
బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra) ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక సంఘటన వల్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైంది. ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తూ, జైపూర్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసి, సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, తన పేరు పిలవకపోవడంతో విమానం ఎక్కలేకపోయానని చెప్పింది.
ఎయిర్‌పోర్ట్ సిబ్బందిపై కేకలు వేస్తూ, అరుస్తూ మన్నారా చోప్రా రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో ప్రయాణికురాలు ఆమెకు మద్దతు పలుకుతూ..‘ఆమె పెద్ద సెలబ్రిటీ, దేశానికి సేవ చేస్తోంది’.. మీరు ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించింది.
మన్నారా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపిస్తే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ‘ఎయిర్‌లైన్ నిబంధనల ప్రకారం బోర్డింగ్ 30 నిమిషాల ముందు మూసివేస్తారు, ఆమె సకాలంలో రాకపోతే సిబ్బందిని నిందించడం సరికాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు "ఆమె దేశానికి సేవ చేస్తోందని చెప్పడం హాస్యాస్పదం" అని, "ఇంత పెద్ద సెలబ్రిటీ ఎవరు? ఆమె ఏ సినిమాల్లో నటించింది?" అంటూ ఎగతాళి చేశారు. ‘ఇండిగో తరచూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంది’ అని కొంతమంది, చాలా మంది ఆమె ప్రవర్తనను ‘అతిగా ఉంది’ అని ట్రోల్ చేస్తున్నారు.
మన్నారా చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్‌తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్‌తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్" మరియు "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది.