
సాక్షి, ఆదిలాబాద్/వరంగల్: జిల్లాలోని యపల్‌గూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. రమణమ్మ అనే వృద్ధురాలు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె తనయుడు, రిటైర్డ్ సీఐ విజయ్‌కుమార్, కోడలు సునీత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యపల్‌గూడకు బయల్దేరారు.
ఈక్రమంలో వారు ప్రమాణిస్తున్న కారు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం, పెంచికల్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన విజయ్‌కుమార్, సునీత అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడి మృతితో రమణమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో.. ఆ గ్రామం విషాదంలో మునిగింది.
Comments
Please login to add a commentAdd a comment