక్తి చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే.. కాటికాపరులు డబ్బుల కోసం వేధించిన సంఘటన జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది.దీంతో గ్రామస్తులే చొరవ తీసుకుని, అంత్యక్రియలను ముగించిన వైనం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మిట్టపెల్లి బాపురెడ్డి ఆదివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లగా.. కాటికాపరులు వచ్చి చితిపై కూర్చుని అంతిమ సంస్కారాలను అడ్డుకున్నారు. రూ.10 వేలు ఇస్తేనే చితి మీది నుంచి దిగుతామని భీష్మిం చారు. గ్రామస్తులు మాట్లాడి రూ.వెయ్యి వరకు ఇస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. దీంతో గ్రామస్తులందకూ కలిసి చితిపై ఉన్న కాటి కాపరులను పక్కకు తోసి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. -
కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు
సాక్షి, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన మాసున శ్రీనివాస్ (38) పాము కాటుకు గురై మృతి చెందగా, కూతురే కొడుకై తండ్రి చితికి నిప్పు పెట్టింది. శ్రీనివాస్ జీవనోపాధి కోసం హన్మకొండలో ఓ మడిగను అద్దెకు తీసుకొని కంకబొంగులతో గంపలు, తడకలు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అద్దెకు ఉంటున్న మడిగలో సోమవారం రాత్రి శ్రీనివాస్ పాము కాటుకు గురై మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు స్వగ్రామం హుస్నాబాద్‌కు తీసుకొచ్చారు. మృతుడి శ్రీనివాస్‌కు భార్య స్వరూప, కుమార్తెలు అనూష్క, అక్షయలు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అనుష్క తండ్రి అంత్యక్రియలు చేసి చితికి నిప్పు పెట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. చదవండి: ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్..మహిళా సర్పంచ్ మృతి -
తలకొరివి పెట్టిన కూతుళ్లు
తల్లాడ/ఖమ్మం: మండల పరిధిలోని రంగంబంజర ఘటనలో మృతి చెందిన దంపతులకు ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన మాట వినలేదని, అమెరికా వెళ్లొద్దని జగడం పెట్టుకుని ఈ నెల 3వ తేదీ తెల్లవారు జామున తన భార్య విజయలక్ష్మిని నరికి చంపి, సంక్రాంతి సుబ్రమణ్యేశ్వర్‌రావు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. దంపతులిద్దరూ చిన్న కుమార్తె సునీత దగ్గరకు అమెరికా వెళ్లే విషయంలో ఏకాభిప్రాయం కుదరక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చిన్న కూతురు సునీత వచ్చే వరకు మృతదేహాలను ఖమ్మం మమత ఆసుపత్రిలో భద్రపర్చారు. ఆదివారం ఆమె రంగంబంజర చేరుకోవడంతో మృతదేహాలను ఖమ్మం నుంచి స్వగృహానికి అంబులెన్స్‌లో తరలించారు. పెద్ద కుమార్తె సరిత తండ్రికి తలకొరివి పెట్టగా, చిన్న కుమార్తె సునీత తల్లి విజయలక్ష్మికి తల కొరివి పెట్టారు. కూతుళ్లు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. చదవండి : (అమెరికా వెళ్తానన్న భార్య.. హత్య చేసిన భర్త) (భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య) -
ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం
-
ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం
సాక్షి, పెద్దపల్లి : దారుణహత్యకు గురైన న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. మంథని మండలం గుంజపడుగులో గోదావరి ఒడ్డున శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ఒకే చితిపై దంపతులిద్దరికీ దహన సంస్కారాలు నిర్వహించారు. వామన్ రావు సోదరుడు ఇంద్రశేఖర్ రావు తలకొరివి పెట్టారు. వారి నివాసం నుంచి గోదావరినది వరకు రెండు కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అంత్యక్రియల్లో మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టు వామన్ రావు నాగమణి దంపతుల మృతదేహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నివాళులర్పించారు. మరోవైపు దంపతుల అంత్యక్రియలు పూర్తికావడంతో నిందితులను అరెస్టు చూపే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు A-1 వసంతరావు, A-2 కుంట శ్రీనివాస్, A-3 కుమార్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని మరికాసేట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
ఆస్తి మొత్తం మూడో కూతురికేనా.. మాకేదీ!
సాక్షి,పాలకుర్తి: ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా కన్నతండ్రి అంత్యక్రియలను సొంత కూతుళ్లే అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాల్సిందేనంటూ పట్టుబట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన దీకొండ చంద్రయ్య(74)కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. చంద్రయ్య అనారోగ్యానికి గురైనప్పటి నుంచి మూడో కుమార్తె ఆయన బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో చంద్రయ్య అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. తండ్రి ఆస్తి మొత్తం మూడో కుమార్తె తీసుకుందని ఆరోపిస్తూ మిగతా కూతుళ్లు దహన సంస్కారాలను అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాలన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఐ గండ్రాతి , పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాక మాట్లాడుదామని నచ్చజెప్పడంతో కూతుళ్లు అంగీకరించారు. తల్లిదండ్రుల ఆస్తి కోసం కుమార్తెలు గొడవకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
అమ్మకు అవమానం
సాక్షి, కోనేరుసెంటర్ (కృష్ణా): నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకునేందుకు నిరాకరించాడు ఓ కన్నకొడుకు. చేసేది క్షమించరాని తప్పిదమని తెలిసినా ఆమె తనకు అన్యాయం చేసిందనే అక్కసుతో ఆమె మృతదేహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు. పైగా తన తల్లిని తోబుట్టువు చంపేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తతంగమంతా గతంలోనే తెలిసి ఉన్న పోలీసు అధికారులు అతని దుర్మార్గ పు చర్యను మందలించి తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిగేలా చేశారు. ఈ ఘటన జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఈడేపల్లిలో నివాసం ఉంటున్న నాగప్రసాద్ జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తల్లి రాజారత్నంకు నాగప్రసాద్‌తో పాటు కుమార్తె ఉంది. కొంతకాలంగా నాగప్రసాద్‌కు తోబుట్టువుకు మధ్య ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. ఈ విషయంలో తోబుట్టువుతో పాటు తల్లితోనూ విభేధాలు ఏర్పడ్డాయి. నాగప్రసాద్ రాజారత్నంను పట్టించుకోవటం మానేశాడు. ఈ విషయంపై రాజారత్నం అనేక మార్లు నాగప్రసాద్‌పై జిల్లా కలెక్టర్‌తోపాటు అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేసింది. అయినా ప్రయోజనం లేకపోవటంతో బంటుమిల్లిలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె వద్దకు వెళ్లి తలదాచుకుంది. అప్పటి నుంచి కూతురు వద్దనే ఉంటున్న రాజారత్నం ఇటీవల అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి చనిపోయింది. దీంతో నాగప్రసాద్ తోబుట్టువు ఆమె భర్త కలిసి రాజారత్నం మృతదేహాన్ని ఈడేపల్లిలోని నాగప్రసాద్ ఇంటికి తీసుకు వచ్చారు. నాగప్రసాద్ మృతదేహాన్ని తన ఇంటి ముందు పెట్ట వద్దంటూ వారితో వివాదానికి దిగాడు. తన తల్లిని అంతమొందించి ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించారంటూ తోబుట్టువుపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై గతంలోనే అవగాహన ఉన్న స్టేషన్ అధికారులు నాగప్రసాద్‌కు సర్ది జెప్పి అంత్యక్రియలు జరిపించారు. కొడుకు అంత్యక్రియలు నిర్వహించనని తల్లి శవాన్ని ఇంటి ముందు వదలి ఇంటికి తాళాలు పెట్టుకుని వెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు నాగప్రసాద్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. (చదవండి: లోన్ యాప్ వేధింపులు: మరో వ్యక్తి బలి) -
నాన్న వచ్చాడు.. లేచి చూడు కన్నా..
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : సరదాగా స్నేహితులతో తిరిగేవాడివి... మారం చేయకుండా బడికి వెళ్లే వాడివి... ఏ పని చెప్పినా చేసేవాడివి.. అందిరితో కిలివిడిగా ఉండే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ శివరామకృష్ణ తల్లి లావణ్య బోరున విలపిస్తోంది. నిన్నే ప్రాణంగా భావించి.. నీ అభివృద్ధి కోసం కువైట్‌కు వెళ్లిన మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చాడు..ఒక్క సారి లేచి చూడరా నానా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందన అందరి గుండెలను పిండేసింది. గుంజన ఏటిలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన శివరామకృష్ణ మృతదేహం గురువారం తెల్లవారు జామున లభ్యమైంది. జాలర్లు వల సహాయం మృతదేహాన్ని గట్టుకు చేర్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కువైట్‌లో ఉన్న మృతుని తండ్రి సుబ్రమణ్యం కూడా ఇంటికి చేరుకోవడంతో కటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బంధువులే కావడంతో గుండాలపల్లె గ్రామస్తులు శోకసంద్రంలోనే ఉన్నారు. శివరామకృష్ణకు నివాళి ఏటిలో గల్లంతై మృతి చెందిన శివరామకృష్ణకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళులరి్పంచారు. గురువారం ఉదయం గుండాలపల్లెకు వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. ఫలించిన కొరముట్ల కృషి శివరామ కృష్ణ ఏటిలో గల్లంతయ్యాడని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేసిన కృషి ఫలించింది. స్థానిక రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలింపు చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో జిల్లా ఎస్పీతో చర్చించారు. బోటు, జాలర్లను పిలిపించారు. గురువారం రాత్రంతా ఏటిలో జల్లెడ పట్టించారు. గుంజన ఏరు నీటి ఉధృతిని తగ్గించడానికి నాలుగు జేసీబీలతో నీటిని తగ్గించారు. విప్ కొరమట్లు దగ్గరుండి వారిని ప్రోత్సహించారు. చివరికి గురువారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కొరముట్ల కృషికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు, జాలర్ల పనితీరును ప్రశంశించారు. శివరామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీస్తున్న జాలర్లు మృతుని తల్లిదండ్రులను ఓదారుసున్న విప్ కొరముట్ల -
అమెరికాలోనే అంత్యక్రియలు..
సాక్షి, మరికల్ (నారాయణపేట): మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన దంపతులు ఆర్టీసీ కండక్టర్ నరసింహరెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విధితమే. వీరి అంత్యక్రియలు పది రోజుల తర్వాత సోమవారం సాయంత్రం అమెరికాలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడ్డ కూతురు మౌనికారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. చదవండి: (టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం) -
నోముల అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్
నల్గొండ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జరిగాయి. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని నివాళి అర్పించారు. నోముల భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. (ముగిసిన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం) నకిరేకల్ నుంచి పాలెంకు భౌతికకాయం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని గురువారం ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 10.30 గంటల వరకు ఉంచారు. ఆ తర్వాత స్వగ్రామమైన పాలెం తీసుకెళ్లారు. కాగా, అమెరికాలో ఉన్న నోముల కుమార్తె బుధవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. -
వీర జవాన్లుకు ఘన వీడ్కోలు
సాక్షి, చిత్తూరు/నిజామాబాద్: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వీర జవాను ర్యాడ మహేశ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి వైకుంఠ ధామంలో మహేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ పార్థివ దేహంపై కుటుంబ సభ్యులు జాతీయ జెండాను ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. జవాన్‌కు తుది వీడ్కోలు పలకడానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కోమన్‌పల్లి కన్నీటిసంద్రమైంది. కాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన మరో జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కుటుంబసభ్యులు కన్నీటితో ప్రవీణ్‌కు తుది వీడ్కోలు పలికారు. కాగా బుధవారం ఉదయం ప్రవీణ్ భౌతిక కాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అశ్రునయనాల మధ్య నాయిని అంత్యక్రియలు
-
కార్మిక నేతకు తుది వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియ లు గురువారం మధ్యాహ్నం ఫిలింనగర్ మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో నాయి ని మృతి చెందినట్లుగా అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు, అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని నాయిని కుటుంబసభ్యులను పరామర్శించారు. తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఆయన పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహి ల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని నాయిని నివాసానికి తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఇంటి వద్ద కడ సారి చూపుకోసం వేచి ఉన్నారు. నాయిని భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథో డ్, ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి నాయిని అం తిమ యాత్ర ప్రారంభమైంది. మహాప్రస్థానంలో నాయిని పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్.. పాడె కూడా మోశారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాయిని చితికి కుమారుడు దేవేందర్‌రెడ్డి నిప్పంటించారు. ఆస్పత్రి నుంచి భార్య.. నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాయినితో పాటు ఆమె కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో ఆస్పత్రి వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో ఆమె ను మినిస్టర్ క్వార్టర్స్‌కు తీసుకురాగా భర్త భౌతిక కాయాన్ని చూసి రోదించారు. అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి నాయిని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. కార్మిక సమస్యల పరిష్కారంలో నాయిని కృషి చిరస్మరణీయం న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల పలువు రు ప్రముఖులు సంతాపం తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘స్నేహశీలి నాయిని ఆ త్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సోషలిస్టు ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన నర్సింహారెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్మిక సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయం’’అని వెంకయ్య తన సందేశంలో పేర్కొన్నారు. పలువురి సంతాపం నాయిని నర్సింహారెడ్డి మృతికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీ యాధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ఎంపీ కోమ టి రెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వినో ద్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సీపీఐ నేతలు సురవరం సుధాకరరెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహారావు, ప్రొఫెసర్ కోదండరామ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి, టీఎన్జీఓ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మరో నేత కారం రవీందర్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, నాయిని పార్థివదేహానికి డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. హాం మంత్రిగా ఉన్నప్పుడు నాయిని పోలీసుశాఖకు ఎన్నో సేవలు చేశారని డీజీపీ గుర్తు చేసుకున్నారు. ప్రతీక్షణం తెలంగాణ కోసం .. నాయిని తన జీవితంలో ప్రతీక్షణం తెలంగాణ కోసం శ్రమించారు. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిది. నాయిని మృతితో తెలంగాణ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది – గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మరచిపోలేని అనుబంధం నాయిని మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో నాయినితో కలిసి పనిచేసిన అనుబంధం మరచిపోలేనిది. ఆయన కుటుంబ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. – సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి నాయిని మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం అత్యంత బాధాకరం అని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని ఓ గొప్ప కార్మిక నాయకుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జననాయకుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నిలిచిన జన నాయకుడు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోం మంత్రిగా మనందరి మనసులో నాయిని నర్సింహారెడ్డి చిరస్థాయిగా నిలచిపోతారు. – మంత్రి కేటీ రామారావు. -
అశ్రునయనాల మధ్య నాయిని అంత్యక్రియలు
-
నాయిని అంత్యక్రియలు: పాడె మోసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్న్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనలతో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మీయ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పడలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్.. పాడె మోసి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. కరోనా అనంతరం అనారోగ్యం పాలైన నాయిని.. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. -
కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరారు. మధ్యాహ్నం జరగనున్న ఆయన మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం.గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, డీఐజీ వెంకటరామిరెడ్డి తదితర అధికారులు విమానాశ్రయంలో సీఎం జగన్‌ను కలిశారు. (చదవండి: సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి నివాళర్పించారు. -
గాయక నాయకా స్వరాభివందనం
సాక్షి ప్రతినిధి, చెన్నై : కోట్లాది మంది అభిమానులకు కన్నీటిని మిగిల్చి.. కానరాని లోకాలకు గాన గంధర్వుడు శాశ్వతంగా వెళ్లిపోయారు. పాటలతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ స్వరమాంత్రికుడిని భూమాత తన గర్భంలో దాచుకుంది. అభిమానుల అశ్రునయనాలు, కుటుంబీకుల కన్నీటి ధారల మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శనివారం పూర్తయ్యాయి. అనారోగ్యంతో శుక్రవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన తర్వాత ఎస్పీ బాలు పార్థివదేహాన్ని కమదార్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ కొంతసేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో ఉన్న బాలు సొంత వ్యవసాయ క్షేత్రానికి ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి తరలించారు. ఆ వాహనాన్ని వేలాది మంది అనుసరించారు. దారిపొడవునా అభిమాన సందోహం ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పలు చోట్ల వాహనాన్ని నిలిపివేసి పూలవర్షం కురిపించారు. దీంతో గంటలో వ్యవసాయ క్షేత్రానికి రావాల్సిన వాహనం మూడు గంటలు ఆలస్యంగా శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకుంది. అప్పటికే వేలాది మంది జనం వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. (మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!) కన్నీటి పర్యంతమైన కుటుంబం వ్యవసాయ క్షేత్రంలో బాలు భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు శనివారం తెల్లవారుజాము 5 గంటల నుంచి అనుమతించారు. ఉదయం 7 గంటలకు అంతిమసంస్కారాలు ప్రారంభించారు. బాలు సతీమణి సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు, ఇతర బంధువులు పార్థివదేహానికి ప్రదక్షిణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతిలో కుమారుడు చరణ్ పూర్తి చేశారు. ఎస్పీ బాలుతో కలిసి చదువుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ మహేశ్వరి నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 24 మంది పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్చి నివాళులు అర్పించారు. బాలు భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరవుతున్న భార్య సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం బాలసుబ్రహ్మణ్యానికి వీలు చిక్కినప్పుడల్లా తన వ్యవసాయక్షేత్రానికి వచ్చేవారు. ఈ ఫాం హౌస్‌లోని ప్రశాంత వాతావరణంలో కాలక్షేపం చేసేవారు. సుమారు 15 ఎకరాల్లోని ఈ వ్యవసాయక్షేత్రంలో పచ్చని చెట్లు, తోటల మధ్య గడిపేందుకు ఆయన ఇష్టపడేవారు. అంతేగాక ఈ వ్యవసాయక్షేత్రం చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఎన్నో సహాయాలు చేసేవారు. బాలు మరణవార్త వినగానే అంతిమసంస్కారాలు ఎక్కడ చేయాలనే ఆలోచన వచ్చినపుడు.. ఆయన సన్నిహితులు ఈ వ్యవసాయక్షేత్రాన్ని సూచించారు. దీనికి కుటుంబీకులు కూడా అంగీకరించారు. ఎస్పీ చరణ్‌ను ఓదారుస్తున్న హీరో విజయ్ ఏపీ నుంచి మంత్రి అనిల్.. ఎస్పీబీ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ సంగీత దర్శకుడు ఇళయరాజా శనివారం రాత్రి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయ సన్నిధిలో మోక్ష దీపం వెలిగించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బాలుకు నివాళులు అర్పించారు. అంతిమసంస్కారాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తమిళనాడు మంత్రి ఎం పాండియరాజన్, ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్, నటుడు అర్జున్, రెహమాన్, దర్శకుడు భారతీరాజా, గాయకుడు మనో, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్ బాలుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ చరణ్‌తో మాట్లాడుతున్న ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయంలో ఖననం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయానికి చెందిన వారు కావడంతో ఆయన పార్థివదేహాన్ని ఆ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. లింగదారుల వంశీకుల్లో స్త్రీ, పురుషులు విధిగా శివలింగాన్ని ధరించి ఉంటారు. ఎస్పీ బాలు ఇంటిలో శివలింగాలకు వేదపండితులు నిత్యం అభిషేకం చేస్తారు. లింగదారుల సంప్రదాయంలో వారు మరణిస్తే భౌతికకాయాన్ని కూర్చోబెట్టి ఖననం చేస్తారు. అయితే బాలు పార్థివదేహం శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల కూర్చోపెట్టడానికి వీలుకాక పడుకోబెట్టిన స్థితిలోనే ఖననం చేశారు. -
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు.. ఫోటోలు
-
ఎస్పీ బాలుకు తుది వీడ్కోలు
-
ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి
సాక్షి, చెన్నై : తన గాన లహరితో భారతావనిని ఓలలాడించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశ్రు నివాళుల మధ్య ముగిశాయి. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంతకు ముందు కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేశారు. దీంతో సొలసితి అంతట నీ శరణనే చొచ్చితిని అంటూ ఆయన ఇక శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. (మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!) తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు సూపర్‌స్టార్ విజయ్, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి) -
సంగీత ప్రపంచానికి తీరని లోటు: దేవిశ్రీ
సాక్షి, చెన్నై : ప్రఖ్యాత గాయకుడు, గాన గందర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతోంది. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో ఆయన అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కోట్లాది అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన బాలుకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ఆదేశించింది. అభిమానులు పెద్ద ఎత్తున వస్తుండటంతో అంత్యక్రియలకు ఆలస్యమవుతోందని కుటుంబ సభ్యులు సందర్శనాన్ని నిలిపివేశారు. సంప్రదాయంగా చేయాల్సిన క్రతువును పూర్తి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బాలు అంతిమయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ప్రముఖులకు మాత్రమే అనుమతినిచ్చారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా బాలు భౌతికకాయాన్ని సందర్శించేందుకు ప్రజలకు అనుమతి లేదని తెలిపారు. అభిమానులు ఎవరూ బాలు అంత్యక్రియలకు రాకుండా, ఫాంహౌస్‌కు 2 కి.మీ దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు చివరి నిమిషంలో పలువురు ప్రముఖులు బాలుకు నివాళి అర్పించారు. శుభలేఖ సుధాకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నేపధ్య గాయకుడు మనో, దర్శకుడు భారతీరాజ ఫామ్ హౌస్ ఆయన భౌతిక కాయనికి నివాళులు అర్పించారు. ఆయన మరణము సంగీత ప్రపంచానికి తీరని లోటు దేవీ శ్రీప్రసాద్ ఆవేదన చెందారు. ఈరోజు చాలా చీకటి రోజుని, ఆయన లాంటి వ్యక్తి ఇక రారు, ఆయనకు సాటి లేరని ఉద్వేగానిక లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి) ఎస్పీ బాలు భౌతిక కాయాన్ని చూసి దర్శకుడు భారతీరాజ కన్నీటి పర్యవంతమైయ్యారు. ‘ఎస్పీ బాలు ఎప్పటికీ నాతోనే ఉంటారు. ఆయన ఆత్మ మాతోనే ఉంది. భౌతికంగా మాత్రమే దూరం అయ్యాయి. పాటలు రూపంలో ఎప్పటికి చిరస్థాయిగా ప్రజలు మదిలో నిలిచిపోతారు’ అని విలపించారు. బాలు ఇక లేరన్న సమాచారం అభిమాన లోకాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. తమ అభిమాన గాయకుడ్ని కడసారి చూసుకునేందుకు పోటెత్తారు. సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు ఈ మరణ సమాచారాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ అభిమాన గాయకుడ్ని కడసారి చూసుకునేందుకు పోటెత్తారు. అభిమానుల రాక పోటెత్తడంతో ఎస్పీబి ఇంటి పరిసరాలు ఇసుకెస్తే రాలనంతంగా పరిస్థితి మారింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున జన సందోహం తరలి రావడంతో ఆరోగ్య పరమైన ఆందోళన తప్పలేదు. అభిమానుల్ని కట్టడి చేయడం మరింత కష్టతరంగా మారింది. (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) -
ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు
సాక్షి, చెన్నై : భారతీయ దిగ్గజ గాయకుల్లో ఒకరైన ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. 17 భాషల్లో 41 వేల 230 పాటలు పాడిన బాలు తమను వదిలి వెళ్లాడనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1966, డిసెంబర్ 15న ప్లేబ్యాక్ సింగర్‌గా తనన ప్రస్తానాన్ని ప్రారంభించిన బాలు.. వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలను అందుకుని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రాణాంతక కరోనా బారినపడిన కోలుకున్నప్పటికీ.. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో గురువారం సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్నాహ్యం తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు చరణ్ ప్రకటించారు. (ఎస్పీ బాలు కన్నుమూత) ఎస్పీ బాలు మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన స్వగృహానికి బాలు భౌతిక కాయాన్ని తరలించారు. రాత్రి 9 గంటలకు భౌతిక కాయాన్ని స్వగృహం నుంచి ఫాంహౌస్‌కు తరలిస్తారని సమాచారం. రేపు ఉ.10:30 గంటలకు తామరైపాక్కం ఫాంహౌస్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కడసారి చూపు కోసం అక్కడికి చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. (జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’) -
పైలా చంద్రమ్మకు ఘన నివాళి
సాక్షి, విశాఖపట్నం : శ్రీకాకుళం సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలు చంద్రమ్మ అంత్యక్రియలు ముగిశాయి. విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి నుంచి జ్ఞానాపురం స్మశాన వాటిక వరకు ప్రజాసంఘాల ప్రతినిధులు ర్యాలీగా వెళ్లారు. శ్రీకాకుళం భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాట ఉద్యమ నాయకురాలు పైలా చంద్రమ్మకు ప్రజా సంఘాల నేతలు ఘనంగా నివాళులర్పించారు. చంద్రమ్మ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రిట్ట పాడు గ్రామ వాసి. ప్రముఖ నక్సలైట్ పైలా వాసుదేవరావు ను అజ్ఞాతంలో వివాహమాడిన చంద్రమ్మ గరుడ భద్ర భూస్వా మ్య వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మందస ఎన్ కౌంటర్ లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన చంద్రమ్మ కొంతకాలం జైలు జీవనం సాగించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా రాత్రి ప్రాణాలు విడిచారు. ఈ దశలో ఆమె పార్థివదేహాన్ని ఆమె కుమార్తె అరుణతో సహా ప్రజాసంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో రైతుల పక్షాన నిలిచి పోరాడిన చంద్రమ్మ ఉద్యమస్ఫూర్తిని కొనియాడారు. ఉద్దాన ప్రాంతంలో విషాద ఛాయలు శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో తుపాకి పట్టి పోరాడిన రైతాంగ పోరాటయోధురాలు పైలా చంద్రమ్మ (70) బుధవారం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బుధవారం తెల్లవారుజామున కేజీహెచ్‌లో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె న్యూడెమొక్రసీ పార్టీకి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. విశాఖలోనే అంత్యక్రియలు జరుగుతాయని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. 1968లో సీపీఐ అనుబంధంగా ఉన్న మహిళా సంఘంలో పనిచేశారు. ఉద్దాన ప్రాంతంలోని గరుడబద్ర భూస్వామి మద్ది కామేశ్ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత న్యూడెమొక్రసీ సాయుధ దళంలోనూ పనిచేశారు. ప్రముఖ నక్సలైట్ నాయకుడు పైలా వాసుదేవరావును చంద్రమ్మ దళంలోనే వివాహం చేసుకున్నారు. -
చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి
-
అన్నింటికి ఆ నలుగురే
వీధిలో ఎవరికైనా కరోనా వచ్చిందంటే అటువైపు వెళ్లడానికే భయపడే రోజులివి. ఇంట్లో సైతం ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే ఆమడదూరం నుంచే సేవలందిస్తున్న కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీ నుంచి తీసి.. వాటిని అంత్యక్రియలకు వాహనంలో పంపిస్తున్నారు పెద్దాసుపత్రిలోని ‘ఆ నలుగురు’. మృతులకు సగౌరవంగా ‘వీడ్కోలు’ చెబుతున్న వీరిని అధికారులు సైతం అభినందిస్తున్నారు. సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌గా మార్చిన తర్వాత ఇతర కోవిడ్ ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా రోగులను సైతం ఇక్కడికే రెఫర్ చేస్తున్నారు. ఈ కారణంగా పెద్దాసుపత్రిలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ఈ ఐదు నెలల కాలంలో కరోనాతో 337 మంది చనిపోయారు. ఇందులో అధిక శాతం మరణాలు పెద్దాసుపత్రిలోనే నమోదయ్యాయి. సాధారణంగా ఎవరి సంప్రదాయం ప్రకారం వారు మృతులకు అంత్యక్రియలు చేస్తారు. కానీ కరోనా కారణంగా మృతదేహాల వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు సైతం భయపడే రోజులు దాపురించాయి. ఇదే సమయంలో వైరస్ ఇతరులకు వ్యాపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తోంది. మృతదేహాలను అంత్యక్రియలకు పంపేందుకు గాను పెద్దాసుపత్రిలో నలుగురు ఎంఎన్‌వోలను నియమించారు. వీరు కరోనా బాధితుల మృతదేహాలపై వార్డులోనే కెమికల్స్ చల్లి, ప్లాస్టిక్ కవర్లో భద్రంగా ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత మార్చురీలో భద్రపరుస్తారు. అనంతరం బయటకు తీసి, వాటిని ‘మహాప్రస్థానం’ వాహనంలో అంత్యక్రియలకు పంపిస్తున్నారు. ఈ సమయంలో పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు వహిస్తున్నారు. ధైర్యవంతుడని ప్రోత్సహిస్తున్నారు ఆ భగవంతునికి సేవ చేస్తున్నానని భావించి మృతదేహాలను ఎత్తి పంపిస్తున్నాను. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. భార్య, కుమారుడు ఉన్నారు. గతంలో కూలి పనిచేసేవాన్ని. ఇప్పుడు ఈ పని తృప్తిగా అనిపిస్తోంది. ఇరుగూ పొరుగు వారు కూడా ఇబ్బంది పెట్టడం లేదు. పైగా వారు ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచిది.. ధైర్యవంతుడని చెబుతున్నారు. – బరిగెల పవన్‌కుమార్, శ్రీరామనగర్, కర్నూలు -
కరోనా: ఆదర్శంగా నిలిచిన భూమన
సాక్షి, తిరుపతి: కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు తిరుపతి ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, సాక్షి టీవీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో నుంచి మృతదేహాలను బయటికి తీయడం, అంబులెన్స్‌లో ఎక్కించడం, కుటుంబ సభ్యులకు అప్పగించడం, దహన సంస్కారం చేసే వారంతా మనుషులే కదా అని ఆయన అన్నారు. వారికి లేని భయం ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఉండటం సరికాదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను తిరుపతిలో కరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొంటున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. మార్గదర్శకాలు, తగిన జాగ్రత్తలతో కోవిడ్ మృతులకు కూడా అంత్యక్రియలు జరుపుకోవచ్చని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అవగాహన కోసం కరోనా మృత దేహాల అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన పలువురికి ఆదర్శంగా నిలిచారు. (పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం) -
అంతిమ సంస్కారాలు ఇలాగేనా?
ఆదిలాబాద్‌టౌన్: చనిపోయిన వారికి సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీ.. ఏ కులం, ఏ మతంలోనైనా వారి సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఎంతదూరంలో ఉన్నా సరే.. చనిపోయారనే సమాచారం అందగానే చివరి మజిలీకి హాజరై తుది వీడ్కోలుతో సాగనంపుతారు. కరోనా నేపథ్యంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ నిర్వహించాల్సిన అధికారులు మానవీయకోణంలో ఆలోచించకపోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను దహనం చేస్తున్నప్పటికీ అవిపూర్తిగా కాలకపోవడంతో గ్రామసింహాలకు ఆహారంగా మారుతున్నాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరినీ కలిచివేస్తున్నాయి. ఇదేనా అంతిమ సంస్కారం? జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కరోనా కాటుకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఒకరు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మృతి చెందగా అంత్యక్రియలు అక్కడే జరిపారు. మరో నలుగురు ఇటీవల మృతి చెందగా వారి అంతిమ సంస్కారాలు ప్రభుత్వమే నిర్వహించింది. మృతదేహాలను మావల ఊరి బయట పొన్నారి శివారులోని మోరం క్వారీల ప్రాంతంలో దహనం చేస్తున్నారు. ఈ దహన కార్యక్రమాలు మున్సిపల్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. శవాన్ని తగలబెట్టిన తర్వాత పూర్తిగా కాలిపోయిందని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి వెళ్లాలి. కానీ శవాన్ని తగలబెట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సగం కాలిన శవాలను కుక్కలు లాక్కెళ్లి పీక్కుతింటున్నాయి. అటువైపు పంటపొలాలకు వెళ్తున్న వారు ఈ దృశ్యాలను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి బంధువులు కూడా కన్నీరుపెట్టుకుంటున్నారు. కనీసం శవాలను ఇవ్వకపోయినా.. దహన సంస్కారాలు చేసేది ఇలాగేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మృతుల దహన సంస్కారాలపై పూర్తి దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. నా దృష్టికి రాలేదు కరోనాతో మృతి చెందిన శవాలకు మావల ఊరి చివర దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. ఈ విషయం నా దృష్టికి రాలేదు. ఇక నుంచి కరోనా మృతులు చనిపోతే శవం కాలిపోయేంత వరకు సిబ్బందిని అక్కడే ఉంచుతాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.– సీవీఎన్ రాజు, మున్సిపల్ సహాయ కమిషనర్ బాధ్యత మున్సిపల్‌దే కరోనా మృతదేహాలను ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో దహన సంస్కారాలు నిర్వహించే చోటుకు తీసుకెళ్తాం. అక్కడ దహన సంస్కారాలు మున్సిపల్ అధికారులు చూస్తారు. సగం కాలిన శవాలను కుక్కలు తినడమనే విషయం నా దృష్టికి రాలేదు. ఇలా జరుగకుండా చూస్తాం.– నరేందర్ రాథోడ్,జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
గుంతలో పెట్టిన శవాన్ని తీసి మరోచోట..
గుత్తి: ఏ కారణంతో మరణించినా దహన సంస్కారాలు నిర్వహించడం ఆ కుటుంబం చావుకొస్తోంది. ఓ వృద్ధురాలు మరణిస్తే శ్మశాన వాటిక సమీపంలోని నివాసితులు అడ్డుకోవడం, చివరకు అక్కడి నుంచి మరోచోటుకు తరలించి ఖననం చేసిన ఘటన గుత్తిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. పట్టణంలోని జంగాల కాలనీలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా సోకింది. వీరంతా స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ కుటుంబంలోని వృద్ధురాలు(62) బుధవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో మరణించింది. దీంతో నలుగురు కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పీపీఈ కిట్లు ధరించి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. వ్యాన్‌లో మృతదేహాన్ని తీసుకొచ్చి శ్మశానంలో తవ్విన గుంతలో పెట్టారు. పూడ్చే సమయంలో స్థానికులు ఒక్కసారిగా గుంపులు, గుంపులుగా వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పూడ్చడానికి వీల్లేదని మృతురాలి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వార్డు వలంటీర్లు ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. చేసేది లేక గుంతలో పెట్టిన శవాన్ని బయటకు తీసి గుంతకల్లు రోడ్డులోని ఓ ప్రాంతంలో జేసీబీ సహాయంతో 10 అడుగుల లోతు గుంత తీసి శవాన్ని ఖననం చేశారు. కరోనాతో మృతి చెందిన వారి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం తక్కువని, మృతదేహంలో కేవలం నాలుగు గంటలకు మించి వైరస్ బతికే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నా ప్రజల్లో మానవత్వం మేల్కోని పరిస్థితి. -
విద్యుత్ శ్మశాన వాటికల ఏర్పాటు
కర్నూలు (టౌన్): జిల్లా కేంద్రమైన కర్నూలులో విద్యుత్ శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి. జమ్మిచెట్టు ప్రాంతం,సుంకేసుల రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జమ్మిచెట్టు ప్రాంతంలో పనులు పూర్తికాగా.. నేడో, రేపో జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని కోవిడ్, సాధారణ మృతదేహాల అంతిమ సంస్కారాలకు వినియోగించనున్నారు. కరోనాతో చనిపోయిన వారిని శ్మశాన వాటికలకు తరలించడం నుంచి.. పూడ్చే వరకు సమస్యలు వస్తున్నాయి. సాధారణ మృతదేహాల అంత్యక్రియలను సైతం అడ్డుకునపరిస్థితులు దాపురించాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. అహమ్మదాబాద్ నుంచి.. వాతావరణ కాలుష్యం లేకుండా విద్యుత్ క్రిమిషన్లతో మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేయవచ్చు. వీటిని జైపూర్, ముంబయి ప్రాంతాల్లో వాడుతున్నారు. అహమ్మదాద్ నుంచి ఒక ఎలక్ట్రికిల్ క్రిమిషన్ కర్నూలుకు చేరుకుంది. రవాణా చార్జీలు, ఇన్స్టలేషన్ కోసం రూ.70 లక్షలు (జనరల్ ఫండ్ నిధులు ) కేటాయించారు. దీనిని జమ్మిచెట్టు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను నగర పాలక కమిషనర్ డీకే బాలాజీ, డీఈ రాధక్రష్ణ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయ్యాయి. -
కట్టె కాల్చడానికీ.. కష్టమొచ్చె!
ప్రకాశం ,ఉలవపాడు: కరోనా...కడచూపులోనూ కన్నీటి కష్టాలు పెడుతోంది. కట్టె కాల్చడానికి దహన సంస్కారాలు చేయడానికి వీలు లేక కుటుంబ సభ్యులు దొంగతనంగా దహనం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం కరోనా సోకిన మృతదేహాలను పూడ్చిపెట్టడం, దహనం చేయడంలో ఇబ్బందులు లేవని అవగాహన కల్పిస్తున్నా నేటికీ అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే శనివారం రాత్రి ఉలవపాడు మండల పరిధిలోని చాగల్లు అటవీ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన సంఘటన. రోడ్డు ప్రమాదంలోమృతి చెందిన తన కుమారుడికి కరోనా ఉందని తెలియడంతో అంత్యక్రియలు చేయడానికి వీలులేక ఆ తండ్రి ఇబ్బందులు పడి గుర్తు తెలియని చోట టైర్లతో తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జాగ్రత్తలతో ఖననం లేదా దహనం చేస్తే చాలని చెబుతున్నా గ్రామాల్లో అడ్డుచెప్పడం ఆగడం లేదు. అంత్యక్రియలకు నిరాకరించడం వల్లే.. గ్రామాల్లో కరోనాతో మృతి చెందిన వారిని రానివ్వకుండా అంత్యక్రియలు చేయకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను కుటుంబ సభ్యులు ఎంచుకుంటున్నారు. దీని వలన కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో పరిస్థితులు కరోనా వలన చాలా దారుణంగా ఉంటున్నాయి. మృతదేహాలను కనీసం పూడ్చిపెట్టే వీలులేదు. కాల్చడానికి కుదరడం లేదు. మరణం బాధని కలిగిస్తే మరణం తరువాత చేయాల్సిన కార్యక్రమాలు మరింత వేదన మిగులుస్తున్నాయి. అవగాహన తప్పదు... కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యతగా అవగాహన కల్పిస్తోంది. న్యాయశాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు తెలియచేస్తున్నారు. కానీ గ్రామాల్లో పరిస్థితి మారడం లేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో మరింత అవగాహన పెరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో భయం ఇలాంటి పరిస్థితి కల్పించేలా చేసింది. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ మానవత్వం మంటకలవకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దహనం చేసిన మృతదేహం..కోవిడ్ సోకిన వ్యక్తిదే ఉలవపాడు: మండల పరిధిలోని చాగల్లు గ్రామ అటవీ శాఖ పరిధిలోని జామాయిల్ తోటలో మృతదేహాన్ని శనివారం రాత్రి దహనం చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఈ మృతదేహానికి సంబంధించి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు కేసును చేధించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడు పంచాయతీ చల్లపాలేనికి చెందిన కరిచేటి శింగయ్య (29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇంటి వద్దే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేసుకుంటున్నాడు. ఈ నెల 23న మార్బుల్స్ కొనడానికి ఒంగోలుకు ద్విచక్ర వాహనం పై వెళ్లి తిరిగివస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో పేర్నమిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో మృతి చెందాడు. 24 న పోస్ట్‌మార్టం నిర్వహించిన తరువాత కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అంత్యక్రియలు చేయడానికి గ్రామంలో వెళ్లి అడుగగా గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 25న రిమ్స్ బయట ఓ అంబులెన్స్ డ్రైవర్ దహనక్రియలు చేయడానికి రూ.25 వేలు ఇస్తే అన్నీ తాను చూసుకుంటానని చెప్పడంతో రూ.17 వేలకు మాట్లాడుకున్నారు. దహనం చేయడానికి టైర్లు, పెట్రోలు కొనుగోలు చేసుకున్నాడు. చాగల్లు వద్ద అడవిలో మృతదేహాన్ని డ్రైవర్ తీసుకుని వచ్చి దహనం చేశారు. రాత్రి వరకు మంటలు వస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమాచారం సేకరించారు. రిమ్స్‌కు సంబంధించిన వైద్యులు పోస్టుమార్టం చేయడానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇది పోస్టుమార్టం చేసిన మృతదేహం అని, కరోనా సోకిన వ్యక్తికి చేసిన ప్యాకింగ్ అని తెలిపారు. దీని పై వివరాలు సేకరించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. వారి తల్లితండ్రులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. తమ కుమారుడి మృతదేహంగా గుర్తించారు. అప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటనా స్థలిలో వివరాలు సేకరించారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ లు ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. వారి తండ్రి వద్ద స్టేట్మెంటును రికార్డు చేసుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు నిరాకరించడంతో ఈ పరిస్థితి వచ్చి దహనం చేసినట్లు పేర్కొన్నాడు. -
చిన్నతయ్యూరులో విషాదఛాయలు
శ్రీరంగరాజపురం : మండలంలోని చిన్నతయ్యూరు దళితవాడలో ఓ కుటుంబానికి సంబంధించిన అందరూ మృతిచెందడంతో మంగళవారం విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నతయ్యూరు దళితవాడకు చెందిన సుధాకర్ వ్యసనాలకు బానిస అయ్యాడని, అతని భార్య సింధు ఇద్దరు ఆడపిల్లలను సోమవారం బావిలో పడేసి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడటం.. తరువాత ఈ సంఘటను చూసి సుధాకర్ అక్కడే చెట్టుకుని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. మంగళవారం సుధాకర్(33), అతని భార్య సింధు(28), పిల్లలు మధుప్రియ(7), శ్రీలత(4) మృతదేహాలను గ్రామంలోకి తీసుకొచ్చారు. గ్రామస్తులు, బంధువులు, చుట్టు పక్కల ప్రజానీకం పెద్దఎత్తున గ్రామంలోకి చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు చలించిపోయారు. భోరున రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల మృత దేహాలకు శోకతప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ శ్రీనివాస్‌రావు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. -
తోడెవరూ రాక... తోపుడు బండిపై..
యశవంతపుర: కరోనా వైరస్ అన్ని బంధాలను తెంచివేస్తోంది. ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఇటువంటి ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా అథణిలో జరిగింది. పట్టణానికి చెందిన నిరుపేద సదాశివ హిరట్టి (55) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు కరోనాతో చనిపోయి ఉంటాడని బంధువులు, ఇరుగుపొరుగు వారెవరూ రాలేదు. దీంతో ఆయన భార్య, 13 ఏళ్ల కుమారుడు, మరొకరి సాయంతో మృతదేహాన్ని తోపుడు బండిపై శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. -
పాపం పెద్దాయన, హృదయం ద్రవించే వార్త!
-
పగవాడికీ రాకూడదు ఈ పరిస్థితి!
సాక్షి, కామారెడ్డి: ‘ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం విధిలీలా. వెంట ఏ బంధము రక్త సంబంధమూ.. తోడుగా రాదుగా తుది వేళ’ తెలుగు సినిమాలోని ఈ పాట నేటి కరోనా పరిస్థితులకు అద్దం పడుతోంది. అయితే, ఆ పాటలో చెప్పినట్టు చివరికి మనల్ని మోయడానికి ‘ఆ నలుగురు’ కూడా కరువైపోవడం అత్యంత బాధాకరం. మహమ్మారి కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తాకడానికి కొందరు భయపడుతుంటే.. అసలు తమవారు మరణించినా పట్టించుకోనివారు మరికొందరు. కరోనా భయాల నేపథ్యంలో మృతదేహాలను జేసీబీలతో పూడ్చిపెట్టిన ఘటనలు బయటపడగా.. తల్లిదండ్రుల శవాలను కూడా చూసేందుకు రాని ఘటనలు మానవత్వానికి మచ్చగా మిగులుతున్నాయి. (చదవండి: కరోనా విషాదం: తల్లి చూస్తుండగానే..) కామారెడ్డి జిల్లాలో ఆదివారం బయటపడిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మెదక్ జిల్లా బురుగుపల్లికి చెందిన హనుమంతు(55) అనే పెద్దాయన ఈనెల 17న మృతి చెందారు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో బస్టాండ్ ఆవరణలోనే కూర్చుండిపోయారు. సుమారు గంట పాటు నరకయాతన అనుభవించారు. హనుమంతుకు కరోనా ఉందనే అనుమానాలతో స్థానికులులెవరూ ఆయన వద్దకు వెళ్లలేదు. చివరకు ఆర్టీసీ అధికారులు స్పందించి 108 కు సమాచారం ఇవ్వడంతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే, ఆయన కూతురు, తమ్ముని కొడుకులకు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు సమాచారం ఇచ్చినా వారు రాలేదు. దీంతో మున్సిపల్ సిబ్బందే హనుమంతు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ ఉన్నా అనాధగా మారిన హనుమంతు పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని మున్సిపల్ సిబ్బంది వ్యాఖ్యానించారు. (కామారెడ్డి బస్టాండ్‌లో దారుణం.. పట్టించుకోని స్థానికులు) -
శవ ‘సంస్కారం’ లేని చైనా!
వాషింగ్టన్: దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల మృతదేహాలకు గౌరవ ప్రదమైన అంతిమ కర్మలు చేసే సంస్కారమూ లేకపోయింది పొరుగుదేశం చైనాకు! గత నెల 15వ తేదీన తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో కొంతమంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. భారత్ 20 మంది సైనికులను కోల్పోగా తమ సైనికులు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న చైనా.. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని వారి అంతిమ సంస్కారానికి కూడా అంగీకరించడం లేదని, కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ మాత్రం తన వీరపుత్రులకు తగిన గౌరవ మర్యాదలిచ్చి వారి బలిదానాన్ని గుర్తించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. చైనా మాత్రం ఇప్పటివరకూ ఆ ఘటనలో ఎంత మంది చనిపోయారో కూడా బహిర్గతం చేయలేదు. పైగా శోకసంద్రంలో ఉన్న సైనికుల కుటుంబాలను ప్రభుత్వం అవమానాల పాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలంటున్నాయి. సంప్రదాయాల ప్రకారం నిర్వహించే అంతిమ సంస్కారాలను సైనికుల కుటుంబాలు మరచిపోవాలంటూ...కరోనాను సాకుగా చూపినట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. -
అంతిమయాత్రలో ఆప్తుడై..
పెద్దపప్పూరు: అనాథ మృతదేహాలకు అతను ఆప్తుడు. పేగు తెంచుకుని పుట్టకపోయినా.. తోబుట్టువు కాకపోయినా.. ఓ ఆత్మీయుడిలా దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాడు. వివవరాల్లోకెళితే పెద్దపప్పూరు మండలం రామకోటికాలనీకి చెందిన భట్రాజు 15 సంవత్సరాలుగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నాడు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 80 మృత దేహాలను తన సొంత ఆటోలో శ్మశానికి తరలించి, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నాడు. కరోనా నేపధ్యంలో ఇటీవల పెద్దపప్పూరు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణిస్తే.. గ్రామ పెద్దల అనుమతితో అంత్యక్రియలు నిర్వహించి పలువురి మన్ననలు పొందాడు. ఒకవైపు అనాథ మృతదేహాకలు అంత్యక్రియలు నిర్వహిస్తూనే.. మరో వైపు ఆధ్యాత్మిక చింతనను ప్రజల్లో పెంపొందించేలా ప్రతి పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో ఆలయాల్లో భజన కీర్తనల పారాయణం చేస్తూ వస్తున్నాడు. తాడిపత్రి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా.. అనాథ మృతదేహం ఉన్నట్లు తనకు (94900 70655) సమాచారం అందిస్తే.. తన కుమారుడితో కలిసి ఆటో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి వస్తాననే భట్రాజు.. జీవితంలో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు.. మనకున్నంతలో ఎంత సేవ చేయగలిగామన్నదే ప్రధానమని పేర్కొంటుంటారు. ఆటోలో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తున్న భట్రాజు అయినవారు కాదంటే.. అయినవారందరూ ఉన్న ఓ దివ్యాంగుడు అనారోగ్యంతో మరణిస్తే.. అంతిమయాత్రలో పాల్గొనే వారు కరువయ్యారు. విషయాన్ని ఫోన్‌ద్వారా తెలుసుకున్న భట్రాజు ఆ గ్రామానికి చేరుకుని ఆప్తుడిలా ఆ దివ్యాంగుడికి అంత్యక్రియలు నిర్వహించి వచ్చారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపప్పూరు మండలంలోని గార్లదిన్నెకు చెందిన జక్కిలేరు (70) రెండు నెలల క్రితం కాలికి దెబ్బ తగిలి చికిత్సకు నోచుకోలేక అనారోగ్యంతో ఆదివారం మృతిచెందాడు. బంధువులకు సమాచారం అందించినా.. లాక్డౌన్ నేపథ్యంలో అటువైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భట్రాజుకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. వెంటనే ఆ గ్రామానికి చేరుకున్న భట్రాజు.. జక్కిలేరు మృతదేహానికి స్నానపానాదులు, పూజలు చేసి, తన సొంత ఆటోలో శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆపద సమయంలో ఆప్తుడిలా వచ్చిన భట్రాజును ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు. -
కరోనా : మృతదేహాలకు కష్టమొచ్చె!
సాక్షి, సిటీబ్యూరో: కరోనాతో కన్నుమూసిన వ్యక్తి అంత్యక్రియలు జరపాలంటే పలు ఇబ్బందులెదురవుతున్నాయి. నియమ నిబంధనల మేరకు పోలీసుల సమక్షంలో మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలి. మరణించాక ఆస్పత్రి నుంచి శ్మశాన వాటికకు తరలించేంత వరకు.. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు నిబంధనలు పక్కాగా అమలుచేయాలి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాలు నిర్వహించే పోలీసు, జీహెచ్ఎంసీ, వైద్యసిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల బాధితులూ చికిత్సల కోసం ఇక్కడికే వస్తున్నారు. ఒకవేళ సదరు వ్యక్తి మరణిస్తే మృతదేహాన్ని స్వస్థలాలకు తీసుకువెళ్తున్న వారి సంఖ్య తక్కువే. కరోనా మృతుల సంఖ్య ఇప్పటికే దాదాపు రెండొందలకు చేరువలో ఉంది. కేసులు ఇంకా పెరుగుతాయనే హెచ్చరికలు వెలువడుతుండటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియలకు సంబంధించి అపోహలు వీడి.. స్థానికులు సహకరించకుంటే మరింత సమస్యాత్మకంగా మారే అవకాశముంది. మరోవైపు ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా కరోనా మృతుల అంత్యక్రియలకు ఒక ప్రత్యేక శ్మశానవాటిక ఉండటం అవసరమని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నగర శివార్లలో అందుకు తగిన స్థలం కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు, అంత్యక్రియలు నిర్వహించే ప్రభుత్వ యంంత్రాంగానికీ ఇబ్బందులు ఉండవంటున్నారు. అయినవాళ్లూ దూరమే.. కరోనా మృతుల అంత్యక్రియలకు వచ్చేవారి సంగతేమో గాని.. ఆఖరి చూపులకూ రాని సంఘటనలెన్నో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మరణించిన వారిలోనూ దాదాపు 20 శాతం మృతదేహాలకు మాత్రమే అయినవాళ్ల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. మిగతా వాళ్లు, తమవల్ల కాదని మీరే నిర్వహించండని అధికార యంత్రాంగానికి విన్నవించినట్లు సమాచారం. దీంతో నగరంలో అందుబాటులో ఉన్న శ్మశానవాటికల్లో నిర్వహించేందుకు తీసుకువెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల నగరంలోని కవాడిగూడ, అంబర్‌పేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని శ్మశానవాటికల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. కరోనా మృతుల అంత్యక్రియల వల్ల పరిసరాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడతారనే ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కేటాయించాలి.. ప్రజలు ప్రత్యేక శ్మశానవాటిక కోరుతున్నా.. అందుకు తగిన స్థలం అవసరమని, ప్రభుత్వం కేటాయించాలని ఒక అధికారి పేర్కొన్నారు. ప్రజల వ్యతిరేకత దృష్ట్యా నగర శివార్లలో అయితేనే ఇబ్బందులుండవని ప్రజాప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ దాదాపు రూ. 2.40 కోట్లతో బన్సీలాల్‌పేట, అంబర్‌పేట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్‌లలో విద్యుత్ దహన వాటికలు ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఒక్కటి కూడా పనిచేయడం లేదు. వాటిలో కనీసం ఒక్కటి పనిచేసినా కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందులు కొంత తప్పేవని ఆయన పేర్కొన్నారు. అపోహ మాత్రమే కరోనాతో ఎవరైనా మరణిస్తే, వారి సంబంధీకులకు సమాచారమిస్తాం. వారు ఏదైనా శ్మశానవాటికను ఎంపిక చేసుకుంటే, అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక సంబంధిత సిబ్బంది, ప్రత్యేక వాహనంలో అక్కడకు తరలిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు, తగిన భద్రత కోసం పోలీసులు కూడా ఉంటారు. చాలా ప్రాంతాల్లో తగిన అవగాహన లేక స్థానికులు సిబ్బందిని కొట్టడానికి వస్తున్నారు. మరణించాక సంబంధీకులకు సమాచారమిచ్చేందుకు కూడా పది ఇరవై సార్లు ఫోన్లు చేయాల్సి వస్తోంది. వెంటనే స్పందించేవారు తక్కువ. వర్షాకాలంలో దహన సంస్కారాలకు కట్టెలు దొరకడం కష్టం. ఒక్కో మృతదేహానికి దాదాపు 25 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ప్రస్తుతం 14 వాహనాలు, సిబ్బందిని ఈ విధులకు వినియోగిస్తున్నారు. ఎక్కడ దహన సంస్కారాలు చేసినా, పరిసరాల్లో వ్యాధులు వస్తాయనుకోవడం అపోహ. ప్రత్యేక పద్ధతుల్లో నిర్వహించడం వల్ల వంద మీటర్ల దూరం వరకు ఎలాంటి క్రిమికీటకాలున్నా నశిస్తాయి. ఆ తర్వాత క్రిమిసంహారక స్ప్రే కూడా చేస్తారు. ప్రజలకు ఈ విషయంలో అవగాహన వస్తే తప్ప యంత్రాంగానికి ఇబ్బందులు తప్పవు.– డాక్టర్ రవీందర్‌గౌడ్, ఏఎంఓహెచ్ (కోవిడ్–19 సంబంధిత అధికారి) -
పోలీస్ విభాగం రద్దుకు ఓటు
హ్యూస్టన్/వాషింగ్టన్: ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలిప్పుడు శాంతియుత ప్రదర్శనలుగా మారిపోయాయి. పోలీసు సంస్కరణలే ప్రధాన డిమాండ్‌గా ఈ ప్రదర్శనలు జరుగుతూండటంతో పోలీసులు కూడా దుడుకు చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాయిడ్‌తో పోలీసు అధికారి వ్యవహరించిన తీరును నిరసిస్తూ మినియాపోలిస్ సిటీకౌన్సిల్ సభ్యులు పోలీస్ విభాగం మొత్తాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. దీని స్థానంలో సరికొత్త పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రజలను సురక్షితంగా ఉంచేలా పనిచేసే కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామని సిటీ కౌన్సిల్ అధ్యక్షుడు లిసా బెండర్ తెలిపారు. ప్రస్తుత వ్యవస్థ సమాజానికి ఏమాత్రం రక్షణ కల్పించడం లేదన్నారు. పోలీస్ విభాగం రద్దుకు సిటీ కౌన్సిల్ సభ్యులు అత్యధికం మద్దతిస్తున్నారని కౌన్సిలర్ అలోండ్రా కానో తెలిపారు. గత నెల 25న మినియాపోలిస్ పోలీస్ అధికారి డెరెక్ చావెన్ దాష్టీకం కారణంగా ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే చర్చిలో ప్రజల సందర్శనార్థం జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. హ్యూస్టన్‌లో తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్ మృతదేహాన్ని మంగళవారం ఖననం చేయనున్నట్లు కుటుంబం తరఫు మీడియా ప్రతినిధి ఒకరు ప్రకటించారు. హిల్‌క్రాఫ్ట్ అవెన్యూలోని ‘ద ఫౌంటేన్ ఆఫ్ ప్రెయిస్’చర్చిలో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని, ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బైడెన్ ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలుస్తారని ఆయన సహాయకుడొకరు తెలిపారు. సియాటెల్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు సీసాలు, రాళ్లతో దాడులకు దిగారు. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతూ తన వాహనాన్ని ఆందోళనకారులపైకి నడిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇలా ఉండగా ఫ్లాయిడ్ మరణానికి కారణమైన అధికారి డెరెక్ ఛావెన్ సోమవారం కోర్టు ముందు హాజరు కానున్నాడు. -
అందుకే ఆసుపత్రిలో ‘రిషి’ని చూడలేదు: అమితాబ్
‘ఎప్పుడు చిరునవ్వుతో ఉండే రిషి కపూర్ ముఖంపై నేను బాధను చూడాలని అనుకోలేదు. అందుకే రిషి కపూర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను చూడడానికి వెళ్లలేదు’ అని అమితాబ్ బచ్చన్ వెల్లడించాడు. అతని చివరి క్షణాలలో కూడా ముఖంపై చిరునవ్వుతోనే వెళ్లి ఉంటాడని భావిస్తున్నాను అని ఆయన అన్నారు. ఇక బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్(67) గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడిన ఆయన ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చాకొలెట్బాయ్ రిషి కపూర్ మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరు రిషితో తమకు ఉన్నఅనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో రిషి కపూర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కూతురు రిధియా తండ్రిని చివరిచూపు చూడకుండానే ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. (మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు) ఈ క్రమంలో శుక్రవారం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రిషి కపూర్ మరణంపై సంతాపం ప్రకటించారు. ఈ మేరకు బిగ్ బీ తన బ్లాగ్‌లో రిషి కపూర్ గురించి రాసుకొచ్చారు. మిస్టర్ కపూర్‌తో తన తొలి సమావేశాల గురించి, ఆర్కె స్టూడియోలో గడిపిన సందర్భాల గురించి తెలిపారు. రిషి కపూర్ నడక, డైలాగ్ డెలివరీ, లిప్-సింకింగ్, అద్బుత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. రిషి కపూర్ , అమితాబ్ ఇద్దరూ కభీ-కభీ, అమర్, అక్బర్, ఆంథోనీ, నసీబ్, కూలీ, 102 నాట్ ఔట్.. ఇలా 77 సినిమాల్లో కలిసి నటించారు. అయితే రిషి కపూర్ మరణంతో అమితాబ్ చలించిపోయారు. అందుకే రిషి కపూర్ అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ వెళ్లారు. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ ) -
కరోనా: అంత్యక్రియలు అడ్డుకుంటే కటకటాలే!
చెన్నై: కరోనా బారినపడి చనిపోయినవారి అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ జైలు శిక్ష తప్పదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కోవిడ్‌తో మృతి చెందినవారి అంతిమ సంస్కారాలు గౌరవంగా సాగాలని వెల్లడించింది. కోవిడ్ మృతుల అంతిమ సంస్కారాలకు ఆటంకం కలిగించడం, అందుకు కారకులుగా మారి నేరస్తులుగా మిగులొద్దని హితవు పలికింది. గతవారం చెన్నైలో వెలుగు చూసిన ఓ హృదయవిదారక ఘటన సంచలనం కావడం.. చెన్నై హైకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. (చదవండి: ఆ దురలవాటు కట్టడికిదే సమయం: మోదీ) ఆఘటన వివరాలిలా.. చెన్నైకి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సైమన్ హెర్కులస్ కరోనా వైరస్ బారిన పడి ఏప్రిల్ 19వ తేదీన మరణించారు. ఆయన మృతదేహాన్ని కిల్పాక్ ప్రాంతంలోని శ్మశానంలో ఖననం చేసేందుకు మున్సిపల్ అధికారులు అనుమతించారు. అక్కడికి మృతదేహం తీసుకెళ్లాక ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించలేదు. దాంతో అన్నానగర్‌లోని శ్మశానానికి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ స్థానికులు అంబులెన్స్‌ను అడ్డుకోవడంతోపాటు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్, శానిటేషన్ వర్కర్, మున్సిపల్ ఉద్యోగి, ఇతరులు అంబులెన్స్‌ను వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. రాత్రి పొద్దుపోయాక డాక్టర్ సైమన్ స్నేహితుడు డాక్టర్ కె.ప్రదీప్ కుమార్, ఇతర సిబ్బందితో కలిసి స్వయంగా గొయ్యి తవ్వి మృత దేహాన్ని ఖననం చేశారు. ప్రభుత్వం తాజా నిర్ణయం సందర్భంగా గతవారం జరిగిన ఉదంతాన్ని తలుచుకుని ప్రదీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ బాధితులకు సేవలందించిన డాక్టర్ చనిపోతే.. ఇంతటి కర్కషంగా ప్రవర్తిసారా అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కోవిడ్ పోరులో ముందుండే సిబ్బంది చనిపోతే రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడు వ్యాప్తంగా 1,821 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో చైన్నై, కోయంబత్తూరు,మధురై, తిరుపూర్, సాలెంలలోనే సగం కేసులున్నాయి. (చదవండి: చివరకు అంత్యక్రియలపైనా అలజడి) -
కరోనా: అంత్యక్రియలపై కేంద్రం మార్గదర్శకాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్-19 కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదం చేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. (చదవండి: కోవిడ్.. జాతీయ విపత్తు) ఎబోలా, నిఫా వంటి వైరస్లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం/ఖననం చేయవచ్చునని పేర్కొనడం గమనార్హం. ఇక కోవిడ్ వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది మరణించగా... లక్షా 50 వేల మంది కోవిడ్ అనుమానితులుగా ఉన్నారు. భారత్‌లో ఈ వైరస్ సోకి ఇద్దరు మరణించగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88కి చేరింది. (భారత్‌లో పాజిటివ్ కేసులు 88) (ట్రంప్‌నకు కరోనా టెస్ట్ : రిపోర్ట్‌లో తేలిందిదే..) -
అమృత గో బ్యాక్
-
అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!
మిర్యాలగూడ: తండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటిక వద్దకు వెళ్లిన అమృతాప్రణయ్‌కు నిరాశే మిగిలింది. మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత.. వాహనం దిగి తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్తున్న క్రమంలో.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. తండ్రి చావుకు కారణమైన ‘అమృత గో బ్యాక్’, ‘మారుతీరావ్ అమర్ రహే’ అంటూ అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె తిరిగి వాహనం ఎక్కి కూర్చున్నారు. పోలీసుల సూచనమేరకు తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు. (చదవండి: మారుతిరావు ఆత్మహత్య) కాగా, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు నిన్న (శనివారం) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో.. ప్రణయ్ అనే దలిత యువకుడిని మారుతీరావు హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే. (చదవండి: చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం) ఇదిలాఉండగా.. మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషయం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు. (చదవండి: మారుతీరావు పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక) -
తల్లి అంత్యక్రియలు.. అంతలోనే కొడుకు, కోడలు..
సాక్షి, ఆదిలాబాద్/వరంగల్: జిల్లాలోని యపల్గూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. రమణమ్మ అనే వృద్ధురాలు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె తనయుడు, రిటైర్డ్ సీఐ విజయ్‌కుమార్, కోడలు సునీత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యపల్‌గూడకు బయల్దేరారు. ఈక్రమంలో వారు ప్రమాణిస్తున్న కారు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం, పెంచికల్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన విజయ్‌కుమార్, సునీత అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడి మృతితో రమణమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో.. ఆ గ్రామం విషాదంలో మునిగింది. -
శై'శవ' గీతం!
జీడిమెట్ల: బతికున్నంత కాలం మనిషిని డబ్బే నడిపిస్తుంది. చనిపోయినా అది లేకుంటే మృతదేహం కూడా ‘కదలదు’. ఆ డబ్బు లేక తమ కొడుకు మృతదేహాన్ని ఖననం చేయడానికి ఓ బెంగాలీ కుటుంబం నరకయాతన అనుభవించింది. ఓ వైపు శిశువు చనిపోయిన దుఃఖం... మరోవైపు మృతదేహాన్ని ఖననం కూడా చేయలేని అయోమయ పరిస్థితి. ఇదిగో పై చిత్రంలో చనిపోయిన బిడ్డను మోసుకుంటూ వస్తున్న ఇతని పేరు విప్లవ్. పశ్చిమ బెంగాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. సోమాజీగూడలో ఉంటూ సెంట్రింగ్ పని చేసుకుంటున్నాడు. ఇతని నాలుగు నెలల బాబు తకోష్ న్యూమోనియాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అంత్యక్రియలు చేసే ఆర్థిక స్థోమత లేక కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో ఖననం చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కొందరు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. విప్లవ్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బీరప్ప నగర్ శ్మశాన వాటికలో పూడ్చేందుకు తీసుకెళ్లారు. అది ఓ వర్గానికి చెందినది కావడంతో అక్కడ ఖననం చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో పోలీసులు చెన్నప్ప, సుధాకర్ వారి ని భగత్‌సింగ్‌నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఖననం చేసేందుకు పోలీసులు రూ.1,500కు ఒప్పించారు. ఏ రోజు కూలీతో ఆ రోజు పొట్టపోసుకునే విప్లవ్ కుటుంబం ఆ మొత్తం చెల్లించి కొడుకు మృతదేహాన్ని ఖననం చేశారు. -
సులేమానీ అంత్యక్రియల్లో అపశ్రుతి.. 35 మంది మృతి
టెహ్రాన్ : ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో.. 35 మంది మృతి చెందగా, 48 మంది గాయపడినట్టు ఇరాన్ ప్రభుత్వ చానల్ తెలిపింది. సులేమానీ స్వస్థలం కెర్మన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ చీఫ్ కౌలివాండ్ ధ్రువీకరించారు. సులేమానీ అంతిమయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది ఇరానీయులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు ఆన్లైన్లో పోస్ట్ చేయగా.. అందులో పలువురు రోడ్డుపై విగత జీవులుగా కనిపించగా.. మరికొందరు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు. కాగా, బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతని మృతదేహాన్ని టెహ్రాన్‌కు తరలించారు. సులేమానీ అంతిమయాత్రలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ సహా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అంత్యక్రియలు చేశాక.. తిరిగొచ్చాడు
పట్నా: లేడనుకున్న మనిషి.. ఇక రాలేడుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. చనిపోయి అంత్యక్రియలు కూడా నిర్వహించిన వ్యక్తి ఒక్కసారిగా మన ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది. ఊహించడానికి కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. మూక దాడుల్లో చనిపోయాడని భావించిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన మూడు నెలల తరువాత తిరిగి ఇంటికి చేరుకున్నాడు. వివరాలు.. పట్నాలోని నిసార్‌పూర్ గ్రామానికి చెందిన కృష్ణ మాంచి అనే వ్యక్తి ఈ ఏడాదిలో ఆగస్ట్‌లో కనిపించకుండా పోయాడు. అదే నెల 10న బిహార్ మమత్పూర్ గ్రామంలో చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే నెపంతో ఆ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసి చంపారు. అయితే మృతదేహం గుర్తుపట్టకుండా ఉండటంతో దుస్తుల ఆధారంగా అతను కృష్ణ మాంచి అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం వారు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. మూడు నెలల తరువాత.. అయితే దాదాపు మూడు నెలల తర్వాత కృష్ణ మాంచి తిరిగి ఇంటికివచ్చాడు. అతన్ని చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఇక లేడు అనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆనందంతో చిందులేశారు. ‘నేను మృతదేహాన్ని సరిగ్గా గుర్తించలేదు. దుస్తుల ఆధారంగా అతను నా భర్తే అని గ్రామస్తులు చెప్పడంతో నమ్మెశాను. ఇక లేడు అనుకున్న నా భర్త తిరిగిరావడం సంతోషంగా ఉంది’ అని కృష్ణ భార్య రూడీదేవి మీడియాకు తెలిపారు. అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరు అనే దానిపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. -
మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అంతిమ వీడ్కోలు
తిరుపతి రూరల్/తిరుపతి అర్బన్: చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాలలో పూర్తి చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం విదితమే. పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, అమరనాథ్‌రెడ్డి, లోకేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, అమరరాజ ఇండస్ట్రీస్ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ తదితరులు నివాళులు అర్పించి శివప్రసాద్ కుటుంబాన్ని ఓదార్చారు. సాయంత్రం 4.01 గంటల సమయంలో తిరుపతి నుంచి ఊరేగింపుగా చంద్రగిరి మండలం అగరాల సమీపంలోని శివప్రసాద్ సొంత స్థలంలో ఖననం చేశారు. పెద్దల్లుడు వేణుగోపాల్ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు. బాల్య మిత్రుడిని కోల్పోయా..: చంద్రబాబు బాల్య మిత్రుడు శివప్రసాద్‌ను కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుపతి నగరంలోని ఎన్జీవో కాలనీలోని శివప్రసాద్ నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు. ఆయనతో చిన్ననాటి స్నేహం నుంచి నాటి రాజకీయాలతో ముడిపడి ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. బాల్యంలో తాము ఇద్దరం తిరుపతిలో కలసి చదువుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత వైద్యవృత్తిలో ఉన్న ఆయన్ని తానే రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు చెప్పారు. కాగా చదువుకునే రోజుల నుంచి ఆయనకు నటనపై ఎంతో మక్కువ ఉండేదన్నారు. దాంతోనే బాల్యం నుంచి చక్కటి నాటకాలను ప్రదర్శించేవారని చెప్పారు. పాడెను మోసిన ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి శివప్రసాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కన్నీరుపెట్టుకున్నారు. వైఎస్ రాజారెడ్డి అనుచరుడిగా, వైఎస్ రాజశేఖరరెడ్డి› ఆత్మీయుడిగా ఉన్న శివప్రసాద్‌తో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పాడెను మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలోనే శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. -
దేవదాస్ కనకాలకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: సీనియర్ నటుడు, దర్శకుడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు దేవదాస్ కనకాల (75) అంత్యక్రియలు శనివారం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించే సమయంలో రాజీవ్ కనకాల రోదించడం అందరినీ కలచి వేసింది. అంతకుముందు మణికొండలోని దేవదాస్ నివాసానికి ఆయన వద్ద నటనలో శిక్షణ పొందిన అనేక మంది శిష్యులు చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేవదాస్‌కు నివాళులు అర్పించి కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మిని ఓదార్చారు. భార్య మరణించినప్పటి నుంచి దేవదాస్ ముభావంగా ఉంటున్నారని, ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మణికొండ, రాయదుర్గం మీదుగా విస్పర్ వ్యాలీ కూడలి నుంచి మహాప్రస్థానానికి దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని తరలించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో సినీనటులు, ఆయన శిష్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. -
‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి
మంగళూరు/సాక్షి, బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి అదృశ్యమైన కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) బుధవారం శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ మృతదేహాన్ని కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున జాలరులు, పెట్రోలింగ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాలరులు కనుగొన్న మృతదేహం సిద్ధార్థదేనని ఆయన స్నేహితులు నిర్ధారించినట్లు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్ శశికాంత సెంథిల్ చెప్పారు. మంగళూరులోని వెన్లాక్ వైద్యశాలలో సిద్ధార్థ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఇతర రాజకీయ నాయకులు, కెఫే కాఫీ డే ఉద్యోగులు, గ్రామస్థులు తదితర వందలాది మంది సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే. మంగళూరు సమీపంలో నేత్రావతి నదిపై ఉన్న వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమైనట్లు ఆయన డ్రైవర్ చెప్పడంతో, ఆ ప్రాంతంలో సిబ్బంది తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్కాయిస్ అనే ప్రభుత్వ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారంగా సిద్ధార్థ మృతదేహం ఉన్న అంచనా ప్రదేశాన్ని గాలింపు సిబ్బంది తొలుత గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించడంతో మృతదేహం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ ‘మృతదేహం లభించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు. వారు అంతటి బాధలో ఉన్నారు. సిద్ధార్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి’ అని చెప్పారు. మృతి దురదృష్టకరం: మమతా బెనర్జీ సిద్ధార్థ మృతి దురదృష్టకర సంఘటన అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నా రు. ప్రభుత్వ సంస్థల వేధింపుల కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, విధానాల కారణంగా ఇప్పటికే కొందరు వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారనీ, మరికొందరు కూడా వెళ్లిపోయేందుకు ఆలోచిస్తున్నారని మమత పేర్కొన్నారు. అదృశ్య హస్తాలెవరివో తేల్చండి: కాంగ్రెస్ సిద్ధార్థ మృతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. ‘ఆదాయపు పన్ను అధికారుల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వ్యాపారంలో భారత స్థాయి కూడా పడిపోతోంది. దీనంతటికీ కారణం పన్ను ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ కూలుతుండటమే. యూపీఏ హయాంలో ఎంతో వృద్ధి చెందిన వ్యాపారాలు, కంపెనీలు నేడు మూతపడుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు’ అని ట్విట్టర్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరగాలి. ఇలా విషాదకర రీతిలో సిద్ధార్థ చనిపోవడానికి కారణమైన అదృశ్య హస్తాలెవరివో, ఇందుకు కారణాలేంటో తేల్చాలి. ఆదాయపు పన్ను అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. పన్ను ఉగ్రవాదం, రాజకీయ దురుద్దేశాల కోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటుండటంపై సిద్ధార్థ తన లేఖలో ప్రస్తావించారు. దీని ద్వారా యువపారిశ్రామికవేత్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? సంస్కరణల కోసం కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి
-
రూపాయికే అంత్యక్రియలు
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక్క రూపాయికే అంత్యక్రియలు–ఆఖిరిసఫర్ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి రానుంది. నగరంలో నివసించే నిరుపేదలకు వరంగా మారే ఈ పథకాన్ని నగర మేయర్ రవీందర్‌సింగ్ రూపొందించారు. మున్సిపాలిటీ అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నిరుపేదలకు ఇబ్బందికరంగా మారిన అంతిమ సంస్కారాలను చేయాలనే తలంపుతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అన్ని కులాలు, మతాల వారికి అంతిమయాత్ర నుంచి మొదలుకొని అంత్యక్రియల వరకు అయ్యే ఖర్చులను నగరపాలక సంస్థనే భరించనుంది. పథకం అమలుకు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం రూ.48 లక్షలు కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షించనున్నారు. ఒక్క రూపాయి బల్దియాకు చెల్లిస్తే చాలు కార్మికులను వారి ఇంటికి పంపించి పాడె కట్టించడంతోపాటు నలుగురు డప్పు వాయించే వారిని పంపిస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు కోరితే ఉచితంగానే బాడీ ఫ్రీజర్‌ను అందిస్తారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు పంపించేం దుకు వాహనాన్ని సమకూరుస్తారు. అంత్యక్రియల సందర్భంగా ఎవరి సంప్రదాయాల ప్రకారం వారికి అవసరమైన సామగ్రిని అందజేస్తారు. శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేసే వారికి కట్టెలు, కిరోసిన్, టైర్లు, ఇతర వసతులు కల్పిస్తారు. మృతదేహాన్ని ఖననం చేసే సంప్రదాయం ఉంటే ఆ ప్రకారంగా ఏర్పాట్లు చేస్తారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అక్కడికక్కడే డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. నిరుపేదలకు అండగా... రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు గడిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చులు వారికి తలకుమించిన భారమే. అలాంటి కుటుంబాల్లో చాలా సందర్భాల్లో స్థానికులు చందాలు వేసుకొని అంతిమ సంస్కారాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతిమయాత్ర–ఆఖిరిసఫర్ కార్యక్రమంలో నిరుపేదలకు అండగా మారనుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు అంత్యక్రియలు భారం కాకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ తీసుకున్న ఈ పథకంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నిరుపేదలకు అండగా చేపట్టిన పథకం అన్ని ప్రాంతాల్లో విస్తరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సైతం యోచిస్తోంది. సామాజిక దైవకార్యంలా భావించాలి.. – మేయర్, కమిషనర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతిమాయాత్ర–ఆఖిరిసఫర్ కార్యక్రమాన్ని సామాజిక దైవకార్యంగా భావించి, ఈ కార్యక్రమ అమలుకు అధికారులంతా సిద్ధం కావాలని నగర మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కోర్టు ట్యాంకు ఆవరణలో పథకం అమలుపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. పథకానికి నగర మేయర్ రవీందర్‌సింగ్ రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న పథకం అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ.. పథకం అమలుకు రూ.49 లక్షలు కేటాయించామని, ఒక్క అంత్యక్రియ కార్యక్రమానికి సుమారు రూ.6వేలు నగరపాలక సంస్థ ద్వారా ఖర్చు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి డీఈ స్థాయి వ్యక్తిని ప్రత్యేక అధికారిగా నియమించి, స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏరియాల వారీగా కమిటీ అధికారులు ఆఖిరి సఫర్ కార్యక్రమం విధుల నిర్వహిస్తారన్నారు. యుద్ధప్రాతిపదికన పథకం అమలుకు నగరపాలక సంస్థ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ భద్రయ్య, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, అదనపు కమిషనర్ రాజేంద్రకుమార్, డీఈలు రామన్, యాదగిరి, మసూద్, ఏఈలు వెంకట్‌కుమార్, చైతన్య, నిఖిత, వాణి, సానిటరీ సూపర్వైజర్ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు. -
సరికొత్త పధకం..రూపాయికే అంత్యక్రియలు
-
ఊరు మోడైంది.. కన్నీరు తోడైంది
అలంపూర్: ఓ శుభకార్యం కోసం వెళ్లి వస్తూ.. ఊహించని రోడ్డు ప్రమాదంలో విగత జీవులై తిరిగొచ్చిన తమ వాళ్లను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఊరంతా కదిలొచ్చి వెల్దుర్తి రోడ్డు ప్రమాద మృతులకు కడసారి వీడ్కోలు పలికారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 16 మందిలో 15 మంది జోగుళాంబ గద్వాల జిల్లా వాసులే. వీరిలో 14 మంది వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామస్తులే ఉండటంతో భౌతిక కాయాలను ఒకే చోట ఖననం చేశారు. ఆదివారం వీటి కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేసింది. రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మన్న కుమారుడు శ్రీనాథ్ వివాహం నిశ్చయం చేసుకుని అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి తిరిగి వస్తుండగా.. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. శాంతినగర్‌లో ధర్నా మృతదేహాలు ఉన్న అంబులెన్స్‌ను ఆదివారం శాంతినగర్ వద్ద నిలిపివేసి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లలకు విద్య సౌకర్యం, రైతు బీమాతో పాటు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇప్పించాలని ఎమ్మెల్యే అబ్రహంను ఘెరావ్ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా హామీలపై స్పష్టమైన ప్రకటన చేయడం వీలుపడదని, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని గద్వాల ఆర్డీఓ రాములు హామీనివ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాతో అలంపూర్–రాయిచూరు రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి. ఎస్పీ లక్ష్మినాయక్, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్ హుసేన్ ట్రాఫిక్‌ను క్లియర్ చేసి మృతదేహాలు ఉన్న అంబులెన్స్‌లను అక్కడి నుంచి తరలించారు. ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటు.. జోగుళాంబ గద్వాల కలెక్టర్ శశాంక ఆదేశాల మేర కు రామాపురం గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో ఒక ఎకరం పొలం ఎంపిక చేసి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అంబులెన్స్‌లో వచ్చిన మృతదేహాలను వారి నివాసాలకు కాకుం డా ప్రత్యేకంగా వేసిన టెంట్ల వద్దకు చేర్చారు. అక్కడే అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేసి కొత్తగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలో ఖననం చేశారు. అంత్యక్రియల్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు. బాధిత కుటుం బాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రులు డీకే అరు ణ, రాములు, ఢిల్లీలో ప్రభుత్వ అధికారి ప్రతినిధి మందా జగన్నాథం, నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీజే పీ అభ్యర్థి బంగారు శ్రుతి పరామర్శించారు. -
ముగిసిన మనోహర్ పారికర్ అంత్యక్రియలు
-
కన్నీటి వీడ్కోలు
-
రాజారెడ్డి ఘాట్‌లో వివేకానందరెడ్డి అంత్యక్రియలు
-
పూర్తయిన నటి ఝాన్సీ అంత్యక్రియలు
-
బుష్ గౌరవార్థం ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’
హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ భౌతికకాయాన్ని వాషింగ్టన్ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ హూస్టన్‌కు చేరుకుంది. బుష్ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’గా పేరుపెట్టారు. వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి బుష్ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. మరోవైపు, బుష్ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సల్లీ విచారంగా పడుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చివరి కోరిక
‘‘ఇది విన్నారా? రఘు రావట్లేదంట. యూఎస్ నుంచి ఇందాకే కాల్ చేసి చెప్పాట్ట’’ ఒకింత ఆశ్చర్యంగా ఈ కబురు తెలిపింది నా శ్రీమతి.మోటార్ సైకిల్ పార్క్ చేసి, లోనికి వచ్చి కూర్చుని చెప్పాను‘‘అవునట. నాకూ ఇందాకే తెలిసింది. ఆఫీస్ నుంచి వస్తుంటే దార్లో రంగనాథంగారు కనబడి చెప్పారు’’రఘు రాలేకపోతున్నది ఏదో పెండ్లికో పేరంటానికో కాదు, సాక్షాత్తు తన తల్లి దశదిన కర్మలకి. రఘు అమెరికాలో పనిచేస్తున్నాడు. చాలా బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాడు.కుక్కాంటీ అనబడే సరోజ ఆంటీకి రఘు ఒక్కగానొక్క కొడుకు. తన ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకుని ఐఐటీలో చదవించి, వాడి జీవితాన్ని ఒక దారిలో పెట్టిన కుక్కాంటీ అసలు ఊహించి ఉండదు ఇలాంటి పరిణామం. ఆవిడ చనిపోయిన రోజు కూడా రఘు రాలేకపోయాడు. బిజీగా ఉన్నానని అమెరికా నుంచి ఫోన్ చేశాడు.అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశాడు. తల మునకలయ్యేంత పనుల్లో ఉన్నానని, సెలవు దొరకదని, అంత్యక్రియలు కాలనీ పెద్దల ఆధ్వర్యంలో కానివ్వండని, దశదిన కర్మల లోపు వచ్చేస్తానని ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా పనులు కానివ్వండని అభ్యర్థించేటప్పటికి ఎవరూ కాదనలేకపోయారు. అతని కోణం నుంచి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నమే చేశారు.రంగనాథంగారు సరోజ ఆంటీకి బాగా దగ్గరి వారు. దూరపు చుట్టరికం కూడా ఉందనుకుంటాను. ఆయన బాధ్యత తీసుకుని, అన్ని పనులూ తన తలపై వేసుకుని వ్యవహారం కానిచ్చారు. కాలనీలోని ప్రతి ఒక్కరూ రంగనాథంగారికి సహకరించారు. సరోజ ఆంటీ అంటే అందరికీ ప్రత్యేక అభిమానం. ఆవిడ రుణం ఈ విధంగా తీర్చుకునే అవకాశం వచ్చిందని అందరూ అనుకున్నారు. తలలో నాలుక అన్నది చాలా చిన్నపదం అవుతుంది ఆవిడ విషయంలో. కాలనీలో అందరినీ తన పిల్లల్లా చూసుకునేది. పెళ్లి, పేరంటం, నామకరణం, పుట్టినరోజు వేడుకలు... ఇలా ఒక్కటేమిటి ఎక్కడ కోలాహలం ఉంటే అక్కడ కుక్కాంటీ ఉంటుందనేది జగమెరిగిన సత్యంగా మారింది.శుభకార్యాలు సరే, ఏ ఇంట్లో విషాదం జరిగినా, ఓదార్చడానికి తానే ముందుండేది. ఆయా ఇండ్లలో ఆ ఇల్లు ఆవిడదేనేమో అన్నట్లుగా తిరిగి అందరినీ ఓదార్చి ఒక పూటో రెండుపూటలో ఉండి వచ్చేది. ఆవిడ ఒక చైతన్యం, ఆవిడ ఒక శక్తి. ఆవిడ ఒక అండ.ఇలా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇలా ఆలోచిస్తూ ఉంటే, ఆవిడని నేను మొదటిసారి చూసిన సంఘటన గుర్తొచ్చింది. నా ఆలోచనలు క్రమంగా గతంలోకి పరుగులు తీశాయి.ఈ సంఘటన జరిగి దాదాపు పదిహేనేళ్లు అవుతోంది.‘‘ఇలా చలిగాలిలో తిరక్కూడదు. కడుపునిండా భోంచేసి చక్కగా ఇంట్లో పడుకోవాలి’’ కాసింత కటువుగా అన్నారెవరో.చలికి ఒకరికొకరం దగ్గరగా అతుక్కుని నడుస్తున్నామేమో, ఈ మాట విని చటుక్కుమని దూరంగా జరిగిపోయాం నేనూ మా ఆవిడా.‘‘అయ్యో! మిమ్మల్ని కాదులెండి. ఈ కుక్కల్ని అంటున్నాను’’ ఈ మాటతో మా అయోమయం ఇంకా ఎక్కువైంది.ఆ మాటలు అంటున్నావిడ కాస్త లావుగా ఉంది. ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకుని, తెల్లని శరీర ఛాయతో హుందాగా ఉంది. ఆవిడ చేతిలో అన్నం గిన్నె పట్టుకుని, చుట్టూ చేరిన ఐదారు కుక్కలకి అన్నం పెడుతోంది.ఆవిడ ధోరణి మాకు కాస్త విచిత్రంగా అనిపించింది. మనుషులతో మాట్లాడినంత చనువుగా, ఆప్యాయంగా ఉండుండి ఆ కుక్కలతో మాట్లాడుతోంది. వాటి వాలకాన్ని బట్టి చూస్తే అవన్నీ వీధి కుక్కలని తెలిసిపోతోంది. ఒక్కటి కూడా పెంపుడు కుక్కలా లేదు.అవాక్కయి నిలబడి చూస్తుండిపోయా మేమిద్దరం.‘‘గుడికెళ్తున్నారా? వెళ్లిరండి. హారతి టైమవుతుందనుకుంటాను’’ మమ్మల్ని ఉద్దేశించి ఆ రెండు మాటలూ అనేసి తిరిగి కుక్కలకు వడ్డించడంలో నిమగ్నమైపోయింది. ఆవిడని చూడటం అదే మొదటిసారి. ఆవిడ పేరు సరోజ అని తర్వాత తెలిసింది.ఆవిడని ఆ విధిలో అందరూ కుక్కాంటీ అనే పిలుస్తారని తెలిసింది. ఆవిడ అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని మాకు క్రమంగా అర్థమైంది.ఆవిడ వెళుతూ ఉంటే, వెనకాలే కనీసం నాలుగైదు కుక్కులు తోకూపుకుంటూ వెళుతూ కనిపిస్తాయి.మామూలుగా మనం పక్కవీ«ధికి వెళితే పరిచయస్తులు ‘హలో.. హాయ్’ అని పలకరించినట్లు ఆ చుట్టుపక్కల వీధుల్లో ఎక్కడికెళ్లినా ఆయా వీధుల్లోని కుక్కలు ‘కుయ్.. కుయ్’మంటూ ఆవిడ దగ్గరగావచ్చి తమ విశ్వాసం ప్రకటిస్తాయి.నగరానికి నేనొచ్చిన కొత్త రోజులవి. విశ్వవిఖ్యాత దిగ్గజంలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో నాకు నేలపై కాళ్లు నిలబడేవి కావు ఆరోజుల్లో. చేతినిండా డబ్బు. కావలసినంత స్వేచ్ఛ.అమ్మానాన్నల ఇష్టానికి అనుగుణంగా నా మరదలినే పెళ్లి చేసుకుని నగరంలో స్థిరపడ్డాను. నగర కాలుష్యానికి దూరంగా, ఆఫీస్ క్యాంపస్‌కి కాస్త దగ్గరగా ఉండేలా చూసుకుని ఎదుగుతున్న ఆ కాలనీలో ఇండిపెండెంట్ ఇల్లు సొంతం చేసుకున్నాను. ఆ ఇంటి నిర్మాణం సందర్భంగా ఒకరోజు సాయంత్రం నిర్మాణ నిర్వహణ పనులు ముగించుకుని సతీసమేతంగా గుడికి వెళుతూ కుక్కాంటీగారిని ఇలా చూడటం తటస్థించింది. ఇంటికి దగ్గర్లోనే ఒక మంచి సాయిబాబా గుడి ఉండటం మాకు చాలా నచ్చింది. వీలైనంత వరకు ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. నగరాల్లోని కాలనీల్లో ఎవరి జీవితం వారిది అనుకుంటూ కాలం గడిపేయడానికి అలవాటు పడిపోయాం అందరమూ. పక్కింటివాడి పేరు తెలియదు. ఏం చేస్తుంటాడో తెలియదు. ఇదో నాగరికత అనే భ్రమలో బతికేస్తుంటాం.ఇలాంటి భ్రమలకు తెరదించింది సరోజ ఆంటీ. నేను ఇంటి స్థలం తీసుకుని, నిర్మాణం పనులన్నీ ముగించి, కొలీగ్స్‌ని, బాగా దగ్గరి బంధువులను, ఆప్తమిత్రులు కొందరిని ఆహ్వానించుకుని ‘హరి ఓం’ అని గృహప్రవేశం చేసుకుంటున్నాను. ఇంతలో ఉరుములేని పిడుగులా సరోజ ఆంటీ ఊడిపడింది.‘‘ఏం నాయనా! నా సైజు చూసి బాగా మెక్కేస్తానని పిలవలేదా ఏంటి? సరిగా మీ ఇంటి వెనుకే ఉంటాను తండ్రీ. నా పేరు సరోజ. మీ అమ్మగారిలా అనుకో. ఇదిగో నా తరఫు నుంచి ఈ చిన్న కానుక. మీరు, మీ తదనంతరం మీ పిల్లలు, మీ మనవళ్లు, మనవరాళ్లు ఈ ఇంట్లో అనేక శత సంవత్సరాలు హాయిగా అనేకానేక శుభకార్యాలు నిర్వహించుకుంటూ సంతృప్తిగా, సంతోషంగా అషై్టశ్వర్యాలతో తులతూగాలని నా ఆకాంక్ష’’ అంటూ ఆవిడ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లా టకటకా చెప్పదలచిన నాలుగు ముక్కలూ చెప్పేసి, కానుక ఇచ్చేసి, అందరితో పరిచయాలు చేసేసుకుని, బలవంతం చేస్తే కొద్దిగా విందు ఆరగించి, ఎలా వచ్చిందో అలా వేగంగా వెళ్లిపోయింది. మొదటి చూపులోనే ఆవిడ మా వాళ్లందరికీ తెగ నచ్చేసింది. ఆ తర్వాత మా బంధువులంతా నగరానికి ఎప్పుడు వచ్చినా ఆవిడని కలవకుండా వెళ్లేవారు కాదు. మా అక్కయ్యలు, అన్నయ్యలు ఎప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడినా ఆవిడ గురించి కుశల ప్రశ్నలు అడిగిగాని సంభాషణ ముగించేవారు కాదు. అంతగా మా అందరిపై ప్రభావం చూపగలిగిందావిడ. పిచ్చిదానిలా కనిపించిన ఆవిడ, చాలా త్వరలోనే నా దృష్టిలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతుందని నాకప్పట్లో తెలియదు. ఆవిడ భర్త ఏదో చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఈవిడంత కలుపుగోరు మనిషి కాదాయన. తన పని తాను చేసుకుపోయేవాడు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవాడు. ఈవిడ చేసే ఎలాంటి సేవా కార్యక్రమాలకు అడ్డు చెప్పేవాడు కాదాయన. అదే ఆయన చేసే సేవ అని చెప్పవచ్చు. వారికి ఒకే ఒక అబ్బాయి.వాడి పేరు రఘు. మేము ఆ కాలనీలో చేరేటప్పటికి రఘు రెండో తరగతో మూడో తరగతో చదివేవాడు. వాళ్ల ఆశలన్నీ రఘుపైనే. వాడిని బాగా చదివించి అమెరికా పంపించాలనేది ఆవిడ ఆశయంగా ఉండేది. అందరితో అదే మాట చెప్పేది. రఘు కూడా చదువులో మంచి ప్రతిభ చూపేవాడు. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్‌గా నిలిచేవాడు.ఇక కుక్కాంటీ విషయానికొస్తే చెప్పుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి.స్వామీ వివేకానంద జన్మదినోత్సవం వస్తోందంటే చాలు, ఈవిడ ఓ హుండీలాంటి డబ్బా ఒకటి పట్టుకుని కాలనీలోని అన్ని ఇళ్లూ తిరిగి చందాలు వసూలు చేసేది. ‘‘మీకు తోచినంత ఇవ్వండి. ఎటువంటి బలవంతం లేదు’’ అనేది. అలా పోగైన డబ్బులన్నీ పట్టుకువెళ్లి మా ఇళ్ల దగ్గర్లో ఉన్న అనాథాశ్రమంలోని పిల్లలకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు కొని ఇచ్చేది. తన పుట్టినరోజని ఒకసారి, వాళ్లాయన పుట్టినరోజని ఒకసారి, వాళ్లబ్బాయి పుట్టినరోజని ఒకసారి ఇలా ఏదో ఒక సందర్భంలో అనాథాశ్రమం పిల్లలకు తన ఇంటి నుంచి తెచ్చిన విందుభోజనం పెట్టేది.తాను చేసే ఇలాంటి ధర్మకార్యాలకు ఎలాంటి ప్రచారమూ ఆశించేది కాదు. ఊరికి దూరంగా ఉన్న కారణంగా అనుకుంటాను మా కాలనీకి బిచ్చగాళ్లు తక్కువగా వచ్చేవారు. అనుకోకుండా వచ్చే ఒకటీ అరా బిచ్చగాళ్లకు చక్కని సరోజా ఆంటీ ఇంట్లో చక్కని భోజనం, వారి ఇంటి కాంపౌండ్‌లోని వేపచెట్టు కింద నవారుమంచంపై చక్కని నిద్ర దక్కేవి.కాలనీలో రోడ్లు పడ్డా ఆవిడకే ఆనందం, బోరుబావులు తవ్వినాఆవిడకే ఆనందం. చిన్నపిల్లలా అక్కడే ఉండి ఆయా కార్మికులని ఉత్సాహపరుస్తూ వాళ్లకు నీళ్లు, చిరుతిండ్లు తానే సప్లై చేసేది. మా ఇంటి దగ్గరి సాయిబాబా గుడికి ప్రతి గురువారం మధ్యాహ్నం పన్నెండింటికి చేరుకునేది. అక్కడ జరిగే అన్నదానంలో ప్రత్యక్షంగా వడ్డన ద్వారా, పరోక్షంగా ఆర్థికసాయం ద్వారా తనవంతు తోడ్పాటు అందించేది. అందరూ తన బంధువులేనేమో అనేంత ఆప్యాయంగా వడ్డించి, ఆకలి తీరిందో లేదో కనుక్కుని మరీ పంపేది. మా కాలనీ అంతా కలిపి వందా నూటయాభై ఇళ్లు ఉండేవి ఆ రోజుల్లో. నెలకోసారి అందర్నీ కలిపేలా చేసి ఏదో ఒక సాంఘిక కార్యక్రమం నిర్వహింపజేసేది ఆవిడ. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ చెత్త లేకుండా చూసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించేది. ఇప్పుడు మా కాలనీలో మంచి మంచి వృక్షాలు ఉన్నాయంటే అదంతా ఆవిడ చలవే.ఇటీవల ఒక టీవీ చానల్ వాళ్ల సర్వేలో తేలిందేమిటంటే రాష్ట్రం మొత్తం మీద సగటు ఉష్ణోగ్రత కంటే మా కాలనీలో ఐదారు డిగ్రీలు తక్కువే ఉంటుందట. ఇవన్నీ ఒక ఎత్తయితే కాలనీలోని ఆడపిల్లలందరినీ సమీకరించి వారికి వేదికనెక్కి ఉపన్యాసం ఇచ్చే కళని పదును పెట్టుకోమని ప్రోత్సహించేది. మా కాలనీ అమ్మాయిలు చాలామంది ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సునాయాసంగా నెగ్గడానికి కుక్కాంటీ చిన్నప్పుడు తమకు ఇచ్చిన శిక్షణే ఎంతో ఉపయోగపడిందని వారంతా ముక్తకంఠంతో చెబుతారు. ఇలా అందరి జీవితాలపై ప్రభావం చూపిన ఆవిడ తన కొడుకు రఘు విషయంలో సహజంగానే మరింత ప్రేమగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.దురదృష్టవశాత్తు రఘుకి ఆవిడ పూర్తిగా అర్థం కాలేదని చెప్పవచ్చు. అర్థం కాకపోతే పోయే. తల్లిదండ్రుల మీద, సొంత దేశం మీద ద్వేషం పెంచుకోవడమే విషాదం.యోగ్యులను దేవుడు పరీక్షలకు గురిచేస్తాడని అనుకునే వారి నమ్మకాన్ని నిజం చేస్తూ దేవుడు సరోజ ఆంటీకి ఒక పెద్ద పరీక్షే పెట్టాడు.రఘు ఇంకా పదో తరగతికి రాక ముందే ఆవిడని విధి చిన్నచూపు చూసింది. రఘు తండ్రిలేని వాడయ్యాడు. ఆవిడ కనీసం పదో తరగతి కూడా పాస్ కాకపోవడంతో భర్త ఉద్యోగం కూడా రాలేదు. కొంత పరిహారం, నెలనెలా అందే పింఛనుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కుదుపు ఆమెలోని కరుణకి ఆనకట్ట వేయలేకపోయింది. తిరిగి మామూలుగానే ఆమె సేవా కార్యక్రమాలకి నడుం బిగించింది. చిత్రంగా ఆమె మరింత సమయాన్ని సేవా కార్యక్రమాలకి వెచ్చించడం మొదలుపెట్టింది. బహుశ తన దుఃఖాన్ని ఈ విధంగా మర్చిపోయే ప్రయత్నం చేసేదనుకుంటా. అలాగని కొడుకు బాధ్యతలని, ఇంటి పనులని నిర్లక్ష్యం చేయలేదు. భర్త మరణం తర్వాత రఘు చదువుపై ఎక్కువ సమయాన్ని వెచ్చించేది.వాడు ఇంటర్‌కు వచ్చాక వేకువనే బ్రహ్మీముహూర్తంలో లేచి, నాలుగు నాలుగున్నరకల్లా వాడిని నారాయణగూడలోని ఐఐటీ కోచింగ్ సెంటర్లో దిగబెట్టి రావడంతో ఆవిడ దినచర్య ప్రారంభమయ్యేది. కోచింగ్ సెంటర్‌కీ, జూనియర్ కాలేజీకి, సాయంత్రం మరో కోచింగ్ సెంటర్‌కి తిరగడంతో ఆవిడకి కాలం వేగంగా గడిచినట్లు అనిపించేది. వేళకి రఘుకి టిఫన్లు, భోజనాలు ఏర్పాటు చేయడంలో ఆ జీవి ఎంత అలసిపోయేదో ఆ కర్మసాక్షికి మాత్రమే తెలుసు. రఘు గురించి ఆమె కన్న కలలన్నీ నిజమయ్యాయనే చెప్పవచ్చు. సహజంగా తెలివైన కుర్రాడు కావడం, చక్కని కోచింగ్ లభించడంతో రఘుకి ముంబై ఐఐటీలో మొదటి ప్రయత్నంలోనే కోరుకున్న బ్రాంచీలో సీటు రావడం, అక్కడ కూడా దిగ్విజయంగా కోర్సు పూర్తి చేసుకుని, చూస్తుండగానే చక్కని కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.కథ ఇక్కడి వరకే అయితే ‘సుఖాంతం’ అని చెప్పి చేతులు దులిపేసుకునేవాడిని నేను కూడా. అసలు కథ ఇక్కడే మొదలైంది మరి. రఘు ఐఐటీలో చేరిన కొత్తలో ఆవిడ ఇంటింటికీ తిరిగి తన పుత్రుడి గురించిన విశేషాలను చెప్పుకుంటూ ఆనందం పంచుకునేది. క్రమంగా ఆవిడలో ఆ ఉత్సాహం సన్నగిల్లింది. రఘు గురించిన ప్రస్తావన తానై తేవడం మానేసింది. ఎవరైనా అడిగితే ముక్తసరిగా చెప్పి ముగించేది ఆ సంభాషణ.వాడు ఐఐటీలో చేరింది లగాయతు మహా అంటే ఒకట్రెండు సార్లు వచ్చి ఉంటాడు ఇంటికి. ఇక అమెరికాకి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఇంటి మొహం చూసిన పాపానపోలేదు. వాడి దగ్గర ఉన్న స్టాక్ సమాధానం ‘బిజీగా ఉన్నాను’. ఎప్పుడూ చైతన్యానికి ప్రతీగా ఉండే కుక్కాంటీ డల్‌గా ఉండటం ఎవరూ ఎన్నడూ చూడలేదు. ఈ ప్రపంచంలోని ఆనందం, ఉత్సాహం తాలూకు కేరాఫ్ అడ్రస్సా ఈవిడ అన్నట్లు ఉంటుంది ఆవిడ ప్రవర్తన.అలాంటావిడ వెక్కివెక్కి ఏడ్వడం నేను చూడాల్సి వచ్చింది ఓసారి. అసలేం జరిగిందంటే...ఒకరోజు సాయంత్రం గుడికెళ్తూ అనుకోకుండా వారింటికి వెళ్లాను. ముందు గదిలో లైట్ కూడా వేసుకోకుండా కూర్చుని ఆవిడ వెక్కివెక్కి రోదిస్తోంది. నా మనసు ఎందుకో కీడు శంకించింది.ఆవిడ భర్త పోయినప్పుడు కూడా ఎంతో హుందాగా వ్యవహరించింది. అలాంటావిడ ఇలా ఏడ్వడం నాకు బాగా దుఃఖాన్ని కలిగించింది. ‘‘ఏమైంది ఆంటీ..?’’ నోరు పెగుల్చుకుని అడిగాను.ఆవిడ మౌనంగా ఓ ఎయిర్‌మెయిల్ ఉత్తరం నా చేతిలో పెట్టింది. లైట్ ఆన్ చేసి చదవడం ప్రారంభించాను. అది రఘు నుంచి.నేరుగా ఆవిడకి రాయలేదు. రంగనాథంగారికి రాశాడు.‘‘డియర్ అంకుల్బాగున్నారా? మీరంతా బాగున్నారని ఆశిస్తాను.నాకిక్కడ జీవితం ఆనందంగా గడిచిపోతోంది. అనేకమంది పరిచయమయ్యారు. రోజులు బాగా వేగంగా నడిచిపోతున్నాయి. నేను జీవితంలో ఏం కోల్పోయానో నాకు క్రమంగా అర్థమవుతోంది. నేను కోల్పోయినదంతా తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నాను.నేనేం కోల్పోయానో తెలుసా అంకుల్? జీవితం కోల్పోయాను. అవునంకుల్ నేను బాల్యం కోల్పోయాను. స్కూల్‌డేస్ తాలూకు ఆనందం కోల్పోయాను. కాలేజ్ డేస్ తాలూకు వేగం కోల్పోయాను. బాల్యం అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పుస్తకాలు, పరీక్షలు. స్కూల్ అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పోటీ, ర్యాంకులు, పరుగులు. కాలేజీ లైఫ్ మరీ ఘోరం అంకుల్. ఒక బందిఖానా నయం దానికంటే. పేపర్లలో ప్రకటనల కోసం మమ్మల్ని సమిధలుగా వాడుకున్నారు ఆ జూనియర్ కాలేజీ వాళ్లు. వాళ్ల దృష్టిలో మేం ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాలం. మాకంటూ కొన్ని మనోభావాలుంటాయని అవి దెబ్బతింటాయని ఏనాడూ ఆలోచించలేదు వారు. హైదరాబాద్ అంటే కోచింగ్ సెంటర్లు గుర్తు వస్తాయి కాని ఎంజాయ్ చేసిన క్షణాలు బుర్ర బద్దలు కొట్టుకున్నా గుర్తురావడం లేదు. ఇక ఐఐటీలో అయితే ఊపిరి తీసుకోవడానికి కాదు కదా, చావడానికి కూడా మాకు టైమ్ ఉండేది కాదు. అలసి సొలసి ఇంటికి వచ్చిన నన్ను ఏనాడూ మా అమ్మ నన్ను ఒక మనసున్న మనిషిగా ట్రీట్ చేయలేదు. ఎంతసేపూ నాకెన్ని మార్కులు వచ్చాయని అడగడం, మంచి మార్కులు వచ్చాయనగానే స్వీట్స్ చేసి పెట్టడం, ఎప్పుడైనా ఒకటీ అరా తక్కువ వచ్చిన సందర్భాల్లో తాను డల్‌గా మారిపోవడం... ఇంతేనా జీవితమంటే అని అనిపించేది. నేను కంటి ముందు కనిపిస్తే చాలు ‘బాగా చదువుకో, అమెరికాలో ఉద్యోగం తెచ్చుకో’ ఈ రెండు మాటలే తప్ప మూడోమాట ఆవిడ నోట్లోంచి వచ్చేది కాదు. ఎక్కడో నాకూ మా అమ్మకీ మధ్యన ఉండాల్సిన సున్నితమైన ఏదో బంధం తెగిపోయినట్లనిపిస్తుంది నాకు. ర్యాంకులు, మార్కులు, పరీక్షలులాంటి టాపిక్స్ తప్ప మా మధ్య మాట్లాడుకోవడానికి ఏ టాపిక్స్ ఉండేవి కావు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత పరిస్థితి మరీ ఘోరం అయ్యిందని చెప్పవచ్చు.నాకెరీర్ని మా అమ్మ ఒక జీవన్మరణ సమస్యగా తీసుకున్నట్లనిపించేది నాకు.సినిమాల్లో చూపించినట్లు ఇంటి వాతావరణం అందంగా ఉండదని నాకు తెలిసిన క్షణం నుంచి నాలో ఒకవిధమైన విరక్తి కలిగింది.అలా అన్చెప్పి నాకు మా అమ్మపై ప్రేమ లేదని కాదు. ఆవిడ బాధపడితే నేను చూడలేను. ఆవిడ ఆనందంగా ఉండాలి. ఆవిడ ఆనందానికి మూలకారణం నా మార్కులే. నా విజయాలే అనే ధోరణి నాకు విపరీతమైన చిరాకు కలిగించేది.సెలవులకు రాకూడదా అని మీరు నాకు పదే పదే ఫోన్ చేయకండి. వీలైతే నేనే వస్తాను. తరచూ వచ్చి అక్కడ గడపడం నా వల్ల కాదు. నా ఇబ్బంది అక్కడికి రావడం కాదు. వచ్చాక ఒక విధమైన నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది ఇంట్లో. నాకక్కడ అసలేం తోచదు. నాకు మా అమ్మకి మధ్య ఓవిధమైన నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో తనకీ తోచదు, నాకూ తోచదు.ఇంతదూరం వచ్చి నా టైమ్ వేస్ట్ చేసుకుని వృథాగా గడిపి వెళ్లిన భావన కలుగుతుంది. దయచేసి నన్ను రమ్మని పిలవకండి. నేనే వీలు చూసుకుని తప్పకుండా ఒకసారి వచ్చి వెళతాను. అమెరికా రమ్మంటే తను రాదు. ఎన్నోసార్లు అడిగి విసిగిపోయాను. తనకు ఎంత డబ్బు కావాలన్నా పంపిస్తాను. తనని ఆనందంగా ఉండమని చెప్పండి. మీరంతా ఆవిడకి తోడు ఉన్నారన్న భరోసాతో నేనిక్కడ నింపాదిగా ఉండగలుగుతున్నాను. అమ్మని బాగా చూసుకోండి.మీ రఘు.ఆవిడ అక్షరాలని కూడబలుక్కుని చదివి ఉంటుంది ఆ ఉత్తరం.‘‘ఈ కాలనీ వారంతా మీ పిల్లల్లాంటి వారు కాదా ఆంటీ’’ అని చెప్పి ఓదార్చి వచ్చాను. కాని ఆవిడ దుఃఖాన్ని ఆపడం నా వల్ల కాలేదు. నన్ను ఎక్కువసేపు ఉండనివ్వలేదావిడ వారింట్లో. సున్నితంగా నన్ను వెళ్లిపొమ్మని సైగ చేసింది. నేను వచ్చేశాను.ఆ తర్వాత ఆమెలో కొత్త మనిషిని చూశాను. ఇదివరకటి కన్నా ఉత్సాహంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ సంఘటన తర్వాత ఆవిడ ఎప్పుడూ రఘు గురించి మేమడిగినా ప్రస్తావించేది కాదు.ఆవిడలో ఒక స్థిరత్వాన్ని గమనించాను ఈ విషయంలో.మృత్యువు ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేకుండా, చివరి నిమిషం వరకు నవ్వుతూ నవ్విస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటూ హాయిగా గడిపేసింది ఆమె తన చివరి రోజులు.తానెన్నుకున్న మార్గం విషయంలో ఆమె ఎన్నడూ రాజీ పడలేదు.దుఃఖమే ఆమె ముందు దుఃఖించింది. అలసటే ఆమె ముందు అలసిపోయింది. ఓటమే ఆమె ముందు ఓడిపోయింది. ఆ విధంగా సరోజ ఆంటీ జీవితం ముగిసిపోయింది.మూడు నెలల తర్వాత ఒక ఆదివారం రంగనాథం గారి నుంచి పిలుపు వస్తే వెళ్లాను వారింటికి.మా కాలనీలో వేసవికాలాల సాయంత్రాలు నాకు చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో చిన్న చిన్న తోటలు ఉంటాయేమో, సాంత్వన కలిగిస్తూ పిల్లగాలులు, మామిడాకు వాసనలు, మల్లెల పరిమళాలు. ఒకవిధమైన ఆహ్లాదం ఉంటుంది వీధుల్లో తిరుగుతుంటే గేటు తీసుకుని లోనికి వెళ్లాను.రంగనాథంగారి కంఠం నాకు పరిచయమే. లోపల్నుంచి ఏదో అపరిచిత కంఠం కూడా వినిపిస్తోంది. హాల్లోకి ప్రవేశించాను. రంగనాథం ఎదురుగా కూర్చున్నది ఎవరో కాదు. సరోజ ఆంటీ వాళ్లబ్బాయి రఘు. మంచి రంగు తేలాడు. బాగా ఒళ్లు చేశాడు. ‘‘హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు?’ నన్ను చూసి కుశల ప్రశ్నలు వేశాడు. నేను చిరునవ్వుతో తలపంకించాను. ‘‘ఎందుకంకుల్ ఎంత ఖరీదైనా నేనే కొంటాను ఇంటిని వేరే ఎవరికీ అమ్మవద్దని అంతలా ఒత్తిడి చేస్తున్నాడు ఆ శ్రీరామ్. ఇంతకీ ఎవరంకుల్ ఆయన’’రఘు ప్రశ్నిస్తున్నాడు రంగనాథం అంకుల్ని.రఘు అమెరికా నుంచి ఆన్లైన్లో తమ ఇంటిని వేలానికి పెట్టాడని ఇటీవలే తెలిసింది. ఆ విషయంగా బేరం ఫైనల్ చేసుకోవడానికి వచ్చాడట.‘‘శ్రీరామ్ ఎవరో తెలీదా నీకు?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా.తెలీదన్నట్టు తలూపాడు రఘు.‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా. మళ్లీ తెలీదన్నట్టు తలూపాడు రఘు. ‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా నీకు’’ మరోసారి ప్రశ్నించారు రంగనాథం అంకుల్.రఘు తెల్లమొహం వేశాడు.నేను ఆసక్తిగా వింటుండిపోయాను. హాల్లో ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ గాలికి క్యాలెండర్ పేజీలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాసేపట్లో ఒక బ్రహ్మాండమైన నిజం బద్దలవుతుందని నాకా క్షణంలో తెలియదు. ఈ నిజాన్ని రంగనాథం అంకుల్ ఇన్నాళ్లూ కాపాడాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు రంగనాథం అంకుల్.‘‘ఆ శ్రీరామ్ ఒక అనాథ. మీ అమ్మగారి సాయంతో ఈవేళ ఒక మంచి స్థితికి చేరుకున్నాడు. మీ ఇంటి దగ్గర అనాథాశ్రమంలో ఒక విద్యార్థి వాడు. వాడికి తెలుసు మీ అమ్మగారి చివరి కోరిక. అందుకే వాడు ఆ ఇంటిని తానే కొనాలని పట్టుదలగా ఉన్నాడు. ఆశ్రమంవారు వాడిని ఇంటర్ వరకు చదివించి, ఆపై చదివించలేమని చేతులెత్తేశారు. అప్పుడు మీ అమ్మగారు పూనుకొని వాణ్ణి ఇంజనీరింగ్ చదివేలా ప్రోత్సహించింది. ఆపై ఎంబీఏ చదివించింది. వాడూ సలక్షణంగా చదువుకుని ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వెళ్లి చూడు. వాడి ప్రతి కంపెనీ పేరూ ‘సరోజా ఇండస్ట్రీస్’ అనే ఉంటుంది. వాడు మీఅమ్మని మరువలేదు. ఆవిడ చివరి కోరికనీమరువలేదు.‘‘ఏంటంకుల్ ఆ చివరి కోరిక’’ అడిగాడు రఘు.‘‘తన తదనంతరం ఇంటిని అనాథాశ్రమంగా మార్చాలన్నది ఆవిడి కోరిక. రఘూ! నీకొక నిజం చెప్పాలి. సరోజ ఆంటీ నీ సొంత తల్లి కాదు. నువ్వొక అనాథవి. పెంటకుప్ప దగ్గర పసిగుడ్డుగా పొత్తిళ్లలో కనిపిస్తే ఆ మహాతల్లి తీసుకువచ్చి నిన్ను పెంచింది. కానీ నీకెన్నడూ ఆ భావన రాకుండా పెంచింది. నీ జీవితం ఆవిడ ఇచ్చిన దానం. ఆ మహాతల్లే కనుక చేరదీయకపోతే నువ్వు ఆ క్షణమే నేలరాలిపోయేవాడివి. నీ జీవితమంతా సుఖంగా ఉండటానికి కాలేజీ వాళ్లు నిన్న పెట్టిన కష్టమే పెద్ద కష్టమని అంటున్నావు. ఆ చదువే లేకుంటే నీ జీవితం ఏమయ్యేదో ఊహించుకో. అమ్మ ఏది చేసినా నీ మంచికే అనే జ్ఞానం నీకు లోపించడం వల్ల నీలో ఈ విపరీత ధోరణి కలుగుతోంది’’ఎంతగా దాచాలనుకుంటున్నా రఘు తన కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీటిని దాచలేకపోతున్నాడు.‘‘సరోజ అనాథ వసతి గృహం’’ఆ ఇంటిని అమ్మకుండానే తల్లి చివరి కోరిక తీర్చాడు రఘు. ఆ ఇంట్లోనే అనాథ వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు. - రాయపెద్ది వివేకానంద్ -
అర్చకుడు సత్యనారాయణ శర్మకు కన్నీటి వీడ్కోలు
గీసుకొండ(పరకాల): అర్చకుడు దేవళ్ల సత్యనారాయణ శర్మకు అర్చకులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సత్యనారాయణ శర్మ భౌతిక కాయాన్ని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సందర్శించి నివాళులర్పించారు. అంతిమయాత్రలో కడదాకా పాల్గొన్నారు. సత్యనారాయణ శర్మకు భార్య, పిల్లలు లేకపోవడంతో ఆయన అన్న శంకర్రావు కుమారుడు సురేష్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఎనుమాముల, రెడ్డిపాలెం నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు. అంతిమయాత్రలో తెలంగాణ బ్రాహ్మణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ప్రధానకార్యదర్శి జీవీఎస్ శ్రీనివాసాచారి, అర్బన్ జిల్లా అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్, నాగిళ్ల శంకర్‌శర్మ, నాయకులు జగన్మోహన్శర్మ, వాణి, బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, గట్టికొప్పుల రాంబాబు, గ్రామ పెద్దలు ఆడెపు రమేశ్, దొంగల రమేశ్ పాల్గొన్నారు. డీసీపీ అనురాధ, ఏసీపీలు ప్రతాప్‌కుమార్, సుధీంద్ర, సీఐ సంజీవరావు, ఎస్ఐ రహీంలతో పాటు పలువురు పోలీస్ అధికారులు అవాంఛనీయ టనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.. అర్చకుడు సత్యనారాయణశర్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గేషియా చెల్లించి ఆదుకోవాలని బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా మొగిలిచర్లలో సత్యనారాయణశర్మ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్చకుల భద్రతపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్ నుంచి సత్యనారాయణ కుటుంబానికి తక్షణ సాయం అందించాలన్నారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
హరికృష్ణ చితికి నిప్పంటించిన కల్యాణ్‌రామ్
-
ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. హరికృష్ణ చివరిచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు చివరిసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హరికృష్ణ చితికి కళ్యాణ్‌రామ్ నిప్పంటించారు. హరికృష్ణ గౌరవార్థం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమయాత్ర సాగింది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మధ్యాహ్నం మహాప్రస్థానానికి చేరుకుంది. దాదాపు గంటన్నరపాటు అంతిమయాత్ర సాగింది. ‘రథసారధి’కి అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అప్డేట్స్: హరన్నా.. ఇక సెలవు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతకుముందు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. అంతిమయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఇవి.. సాయంత్రం 4.20 గంటలు: మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నందమూరి కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3.25 గంటలు: నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. దాదాపు గంటన్నరపాటు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2.30 గంటలు: మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి ప్రారంభమై హరికృష్ణ అంతిమయాత్ర కుటుంబసభ్యుల, అభిమానుల అశ్రునయనాల మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలు : నటుడు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. మెహిదీపట్నంలో హరికృష్ణ నివాసానికి వెళ్లిన పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హరికృష్ణకు శ్రద్ధాంజలి ఘటించి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉదయం 11.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మరోవైపు అభిమానులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో.. ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు చర్యలు చేపట్టారు. హరికృష్ణ ఇంటికి వెళ్ళే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. బంధువులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నారు. అభిమానులు అంత్యక్రియలు జరిగే జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలు: హరికృష్ణ భౌతికకాయానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్, సినీ నటుడు కోట శ్రీనివాస రావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఆయన తనను చాలా అభిమానించేవారని తెలిపారు. ఆయన మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. మంచి మిత్రుడుగా ఉండేవారని పేర్కొన్నారు. కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ..హరికృష్ణతో నా అనుబంధం ఇప్పటిది కాదని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..హరికృష్ణ, తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు బస్సు యాత్రలో, సత్తుపల్లిలో జరిగిన సమావేశాల్లో హరికృష్ణని కలిశానని గుర్తు చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు. ఉదయం 9 గంటలు: హరికృష్ణ నివాసానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు.. ఈ సందర్భంగా హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు. హరికృష్ణ పార్థివదేహానికి ఎంపీ కవిత, నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగపతిబాబు, అశ్వనీదత్ నివాళులర్పించారు. ఉదయం 8.30.. పలు చోట్ల నిదానంగా కదులుతున్న వాహనాలు పలు ప్రాంతాల్లో ట్రాఫ్‌క్ జామ్ ఏర్పడింది. లకిడికపూల్ ఫ్లైఓవర్, మహవీర్ ఆస్పత్రి, మాసబ్ ట్యాంక్ టవర్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి వైఎంసీఏ ఫ్లైఓవర్, ఎస్బీహెచ్ క్రాస్‌రోడ్, ప్లాజా క్రాస్‌రోడ్ ప్రాంతల్లో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హరికృష్ణ అంతిమ యాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ ట్యాంక్ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో వెళ్లే వాహనదారులు బజార్‌ఘట్, ఆసిఫ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిల్మ్‌నగర్ మీదుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు. మెహదీపట్నం ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతోంది. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనున్న అంతిమయాత్ర. సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొడుకు అంత్యక్రియలు జరిగిన చోటే..
సాక్షి, హైదరాబాద్ : కారు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రేపు శంషాబాద్ దగ్గరగల ఫాంహౌస్‌లో జరగనున్నాయి. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కామినేని ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తైన తర్వాత హరికృష్ణ మృతదేహాన్నిహైదరాబాద్కి తరలించనున్నారు. ఇప్పటికే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు త్రివిక్రమ్, జగపతి బాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ , బాలకృష్ణ, పురందేశ్వరి తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. -
మహానేతకు సేవ చేయడం మా అదృష్టం...
దేశవ్యాప్తంగా తన వాక్పటిమ, రాజనీతిజ్ఞతతో ఆకట్టుకున్న మహానేతకు వారు సేవలందించారు. వాజ్‌పేయికి అంతమ శ్వాసవరకు సేవ చేసే అవకాశం లభించడాన్ని ఢిల్లీలోని ఆల్ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) డాక్టర్లు, నర్సులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏయిమ్స్‌లో వాజ్‌పేయికి 9 వారాల పాటు చికిత్స అందించిన సందర్భంగా తమకెదురైన జ్థాపకాలను వారు పదిలం చేసుకుంటున్నారు. వృద్ధాప్యంతో పాటు న్యూమోనియా, వివిధ అవయవాలు పనిచేయని కారణంగా గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో గత కొన్నిరోజులుగా తాము తీవ్ర వత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని, అయినా అలాంటి నేతకు సేవలు చేయడంలో ఆ శ్రమ మరిచిపోయామని చెబుతున్నారు. ’ చిన్నప్పటి నుంచి ఏ నాయకుడి ఉపన్యాసాలు టీవీల్లో చూస్తూ పెరిగామో ఆ నేతే ఆసుపత్రి మంచంపై తీవ్ర అనారోగ్య స్థితిలో కనిపించడాన్ని వివరించడానికి కష్టంగా ఉంది. వాజ్‌పేయి లాహోర్ బస్సుయాత్రకు వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్లకు కట్టినట్టుగా ఇప్పటికీ నాకు కనిపిస్తున్నాయి’ అని ఓ నర్సు చెప్పారు. మామూలు ఆరోగ్య పరీక్షల కోసం జూన్ 11న ఏయిమ్స్‌కు వచ్చిన సందర్భంగా ముత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్తో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్,తక్కువ మోతాదులో మూత్రం విడుదల, ఛాతీ సమస్యలను డాక్టర్లు గుర్తించారు. ఆయనకు అవసరమైన వైద్యం అందించేందుకు ఆ వెంటనే ఏయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఐదుగురు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యపరిస్థితిని గురించి ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. గత శనివారం నుంచి వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, బుధవారం మరింత విశమించిందని వారు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నానానికి రెండు ఊపరితిత్తుల్లో న్యూమోనియా తీవ్రస్థాయికి చేరుకుందని, ఆ వెంటనే ’ఎక్స్ట్రా మెంబ్రేన్ ఆక్సిజెనెషన్’ (ఈసీఎంఓ) సేవలు అందించారు. ఈ ప్రక్రియ గుండెకు, శ్వాసక్రియకు సహాయకారిగా ఉండడంతో పాటు, కృత్రిమ గుండెగా, ఊపిరితిత్తులుగాను ఇది పనిచేస్తుంది. దిగజారుతున్న వాజ్‌పేయి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు వైద్యసిబ్బంది ఓ వైపు తీవ్రంగా శ్రమిస్తుండగా, విశమిస్తున్న ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. చివరకు ప్రధాని మోదీ ఏయిమ్స్‌ను సందర్శించాక, వాజ్‌పేయి మరణవార్తను ఏయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్పర్సన్ డా. ఆర్తి విజ్ ప్రకటించారు. వాజ్‌పేయి మరణం రూపంలో ఎంతో నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న సంతాపంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నామంటూ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీల సంతాపం
తాను నమ్మిన సిద్ధాంతాలను మానవతా ధృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసి సుపరిపాలన అందించిన ఒక పాలనాధక్షుడిగా వాజ్‌పేయి చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. 10 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు పనిచేసి దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు వాజ్‌పేయి. ఆయన మరణంతో దేశం ఒక మహోన్నత నాయకుడిని కోల్పోయింది. – వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాదరావు -
వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ నోటిఫికేషన్‌ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో జారీ చేశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 2018 ఆగస్టు 16న సాయంత్రం 5.05 గంటలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించారని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏడు రోజుల సంతాప దినాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని తెలిపింది. మాజీ ప్రధాని మరణిస్తే వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ నిబంధనల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా వస్తోందని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. -
ప్రముఖుల తుది మజిలీ ‘స్మృతి స్థల్’
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దేశ రాజధాని ఢిల్లీలోని స్మృతి స్థల్లో జరిగాయి. యమునా నది తీరంలో పచ్చిక బయలుతో అలరారే సువిశాల ప్రాంగణం స్మృతి స్థల్. గాంధీ సమాధి(రాజ్‌ఘాట్)కి సమీపంలో శాంతివన్ (నెహ్రూ సమాధి), విజయ్ ఘాట్ (లాల్ బహదూర్ శాస్త్రి సమాధి)ల మధ్య ఈ స్మృతి వనం ఉంది. రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధాన మంత్రుల వంటి అత్యంత ప్రముఖుల అంత్యక్రియల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్మృతి స్థల్‌ను ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు మరణించినప్పుడు వారికోసం దేశ రాజధానిలో ప్రత్యేకంగా స్థలాల కేటాయింపులు జరిగాయి. రాజ్‌ఘాట్ సమీపంలో వారికి కూడా స్మారక స్థలాలను కేటాయించేవారు. శాంతివన్, శక్తి స్థల్, వీర్ భూమి, ఏక్తా స్థల్, సమతా స్థల్, కిసాన్ ఘాట్ వంటి పేర్లతో ఏర్పాటు చేసిన ఈ స్మారకాల కోసం రాజధానిలో అత్యంత విలువైన 245 ఎకరాలకు పైగా కేటాయించారు. ఇలా కేటాయిస్తూ పోతే రాజధానిలో భూమి కొరత వస్తుందన్న ఆందోళనతో 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇకపై ప్రముఖులకు స్థలాలు కేటాయించకూడదని నిర్ణయించింది. 2013లో కేంద్ర మంత్రివర్గం స్మతి స్థల్ నిర్మాణానికి ఆమోదం తెలపగా, 2015లో రాజ్‌ఘాట్ సమీపంలో నిర్మాణం పూర్తయింది. స్మతి స్థల్లో మొదటి సమాధి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది. 2015లో ఎన్డీయే ప్రభుత్వం ఈ స్మృతి స్థల్లో ఆయన స్మారకాన్ని నిర్మించింది. అయితే ఇందుకు ఆయన కుటుంబీకులు పదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. పీవీ నరసింహారావు ఢిల్లీలో మరణించారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు రాజధానిలో జరిపేందుకు అంగీకరించలేదు. దాంతో కుటుంబీకులు పీవీ అంత్యక్రియలను హైదరాబాద్‌లో నిర్వహించి స్మారకం ఏర్పాటు చేశారు. తమ తండ్రికి దేశ రాజధానిలో స్మారకం ఏర్పాటు చేయాలని పీవీ కుటుంబీకులు కోరడంతో 2015లో ఎన్డీయే ప్రభుత్వం పీవీకి స్మృతి స్థల్లో స్మారకం ఏర్పాటు చేసింది. మరో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు 2012 డిసెంబర్లో స్మృతి స్థల్లో అంత్య క్రియలు నిర్వహించారు. కొందరు మాజీ ప్రధానుల స్మారక స్థలాలు– వాటి పేర్లు–కేటాయించిన స్థలం మహాత్మా గాంధీ రాజ్‌ఘాట్ 44.35 ఎకరాలు జవహర్లాల్ నెహ్రూ శాంతి వన్, న్యూఢిల్లీ 52.6 ఎకరాలు లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్, న్యూఢిల్లీ 40 ఎకరాలు ఇందిరా గాంధీ శక్తి స్థల్,న్యూఢిల్లీ 45 ఎకరాలు రాజీవ్ గాంధీ వీర్ భూమి, న్యూఢిల్లీ 15 ఎకరాలు చరణ్ సింగ్ కిసాన్ భూమి 19 ఎకరాలు జైల్ సింగ్ ఏక్తా స్థల్ 22.56 ఎకరాలు చంద్ర శేఖర్ ఏక్తా స్థల్, న్యూఢిల్లీ ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్లో కలిసింది ఐకే గుజ్రాల్ ఏక్తా స్థల్,న్యూఢిల్లీ ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్లో కలిసింది వీపీ సింగ్ దియా గ్రామం, రామ్‌ఘడ్, అలహాబాద్ మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, గుజరాత్ -
మదురై మహిళకు పాదాభివందనం
మదురై జిల్లా పుల్లచ్చేరి గ్రామానికి చెందిన చిన్నపిళ్లై అనే మహిళకు 2001లో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా పాదాభివందనం చేశారు. కళంజియం అనే పేరుతో చిన్నపిళ్లై ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజల్లో పొదుపు చేసే అలవాటును బాగా ప్రోత్సహించారు. ఆమె సమాజ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘శ్రీ స్త్రీశక్తి’పురస్కారాన్ని అందజేసింది. నాడు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి చిన్నపిళ్లైకి అవార్డు బహూకరిస్తూ ఆమె పాదాలకు నమస్కారం చేశారు. దీంతో ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది. వాజ్‌పేయి కన్నుమూశారన్న వార్త విని చిన్నపిళ్లై కన్నీరు పెట్టుకున్నారు. -
ఏ బంధమో...
ఏ బంధం లేకున్నా ... బలమైన అనుబంధమేదో కలిపింది వీరందరినీ. వాజ్‌పేయితో వ్యక్తిగత అనుబంధం లేకపోవచ్చు. ఆయన్నసలు చూసి కూడా ఉండకపోవచ్చు. కానీ ఆయన చేసిన పనులేవో వారిని తట్టిలేపాయి. ఆయన మాటలేవో వారి మదిని కదిలించాయి. అందుకే జనం తరలి వచ్చారు. కడసారి ఆ మహానేతను చూసిపోదామని వచ్చిన బహుదూరపు బాటసారులెందరో వాజ్‌పేయి ఇంటిముందు బారులు తీరారు. ఎక్కడ నుంచో తరలి వచ్చిన పీహెచ్డీ విద్యార్థి ఒకరు.. రాష్ట్రీయ స్మృతి స్థల్లో పనిచేసే రోడ్డు నిర్మాణ కార్మికుడొకరు.. బీహార్ నుంచి వచ్చిన ఓ సివిల్ సర్వీసెస్ విద్యార్థి, ఒక న్యాయవాది..ఉత్తరప్రదేశ్‌నుంచి వచ్చిన వలస కార్మికుడొకరు. వాజ్‌పేయి ఎదిగివచ్చిన సమాజం ఒకవైపూ, వాజ్‌పేయి స్ఫూర్తినొందిన సిద్ధాంతాన్ని విశ్వసించిన ప్రజలు మరోవైపూ, ఏ సంబంధమూ లేని వీరందరినీ 6–ఎ క్రిష్ణ మీనన్ మార్గ్..దగ్గరికి చేర్చేందుకు కారణమయ్యారు అటల్ బిహారి వాజ్‌పేయి. ఒకరికొకరు సంబంధంలేని వేనవేల ప్రజానీకం ఆఖరి చూపుకోసం, తన ప్రియతమ నేత మహాభినిష్క్రమణం వేళ అశ్రునివాళులర్పించేందుకు శుక్రవారం వరకు అక్కడే వేచి ఉన్నారు. ఆఖరిచూపు కోసం సైనిక పటాలాలు, సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగత రక్షక సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య 6–ఎ, క్రిష్ణ మీనన్ మార్గ్ వద్ద జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ నుంచి వచ్చిన 52 ఏళ్ళ యోగేశ్ కుమార్, ఆయనతో సహా అనేక మంది 500 కిలోమీటర్ల సుదూర తీరాలనుంచి ప్రయాణించి వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు తెల్లవారేసరికి వాజ్‌పేయి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంగాజలం తెచ్చాను.. ‘‘1984లో వాజ్‌పేయి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళుతుండగా మార్గం మధ్యలో మొదటిసారి వాజ్‌పేయిని కలిసాను. మళ్లీ రెండేళ్ల తరువాత 1986లో ఉత్తరకాశీలో రెండోసారి వాజ్‌పేయిని చూశానంటూ వాజ్‌పేయితో దిగిన ఫొటోని చూపిస్తూ కనిపించారు యోగేష్ కుమార్. తనతో పాటు గంగోత్రి నుంచి గంగాజలాన్ని తెచ్చాననీ, ఒక్కసారి వాజ్‌పేయి పార్థివ దేహాన్ని చూసే అవకాశం వస్తే చాలన్నారు. అందరూ ఆయన ఆరాధికులే ‘‘హిందువా, ముస్లిమా అన్నది చర్చనీయాంశం కాదు. ఏ మతానికి చెందిన వారైనా అందరికీ ఆయనపై విశ్వాసం ఉంది. ఆయన జాతిజనులకోసం పరిశ్రమించారు’’అని బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి వచ్చిన 49 ఏళ్ళ న్యాయవాది సుధీర్‌కుమార్ ఝా పేర్కొన్నారు. వార్తల్లో చూసి... ‘‘వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్త విని నా స్నేహితుడూ, నేనూ కడసారి ఆయన చూడాలని పట్నా నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చాము’’అని ఆశీష్ ఉపాధ్యాయ అనే ఇంజనీర్ తెలిపారు. జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్డీ చదువుతున్న దీన్‌నాథ్ గుప్తా అనే విద్యార్థి తాను మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాననీ, మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు తెలిసి తన రీసెర్చ్పనిని విడిచి ఎయిమ్స్‌కి వచ్చినట్టు తెలిపారు. ఆయన కవిత్వమే నాకు స్ఫూర్తి వాజ్పేయే కవిత్వమే తనకు స్ఫూర్తి అని సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న రాహుల్ అహ్వద్ అంటారు. 2013, 2015లో రెండుసార్లు వాజ్‌పేయిని చూశానంటారు. అప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా లేరని, చివరిసారిగా ఆ మహానేతని ఒకసారి చూడాలని వచ్చినట్లు చెప్పారు. ‘‘వాజ్‌పేయి అన్ని పార్టీలతో సత్సంబంధాలు నెలకొల్పారు. అందరి మన్ననలూ అందుకున్నారు’’అన్నారు రాహుల్ అహ్వద్. ఓ మంచి మనిషి... ‘‘నేను స్కూల్లోనూ, కాలేజీలోనూ చదువుకునేటప్పుడు వాజ్‌పేయి గురించి తెలుసుకున్నానని, ఆయన్ని గురించి చదివానని చెప్పిన 19 ఏళ్ళ బిపిన్ కుమార్ ‘‘వాజ్‌పేయి ఓ మంచి మనిషి’’అంటారు. అసంఘటిత రంగ కార్మికుడి నుంచి సంఘటిత ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల వరకూ అందరూ తమ అధినేతకు అశ్రునివాళులు అర్పించామన్న సంతృప్తితో వెనుదిరిగారు. వాజ్‌పేయి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. వాజ్‌పేయితో కలసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. దేశ ప్రజలంతా అమితంగా ఆరాధించే మాజీ ప్రధాని, విభిన్న జాతీయ నేత, ఆధునిక భారత రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రచయితగా, కవిగా, ఎంపీగా, పరిపాలకుడిగా, చివరకు ప్రధానిగా ప్రజా జీవితంలో ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఆయన మరణం దేశానికే కాదు ప్రపంచమంతటికీ లోటు – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాజ్‌పేయి అస్తమయంతో ఒక శకం ముగిసిందని అందరూ అంటున్నారు. అయితే నేను మాత్రం భావించడం లేదు. ఆయనతో పాటు మరికొందరు వేసిన పునాదిపై నిర్మితమైన ఆ శకం కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మొదటి కొన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యమే కొనసాగింది. దానికి ముగింపు పలుకుతూ వాజ్‌పేయి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపారు. అడ్వాణీతో కలిసి కేంద్ర, రాష్ట్రాల్లో రెండో తరం నేతల్ని తయారు చేసిన ఘనత వాజ్‌పేయిదే. – కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వాజ్‌పేయి మరణంతో దేశం ఒక మహాపురుషుడిని కోల్పోయింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మానవత్వానికి ప్రతీక అటల్ జీ. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నా. – గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దేశాభివృద్ధికి, జాతీయ సమస్యల పరిష్కారానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చూపిన బాట నేటికికూడా అనుసరణీయమే. 1975లో నేను కరీంనగర్ జన్‌సంఘ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాజ్‌పేయితో ఏర్పడిన బంధం ఆయన మంత్రివర్గంలో చోటు దక్కేస్థాయికి చేరింది. నా కూతురి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. మనం స్నేహితులను మార్చుకోవచ్చుకానీ పక్కింటివారిని మార్చుకోలేమని అనేవారు. ఆ దృక్పథంతోనే పాక్ విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. – మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు దేశంలో మలిదశ సంస్కరణలకు ఆద్యుడు వాజ్‌పేయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో, జాతీయ రహదారులు, హరిత విమానాశ్రయాలు, సూక్ష్మ నీటిపారుదల రంగాల్లో వాజ్‌పేయి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో హుం దాగా నడుపుతూ మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యక్తిత్వం, విలువలు ఎవరికీ లేవు. – ఏపీ సీఎం చంద్రబాబు అజాత శత్రువు అయిన వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా వాజ్‌పేయి నడపగలిగారు. ఎవరినీ శత్రువులా చూడకుండా అన్ని పార్టీల అభిమానాన్ని ఆయన సంపాదించగలిగారు. – టీఆర్ఎస్ ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డి రాజకీయ విలువలను కాపాడుతూ వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయాలు నేటి తరానికి ఆదర్శం. వాజ్‌పేయి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. – దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ -
భారతీయుల గుండెల్లో ఉంటారు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని నరేంద్ర మోదీ కన్నీటి వీడ్కోలు తెలిపారు. వాజ్‌పేయి వంటి అసాధారణ వ్యక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని మహోన్నతంగా మార్చడంలో జీవితాన్నే త్యాగం చేసిన వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు సరైన పదాలే లేవు. నేడు దేశం నలుమూలల నుంచి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అరుదైన వ్యక్తికి నివాళులర్పించేందుకు ఢిల్లీ వచ్చారు. అటల్ జీ దేశం మీకు సెల్యూట్ చేస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉదయం తన బ్లాగ్‌లోనూ ‘స్ఫూర్తి, సుహృద్భావం, అద్భుతమైన వాక్చాతుర్యం కలబోసిన మహనీయుడిని దేశం నేతగా ఎంచుకుంది. దేశం సమస్యల్లో ఉన్నప్పుడు నీతిమంతమైన, స్ఫూర్తిదాయకమైన దీర్ఘదృష్టి గల నేతగా ప్రజలకు సరైన మార్గదర్శనం చేశారు’ అని పేర్కొన్నారు. 1990వ దశకంలో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక దుర్భర పరిస్థితులున్న సమయంలోనూ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకొచ్చిన గొప్ప వ్యక్తి, రెండు దశాబ్దాలుగా మనం అనుభవిస్తున్న ఆర్థిక ఫలాలకు ఆయన వేసిన బీజాలే కారణం. వాజ్‌పేయి దృష్టిలో అభివృద్ధి అంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు సాధికారత దక్కడమే. ఆయన ఆలోచనలతోనే మా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించుకుని ముందు కెళ్తోంది’ అని పేర్కొన్నారు. భారతదేశాన్ని అణుశక్తిగా మార్చేందుకు ఎవరినీ లెక్కచేయని ధైర్యవంతుడని కొనియాడారు. ‘వ్యక్తిగతంగా ఆయన నా ఆదర్శం, నా గురువు, నాలో స్ఫూర్తి రగిలించిన అసాధారణ మహనీయుడు. 2001 అక్టోబర్‌లో ఓ రోజు నన్ను పిలిచి.. గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్లమన్నారు. వ్యవస్థ పరంగా పనిచేశానని.. పరిపాలనలో అనుభవం లేదని చెప్పాను. అయినా నాలో ధైర్యాన్ని నింపి ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయాలని చెప్పి పంపించారు. నాపై ఆ నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞుడిని. అందుకే ఆయన చూపిన బాటలో.. ఆయన నేర్పిన విధానాలతోనే మేం ప్రపంచంతో పోటీపడగలుగు తున్నాం’ అని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని పరిపాలనలో (గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు) ఆయన ఇచ్చిన సూచనలను మోదీ గుర్తుచేసుకున్నారు. సిమ్లాలో జాతీయ జెండా అవనతం... వాజ్‌పేయికి నివాళులర్పిస్తున్న అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల ప్రతినిధులు, సుష్మాస్వరాజ్, భూటాన్ రాజు జిగ్మే