
నల్గొండ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జరిగాయి. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని నివాళి అర్పించారు. నోముల భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. (ముగిసిన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం)
నకిరేకల్ నుంచి పాలెంకు భౌతికకాయం
నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని గురువారం ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 10.30 గంటల వరకు ఉంచారు. ఆ తర్వాత స్వగ్రామమైన పాలెం తీసుకెళ్లారు. కాగా, అమెరికాలో ఉన్న నోముల కుమార్తె బుధవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment