వైరల్‌ వీడియో.. 5 నిమిషాల్లో 3 కేజీల సమోసా తినేశాడు.. | Delhi Blogger Eats 3 Kg Samosa In 5 Minutes Wins Rs 11000 Viral | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ఛాలెంజ్‌: 5 నిమిషాల్లో 3 కేజీల సమోసా లాగించేశాడు!

Published Sun, Sep 4 2022 8:33 PM | Last Updated on Sun, Sep 4 2022 9:14 PM

Delhi Blogger Eats 3 Kg Samosa In 5 Minutes Wins Rs 11000 Viral - Sakshi

ఆహార పోటీల గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు సైతం ఇస్తుంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నారు.

న్యూఢిల్లీ: ఆహార పోటీల గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు సైతం ఇస్తుంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నారు. అలాంటి.. సంఘటనే తాజాగా వైరల్‌గా మారింది. రాజ్‌నీశ్‌ జ్ఞాని అనే వ్యక్తి  ‘ఆర్‌ యూ హంగ్రీ​’ అనే పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ, యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. ఇచ్చిన ఛాలేంజ్‌ను పూర్తి చేసి నగదు గెలుచుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని వైరల్‌గా మారాడు. ఆ ఛాలేంజ్‌ పూర్తి చేయటం ద్వారా బులెట్‌ బైక్‌ గెలుచుకున్నాడు. అయితే, ఆ బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో 12 మిలియన్ల మంది చూశారు. 

ఇప్పుడు మరోమారు ఈ బ్లాగర్‌ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్‌ ఫుడ్‌ ఛాలేంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్‌ చేయగా 1 మిలియన్‌కుపైగా వ్యూస్‌ వచ్చాయి.  వీడియోలో.. ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్‌ ఓనర్‌ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు 1-2 రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడు. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు బ్లాగర్‌. అందుకు గానూ రెస్టారెంట్‌ ఓనర్‌ వద్ద రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు.

ఇదీ చదవండి: Bahubali Samosa Challenge: తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement