రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా! చివరికి | Funerals obstructed the  burial ground people for money | Sakshi
Sakshi News home page

రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా! చివరికి

Apr 12 2021 8:07 AM | Updated on Apr 12 2021 11:39 AM

Funerals obstructed the  burial ground people for money - Sakshi

జగిత్యాల ‌: వ్యక్తి చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే.. కాటికాపరులు డబ్బుల కోసం వేధించిన సంఘటన జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది.దీంతో గ్రామస్తులే చొరవ తీసుకుని, అంత్యక్రియలను ముగించిన వైనం వెలుగులోకి వచ్చింది. 

గ్రామానికి చెందిన మిట్టపెల్లి బాపురెడ్డి ఆదివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లగా.. కాటికాపరులు వచ్చి చితిపై కూర్చుని అంతిమ సంస్కారాలను అడ్డుకున్నారు. రూ.10 వేలు ఇస్తేనే చితి మీది నుంచి దిగుతామని భీష్మిం చారు. గ్రామస్తులు మాట్లాడి రూ.వెయ్యి వరకు ఇస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. దీంతో గ్రామస్తులందకూ కలిసి చితిపై ఉన్న కాటి కాపరులను పక్కకు తోసి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement