
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దేవర మూవీలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఇందులో ఒక్క ఫైట్ సీక్వెన్సులు మాత్రమే కాదు.. చివరి అరగంట అందరినీ అలరిస్తుందన్నారు. అద్భుతమైన విజువల్స్, ఫైట్ సీక్వెన్సెస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని చెప్పారు. సముద్రంలో షార్క్‌పై కనిపించిన షాట్ కోసం చాలా కష్టపడ్డామని అన్నారు. ఆ సీన్ చాలా ఎక్కువ సమయం తీసుకుందని జూనియర్ వెల్లడించారు. ఒక రోజు మొత్తం ఆ షాట్‌కే కేటాయించినట్లు ఎన్టీఆర్ వివరించారు. కాగా.. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
Simple ga cheppalante…last 40 mins motham tagalapadipoddi antunnaru 😁🔥#Devara #DevaraTrailer pic.twitter.com/fRe1vyrYwF
— Devara (@DevaraMovie) September 10, 2024