
గ్రేటర్ నోయిడా: పబ్జీలో పరిచయమైన వ్యక్తిని కలుసుకోవాలన్న ఆలోచనలో ముందు వెనుక చూడకుండా నలుగురు పిల్లలతో సహా ఇండియాలో ల్యాండ్ అయిపొయింది పాకిస్తాన్ వీర ప్రేమికురాలు సీమా గులామ్ హైదర్. అన్ని అడ్డంకులను జయించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధం చేసే పనిలో పడింది.
ఇదే క్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ తనకు భారత పౌరసత్వం ఇప్పించమని కోరిన విషయం తెలిసిందే. మరోపక్క ఆమెకు తీవ్రవాద ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు యూపీ యాంటీ టెర్రరిస్టు పోలీసులు.
ఇదిలా ఉండగా గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనా ఇంటిలో కొత్త కాపురాన్ని మొదలు పెట్టిన సీమా హైదర్ పై చుట్టుపక్కల వారు చిరుబుర్రుమంటున్నారు. ఓ మీడియా సంస్థ వీరిద్దరినీ పలకరించేందుకు వెళ్లి అక్కడ గుమికూడిన స్థానికులను కూడా కొన్ని ప్రశ్నలు అడగ్గా... అందులోని ఒకామె.. పాకిస్తాన్ మహిళను వెంటనే ఆమె దేశం పంపించాలి.. లేదంటే ఇటువంటి వారి వలన ఇక్కడివారి మనసుల్లో కొత్త ఆలోచనలు పుడతాయి. పాకిస్తాన్ నుంచి కోడళ్లను తెచ్చుకోవాలన్న కోరిక పుట్టినా పుడుతుందని అంది. అసలు నీకు వాడేలా నచ్చాడు తల్లీ.. వాడొక బద్ధకస్తుడు.. చూడటానికి కూడా చాలా సన్నగా పుల్లల ఉంటాడని ఎద్దేవా చేసింది. ఆ మహిళ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది.
Seema haider ke Indian padosi 🤣 pic.twitter.com/0mFyZm54aW
— SwatKat💃 (@swatic12) July 19, 2023
ఇది కూడా చదవండి: మణిపూర్‌లో బయటపడుతున్న దారుణాలు.. రోజుకొకటి..