తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల్లో శరత్ బాబు తనదైన నటనతో అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. శ్రీకాకులం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు. కానీ అనుకోకుండానే నటనలో ప్రవేశించారు. 1973లో రామరాజ్యం సినిమాతో మొదలైన శరత్ బాబు ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. ఆయన సినిమాల్లో ఛాన్స్ కోసం చెన్నైకి వెళ్లారు. గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన శరత్ తొలి సినిమా ఛాన్స్ గురించి ఆసక్తిక విషయాలను పంచుకున్నారు.
(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత)
ఇంటర్వ్యూలో శరత్ బాబు మాట్లాడుతూ.. 'మాకు ఊర్లో ‘గౌరీశంకర్’ అనే హోటల్ ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా హోటల్‌కు మంచి పేరు కూడా ఉండేది. అన్నయ్యతో పాటు నేను కూడా హోటల్‌ను చూసుకునేవాళ్లం. కాలేజీ అయిపోగానే అన్నయ్యకు హోటల్ పనుల్లో సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో మద్రాసు వెళ్లమంటూ నా స్నేహితులు బలవంతం చేశారు. అప్పట్లో నా అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారికి ఫొటోలు పంపాను. ఇంటర్వ్యూకు రమ్మని ఉత్తరం పంపారు. మద్రాసుకు వెళ్లాక నన్ను చూసిన సుబ్బారావు.. మళ్లీ కబురు పంపిస్తా.' అని అన్నారు.
ఆయన మాటలకు ఆశ్చర్యపోయా!
సినిమా ఛాన్స్ రావడం పట్ల మాట్లాడుతూ.. 'అయితే సుబ్బారావు ఎప్పుడు పిలుస్తారా అని మద్రాస్‌లోనే ఉన్నా. అప్పుడే రామా విజేత ప్రొడెక్షన్స్ వారు కొత్త హీరో కావాలని ప్రకటన ఇచ్చారు. ఆడిషన్‌కు 3000 మంది రాగా.. చివరకు నేనే సెలెక్ట్ అయ్యా. యూ ఆర్ ద హీరో ఆఫ్ మై పిక్చర్ అని దర్శకుడు బాబూరావు చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఇదంతా నిజమేనా అనిపించింది. జగ్గయ్య, ఎస్వీ రంగారావు, చంద్రకళ, సావిత్రి.. ఇలా అగ్రహీరోలతో కలిసి నా మొదటి సినిమా ‘రామరాజ్యం కోసం పనిచేశా. 1973లో అది విడుదలైంది. హీరోగా తొలి ప్రయత్నంలోనే నాకు గుర్తింపు లభించింది.' అని అన్నారు.
(ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..)
Comments
Please login to add a commentAdd a comment