
అర్జున్ సర్జా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సీతా పయనం’(Seetha Payanam). అర్జున్ కుమార్తె, హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో ధృవ సర్జా(Dhruva Sarja) (అర్జున్ మేనల్లుడు, కన్నడ స్టార్ హీరో) నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘అర్జున్ సర్జా తన అనుభవంతో, కమర్షియల్ అంశాలతో కూడిన అద్భుతమైన కథను రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో ధృవ సర్జా కూడా పాల్గొంటున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.