సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం
సాక్షి, హైదరాబాద్/సంతోష్‌నగర్: అగ్ని క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్, దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. గురువారం కన్ను మూసిన అగర్వాల్ అంత్యక్రియలు శనివారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.
1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక క్షిపణి తయారీ కార్యక్రమంలో డాక్టర్ అరుణాచలం, డాక్టర్ అబ్దుల్ కలాంతో కలసి అగర్వాల్ పనిచేశారు. అగర్వాల్ హైదరాబాద్‌లోనే నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు. ఇదిలా ఉండగా డీఆర్‌డీఓ హైదరాబాద్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ యూనిట్ అండ్ ఆర్‌అండ్‌డీలో ఉద్యోగులు శుక్రవారం అగర్వాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ అండ్ ఎస్టేట్ మేనే జర్ షేక్ గౌస్ మోహినుద్దీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment