
ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్‌పై ఆత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడినట్లు 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టైలిస్ట్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధిత మహిళ ఆరోపణలతో పోలీసులు రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. రాహుల్ తన పనితనాన్ని ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి మెసేజ్ చేశాడని, తనని తన పర్సనల్ స్టైలిస్ట్‌గా నియమించుకుంటానని కూడా చెప్పి తనని కలవమన్నాడని ఆమె పోలీసులకు తెలిపింది.
చదవండి: ఆసక్తి పెంచుతున్న విజయ్ ఆంటోని ‘హత్య’ ట్రైలర్, చూశారా?
దీంతో రాహుల్ పిలవడంతో అతడి ఫ్లాట్‌కి వెళ్లానని, అప్పుడే రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ పేర్కొంది. అయితే తాను ప్రతిఘటించినప్పటికి బలవంతంగా అత్యాచారం చేశాడని... తన ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్, ఫోన్‌కాల్‌కు సంబంధించిన సాక్ష్యాలను అతడు తొలగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 323, 506 కింద రాహుల్ జైన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
ఇదిలా ఉంటే సింగర్ రాహుల్ బాధిత మహిళ ఆరోపణలను ఖండించాడు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, తనని ఇంతకుముందేన్నడు చూడలేదన్నాడు. అయితే గతంతో కూడా ఓ మహిళ తనని అత్యాచారం చేశానని తప్పుడు ఆరోపణలు చేసిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. కాగా సింగర్ రాహుల్ జైన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, తాను గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ గతంలో మరో మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.