
పుష్ప 2, ఛావా సినిమాలతో వరస బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్ రష్మిక.. కొన్నిరోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడింది. కాలికి కట్టుతో ఉన్న ఫొటోని కూడా పోస్ట్ చేసింది. రీసెంట్ టైంలో నార్మల్ గా నడిచేస్తూ కనిపించింది. ఇప్పుడు కాలి నొప్పి తగ్గిందా లేదా అనే విషయాన్ని స్వయంగా రష్మిక చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?)
ప్రస్తుతం సికిందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న రష్మిక.. మెల్లగా నడుచుకుంటూనే వస్తోంది. దీంతో రష్మిక కాలి గాయం తగ్గిందా లేదా అని ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాలో చాట్ సెషన్ పెట్టిన రష్మికకు.. కాలి గాయం గురించి ప్రశ్న ఎదురైంది.
కాలి గాయం తగ్గిందా అని ఓ నెటిజన్, రష్మికని అడగ్గా.. కాలు పూర్తిగా నయం కావడానికి 9 నెలలు పడుతుంది. ప్రస్తుతానికి కాస్త బెటర్ గానే ఉంది. నేనైతే పనిచేయడం మొదలుపెట్టేశాను అని చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్స్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)
