కొల్లాం: వందల ఏళ్లుగా మనుషులుకు అడవి జంతువులకు మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంది. అదే సమయంలో మనుషులు, అడవి జంతువుల మధ్య అంతులేని అనుబంధం పెనవేసుకుపోయింది. అలాంటి ఓ సంఘటనే కేరళలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల పాటు తన ఆలనాపాలన చూసిన మావటి చనిపోతే కన్నీరు పెట్టుకున్నాడు ఓ గజరాజు. అతని అంత్యక్రియలకు హాజరై చివరి సారిగా నిండైన మనసుతో నమస్కారాలు చెప్పాడు.
గజరాజు దండాలు
కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన ఓమనచెట్టన్ అనే మావటి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ జూన్ 3న మరణించాడు. అంతకు ముందు అతను పాతికేళ్లపాటు పల్లాట్ బ్రహ్మదత్తన్ అనే ఏనుగుకు మావటిగా వ్యవహరించాడు. మావటి చనిపోయిన రోజు అతని ఇంటికి వచ్చిన బ్రహ్మదత్తన్ కన్నీటితో వీడ్కోలు పలికాడు. తొండమెత్తి దందాలు పెట్టాడు. ఈ దృశ్యం చూసిన స్థానికుల గుండెలు ద్రవించిపోయాయి. ఈ వీడియోలో ఏనుగు ప్రేమాభిమానాలు చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment