
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య తరువాత దర్శన్ ఏం చేయాలో దిక్కుతోచక అనేక తప్పులు చేశాడు. అవన్నీ విచారణలో వెలుగు చూస్తున్నాయి. కేసు తనపైకి ఉండేందుకు ముగ్గురు రౌడీలకు రూ.30 లక్షలు ఇవ్వడం మొదలుకుని అనేక తప్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలుగా మారి ఆయన మెడకు చుట్టుకున్నాయి.
రేణుకాస్వామి హత్య అనంతరం... కేసు నుంచి బయటపడేయాలని దర్శన్ పలువురు రాజకీయ నేతలను వాట్సాప్ ద్వారా కోరినట్టు పోలీసులు గుర్తించారు. దర్శన్‌ను అరెస్టు చేశాక అతని మొబైల్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ కాల్స్‌మెసేజెస్ రిట్రీవ్ చేయగా ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి.