
యశవంతపుర: కరోనా వైరస్ అన్ని బంధాలను తెంచివేస్తోంది. ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఇటువంటి ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా అథణిలో జరిగింది. పట్టణానికి చెందిన నిరుపేద సదాశివ హిరట్టి (55) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు కరోనాతో చనిపోయి ఉంటాడని బంధువులు, ఇరుగుపొరుగు వారెవరూ రాలేదు. దీంతో ఆయన భార్య, 13 ఏళ్ల కుమారుడు, మరొకరి సాయంతో మృతదేహాన్ని తోపుడు బండిపై శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.