
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
జైపూర్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఇంజినీరింగ్ కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కేంద్రంగా పేరొందిన కోటాలో గత ఏడాది 29 ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకోవడం గురించి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇదే తొలి విద్యార్థి ఆత్మహత్య.
యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్(18) అనే విద్యార్థి కోట హాస్టల్‌లో ఉంటూ జేఈఈ మెయిన్స్ కోచింగ్‌లో చేరాడు. మంగళవారం అర్ధరాత్రి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా ప్రదేశంలో సూసైడ్ నోట్ లాంటివి కనిపించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాత్రి 11:00 ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్‌ల అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు మానసికంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఆత్మహత్యలు తగ్గడం లేదు.
ఇదీ చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్