
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 ఒక్క ఏడాదిలోనే 286 మంది కుక్కకాటుకు బలయ్యారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 2023లో మొత్తంగా 30 లక్షలకుపైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం(జులై 30) కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు.
2023లో 46లక్షల 54వేల98మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేబిస్ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు.