
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కానున్నారు. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమ్మాయి మెడలో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. అయితే శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా ఆ అమ్మాయి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది.
ఈనెల 26న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రక్షితా రెడ్డితో ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. త్వరలోనే రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు. ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. అయితే ఇటీవల అన్‌స్టాపబుల్ షో పాల్గొన్న శర్వానంద్ పెళ్లి వార్తలపై స్పందించారు.