
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్‌లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్‌గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాడు. రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్‌కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్‌ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం.
కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు.