
సీనియర్ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, సన్నిహితులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కాగా.. శరత్ బాబు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబు కోలుకోలేక మృతి చెందారు.
(ఇది చదవండి: చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో..)
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు.