
సీనియర్ నటుడు సాయి కుమార్, రాధిక శరత్ కుమార్‌లు నటించిన వెబ్ సిరీస్ గాలివాన. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఓటీటీల హావా సాగుతున్న నేపథ్యంలో జీ5 సంస్థ తనదైన ముద్రను వేస్తూ ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈక్రమంలో తాజాగా 'గాలివాన' వెబ్ సిరీస్‌ను ఈ రోజు అర్థరాత్రి (ఏప్రిల్ 14) నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది.
చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది
ఈ వెబ్ సిరీస్ లో రాధిక, సాయికుమార్‌లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన ఎమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ వెబ్ సిరీస్ భారీగా కనిపిస్తోంది. మదర్ సెంటిమెంట్, క్రైమ్ థిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌ను బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు.
#Gaalivaana storm arriving tomorrow exclusively on #ZEE5.#StormComingSoon 🌪🌪 #GaalivaanaOnZEE5 #PremieresTomorrow #AZEE5Original @realradikaa #SaiKumar @iChandiniC @99_chaitu @ImNandiniRai #ThagubothRamesh #SharanyaPradeep @nseplofficial @bbcstudiosindia @sharandirects pic.twitter.com/qO5v67qmAM
— ZEE5 Telugu (@ZEE5Telugu) April 13, 2022