sucide
-
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
పోచారం/నిజాంపేట/ బీబీనగర్/ భానుపురి (సూర్యాపేట): వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘట నలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. అన్నోజిగూడ నారాయణ కళాశాలలో...బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు. అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్‌ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా..తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనుష్కు ఫిట్స్ వచ్చాయని కళాశాల నిర్వాహకులు చెబుతుండగా..అధ్యాపకుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఎన్ఎస్ఆర్ కళాశాలలో...నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నతడం గ్రామానికి చెందిన ప్రజ్ఞారెడ్డి ప్రగతినగర్‌లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ ఐఐటీ గల్స్ క్యాంపస్‌లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రజ్ఞారెడ్డి తాను ఉంటున్న హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని దాచి పెట్టిన కళాశాల యాజమాన్యం హుటా హుటిన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ ఐఐటీ క్యాంపస్‌కు ఇంటర్ బోర్డు అనుమతి లేదని సమాచారం. ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో....సూర్యాపేట జిల్లా కోదాడ స్నేహ నర్సింగ్ కళాశాలలో అసోం రాష్ట్రానికి చెందిన నర్గిస్ పర్వీన్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బుధవారం రాత్రి కాలేజీ హాస్టల్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను సూర్యాపేట ఆస్పత్రిలో చేర్పించగా..కోలుకుంది. మళ్లీ ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేయడంతో సోమవారం గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులతో కలిసి ఆమె సూర్యాపేటలోని కలెక్టరేట్‌కు వచ్చింది. వారంతా కలిసి కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బాధిత విద్యార్థిని తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ తాగి మళ్లీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్గిస్ పర్వీన్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పరామర్శించారు. -
'సూసైడ్ పాడ్': జస్ట్ బటన్ నొక్కితే చాలు..!
కొందరూ నయం కానీ జబ్బులతో నరకయాతన అనుభవిస్తారు. వారికి సేవలు చేసే కుటుంబసభ్యులు సైతం వారి బాధను చూడలేక దేవుడు తీసుకుపోయినా బావుండేది అనేలా ఉంటుంది పరిస్థితి. అలా అని ఆత్మహత్య చేసుకుంటే నేరం కాబట్టి చట్టబద్దంగా చనిపోయేలా అనాయస మరణంకై కోర్టుని ఆశ్రయిస్తుంటారు. సమగ్ర స్థాయిలో విచారణ జరిపి తీర్పు ప్రకారం బాధితుడి సునాయస మరణానికి మార్గం సుగమం అవుతుందని తెలిసిందే. అలాంటి ఇబ్బందులు పడకుండా కనీసం వైద్య పర్యవేక్షణ కూడా లేకుండా చనిపోయేలా సార్కో అనే కొత్త 3డి-ప్రింటెడ్ 'సూసైడ్ పాడ్'ని తీసుకొచ్చింది ఓ స్విస్ కంపెనీ. ఇప్పుడూ ఈ పాడ్ కాస్త వివాదాస్పదమై హాట్‌టాపిక్‌గా మారింది.లాస్ట్ రిసార్ట్ ఆర్గనైజేషనికి సంబంధించిన సహాయక సూసైడ్ గ్రూప్ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే స్విట్జర్లాండ్ సంస్థ ఈ సూసైడ్ పాడ్‌ని రూపొందించింది. దీన్ని సార్కోఫాగస్ లేదా సార్కోపాడ్ అని పిలుస్తారు. ఇందులో త్రీడి ప్రింటెడ్ అనే చిన్న ఛాంబర్లాంటి గది ఉంటుంది. దీన్ని నైట్రోజన్ వాయువుతో నింపేస్తారు. ఈ పాడ్‌లోకి వెళ్లిన వ్యక్తి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే చాలు..క్రమంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి క్షణాల్లో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోతాడు. చెప్పాలంటే పది నిమిషా వ్యవధిలో మనిషి చనిపోతాడు. అయితే ఇప్పుడూ ఈ పాడ్ వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే గుర్తు తెలియని ఓ అమెరికన్ మహిళ సోమవారం స్విట్జర్లాండ్‌లో ఈ పోర్టబుల్, 3డి – ప్రింటెడ్ సూసైడ్ పాడ్‌ని ఉపయోగించి ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన స్విస్ – జర్మన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మెరిచౌసెన్ ప్రాంతంలోని అటవీప్రాంతంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అంతేగాదు ఆమె ఆత్మహత్యకు సహకరించిన వారందర్నీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే లాస్ట్ రిసార్ట్ సహ-అధ్యక్షుడు ఫ్లోరియన్ విల్లెట్ ఈ ఘటనకు ప్రతక్ష సాక్షి. అతడు ఆ మహిళ మరణాన్ని వేగవంతంగా జరిగిన అత్యంత శాంతియుతమైన మరణంగా పేర్కొనడం గమనార్హం. అలాగే సదరుబాధిత మహిళ తీవ్ర రోగ నిరోధక వ్యవస్థతో బాధపుడుతున్నట్లు సమాచారం. కానీ స్విట్జర్లాండ్‌లో సహాయక మరణం దశాబ్దలుగా చట్టబద్ధమే. అయితే దీన్ని వైద్యుని సహాయంతో చేయకూడదు. అందువల్లే ఇక్కడ ఇలా వైద్య పర్యవేక్షణ లేకుండా జస్ట్ బటన్ నొక్కి ఆపరేట్ చేసే ఈ పాడ్‌పై పలు సంశయాలు వ్యక్తమయ్యాయి. నెదర్లాండ్స్‌లో వైద్య సహాయంతో కూడిన అనాయస మరణం చట్టబద్ధమైతే.. స్విస్ చట్టం మాత్రం ఇలాంటి అనాయసాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. అలాగే స్విస్ ఆరోగ్య మంత్రి ఎలిసబెత్ బామ్-ష్నైడర్ ఈ సార్కోపాడ్ ఆమోదానికి సంబంధించి పలు అనుమానాలు లేవెనెత్తారు. ఇలాంటి పాడ్లను వినియోగానికి అనుమతించకూడదని, రసాయనాల చట్టం ప్రకారం నైట్రోజన్ వాడకం సరైనది కాదనేది స్విస్ ఆరోగ్య మంత్రి వాదన. ఏదీఏమైనా ఇలాంటి వాటి వల్ల బాధలేని అనాయాస మరణం వస్తుందన్నది ఎంత సరైనదో దీని వల్ల దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం లేదనేది కఠిన సత్యం కదూ..!(చదవండి: పని ఒత్తిడి పనిపడదాం..! హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చేద్దాం ఇలా..!) -
టీడీపీ నేత కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ నేత గోరంట్ల రవికుమార్‌కు చెందిన శ్రీహర్షిణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్డిముక్కల భావన(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డిముక్కల చిన బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన 4వ తేదీన ఇంటికి వెళ్లింది. తిరిగి 16 మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ కళాశాల టెర్రస్‌పై ఉన్న షెడ్డు కప్పునకు ఉన్న ఫ్యాన్‌కు తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరికి వేలాడుతున్న భావనను మంగళవారం ఉదయం విద్యార్థినులు చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి భావనను కిందకు దింపడంతో అప్పటికే బాలిక మృతి చెందింది. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యమే వేధించి తన బిడ్డను పొట్టనపెట్టుకుందని ఆమె కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భావన తండ్రి పదేళ్ల కిందట చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలనూ పోషిస్తోంది. కాగా, కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసి కూడా గోరంట్ల రవికుమార్ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్ఆర్ సురే‹Ù, కేర్ టేకర్ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్‌కు బదులుగా డీన్ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణ లోపాలపై ప్రశి్నంచారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
ప్రేమోన్మాది ఆత్మహత్య
రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్‌గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్ఐ ముకుందరావును బుధవారం వీఆర్‌పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దర్శన్ మేనేజర్ సూసైడ్
బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్‌లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. -
క్యాన్సర్‌తో భార్య మృతి.. నిమిషాల్లో ఐపీఎస్ భర్త సూసైడ్
గువహతి: భార్య క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఈ బాధను దిగమింగుకోలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన మంగళవారం(జూన్18) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ శైలాదిత్య చెటియా(2009బ్యాచ్ ఐపీఎస్ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య క్యాన్సర్‌తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు. -
అయ్యో వైష్ణవి
దుండిగల్: మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. రెండేళ్ల క్రితం తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదకొండేళ్ల వయస్సులోనే ఈ రెండు ఘటనలు ఆ బాలికను కలచివేశాయి. అయినాసరే తట్టుకుని చదువుతోంది.. కానీ ఇప్పుడు అర్ధంతరంగా ఏమైందో ఏమో అనుమానాస్పద స్థితిలో అనాథాశ్రమంలో బలవన్మరణానికి పాల్పడింది. సూరారం ప్రాంతానికి చెందిన దివంగత నీలం సతీశ్ కుమార్తె వైష్ణవి(11) దుండిగల్‌లోని స్పూర్తి ఫౌండేషన్‌లో ఆరవ తరగతి చదువుతూ అక్కడే ఉంటోంది. వదిన పెళ్లి ఉండటంతో ఈ నెల 3న ఇంటికి వెళ్లిన వైష్ణవి అక్కడ బంధువులతో సంతోషంగా గడిపింది. 8న తిరిగి ఫౌండేషన్‌కు వచ్చింది. ఉదయం తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా ఆటలు ఆడింది. అదే రోజు మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైష్ణవి ఉరి వేసుకున్న గదిలోనే గతేడాది మరో బాలిక ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడటంపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉందని, 8వ తేదీ మధ్యాహ్నం వరకు స్నేహితులతో ఆటలు ఆడిందని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ట్రోలింగ్.. ‘సోషల్’ కిల్లింగ్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఒక్కో సందర్భంలో..ఒక్కో తరహా వేధింపులు తప్పడం లేదు. ఇందులో మహిళలే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు. తాజాగా గీతాంజలి ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్చువల్లైఫ్ వేరు.. నిజజీవితం వేరు అని గుర్తించాలి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని, గుర్తింపు పొందాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తున్నారు. అయితే, ఇలాంటి వీడియోలతో ప్రచారం ఎంత పొందుతారో, కొన్నిసార్లు ట్రోలింగ్‌కు గురవడం సహజమే అని గుర్తించాలి. పొగడ్తలకు పొంగిపోవడం కాదు..విమర్శలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటికీ విరుగుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే అని వారు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగాను, కొన్నిసార్లు పార్టీలపరంగా టార్గెట్ చేసి ఇలాంటి తప్పుడు విమర్శలు, కామెంట్లు చేస్తున్నారన్నది మరవొద్దని వారు సూచిస్తున్నారు. ఫేక్ కంటెంట్ రాసినంత మాత్రాన మన చుట్టూ ఉండేవారి దగ్గర మనం తక్కువకాము అన్నది గుర్తించాలంటున్నారు. కొన్ని రకాల ‘సోషల్’ వేధింపులు ఇలా.... సైబర్ బుల్లీయింగ్: ఈ తరహా సోషల్ మీడియా వేధింపులు యువతలో ఎక్కువగా ఉంటున్నాయి. అమ్మాయిలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైబర్ బుల్లీయింగ్ తరహా వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ట్రోలింగ్: రాజకీయాల్లో ఉండేవారికి ఇవి తప్పడం లేదు. ప్రధానమంత్రి మొదలు అన్ని స్థాయిల్లోని రాజకీయనేతలు వీటి బారిన పడుతున్నారు. సినీతారలు, ప్రముఖ క్రీడాకారులు, ఇతర సెలబ్రెటీలకు సైతం ఇవి తలనొప్పిగా మారాయి. స్వాటింగ్: తప్పుడు మెసేజ్‌ల ద్వారా దర్యాప్తు సంస్థల పేరు చెప్పి బెదిరింపులకు గురి చేయడం. ఇది ఎక్కువగా యూఎస్, యూకేలో ఉంది. ఇది కూడా ఒక తరహా సైబర్ వేధింపులే. మన దగ్గర ఈ తరహా సైబర్ వేధింపులు ఎక్కువగా లోన్‌యాప్స్ మోసాల్లో చూస్తున్నాం. మేం చెప్పినంత డబ్బు చెల్లించకపోతే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాం..మా ఏజెంట్ మీ ఇంటికి వచ్చి పరువు తీస్తాడు..అంటూ బెదిరింపులకు దిగి ఆత్మహత్యలు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. రివేంజ్ పోర్న్: స్నేహితులుగా లేదా ప్రేమికులుగా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను వారి రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత బెదిరింపుల కోసం వాడడమే రివేంజ్ పోర్న్. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడతామని అమ్మాయిలను వేధించడం, మానసికంగా కుంగదీయడం దీని కిందకే వస్తుంది. ఈ జాగ్రత్తలు మరవొద్దు ♦ సోషల్ మీడియాలో అవసరానికి మించి మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోవడమే బెటర్. ♦ ఏ తరహా సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్నామన్నది ముందుగా గుర్తించాలి. వాటికి సంబంధించి స్క్రీన్షాట్లు తీసి పెట్టుకోవాలి. ఇవి భవిష్యత్‌లో ఆధారంగా పనికొస్తాయి. ♦వేధింపులు ఉన్నట్టు గమనిస్తే, సోషల్ మీడియా ఖాతాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. వర్చువల్ ప్రపంచంలో ఎక్కడో కూర్చున్న అజ్ఞాత వ్యక్తులు చేసే కామెంట్లు పట్టించుకోవొద్దు. ♦ఎవరైనా మన సోషల్ మీడియా ఖాతాల్లోని గ్రూపులలో అభ్యంతరకర మెసేజ్‌లు పెడితే, వాటిని వెంటనే డిలీట్ చేయాలి. వాటిని ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లో రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. వాటిని వినియోగించుకోవాలి. ♦వేధింపులు మితిమీరితే 1930 నంబర్‌కు డయల్ చేసి సైబర్ క్రైం సెల్లో ఫిర్యాదు చేయాలి. ఠీఠీఠీ. ఛిyb్ఛటఛిటజీఝ్ఛ. జౌఠి. జీn పోర్టల్ ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేయడం ఉత్తమం సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఓ భాగమైంది. విమర్శలు, వ్యక్తిగత దూషణలు వచ్చినప్పుడు మానసిక స్థైర్యం కోల్పోవద్దు. వెంటనే పోలీసులను సంప్రదించాలి. – డా.ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, న్యూఢిల్లీ -
ప్రేమవేధింపులకు విద్యార్థిని బలి
యాచారం: ప్రేమపేరుతో పెడుతున్న వేధింపులను భరించలేక ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నరేశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన గుత్తి జంగయ్య, పద్మ దంపతుల కూతురు నవ్య(14) కందుకూరు మండలం మీర్ఖాన్పేట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన తోటి విద్యార్థి కొమ్మగోని నందీశ్వర్ తనను ప్రేమించాలని నవ్యను కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆరునెలల క్రితమే బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పడంతో నందీశ్వర్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ వెంటపడటం ప్రారంభించాడు. బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన క్లాస్మేట్ రాజేశ్‌తోపాటు మరోతోటి విద్యార్థిని సహకారంతో ఇన్‌స్ట్రాగామ్(బాలిక కుటుంబసభ్యుల ఫోను)లో నవ్యను వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ముగ్గురు విద్యార్థులను పిలిచి విచారిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇదే ప్రథమం
జైపూర్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఇంజినీరింగ్ కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కేంద్రంగా పేరొందిన కోటాలో గత ఏడాది 29 ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకోవడం గురించి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇదే తొలి విద్యార్థి ఆత్మహత్య. యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్(18) అనే విద్యార్థి కోట హాస్టల్లో ఉంటూ జేఈఈ మెయిన్స్ కోచింగ్‌లో చేరాడు. మంగళవారం అర్ధరాత్రి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా ప్రదేశంలో సూసైడ్ నోట్ లాంటివి కనిపించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాత్రి 11:00 ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్ల అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు మానసికంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఆత్మహత్యలు తగ్గడం లేదు. ఇదీ చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్ -
యువకుడి సెల్ఫ్ ‘రిప్’ పోస్టు..వెంటనే సూసైడ్
కొచ్చి: ఓ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు బతికుండగానే తనకు తానే శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. అనంతరం కొద్దిసేపట్టికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన కేరళలోని ఆలువాలో చోటు చేసుకుంది. ‘అజ్మల్ షరీఫ్(28) అనే యువకుడు తన ఫొటోకు రిప్(రెస్ట్ ఇన్ పీస్)అని క్యాప్షన్ పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తర్వాత కాసేపటికి ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజ్మల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 14 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. సరైన ఉద్యోగం రాలేదన్న కారణంగా అజ్మల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశాం’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి -
వైద్యుడి ఆత్మహత్యపై టీడీపీ రాజకీయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైఎస్సార్సీపీకి, ప్రభుత్వానికి ముడిపెట్టి రాజకీయం చేయడం విపక్షాలకు అలవాటుగా మారిపోయింది. జరిగిన ఘటన ఏది, దాని వెనుక కారణాలేమిటి అన్న విచక్షణ కూడా లేకుండా విపక్ష నేతలు వ్యవహరిస్తున్నారు. కాకినాడలో ఓ యువ వైద్యుడి ఆత్మహత్యనూ వివాదాస్పదం చేసి, రాజకీయం చేసేందుకు విపక్షాలు విఫలయత్నం చేశారు. ఆయన ఆత్మహత్యకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు కల్యాణ్ కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. టీడీపీ నేతలు కూడా రంగంలోకి దిగిపోయి అసత్య ఆరోపణలు చేశారు. అయితే, వైద్యుడి ఆత్మహత్యకు ఆర్థిక కారణాలే కారణమని ఆయన తల్లి చెప్పడంతో విపక్షాల వ్యూహం బెడిసికొట్టింది. జరిగిందిదీ.. కాకినాడ అశోక్ నగర్‌కు చెందిన డాక్టర్ నున్న శ్రీకిరణ్ రష్యాలో వైద్య విద్య చదివాడు. కాకినాడలో ఉంటున్నాడు. శనివారం రాత్రి ఆయన తన ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వైఎస్సార్సీపీకి చెందిన కురసాల కన్నబాబు, కల్యాణ్‌తో భూవివాదం కారణంగానే వైద్యుడు శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ వెంటనే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూ దందాలు, హత్యలు పెరిగిపోయాయంటూ వెనుకాముందూ చూసుకోకుండా ట్వీట్ కూడా చేశారు. కుమారుడి ఆత్మహత్యతో విషాదంలో ఉన్న అతడి తల్లి శేషారత్నాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ, జనసేన నాయకులు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి కొద్దిసేపు హంగామా చేశారు. ఈ ఉదంతాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించారు. రాజకీయానికి వాడుకోవద్దు: తల్లి శేషారత్నం అయితే అసలు వాస్తవాన్ని మృతుడి తల్లి శేషారత్నం ఆదివారం మీడియాకు వెల్లడించారు. ‘మా బాబు నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. అక్కడ పోలీసులు స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఎవ్వరికీ ఏదీ సంబంధం లేదనే విషయాన్ని చెప్పాను. కన్నబాబుకు, కల్యాణ్‌కు నా కుమారుడి ఆత్మహత్యలో ప్రమేయం లేదు. బాబు చనిపోవడంతో పొలం మేటర్‌లో ఏదో గొడవ ఉండి ఉంటుందని వాళ్లు వీళ్లు అనడంతో డిప్రెషన్లో మాట్లాడాను. పొలం విషయంలో డిప్రెస్ అయ్యి, ఆర్థిక కారణాలతో సెన్సిటివ్‌గా ఉన్నాడు. అందువల్లే పురుగు మందు తాగాడు. మధ్యలో కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. దయచేసి ఈ సంఘటనను రాజకీయానికి వాడుకోవద్దు’ అని శేషారత్నం వేడుకొన్నారు. -
తుపాకీ ‘గురి’ తప్పుతోంది!
ఒకవైపు ఉద్యోగంలో ఒత్తిళ్లు... మరోవైపు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు. ఇవన్నీ ఖాకీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయుధ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారిపోయి విచక్షణ కోల్పోతున్నారు. విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఆ మానసిక స్థితిలో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు. లేదంటే తమను తాము కాల్చుకుని ఎంతో విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని విషాదాంతం చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు ఇలా ఎందుకు చేస్తున్నారు? సాక్షి, హైదరాబాద్ :ఇటీవల జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విష యం తెలిసిందే. తన మతిలేని చర్యతో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ టికారామ్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు బలయ్యారు. వీరిలో హైదరాబాద్ బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఉన్నారు. సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్‌శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. 13 ఏళ్లలో 1,532 మంది.. ♦ గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2023)లోనూ జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 71 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వీటిని నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో నమోదైన పోలీసు ఆత్మహత్యలు కొన్ని... ♦ జనగాం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ గత ఏప్రిల్ 6న తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు ఉదయం శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తట్టుకోలేకే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ♦ 2016లో ఆదిలాబాద్ జిల్లా కెరిమెరిలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2019లో హెడ్ కానిస్టేబుల్ డి.ప్రకాశ్ రెడ్డి తన పైఅధికారి సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవనర్మణం పొందారు. ♦ 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీఆర్పీఎఫ్ కానిస్టే బుల్ రూపేషానంద్ కుటుంబ సమ స్యల ఒత్తిడికి లోనై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2020 నవంబర్‌లో సికింద్రాబాద్‌లో ఓ బ్యాంక్ వద్ద గార్డ్ డ్యూటీలో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మధు తుపాకీతో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ♦ 2017 జూన్‌లో సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రెడ్డి తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికారుల వేధింపులే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముంది? ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తోటి సిబ్బందిపై కాల్పులు జరపడానికి కార ణాలు విశ్లేíÙంచేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్‌్కఫోర్స్ కమిటీ గత జనవరిలో ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. అందులో పేర్కొన్న ప్రధా న అంశాలు సర్వీ స్–వ ర్కింగ్ కండిషన్స్, వ్యక్తిగత, కుటుంబ కారణాలు సాయుధ పోలీసుల ఆత్మహత్యలకు, తోటి సిబ్బంది, ఇతరులపై కాల్పులు జరపడానికి కారణమవు తున్నాయని తెలిపింది. శిక్షణ నుంచే అలవాటు చేయాలి.. పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఇప్పటితో పోలిస్తే గతంలోనే విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అప్పట్లో ఒకవైపు శాంతిభద్రతల సమస్యలు.. మరోవైపు నక్సల్ సమస్యలు ఉండేవి. ఇలా అనేక రకాల మేం ఉద్యోగానికి వచ్చిన తొలిరోజుల్లో పనిచేశాం. కానీ కాలంతోపాటు ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు కూడా పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. అయితే ఆ పని ఒత్తిడి ఇటీవలే పెరిగింది కాదు. అయితే, పరిస్థితులను తట్టుకునేంతగా ఇప్పటి సిబ్బంది మానసికంగా ధృడంగా ఉండట్లేదన్నది నా అభిప్రాయం. శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచేలా ప్రత్యేక శిక్షణ అవసరం. మానసిక ఒత్తిడిని తట్టుకునేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలన్నది ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే అలవడేలా యువ అధికారులు, సిబ్బందిని తీర్చి దిద్దాలి. అప్పుడే ఆత్మహత్యలు జరగకుండా నివారించగల్గుతాం అని నా అభిప్రాయం. – నారాయణ, రిటైర్డ్ ఎస్పీ కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముందంటే... ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు... పనిగంటలు పెరగడం, సరైన విశ్రాంతి లేకపోవడం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే విధుల్లో సంతృప్తి లేకపోవడం, అన్నింటికి మించి సాంఘికంగా తమను దూరం పెడుతున్నారన్న భావన పెరగడం, కుటుంబ మద్దతు లేకపోవడం, సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సరైన యంత్రాంగం లేకవపోవడం. పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ సైతం అవసరం ♦ తీరిక లేని ఉద్యోగంతో పని ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ విధుల్లోనూ అనేక రకాల పరిస్థితులను వారు చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. నేను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న వారికి కొన్ని తరగతులు తీసుకున్నాను. శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాలను వారు ఉద్యోగంలోకి వచ్చాక ఆచరిస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉంటే వృత్తిగత జీవితంతోపాటు వ్యక్తిగతంగానూ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. – డా.ప్రజ్ఞ రష్మీ, సైకాలజిస్ట్ -
విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి!
ఇండస్ట్రీలో మరో విషాదం. ఓవైపు గుండెపోటు, మరోవైపు అనారోగ్య సమస్యలతో పలువురు సీనియర్ యాక్టర్స్ చనిపోతున్నారు. అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులు బాధపడ్డారు. సరే వీటి గురించి మెల్లమెల్లగా మర్చిపోతున్నాం అనుకునేలోపు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అనుమానాస్పద రీతిలో చనిపోవడం సంచలనంగా మారింది. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) గత కొన్ని దశాబ్దాల నుంచి బాలీవుడ్లో ఆర్ట్ డైరెక్టర్‌గా నితిన్ చంద్రకాంత్ దేశాయ్(58) గుర్తింపు తెచ్చుకున్నారు. సలాం బాంబే, 1942 ఏ లవ్ స్టోరీ, కామసూత్ర, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, స్వేడ్స్, స్లమ్ డాగ్ మిలియనీర్, జోధా అక్బర్.. ఇలా ఎన్నో సినిమాల్లోని సెట్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గానే కాకుండా మరాఠీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన, కొన్నిచిత్రాల్లో అతిథిగా మెరిసిన ఈయన.. ముంబయి ఊరిచివర్లో ఎన్డీ స్టూడియోస్‌ని సొంతంగా పెట్టుకున్నారు. ఇప్పుడు అందులోనే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనుకు తానుగా చనిపోయారా లేదా వేరే ఏమైనా కోణం ఉందా అనే విషయాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏదేమైనా మంచి ఆర్ట్ డైరెక్టర్ ఇలా తనువు చాలించడంతో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!) -
అశోక్ సాగర్‌లో విషాద ఘటన.. సూసైడ్ స్పాట్‌గా మారిన పర్యాటక ప్రాంతం
ఖలీల్‌వాడి /ఎడపల్లి : ఆహ్లాదకరమైన వాతావరణం అందించే అశోక్ సాగర్ ఇప్పుడు సూసైడ్ స్పా ట్‌గా మారింది. శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా అందులో మూడేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో అశోక్ సాగర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నాలుగు నెలల్లో సుమారు పది ఘటనల వరకు ఇక్కడ జరిగాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ పరిధిలో ఉన్న ఈ చెరువు వందేళ్ల క్రితం ఏర్పడింది. దీనిని పెద్ద చెరువుగా పిలిచేవారు. నిజామాబాద్, బోధన్ రహదారిపై చెరువు ఉండటంతో ప్రయాణికులకు ఆహ్లాదం అందించడానికి 2001లో అప్పటి జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ పర్యాటకంగా అభివృద్ధి చేశారు. రాక్ గార్డెన్తో పాటు చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జానకం పేట చెరువు అశోక్ సాగర్‌గా పిలువబడు తోంది. ఇది నగరానికి 12 కిలోమీటర్లు దూరంలో ఉంది. బీజీలైఫ్ గడిపే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ చెరువు నుంచి 5 కిలోమీటర్ల దూ రంలో అలీసాగర్ ఉద్యానవనం ఉంది. ఈ రోడ్డు బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారి కావడంతో పర్యాటకులకు పిక్నిక్ స్పాట్‌గా మారింది. అయితే గత కొంత కాలంగా అశోక్‌సాగర్ వద్ద ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలు, భర్త మద్యానికి బానిసై వేధింపులకు గురిచేయడంతో మహిళలు పిల్లలతో సహా ఆత్మహత్య చే సుకున్న ఘటనలు ఇక్కడ గతంలో చోటుచేసుకున్నాయి. నిరుద్యోగ యువకులు, వ్యాపారంలో న ష్టం వచ్చి ఆర్థిక ఇబ్బందుతో బాధపడుతున్న వారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. పోలీసుల భద్రత పెంచాలి అశోక్ సాగర్‌లో పోలీసుల భద్రతతో పాటు బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉంది. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే వా రిని కాపాడి కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరకట్న వేధింపులతోనే.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు అక్షయ, నిఖిత తమ ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందులో అక్షయ కుమారుడు చిన్నా అలియాస్ భువనేశ్వర్ (3) నీటిలో గల్లంతు అయ్యా డు. అక్షయతో పాటు నిఖిత ఆమె పిల్లలు భవశ్రీ, శ్రీమాన్లను రోడ్డున వెళ్లే వారు కాపాడారు. అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. కొంతకాలంగా హేమంత్, మహేష్ ఇద్దరూ కట్నంగా ఇచ్చిన ఇంటిస్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని తమ భార్య లను వేధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన అక్కా చెల్లెళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో రోడ్డు వెంట బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకు లు దీనిని గమనించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ నెహ్రూనగర్‌కు చెందిన షేక్ హైదర్ చెరువులోకి దిగి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్లను రక్షించాడు. మిగతా ఇద్దరు గౌస్, షారూక్ ఖాన్ ఒడ్డున ఉండి బాధితులను బయటకు తీశారు. -
‘నన్ను క్షమించండి’.. వాట్సప్‌లో స్టేటస్ పెట్టి పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య!
చెన్నై: ఏం జరిగిందో ఏమో గానీ పీహెచ్డీ పట్టా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలన్న తపన పడ్డ ఓ విద్యార్థి అర్థాంతరంగా జీవితాన్ని ముగించాడు. కొడుకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం ఇంటికి వస్తాడనే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థి శుక్రవారం వేలచేరిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయు ముందు తన వాట్సాప్‌లో ఈ విధంగా స్టేటస్ పెట్టుకున్నాడు... ‘‘ఇది సరిపోదు.. నన్ను క్షమించండి’ అని రాశాడు. విద్యార్థి 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జైన్, ఐఐటీ మద్రాస్‌లోని గిండీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎప్పటిలానే తన రెగ్యులర్ క్లాస్‌లకు హాజరయ్యాడు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో గానీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన నివాసానికి తిరిగి వెళ్లిపోయాడు. గంట సేపు నుంచి జైన్ ఎవరికి కనిపించకపోవడంతో అతని స్నేహితులు వెతకడం ప్రారంభించారు. క్యాంపస్ మొత్తం ఎంత సేపు వెతికిన ఆచూకి తెలియరాలేదు. దీంతో జైన్ స్నేహితులు చివరకి అతని ఇంటికి వెళ్లి చూడగా.. డైనింగ్ హాల్లో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే అతని స్నేహితులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఆసుపత్రిలోని సిబ్బంది అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. -
భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..
భార్యభర్తలిద్దరు ఒకరు తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. భర్త చనిపోయిన కొద్ది క్షణాల్లోనే ఆయన లేని జీవితం తనకూ వద్దంటూ మృతుడి భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అజయ్ పాల్(37), మౌనిక (32) ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. బుధవారం మౌనిక పాల్ భర్త నోటి నుంచి నురగతో స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో మౌనిక భర్తను హుటాహుటినీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె భర్త చనిపోయినట్లు ధృవీకరించారు. దీన్ని జీర్ణించుకోలేని మౌనిక వెంటనే ఇంటికి వచ్చి పాయిజన్ తీసుకుని అదే రోజు మధ్యాహ్నాం చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలుగొట్టి చూడగా.. మౌనిక విగతజీవిగా పడి ఉంది. దీంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో ఆమె భర్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని, ఇటీవలే అతను ఎయిర్ ఫోర్స్ జాబ్ నుంచి వైదొలగినట్లు వెల్లడించారు పోలీసులు. పైగా ఆ జంటకు రెండేళ్ల క్రితమే వివాహం అయ్యిందని తెలపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన బలమైన కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: మాఫియాపై ఉక్కుపాదం..ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్డోజర్లతో కూల్చివేత) -
అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్యం
-
విచిత్రమైన ప్రేమ కథ: చనిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!
ఎన్నో విచిత్రమైన ప్రేమ కథలు గురించి విన్నాం. కానీ ఇలాంటి ప్రేమ కథను ఇప్పటి వరకు విని ఉండం. అదీ కూడా బతికుండగా తమ ప్రేమను పండించుకుని పెళ్లి వరకు తీసుకురాలేకపోయారు. కానీ చనిపోయాక తమ కోరికను కుటుంబ సభ్యులతో నెరవేర్చుకోగలిగారు. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గుజరాత్‌లోని తాపిలో నివశించే గణేష్, రంజనాలు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అయితే వారి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించ లేదు. ఇక తమ కోరిక నెరవేరే అవకాశమే లేదని నిరాశతో ఆ ఇద్దరు ఆగస్టు 2022లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అనుహ్య ఘటనతో కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెందారు. ఎలాగో బతికుండగా వారిక కల నెరవేర్చలేకపోయాం అని చాలా బాధపడ్డారు. అందుకని వారి విగ్రహాలను తయారు చేయించి వాటికే పెళ్లి చేసి ఆ ప్రేమ జంట కోరికను నెరవేర్చారు. సరిగ్గా చనిపోయిన ఆరునెలలకు ఆ ప్రేమికుల విగ్రహాలకు ఘనంగా వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. ఈ మేరకు ఆ అమ్మాయి తాత మాట్లాడుతూ ఆ అబ్బాయి తమ దూరపు బంధువు కుంటుంబానికి చెందిన వాడని వద్దునుకున్నామని చెప్పారు. ఐతే వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానే ఇష్టపడ్డారని, అందుకే ఇరు కుటుంబాలు ఈ ఆలోచనకు వచ్చి ఇలా చేశామని చెప్పుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతోనే ఇలా వారి ప్రతిమలకు ఘనంగా పెళ్లి చేసినట్లు బంధువులు తెలిపారు. (చదవండి: స్టార్ సింగర్ రేంజ్లో పాడాడు..ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!) -
అనంతపురం జిల్లా: రాయదుర్గం పీఎస్ లో దొంగ ఆత్మహత్య
-
ప్రముఖ టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్య
-
కూతురిని చంపి ఆత్మహత్యగా నాటకం...పట్టించిన మొబైల్ ఫోన్
మహారాష్ట్ర: కూతురిని ఆత్మహత్య నాటకం పేరుతో నమ్మించి కన్నతండ్రే హతమార్చాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లోని కలమ్మా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...కూతురుని ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం ఆడదామని చెప్పి తమ బంధువుల పేర్లతో సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు స్టూల్ మీద నుంచోమని చెప్పి తాను ఫోటో తీస్తూ... స్టూల్ లాగేసి ఏమి తెలియనట్లు బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తే పోలీసులను పిలిపించి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఆమె గదిలోని సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసును దర్యాప్తు చేసే విషయమే తండ్రిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతని మొబైల్ ఫోన్‌ని పరిశీలించగా.. కూతురు ఉరివేసుకున్న ఫోటోను చూసి ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో గట్టిగా ప్రశ్నించగా...తాను చంపినట్లు ఒప్పుకున్నాడు. తన మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు అని ఆమె చనిపోయిన తర్వాత మరో వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. ఐతే ఆమె కూడా తనను వదిలి వెళ్లిపోవడంతో... ఆమెకు బుద్ది వచ్చేలా చేసేందుకు ఇలా కూతురి చేత ఆత్మహత్య నాటకం ఆడించానని చెప్పాడు. ఆమె ఉరివేసుకునే ముందు మొత్తం ఐదు సూసైడ్ నోట్లు రాయించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసు: మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా: నళిని శ్రీహరన్) -
షాకింగ్ ఘటన: ఏం కష్టం వచ్చిందో ఏమో! ఇద్దరు చిన్నారులతో సహ కుటుంబం మృతి
హర్యానా: ఏం జరిగిందో ఏమో హర్యానాలో ఒక కుంటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన హర్యానాలోని అంబాలాలో చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సంగత్ రామ్(65), అతని భార్య మహింద్రా కౌర్, సుఖ్వీందర్ సింగ్(34), అతని భార్య రీనా, వారి ఇద్దరు కూతుళ్లు ఆషు, జస్సీలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలేమిటో తెలుసుకునేందుకు క్రైం టీంని పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ మృతుల వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించిందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఈ నెల ప్రారంభంలో జమ్ములోని సిధ్రలో ఒక కుటుంబం చనిపోయిందని తెలిపారు. (చదవండి: నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....) -
అరుంధతి మూవీలో సీన్‌ను రీ కనస్ట్రక్ట్ చేసి మరీ... ఆత్మహత్యా యత్నం
తాగుడికి, మత్తుపదార్థాలకు అడిక్ట్ అవ్వడం గురించి విన్నాం. అలాగే సినిమాలకు అడిక్ట్ అయ్యే వాళ్లు గురించి కూడా తెలుసు. చాలావరకు హిరో లేదా హిరోయిన్ మాదిరిగా ప్రవర్తించడం వంటి పిచ్చి చేష్టలు చేస్తారని తెలుసు. కానీ ఆ సినిమాలో కథనాయిక ఎలా చనిపోయాడో అలా చనిపోవాలని మాత్రం అనుకోరు. ఐతే ఈ వ్యక్తి మాత్రం తన చూసిన సినిమాలో కథనాయకి ఎలా చనిపోయిందో అలానే చనిపోవాలని నిర్ణయించుకుని కన్నవాళ్లకు తీరని వేదన మిగల్చాడు.. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కర్ణాటకలోని ఓ గ్రామంలోని 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ అనే వ్యక్తి పదోతరగతి వరకు బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత అతనికి సినిమాలంటే మోజు ఎలా పెరిగిందో తెలియదు గానీ దానికి అడిక్ట్ అయిపోయాడు. ఎంతలా అంటే ఆ సినిమాలో వాళ్లు ఏం చేస్తే అలా చేసేయాలనేంతగా వ్యామోహం పెంచేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఇంటర్ కూడా చదవడం మానేశాడు. అతనికి అరుంధతి సినిమా అంటే మహా ఇష్టమట. ఏకంగా 15 సార్లు ఆ సినిమాని చూశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐతే ఆ సినిమాలో అనుష్క విలన్ పశుపతి నుంచి తన సంస్థానంలోని మనుషులను కాపాడుకోవడానికి ఎలా అయితే సాధువుల వద్దకు వెళ్లి ఎలా తనకు తానుగా చనిపోతుందో అలా తాను చనిపోవాలనుకున్నాడు. ఈ విషయం గురించి తన తల్లిదండ్రులతో పదే పదే చెప్పేవాడు కూడా. దీంతో వాళ్లు అతన్ని అది సినిమాని నిజంగా అలా చేయడం కుదరదని పలుమార్లు వారించారు కూడా. ఈ మేరకు సదరు వ్యక్తి తాను చెప్పినట్టుగానే సినిమా కథానియికిలా 20 లీటర్లు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటాడు. తాను చనిపోతున్న దాన్ని కూడా వీడియో తీసి మరీ వివరించాడు. అయితే స్థానికులు అతను మంటల్లో కాలిపోవడం చూసి రక్షించి ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తి 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ.. ఆస్పత్రిలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. (చదవండి: భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్‌లో భర్త.. చివరకు..) -
ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మణికొండ: ప్లైఓవర్‌పై నుంచి ఔటర్‌రింగ్ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా, మద్డూరు మండలం, చింతల్‌పేట్ గ్రామానికి చెందిన భీమప్ప(30) గత కొంత కాలంగా నార్సింగి మున్సిపల్ కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అతను స్థానిక ఫ్లై ఓవర్‌పై నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపైకి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రాణాలు తీసిన వేగం) -
బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం
Bengali Model Saraswati Das Suicide in Kolkata: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మోడల్, మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి దాస్(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్(21) మరణావార్త మరవక ముందు సరస్వతీ దాస్ మృతి చెందండం సంచలనంగా మారింది. కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున ఆమె శవమై కనిపించింది. కాస్బాలోని బేడియాదంగా వద్ద ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరు లేకోపవడంతో రాత్రి తన అమ్మమ్మతో కలిసి పడుకుంది సరస్వతీ దాస్. చదవండి: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య ఈ క్రమంలో తెల్లవారు జామున 2 గంటల పాత్రంలో సరస్వతి పక్కన లేకపోడంతో ఆమె అమ్మమ్మ ఇల్లంతా వేతికగా మరో గదిలో ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె అమ్మమ్మ ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించగా అప్పటికే సరస్వతీ దాస్ మారణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా కొంతకాలంగా తన తండ్రికి దూరంగా తల్లితో కలిసి వాళ్ల మేనమామ ఇంట్లో ఉంటోంది సరస్వతీ దాస్. మాధ్యామిక్ పరీక్షలో పాసయిన ఆమె చదువు విడిచిపెట్టి ట్యూషన్స్ చెబుతూ మోడల్‌గా రాణిస్తోంది. అయితే సరస్వతీ దాస్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల తెలిపారు. చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో అంతేకాదు ఆత్మహత్యకు ముందు అర్థరాత్రి 1గంట వరకు ఆమె ఫోన్ మాట్లాడినట్లుగా తన ఫోన్ రికార్డులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్న చోట ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సరస్వతీ దాస్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు జరపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌కు చందిన నటి, మోడల్‌లు ఇలా వరుసగా ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు బెంగాలి మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా సరస్వతీ దాస్ అదే తరహాలో మరణించడం గమనార్హం. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఈఎస్ఐ మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన యువతి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ విఫలమైందని ఓ యువతి ఈఎస్ఐ మెట్రోస్టేషన్ పైనుంచి కిందకు దూకింది. మెట్రోస్టేషన్ నుంచి దూకడంతో తీవ్రగాయాలైన ఆ యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలను కోల్పోయింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. చదవండి: కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ.. -
మళ్లీ రైతు కుటుంబంలో పుట్టను
ముంబై: దేశంలో రైతుల దుస్థితిని, దైన్యాన్ని కళ్లకు కట్టాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు. మరో జన్మంటూ ఉంటే రైతు కుటుంబంలో పుట్టబోనని, ఆవేదన వ్యక్తం చేస్తూ విషం తీసుకున్నాడు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రిలో కన్నుమూశాడు. షోలాపూర్ జిల్లా మగర్వాడీ గ్రామానికి చెందిన సూరజ్ జాధవ్(26)ది రైతు కుటుంబం. మూడు రోజుల క్రితం ఆయన ‘రైతులను గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతు కుటుంబంలో మళ్లీ పుట్టాలనుకోవడం లేదు’ అని అంటూ ఓ బాటిల్ మూత తీసి, అందులోని ద్రావకాన్ని తాగేశాడు. ఈ మేరకు ఆయన తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఆయన శుక్రవారం పండర్పూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాధవ్ ఆల్కహాల్ కూడా తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. అతడి బలవన్మరణానికి రుణ భారం తదితర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొలానికి విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం వల్లే అతడు చనిపోయి ఉంటాడంటూ వస్తున్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి కనెక్షన్లు కట్ చేయలేదని తెలిపారు. -
ఏడాది కిందట పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య!
కోలారు: తాలూకాలోని కల్వమంజలి గ్రామంలో ఉరివేసుకున్న స్థితిలో చైత్ర (25) అనే వివాహిత శవమైంది. ఆమె భర్త వెంకటేష్ నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో కార్మికుడు. అతడు డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో భార్య ఇంట్లో ఉరికి వేలాడుతోంది. వీరికి యేడాది క్రితమే పెళ్లయింది. కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని తెలిసింది. వారే హత్య చేశారని మృతురాలి అక్క శ్వేత ఆరోపిస్తోంది. ఘటన తరువాత భర్త, కుటుంబీకులు పరారయ్యారు. సిఐ శివరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మేమూ నీతో పాటే అంటూ .. చనిపోయిన భర్త, పిల్లలు
బెలగావి: సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. మనకు ఎంతో ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధను భరించడం కష్టం. కానీ కొంతమంది ఆ బాధను మర్చిపోలేక ఆవేదనతో తప్పుడు నిర్ణయం తీసుకుని జీవితాన్ని ముగించేస్తారు. అచ్చం అలాంటి సంఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. (చదవండి: అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) వివరాల్లోకెళ్లితే.... ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ తన భార్య మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై తన నలుగురి పిల్లలకు విషం ఇచ్చి, తాను చనిపోయాడు. ఈ ఘటన సంకేశ్వరంలోని బోర్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తి గోపాల్ హదీమణిగా పిల్లలు సౌమ్య, శ్వేత, సాక్షి, సృజన్‌లుగా గుర్తించారు. అయితే అతని భార్య జయ జూలై 6న కోవిడ్ కారణంగా బ్లాక్ ఫంగస్‌తో చనిపోవడంతో గోపాల్ ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యకం చేస్తున్నారు. అంతేకాదు గోపాల్ భార్య మరణంతో చాలా ఆవేదన చెందాడని, పైగా అప్పటి నుంచి పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాడంటూ బాధితుడి బంధువులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. ఈ మేరకు ఇరుగుపొరుగు వచ్చి తలుపులు కొట్టిన పలకక పోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలుకొట్టి చూస్తే గోపాల్, అతని పిల్లలు చనిపోయి ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) -
‘మెదక్ కారు డెత్’ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఆత్మహత్య
-
ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం
పరకాల: ఉద్యోగాల కోసం చేసిన మధ్య వర్తిత్వం భార్యాభర్తలను బలి తీసుకుంది. ఓవైపు బాధితుల ఒత్తిడి.. మరోవైపు డబ్బు తీసుకున్న వారి బెదిరింపులకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయారు. 4 రోజుల కింద కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీవీడియో తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో శుక్రవారం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌కు చెందిన తాళ్లపల్లి కేశవస్వామి(53) పెస్టిసైడ్స్ కంపెనీలో పనిచేసేవాడు. సినీపరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడంతో ఎనిమిదేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివసి స్తున్నాడు. వీరికి కుమారుడు నిఖిల్, కుమార్తె చందనప్రియ. నిఖిల్ మానసిక వికలాంగుడు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి పుల్లాబాయ్తో పాటు వాల్ నాయక్, గాడిపల్లి వెంకటేశ్‌లు కేశవస్వామికి పరిచయమయ్యారు. సబ్‌స్టేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరు ద్యోగులు ఉంటే తెలపాలని కేశవస్వామికి చెప్పడంతో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి సుమారు రూ.80 లక్షలు వసూలు చేసి వారి చేతుల్లో పెట్టాడు. డబ్బు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీంతో కేశవస్వామి పలు మార్లు పుల్లాబాయ్, వాల్‌నాయక్, వెంక టేశ్‌ను డబ్బులివ్వాలంటూ కోరినా తిరిగి బెదిరిం పులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులను నచ్చజెప్పలేక.. బెదిరింపులను తట్టుకోలేక కేశవస్వామి కుమిలిపోతున్నాడు. మకాం మార్చినా ఆగని వేధింపులు బాధితుల ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో సహా హన్మకొండకు మకాం మార్చాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చనిపోదామనుకుని హన్మకొండలో అద్దెకు ఉంటున్న గదిలో భార్య, పిల్లలతో కలసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని వరం గల్ పోలీస్ కమిషనర్‌కు, మిత్రులకు పం పాడు. గురువారం స్థానిక బంగారం దుకా ణంలో కొంత బంగారాన్ని తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో పురుగుల మందు కొని చర్చిలో ప్రార్థనలు చేశారు. భార్యాపిల్లలను అక్కడే ఉంచి కేశవస్వామి బయటకు వెళ్లాడు. అయితే సంధ్యారాణి (50) రాత్రి 10 గంటల సమయంలో బ్యాగులో ఉన్న పురుగుల మందు తాగడంతో స్థానికులు పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించి కేశవస్వామికి సమాచారం ఇచ్చారు. అతడు ఆస్పత్రి చేరుకునేలోపే ఆమె మృతి చెందడంతో కేశవస్వామి కూడా అక్కడే మిగిలిన మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కాగా, మరో సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేశవస్వామి , సంధ్యారాణి(ఫైల్) పాకాలలో చనిపోదామనుకున్నారా? 4 రోజుల కింద వీరంతా పాకాలకు వెళ్లినట్లు సమాచారం. బిర్యానీలో పురుగుల మందు కలుపుకొని తాగుదామనుకున్నా.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. కాగా, సంధ్యారాణి పురుగుల మందు తాగిన సమయంలో పిల్లలు అక్కడే ఉన్నారు. వారు మానసికంగా సరిగా లేకపోవడం, ఏది తాగాలో తెలియక ఉండిపోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. -
హైదరాబాద్ ఫతేనగర్ లో యువకుడి ఆత్మహత్య
-
గోదావరిలో దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు గల్లంతు
-
తేజస్వినిని వెంకటేశ్ హత్య చేశాడు: డీఎస్పీ
-
బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
-
హైదరాబాద్ : డిపో ముందు పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
-
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
కేరళలో మరో విస్మయ.. పెళ్లైన మూడు నెలలకే
కేరళలో కొద్ది రోజుల క్రితం విస్మయ అనే 23 ఏళ్ల మహిళ వరకట్న వేధింపులతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన మరువక ముందే మరో ఘటన రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. తన అత్తమామల వరకట్న వేదింపుల కారణంగా 19 ఏళ్ల యువతి వివాహం చేసుకున్న దాదాపు మూడు నెలల తర్వాత చనిపోయింది. ఆ యువతి తల్లితండ్రులు మాత్రం కట్నం కోసమే ఆమెను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. మృతిరాలి పేరు సుచిత్ర. సుచిత్రకు ఈ ఏడాది మార్చి 21న విష్ణుతో వివాహం జరిగింది. ఇప్పుడు వివాహం జరగకపోతే మరో 7 ఏళ్ల తర్వాతే పెళ్లి జరుగుతుందని ఆమె జాతకంలో ఉన్నట్లు తల్లి, తండ్రులు చెప్పారు. సుచిత్ర కుటుంబం కట్నం కింద 51 సెవిరీల బంగారం, బైక్ ను కట్నంగా ఇచ్చారు. అయితే, ఇవి ఏమి ఆమె అత్తమామలకు సరిపోలేదు. మహిళ మామ కారు, రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఆమె తండ్రి సునీల్ తన పెన్షన్ వచ్చాక డబ్బు ఇస్తానని ఆమె అత్తమామలకు వాగ్దానం చేశాడు. "అయితే వివాహం జరిగిన వెంటనే వరుడి కుటుంబం మళ్లీ డిమాండ్ చేయడం ప్రారంభించారు. విష్ణు సోదరికి అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పారు". బంగారు ఆభరణాలను లాకర్ లో ఉంచాలని ఆమె అత్తగారు వేధించారని ఆరోపించారు. ఆమె అత్తగారు కొన్ని ఆభరణాలను తనఖా పెట్టారని ఆమె తల్లి తెలిపింది. బంగారం పేరిట ఇంట్లో మరిన్ని సమస్యలు రావడంతో ఆమెకు బంగారం ఎందుకు ఇచ్చారని అడుగుతూ, ఏడుస్తూ ఒక రోజు నాకు కాల్ చేసినట్లు తల్లి చెప్పింది. సుచిత్ర భర్త విష్ణు భారతీయ సైనిక దళంలో పనిచేస్తాడు. వివాహం జరిగిన నెలన్నర తర్వాత ఉద్యోగంలో భాగంగా జార్ఖండ్ కు తిరిగి వెళ్లాడు. తన భార్యను తన తల్లితండ్రులతో విడిచి పెట్టి వెళ్లాడు. సుచిత్ర తల్లితండ్రులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తన ప్రాణాలను తీసుకోలేదని ఆరోపించారు. ఆమె తల్లి మీడియాతో మాట్లాడుతూ.. " అసలు ఆమెకు(సుచిత్ర) సరిగ్గా ముడి వేయడం కూడా రాదని, అలాంటి ఆమె ఇలా ఎలా చేయగలదు? అమ్మాయిలు మనుషుల కాదా? ప్రతి ఒక్కరూ అమ్మాయిలతో ఇలా ఎందుకు చేస్తున్నారు. నా కుమార్తె ముందు చాలా భవిష్యత్ ఉంది అని భాదపడింది. ఈ మృతిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్ హెచ్ ఓ) మిథున్ డీ. అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు, కేసు దర్యాప్తు అన్నీ విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. చదవండి: అయ్యో పాపం.. విస్మయ ఎలా చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు -
PUBG గేమ్ కి బానిసై బాలుడు ఆత్మహత్య
-
కర్నూల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
-
చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య
-
సుశాంత్‌కి న్యాయం జరగాలి!
జూన్ 14.. 2020.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ తుది శ్వాస విడిచిన రోజు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ చనిపోయి జూన్ 14కి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. బాలీవుడ్లో నెపోటిజం కారణంగా సుశాంత్‌కి అవకాశాలు రాకుండా చేసి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుశాంత్ మరణంపై అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మృతిపై ముంబై పోలీసులే కాకుండా బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం, బెయిల్ మీద బయటకు రావడం తెలిసిందే. సుశాంత్ మరణించి ఏడాది పూర్తయినా కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి ‘వియ్ మిస్ యు’, 'JusticeForSushantSinghRajput' అని ట్రెండ్ చేశారు. వెబ్సైట్ ప్రారంభం... సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత వివరాలతో www.ImmortalSushant.com పేరుతో వెబ్సైట్ ఆరంభమైంది. సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రారంభమైన ఈ సైట్లో సుశాంత్ జీవిత విశేషాలు, సినిమాల వివరాలు, ఆయన వీడియోలు, ఫోటోలు ఉంటాయి. నీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి – అంకితా లోఖండే సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యా¯Œ ్స చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని రాశారు. ‘పవిత్ర్∙రిష్తా’ సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత రియా చక్రవర్తిని ప్రేమించారు సుశాంత్ సింగ్. ఇంకా సుశాంత్‌తో సినిమాలు చేసినవారు, అతని కుటుంబ సభ్యులు కూడా ట్వీట్ చేశారు.| సహాయం, సలహా లేదా నవ్వు.. ఇవి నాకెప్పుడు కావాలన్నా నువ్వు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నాతో ఉన్నావు. ఈ నటనా ప్రపంచానికి నీతోనే (సారా తొలి చిత్రం ‘కేదార్నాథ్’లో సుశాంత్ హీరో) పరిచయం అయ్యాను నేను. కలలు నిజమవుతాయనే నమ్మకాన్ని నాలో కలిగించిన నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఈ మండుతున్న సూర్యుణ్ణి, వెలుగుతున్న చంద్రున్ని, ప్రకాశిస్తున్న నక్షత్రాలను చూస్తున్న ప్రతిసారీ నువ్వు మాతోనే ఉన్నావని మాకు అనిపిస్తుంటుంది. – సారా అలీఖాన్ నీ ప్రశ్నలు, మనం మాట్లాడుకున్న సంభాషణలతో పాటు నిన్ను కూడా మిస్ అవుతున్నాను. నాకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఊహల్లో ఉన్న ప్రశాంతత నీకు దొరికిందనే ఆశిస్తున్నాను. – భూమీ పెడ్నేకర్ మన జీవితాలను రెండు భాగాలుగా చూసే కొన్ని çఘటనలు ఉంటాయి. సుశాంత్ మరణం మా జీవితాల్లో అలాంటిదే. మా కుటుంబసభ్యుల జీవితాలు సుశాంత్ మరణానికి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారాయి. జీవించడానికి సంపాదించుకుంటున్నాం, మా పెద్దలను బాగానే చూసుకుంటున్నాం. ఇలా కొన్ని సాధారణ పనులు అందరి జీవితాల్లో జరిగినట్లుగానే మాకూ జరుగుతున్నాయి. కానీ మా అందరి ఆలోచనల్లో భర్తీ కానీ ఏదో శూన్యత దాగి ఉంది. అది మా జీవితాలను మార్చివేసింది. సుశాంత్ చాలామందికి దానాలు చేశాడు – సుశాంత్ బావ విశాల్ కృతి. జూన్ నెల అంతా పర్వత ప్రదేశాల్లో ఒంటరిగా గడపాలనుకుంటున్నాను. అక్కడ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండవు. నా సోదరుడికి చెందిన జ్ఞాపకాలను ఆ నిశ్శబ్ద వాతావారణంలో నెమరువేసుకుంటాను’’ అని ఈ ఏడాది మే 26న సుశాంత్‌సింగ్ సోదరి శ్వేతాసింగ్ కృతి ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు – శేఖర్ సుమన్ ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును త్వరితగతిన పూర్తి చేయమని సంబంధిత అధికారులను, ఏజెన్సీలను కోరుకుంటున్నాను. అనుమానాస్పద రీతిలో సుశాంత్ మనకు దూరమై ఏడాది అవుతోంది. ఓ మంచి వ్యక్తి సమాజంలోని కొన్ని కారణాల్ల ఒత్తిళ్లకు లోనయ్యాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని నమ్ముతున్నాను. అతని కేసు విషయంలో న్యాయం ఎందుకు ఆలస్యం అవుతోంది? కేసును ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇలా సమాధానాలు కావాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆ జవాబులు ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ సుమన్. నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు మాకు దూరమయ్యావన్న నిజాన్ని ఇంకా మర్చిపోలేకపోతు న్నాను. కాలం కొన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుందని కొందరు అన్నారు. కానీ నా కాలం, సర్వస్వం నువ్వు. నాకు తెలుసు.. నువ్వొక గార్డియన్ ఏంజిల్లా నీ టెలిస్కోప్ కళ్ళతో నన్ను చూస్తూ, కాపాడుతూనే ఉంటావని! నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళతావని ప్రతిరోజూ ఎదరుచూస్తూనే ఉన్నాను. అన్నిచోట్లా వెతుకున్నాను. నీ గురించి ఇది రాస్తున్నప్పుడు నా మనసులో ఎంత బాధ ఉందో చెప్పలేను. నువ్వు లేకుండా నా జీవితమే లేదు. నా జీవితంలో నెలకొని ఉన్న శూన్యం భర్తీ చేయలేనిది. – రియా చక్రవర్తి మన లుక్‌టెస్ట్ కోసం తొలిసారి నేను నిన్ను చూశాను. ఆలోచనల పరంగా రెండు విభిన్న ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులం మనమని అనుకున్నాను. తర్వాత మనం ఇద్దరం కలిసి చేసిన ఓ సినిమా మన ఇద్దరి ప్రపంచాల్లో ఉన్న చాలా సంగతులు ఒకటేనని తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు లేవని బాధగా ఉంది. నువ్వు దూరమవ్వడాన్ని నేనింకా మర్చిపోలేకపోతున్నాను. నువ్వింకా మా మధ్యనే ఉన్నావనే అనుకుంటున్నాను. – కృతీసనన్ -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని నలుగురు ఆత్మహత్య
మైసూరు: ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర తాలూకా హెచ్.మూకహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహదేవస్వామి (45), భార్య మంగళమ్మ (40), పిల్లలు జ్యోతి (14), శృతి (12) ఉరి వేసుకుని మరణించారు. వీరికి ఒక ఎకరా పొలం ఉంది. తరచూ నష్టాలే వచ్చాయి. అలాగే అప్పులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో కూలి పనులు కూడా దొరకక తీవ్ర అవస్థలు పడ్డారు. 20 రోజుల క్రితం నలుగురికీ కరోనా సోకి, ఇటీవలే కోలుకున్నారు. జీవితంలో కష్టాలు తీరే మార్గం లేదని ఆవేదన చెంది మంగళవారం రాత్రి భోజనం చేశాక అందరూ ఉరివేసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతసేపైనా అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా మృతదేహాలు కనిపించాయి. మొదట పిల్లలకు ఉరివేసి, తరువాత పెద్దవారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్ నిందితుడు) -
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య?
టీ.నగర్ (చెన్నై): కరోనా ఆ కుటుంబాన్ని అప్పుల పాలుజేసింది. ఫలితంగా తీవ్ర దారిద్య్రంలో కూరుకుపోయిన ఆ దంపతులు ముగ్గురు బిడ్డలకు విషం ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన ఉసిలంపట్టిలో సోమవారం చోటు చేసుకుంది. మదురై జిల్లా, ఉసిలంపట్టికి చెందిన శరవణన్ నగల వర్క్‌షాపు నడుపుతుండేవాడు. ఇతని భార్య శ్రీనిధి. వీరికి కుమార్తెలు మహాలక్ష్మి (10), అభిరామి (5), కుమారుడు అముదన్ (5) ఉన్నారు. 20 ఏళ్లుగా వర్క్‌షాపు నడుపుతూ వచ్చిన శరవణన్ వ్యాపారాన్ని కరోనా పరిస్థితులు దారుణంగా దెబ్బతీశాయి. దీంతో గత కొన్ని నెలలుగా అప్పుల బాధతో అవస్థలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చారు. అయితో రోజురోజుకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ దంపతులు తమ ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి.. ఆ తర్వాత వారు సేవించారు. కొద్దిసేపటికే నురగలు కక్కుకుంటూ ఐదుగురూ మృతిచెందారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అలాగే సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. చదవండి: ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి -
కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య
ఆత్మకూర్ (ఎస్): బిడ్డల్ని చేతులు పట్టుకుని నడిపించాల్సి తల్లిదండ్రులే తమకు సమస్య ఎదురవగానే వారితో పాటు బిడ్డల్ని కూడా బలిపెట్టేందుకు వెనుకాడటం లేదు. కుటుంబ కలహాలతో ఆరేళ్ల కొడుకుని బావిలో పడేసి...ఆపై తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏనుబాములలో గురువారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏనుబాముల గ్రామానికి చెందిన సురుకంటి రాంరెడ్డి (45), పద్మ దంపతులకు ప్రేమ్ చరణ్‌రెడ్డి, తనూజ్‌రెడ్డి (6) కొడుకులు. రాంరెడ్డి ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో ఉంటున్నారు. గురువారం స్వగ్రామం ఏనుబాములకు వెళ్తానంటూ చిన్న కొడుకు తనూజ్‌రెడ్డిని బైక్‌పై తీసుకెళ్లాడు. అనంతరం కొడుకు తినేందుకు దుకాణం వద్ద తినుబండారాలు కొని తన వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న బావిలో కుమారుడిని పడేసి..కొద్దిదూరంలోని ఓ చెట్టుకింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వచ్చిన పశువులు కాపరులు రాంరెడ్డిని చూసి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించగా..వారు వచ్చి బాలుడి కోసం వెదికారు. అయితే తన కొడుకును పాతబావిలో పడేసినట్లు రాసి ఉంచిన లేఖ రాంరెడ్డి జేబులో లభించడంతో వెంటనే అక్కడకు వెళ్లి చూడగా బావిలో బాలుడి చెప్పులు తేలుతూ కన్పించాయి. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఘటనా స్థలికి వచ్చి బాలుడి కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో నీళ్లు నిండుగా ఉండటంతో సమీపంలోని మోటార్లను సాయంతో నీటిని తోడినా బాలుడి ఆచూకీ కనిపించలేదు. కుటుంబ కలహాలే కారణమా? రాంరెడ్డి కుటుంబంలో ఏడాదిగా కుటుంబ కలహాలు జరుగుతుండటమే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా, గత లాక్డౌన్ నుంచి రాంరెడ్డి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేయడం, ఈ క్రమంలో తోచిన వారికి సాయం అందిస్తూ రూ.లక్షల అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కుటుంబసభ్యులతో రాంరెడ్డికి ఇంట్లో గొడవలు ఏడాదిగా జరుగుతున్నాయి. ఇతని వ్యవహారం చూసిన కుటుంబ సభ్యులు చివరకు హైదరాబాద్‌లోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స చేయించారు. అనంతరం కొంత భూమిని అమ్మి రాంరెడ్డి అప్పులు తీర్చినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఇలా కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు..
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): అత్త కోపగించుకుందని ఓ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోల్కొండ రేషంబాగ్‌కు చెందిన సయ్యద్ హబీబ్ భార్య బీబీ (24). ఆమె తన అత్త సతీయా బేగంతో కలిసి రేషం బాగ్‌లో ఉంటోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అత్తా సతియా బేగం చిన్న విషయానికే కోపగించుకుంటోందని బీబీ పలుమార్లు భర్తకు తెలిపింది. ఇదిలాఉండగా సోమవారం ఉదయం సతీయా బేగంతన కోడలు బీబీకి టీ తెమ్మని చెప్పింది. దీంతో బీబీ ఇంట్లో టీ తయారు చేసి అత్తకు ఇచ్చింది. కాగా టీ లో పొడి ఎక్కువైందని సతీయా బేగం కోడలిపై విరుచుకుపడింది. కాగా అత్త చిన్న విషయానికే తనను దూషించినందుకు బీబీ మనస్తాపం చెంది తన గదిలోకి వెళ్లి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉరి వేసుకొని చనిపోయిన జాతీయ స్విమ్మర్
యశవంతపుర: కరోనా కాటుతో ఏడాదికి పైగా ఉద్యోగం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన క్రీడాకారిణి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం బెంగళూరులో వెలుగుచూసింది. జాతీయ స్థాయి క్రీడాకారణి జి.బి.శిల్ప బాలరాజు (41) స్విమ్మింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డు పొందారు. శిల్ప బెంగళూరు జయనగరలో నివాసముంటూ ఒక ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కరోనా కారణంగా స్కూల్లో ఆమెతో సహా పలువురు టీచర్లను తొలగించారు. పనిలోకి చేర్చుకోవాలని శిల్ప పలుమార్లు పాఠశాల యజమాన్యానికి లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి తాడుతో ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న భర్త, నృత్య శిక్షకునిగా పనిచేసే నీలకృష్ణ ప్రసాద్ విగతజీవిగా మారిన శిల్ప కనిపించారు. క్రీడాకారిణిగా జాతీయ స్థాయికి ఎదిగినప్పటికీ పాఠశాలలో ఒక ఉద్యోగం సంపాదించలేక పోయానని సూసైడ్ నోట్లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం శిల్ప తల్లి మరణించారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ శిల్ప ఆత్మహత్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: క్షుద్రపూజలు చేసిన కుటుంబానికి దేహశుద్ధి -
ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, టీ.నగర్(చెన్నై): మైలాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. సైదాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ట్రాఫిక్ స్పెషల్ ఎస్ఐ బాలాజీ (50) నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలాజీ మధుమేహానికి చికిత్స పొందుతున్నారు. ఇలావుండగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనవసరంగా సెలవులు పెట్టరాదని డీజీపీ త్రిపాఠి ఉత్తర్వులిచ్చారు. దీంతో బాలాజీ సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు సమాచారం. సోమవారం ఉదయం మైలాపూర్ ఆలయంలో భద్రతా పనులు అప్పగించారు. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన బాలాజీ తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిభారం కారణమా? లేక కుటుంబ సమస్య? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
గుడివాడ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్‌కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. విజయ్‌కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమంటూ సహచర సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడికి రెండు నెలల కిందటే వివాహమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012 బ్యాచ్ ఎస్సై. హనుమాన్ జంక్షన్లో తొలి బాధ్యతలు చేపట్టాడు. అయితే నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన విజయ్‌కుమార్ గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఏలూరుకు చెందిన మహిళతో మూడు నెలల కిందట వివాహమైంది. భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్‌తో కలిసి ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. బ్యూటిషన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్ కుమార్ మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్‌కుమార్ మరణవార్త తెలుసుకున్న సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, ఏరియా ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. -
రైతులకు మద్దతుగా ఆత్మహత్య
న్యూడిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్(65) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు వద్ద తుపాకీతో కాల్చుకున్నారు. రామ్‌సింగ్‌కు పంజాబ్, హరియాణాల్లో అనుయాయులు ఉన్నారు. హరియాణా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. బాబా రామ్‌సింగ్ మృతదేహం సమీపంలో ఆయన పంజాబీలో రాసిన ఆత్మాహుతి లేఖ లభించింది. ‘హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీనస్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చూసి తట్టుకోలేకపోతున్నాను’ అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా పలువురు తమకందిన ప్రభుత్వ పురస్కారాలను వెనక్కు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘రైతులకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ సేవకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తీసుకుంటున్న చర్య’ అని వివరించారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామ్‌సింగ్ మృతికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రాక్షసత్వం అన్ని హద్దులు దాటిందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీతో లాభం లేదు రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు సూచించినట్లుగా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల పరిష్కారం లభించదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దే ఏకైక పరిష్కారమని పేర్కొన్నాయి. కమిటీని ఏర్పాటు చేస్తామని చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను అప్పుడే తిరస్కరించామని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సభ నేత అభిమన్యు కోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు చర్చలు జరిపిన ప్రభుత్వ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు కమిటీతో సమానమేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, దానిపై ప్రభుత్వ స్పందనను గమనించిన తరువాత ఈ విషయంపై మాట్లాడుతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. మరోవైపు, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలను నిలిపేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న 40 రైతు సంఘాల ఐక్య కూటమి ‘సంయుక్త కిసాన్ మోర్చా’ కేంద్రానికి లేఖ రాసింది. యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో ఇటీవల కేంద్ర ప్రతినిధులు భేటీకావడం తెల్సిందే. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, చిల్లా సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. చిల్లా సరిహద్దును దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ–నోయిడా మార్గంలోని చిల్లా సరిహద్దులో బలగాలను మోహరించారు. -
ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి
‘‘కొన్ని రోజులుగా ఓ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగటివిటీ వల్ల ఏం మాట్లాడాలో ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్లో డ్రగ్స్ కాంట్రవర్శీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం గురించి అక్షయ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘మమ్మల్ని స్టార్స్‌ని చేసింది ప్రేక్షకులే. సినిమాల ద్వారా మన దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని మేం ప్రచారం చేస్తుంటాం. సుశాంత్ మరణం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. మన ఇండస్ట్రీలో ఉన్న తప్పొప్పుల్ని సమీక్షించుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. కానీ అందరూ తీసుకుంటారని కాదు. ప్రతి ఒక్కరినీ దోషులుగా చూడొద్దు. ఇది కరెక్ట్ కాదు’’ అని అన్నారు అక్షయ్ కుమార్. -
బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
సూర్య వ్యాఖ్యలపై కలకలం
చెన్నై: తమిళనాడులో నీట్ పరీక్షకు ముందు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. అయితే, సూర్య తమిళంలో ఇచ్చిన స్టేట్మెంట్ను ఆంగ్లంలో అన్వయించుకోవడంలో జరిగిన పొరపాటు వల్లనే జస్టిస్ సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసిందని సూర్య ట్విట్టర్లో స్పందించారు. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారని, అయితే విద్యార్థులను మాత్రం నిర్భీతిగా వెళ్ళి పరీక్షలు రాయమని ఆదేశించడంలో నైతికత లేదని సూర్య ట్వీట్ చేసినట్లు జస్టిస్ సుబ్రమణ్యం తన లేఖలో పేర్కొన్నారు. అయితే సూర్య చేసిన ట్వీట్లో ‘‘అలాంటప్పుడు, నైతికత లేదు’’ అనే పదాలు లేవని, జడ్జి అన్వయం చేసుకోవడంలో పొరపాటుపడి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు సూర్యపై ఎటువంటి చర్యలు చేపట్టొద్దని, ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు సాయపడ్డారని, ఒక దుర్ఘటనపై కళాకారుడి స్పందనను తీవ్రమైనదిగా పరిగణించరాదని ఆరుగురు మాజీ జడ్జీలు, కొందరు ప్రముఖ న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. -
ప్రేమ చెరిగి.. మనసు విరిగి..
విచ్చలవిడి మనస్తత్వం.. జల్సాలకు మరిగిన స్వభావం.. డబ్బుపై మితిమీరిన వ్యామోహం.. కట్టుకున్న వాడినే బలితీసుకుంది. కన్నబిడ్డ ఉసురు తీసేసింది. ఓ వివాహిత విశృంఖల జీవితానికి అలవాటు పడింది. భర్త కళ్లుగప్పి చాటుమాటు వ్యవహారాలు నడిపింది. గుట్టు రట్టయినా పట్టించుకోలేదు. పెనిమిటి చెప్పిన మాటలు తలకెక్కించుకోలేదు. చివరకు కడుపున పుట్టిన చిన్నారి వేధింపులకు గురవుతున్నా చలించలేదు. పచ్చటికాపురంలో నిప్పులు పోసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నోడు ప్రాణాలు తీసుకునే దాకా తీసుకెళ్లింది. సాక్షి, చిత్తూరు: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యే చాటుమాటు వ్యవహారం నడుపుతుండడం.. ఆమె కోసం వచ్చేవాళ్లు ఇంట్లో చిన్న పాప పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని తట్టుకోలేకపోయాడో భర్త. చెప్పుకుంటే పరువుపోతుందని కూతుర్ని ఉరేసి చంపి, ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ యుగంధర్ వివరాలను వెల్లడించారు. చిత్తూరు ప్రశాంత్‌నగర్‌కు చెందిన గణేష్ (31) ఐదేళ్ల క్రితం చెన్నైలోని కొరియర్లో పనిచేసేవాడు. ఫేస్బుక్ ద్వారా చెన్నైలోని సుధాకర్, రాజ్యలక్ష్మి రెండో కుమార్తె దివ్య (26)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2014లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదికి వారికి ఓ పాప పుట్టింది. పెళ్లయిన మూడేళ్లపాటు గణేష్ చెన్నైలోని అత్తమామ ఇంట్లోనే ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో దివ్య చెన్నైకి చెందిన ధన, ప్రిన్స్ అనే వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓసారి డబ్బుకోసం ధన అనే వ్యక్తిని తన తల్లి ఇంటికే దొంగతనానికి పంపింది. దొంగతనం చేస్తుండగా దొరికిపోయిన ధన.. రాజ్యలక్ష్మిని గొంతునులిమి చంపబోయాడు. వెంటనే తనచేయి కోసుకున్న దివ్య.. ధనను తప్పించింది. విషయం అందరికీ తెలియడంతో భార్యను తీసుకొచ్చి చిత్తూరులో కాపురం పెట్టాడు గణేష్. కానీ ఇక్కడకు వచ్చాక బెంగళూరుకు చెందిన మరో ఇద్దరితో సంబంధం పెట్టుకుంది. దివ్యకోసం ఇంటికి వచ్చేవాళ్లు.. నాలుగన్నరేళ్ల పాప కార్తీక పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని గణేష్ గ్రహించాడు. దీనిపై గట్టిగా నిలదీయడంతో అతనిపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది. విషయాన్ని దివ్య తల్లి, అక్కకు చెప్పడంతో వాళ్లు కూడా గణేష్‌కు మద్దతుగా నిలిచి కార్తీకను అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో గురువారం సాయంత్రం తన ద్విచక్రవాహనంలో కార్తీకను తీసుకుని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. తన భార్యకు ఉన్న అక్రమసంబంధాలు, తనపై పెట్టిన తప్పుడు కేసు విచారణలో మనుషుల్ని పెట్టి బెదిరించడం, తన కూతురిపట్ల దివ్య కోసం వచ్చేవాళ్లు ప్రవర్తించిన తీరు మొత్తాన్ని ఓ సెల్ఫీ వీడియోగా తీసుకున్నాడు. తాను, తన కుమార్తె కార్తీక ఇద్దరూ చనిపోతున్నామని వీడియోలో పేర్కొంటూ స్నేహితులకు పంపాడు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో వీడియోను చూసిన స్నేహితులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీలో గణేష్ పేరిట ఉన్న గదిని గుర్తించి రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్న గణేష్ మృతదేహాన్ని గుర్తించారు. పాపకోసం వెతకగా.. బాత్రూమ్లోని కిటీకీ అద్దాలు తీసేసి.. దానికి ఓ తాడుకట్టి పాప గొంతుకు బిగించి ఉంది. మృతదేహం వేలాడుతుండడాన్ని చూసిన పోలీసులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గణేష్ భార్య దివ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన భర్త సుధాకర్ సైతం నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కూడా దివ్యే కారణమంటూ ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. దివ్య విచ్చలవిడితనం, జల్సాలు, డబ్బుపై వ్యామోహమే గణేష్, కార్తీకను బలిగొందన్నారు. -
సుశాంత్ జీవితంతో శశాంక్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త బాలీవుడ్‌ను కుదిపేసింది. ఊహించని షాక్‌లా అనిపించింది. ఎన్నో వివాదాలకు, చర్చలకు దారి తీసింది. సుశాంత్ జీవితం మీద ఆల్రెడీ ఓ సినిమా (సూసైడ్ ఆర్ మర్డర్?) ప్రకటించింది బాలీవుడ్. తాజాగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఓ యంగ్ సినిమా స్టార్ అనుకోకుండా హత్యకు గురికావడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆర్య బబ్బర్, రాజ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. -
నొప్పిలేని మరణం ఎలా?
ముంబై/పట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించే సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడినట్లు ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఆత్మహత్యకు ముందు ‘నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్ డిజార్డర్ అంటే ఏమిటి?’ అనే అంశాలపై గూగుల్‌లో పదే పదే సెర్చ్ చేశాడని చెప్పారు. మాజీ మేనేజర్ దిశా షాలియన్ మరణంతో తనకు సంబంధం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో సుశాంత్ కలత చెందాడని వివరించారు. అతడు మరణించిన వెంటనే కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 56 మంది సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి ప్రస్తావన రాలేదన్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ అయినట్లు ఇంకా తేలలేదన్నారు. సుశాంత్ ఆత్మహత్యపై విచారణ నిమిత్తం బిహార్ ఐపీఎస్ అధికారి ఆదివారం ముంబై చేరుకున్నారు. అయితే ముంబై పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. ఈ ఘటనను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. -
ఎలా బతకాలో తెలియడం లేదు – మీతూసింగ్
‘‘35 ఏళ్లలో నువ్వు లేని రాఖీ పండగ ఇదే. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు కూడా’’ అన్నారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి మీతూ సింగ్. సోమవారం రాఖీ పౌర్ణమి. సుశాంత్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. తమ్ముడు లేకుండా రాఖీ రోజు వస్తుందని నేను ఉహించలేదంటూ ఉద్వేగపూరిత లేఖను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు సుశాంత్ సోదరి మీతు. దాని సారాంశం ఈ విధంగా. ‘‘ఇవాళ మన రోజు. అక్కాతమ్ముళ్ల రోజు. 35 ఏళ్లలో నేను నీకు రాఖీ కట్టలేకపోవడం ఇదే మొదటి సారి. స్వీట్స్ తినిపించలేకపోవడం, నీ నుదుట మీద ముద్దు పెట్టలేకపోవడం, నిన్ను ఆప్యాయంగా హగ్ చేసుకోలేకపోవడం. నువ్వు పుట్టి మా అందరి జీవితాల్లోకి వెలుగు తీసుకొచ్చావు. సంతోషం నింపావు. కానీ మా అందర్నీ వదిలి దూరంగా వెళ్లిపోయావు. ఏదైనా సరే మనిద్దరం కలిసే నేర్చుకున్నాం. ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు తెలియడంలేదు. నువ్వే చెప్పు?’’ అని రాశారు మీతు. ఇక సుశాంత్ ఆత్మహత్య పై ప్రస్తుతం విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘కొంత కాలంగా సుశాంత్ ఏదో ఒత్తిడికి లోనవుతున్నట్టు అనిపిస్తుందని తన అక్క నాతో చెప్పారు. అలాగే సుశాంత్ తన కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నట్టు నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చారు. అలాగే సుశాంత్ సింగ్ కేసు లో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద సుశాంత్ కుటుంబ సభ్యులు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. -
నా భూమి దక్కడం లేదు.. చనిపోతున్నా..!
-
నా భూమి దక్కడం లేదు.. చనిపోతున్నా..!
వర్గల్ (గజ్వేల్): రైతు వేదిక నిర్మాణం కోసం తన భూమి పోతుందని మనస్తాపం చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నా భూమి దక్కడం లేదు. ఇక నేను చనిపోతా’.. అంటూ క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ దిగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో జరిగిన ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి నర్సింలు తల్లిదండ్రులకు సర్వే నంబర్ 370లో లావుని పట్టా భూమి ఉంది. తమకున్న ఎకరం మూడు గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులకు విక్రయించారు. దీంతో ఆ భూమిని 2013లో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోగా.. అక్కడ సబ్‌స్టేషన్ నిర్మించారు. తాజాగా దాని పక్కనే ఉన్న 13 గుంటల స్థలం రైతు వేదిక కోసం కేటాయించారు. అయితే.. ఈ స్థలం తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని నర్సింలు కోరాడు. రెవెన్యూ అధికారులు, సర్పంచ్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. రెండు రోజుల క్రితం అధికారులు జేసీబీతో వేదిక నిర్మాణ పనులు చేపడుతుండగా నర్సింలు అడ్డుకున్నాడు. దీంతో బుధవారం పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణ పనులు చేపట్టడం చూసి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక భూమి తనకు దక్కడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన నర్సింలు క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ దిగాడు. ‘వారసత్వంగా వచ్చిన భూమి నాకు దక్కడం లేదు. ఇక నేను చనిపోతున్నా.. నా ఆత్మహత్యకు సర్పంచ్, పట్వారీ, ఎమ్మార్వో బాధ్యులు’అని ఆడియో రికార్డు కూడా పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నర్సింలును గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి సిద్దిపేటకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. వేలూరులో ఉద్రిక్తత రైతు నర్సింలు మృతి చెందిన సమాచారం తెలియడంతో గురువారం ఉదయం నుంచే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నర్సింలు మృతికి సర్పంచ్, రెవెన్యూ అధికారులే కారణమని ఆరోపిస్తూ మృతుని కుటుంబీకులు, బంధువులు సర్పంచ్ పాపిరెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బలగాలను మోహరించారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీలు పరిస్థితిని సమీక్షించారు. మృతుని కుటుంబ సభ్యులను రైతుబంధు సమితి కన్వీనర్ రవీందర్ ఓదార్చారు. వారితో మంత్రి హరీశ్‌రావును ఫోన్ ద్వారా మాట్లాడించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, గురువారం రాత్రి పోలీసు బందోబస్తు మధ్య నర్సింలు అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
‘సుశాంత్‌ది ఆత్మహత్య కాదు..’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతూ ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన కారణాలను తాను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ట్వీట్లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్‌ది ఆత్మహత్య కాదంటూ #SSRCaseIsNotSuicide అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ కేసులో న్యాయం కావాలంటూ అభిమానులు.. సుశాంత్ కేసు ఆత్మహత్య కాదు అనే పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. (చదవండి: నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...) Respected @AmitShah sir , I’m sushants Singh Rajputs girlfriend Rhea chakraborty,it is now over a month since his sudden demise I have complete faith in the government, however in the interest of justice , I request you with folded hands to initiate a CBI enquiry..part 1 .. — Rhea Chakraborty (@Tweet2Rhea) July 16, 2020 రియా ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తూ... ‘ఓకే మిస్ రియా మీరు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ అని చెబుతున్నారు. అది మేము ఎందుకు నమ్మాలి! ముంబై పోలీసులు సుశాంత్ ఆత్మహత్య అంటున్నారు. బాలీవుడ్ కూడా ఇది ఆత్మహత్యే అనుకుంటుంది. అలాగే నువ్వు కూడా ఇది ఆత్మహత్య అనే అనుకుంటున్నావు కదా! కానీ #SSRCaseIsNotSuicide మాకు న్యాయం కావాలి’ అలాగే ‘సుశాంత్ ఇంటర్య్వూల్లో కూడా స్పష్టం తెలుస్తోంది. బాలీవుడ్‌లోని నెపోటిజం వల్లే తనని చాలా సినిమాల నుంచి తొలగించారని. అయినప్పటికీ సుశాంత్ నటనపై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేదు. అయితే ఇది ఇంకా ఆత్మహత్య అని ప్రజలను మభ్యపెట్టడం మానేయండి’ #SSRCaseIsNotSuicide, ‘సుశాంత్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాము’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
జస్టిస్ ఫర్ సుశాంత్
బాలీవుడ్లో బయటినుంచి వచ్చేవారికన్నా వారసులకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని, ఇక్కడ బంధుప్రీతి బాగా ఉంటుందని పలువురు ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్‌సింగ్ ఆత్మహత్యకు ఇదో కారణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే ఫోరమ్ ఏర్పాటు చేసినట్లు నటుడు శేఖర్ సుమన్ ట్వీటర్లో పేర్కొన్నారు. ‘‘మంచి ప్రతిభ, బలమైన సంకల్పం ఉన్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం నన్ను నిరాశకు గురిచేసింది. అతని ఆత్మహత్యకు గల కారణాలను కొందరు దాస్తున్నారు. వాటన్నింటినీ మా ఫోరమ్ వెలుగులోకి తీసుకొస్తుంది. తన ఆత్మహత్యపై సీబీఐ విచారణకు మా ఫోరమ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ ఫోరమ్ పోరాడుతుంది. సినీ పరిశ్రమలోని గ్రూపు రాజకీయాలను, నిరంకుశత్వాన్ని అంతమొందించేందుకు పని చేస్తాం’’ అన్నారు. ఇప్పటికి మూడు సినిమాలు బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. ఈ నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత షామిక్ మౌలిక్ దర్శకత్వంలో సుశాంత్ జీవితం ఆధారంగా ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు విజయ్‌శేఖర్ గుప్తా ప్రకటించారు. దర్శకుడు నిఖిల్ ఆనంద్ కూడా సుశాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తాజాగా సుశాంత్ జీవితం ఆధారంగా ‘సుశాంత్’ అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు సునోజ్ మిశ్రా. ఇంతకుముందు ‘గాంధీ గిరి’, ‘శ్రీనగర్’ చిత్రాలను డైరెక్ట్ చేశారు సునోజ్ మిశ్రా. ‘సుశాంత్’ చిత్రం గురించి సనోజ్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోని వేధింపుల వల్ల కఠిన నిర్ణయాలు తీసుకున్నవారందరికీ సంబంధించినదే ఈ చిత్రం. రోడ్ ప్రొడక్షన్, సనోజ్ మిశ్రా ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ముంబై, బీహార్ లొకేషన్స్‌లో మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
సుశాంత్‌కు గొప్ప నివాళి
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్ జీవితం ఆధారంగా నిఖిల్ ఆనంద్ ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ సినిమా గురించి నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ – ‘‘సుశాంత్ మన మధ్య లేరనే నిజాన్ని ఒప్పుకోవడం చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా రాణించాలనుకునే ప్రతి సాధారణ వ్యక్తికి సుశాంత్ ఓ స్ఫూర్తి. సుశాంత్ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి మానవతావాది కూడా. నేను తీయబోయే సుశాంత్ బయోపిక్ అతనికి ఓ గొప్ప నివాళి. యాక్టర్స్‌గా కెరీర్‌ను ప్రారంభించాలనుకునే చాలామంది యువతీయువకులకు ఈ బయోపిక్ ఓ ప్రేరణలా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ప్రతిభావంతులైన అవుటర్స్కు మంచి అవకాశాలు వచ్చేలా బాలీవుడ్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నిఖిల్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను 2022లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. సుశాంత్ జీవితం ఆధారంగా ‘సూసైడ్ ఆర్ మర్డర్?: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే చిత్రం కూడా బాలీవుడ్లో రూపొందనుంది. షామిక్ మౌలిక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను విజయ్ శేఖర్ గుప్తా నిర్మించనున్నారు. -
ఐ వాన్న అన్‌ఫాలో యు
‘ఐ వాన్న ఫాలో ఫాలో ఫాలో యు...’ అంటూ ‘నాన్నకు ప్రేమతో’లో రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఫాలో అవుతూ పాడతారు ఎన్టీఆర్. సోషల్ మీడియాలో కూడా తమ అభిమాన తారలను అలానే ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. ‘ఐ వాన్న ఫాలో ఫాలో యు’ అంటూ కండలవీరుడు సల్మాన్ ఖాన్ని, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌ని, క్యూట్ గాళ్స్ సోనమ్ కపూర్, ఆలియా భట్, అనన్యా పాండేలను చాలామంది ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు అదే అభిమానులు ‘ఐ వాన్న అన్‌ఫాలో యు’ అంటున్నారు. దాంతో సామాజిక మాధ్యమంలో వీళ్లంతా లక్షలాది మంది ఫ్యాన్స్‌ను కోల్పోతే కంగనా రనౌత్ ఫాలోయర్స్ సంఖ్య మాత్రం పెరిగింది. దీనికి కారణం ఇటీవల చనిపోయిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. బాలీవుడ్లో వారసులకే ప్రాధాన్యం ఇస్తారని, బంధుప్రీతి బాగా చూపిస్తారని, సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఇదేననే వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ తారాస్థాయిలో ఉందని కంగనా వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పటినుంచీ కంగనా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య పెరిగింది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి విజయాలతో దూసుకెళుతోన్న కంగనా ఇన్‌స్టా ఫాలోయర్స్ అమాంతంగా 20 లక్షలు పెరిగారు. అయితే కంగనా తరఫున ఆమె టీమ్ ఈ అకౌంట్‌ని హ్యాండిల్ చేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ‘రాబ్తా’ సినిమాలో నటించిన కృతీ సనన్ అతను చనిపోయాక ‘నాలో సగ భాగాన్ని కోల్పోయినట్లనిపిస్తోంది’ అని తన బాధను వ్యక్తం చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షలమంది ఫాలోయర్స్ పెరిగారు. ఆలియా భట్, కృతీ సనన్ సల్మాన్ ఖాన్ కుటుంబం తనను టార్చర్ పెడుతోందని దర్శకుడు అభినవ్ కశ్యప్ రాసిన లెటర్, సల్మాన్ కూడా వారసులను ప్రోత్సహిస్తాడని పలువురు పేర్కొనడంతో ఈ కండలవీరుడు భారీ స్థాయిలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. దాదాపు పది లక్షల మంది వరకూ సల్మాన్‌ని అన్‌ఫాలో అయ్యారు. స్టార్ కిడ్స్‌కి అవకాశాలు ఇస్తూ, సినిమాలు నిర్మిస్తాడనే అభిప్రాయం కారణంగా కరణ్ జోహార్‌ని దాదాపు రెండు లక్షల యాభై వేల మంది అన్‌ఫాలో అయ్యారు. ఇక స్టార్ కిడ్స్ సోనమ్ కపూర్ రెండున్నర లక్షలమందిని, ఆలియా భట్ దాదాపు ఐదు లక్షలమందిని కోల్పోయారు. సోనమ్ కపూర్, ఆలియా భట్ అయితే మరో స్టార్ కిడ్ శ్రద్ధాకపూర్‌కి ఫాలోయర్లు పెరగడం విశేషం. సుశాంత్ అంత్యక్రియలకు శ్రద్ధా హాజరై, నివాళులర్పించింది. ఆమెకు 3 లక్షల మంది ఫాలోయర్స్ పెరగడానికి ఇదొక కారణం. ఇక ప్రముఖ నటుడు చంకీ పాండే వారసురాలిగా ఆయన కుమార్తె అనన్యా పాండే కూడా ఆగ్రహానికి గురైనవారి జాబితాలో ఉంది. గత ఏడాది కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ద్వారా కథానాయికగా పరిచయమైంది అనన్య. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ ద్వారా తెలుగుకి పరిచయం కానుంది. ఆమెను 70 వేల మంది అన్‌ఫాలో అయ్యారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇతరుల ఫాలోయర్స్ సంఖ్య కూడా తగ్గుతోంది. శ్రద్ధాకపూర్, అనన్యా పాండే స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య తగ్గితే అది కచ్చితంగా వారి సినిమాల వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. థియేటర్లు రీ ఓపెన్ అయిన వెంటనే సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా వసూళ్లను బట్టి ఇన్స్టాగ్రామ్ అన్ఫాలోయర్స్ ప్రభావం బాక్సాఫీస్ మీద పడిందా? లేదా అని తెలుస్తుంది. ఇక హీరోయిన్లంటే కేవలం వాళ్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడే వసూళ్ల ప్రభావం ఎంతో తెలుస్తుంది. ఆలియా భట్ ప్రస్తుతం ‘గంగూభాయ్ కతియావాడి’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ కిడ్ అనే ట్యాగ్ ఆమె మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమా వసూళ్లు చెప్పేస్తాయి. -
బాయ్‌కాట్ సల్మాన్
‘‘నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. చాకచక్యంగా నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్ (రచయిత–నటుడు, సల్మాన్ ఖాన్ తండ్రి), సల్మాన్ ఖాన్, సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్. ఇంకా వెన్నుపోటు పొడిచినవాళ్లు ఉన్నారు. కానీ ఈ విషపూరిత సర్పానికి సల్మాన్ కుటుంబం అధిపతి. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్‌వరల్డ్ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. దురదృష్టం ఏంటంటే నావైపు ‘నిజాయితీ’ మాత్రమే ఉంది. అయితే నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా జీవితాన్ని చాలించను. తలవంచేది లేదు. ఎదురు నిలబడి పోరాడతా. ఒకటీ వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. ఇక భరించింది చాలు. మళ్లీ పోరాడే సమయం ఆసన్నమైంది’’ అని హిందీ దర్శకుడు అభినవ్ కశ్యప్ మంగళవారం తన ఫేస్బుక్లో సుదీర్ఘంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి హిందీ పరిశ్రమలో అతనికి ఎదురైన చేదు అనుభవాలు ఒక కారణం అనేది పలువురి అభిప్రాయం. అభినవ్ కశ్యప్ కూడా ఆ మాటే అంటున్నారు. ఇది ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది ‘‘ప్రభుత్వానికి ఓ విన్నపం. సుశాంత్ మరణానికి గల కారణాలను సునిశితంగా పరిశోధించాలి. మేం చాలామంది ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బయటకు తీసుకొస్తోంది. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలవి. సుశాంత్ మరణం అనేది ఒక మచ్చు తునక అనే భయం వేస్తోంది. ఇది (నెపోటిజమ్ – బంధుప్రీతి) ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది. సుశాంత్ మరణానికి ‘వైఆర్ఎఫ్’ టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ ముఖ్య కారణం. ఈ టాలెంట్ ఏజెన్సీ వాళ్లు మన కెరీర్‌ని బిల్డ్ చేయరు.. కెరీర్‌తో పాటు జీవితాలను కూడా నాశనం చేసేస్తారు. పదేళ్లుగా ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా చెబుతున్నా.. బాలీవుడ్‌కి చెందిన ప్రతి టాలెంట్ మ్యానేజర్, టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీలు ఆర్టిస్ట్‌లకు ఓ ‘డెత్ ట్రాప్’లాంటివి. ఈ మ్యానేజర్లు, ఏజెన్సీలు అవకాశాలిప్పిస్తామని ఇండస్ట్రీకి సంబంధంలేనివాళ్లను నమ్మిస్తారు. బాలీవుడ్లో జరిగే పార్టీలకు వాళ్లను ఆహ్వానిస్తారు. అయితే అక్కడ వీరిని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అప్పుడు వీళ్లకు ఓ అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అప్పుడు ఈ క్యాస్టింగ్ డైరెక్టర్లు మేం కాపాడతామంటూ కొన్నేళ్ల పాటు తమ ఏజెన్సీతో కలిసి పని చేస్తామని ఒప్పందపత్రంలో సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కసారి ఒప్పందం కుదిరాక ఇక వాళ్లకు ఏ హక్కూ ఉండదు. కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ల చేతిలో ఉండవు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కార్మికుడిలా తక్కువ పారితోషికానికి పని చేయాలి. పోనీ ఎలాగోలా ఈ ఏజెన్సీ నుంచి తప్పించుకుని ‘రేపు’ బాగుంటుందనే నమ్మకంతో వేరే ఏజెన్సీ దగ్గరికి వెళితే ఆ ‘రేపు’ఎప్పటికీ రాదు. ఇలాంటి అనుభవాలు నేను చాలా ఎదుర్కొన్నాను. అర్బాజ్ ఖాన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ‘దబాంగ్’ (2010) సినిమాకి దర్శకత్వం వహించిన పదేళ్లకు నా అనుభవాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ‘దబాంగ్’ తర్వాత ‘దబాంగ్ 2’ ఒప్పుకుని ఆ సినిమా నుంచి నేను తప్పకోడానికి కారణం అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ మరియు అతని కుటుంబం. నా కెరీర్‌ని కంట్రోల్ చేయడానికి వాళ్లు ట్రై చేశారు. నా రెండో చిత్రాన్ని శ్రీ అష్టవినాయక ఫిలింస్ సంస్థతో చేయడానికి సైన్ చేశాను. కానీ ఆ సంస్థ అధినేత రాజ్ మెహతాకి ఫోన్ చేసి, ‘అతనితో సినిమా చేస్తే జాగ్రత్త’ అని బెదిరించారు. దాంతో నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వయాకామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థ అధినేత విక్రమ్ మల్హోత్రాకి ఫోన్ చేసి, బెదిరించారు. దాంతో తీసుకున్న 7 కోట్ల రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో పాటు 90 లక్షలు వడ్డీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సపోర్ట్ వల్ల ‘బేషరమ్’ (2013) సినిమాకి దర్శకత్వం వహించగలిగాను. అయితే ఆ సినిమా విడుదలకు ముందు సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి భయపడ్డారు. కానీ రిలయన్స్, నేను ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నవాళ్లం కాబట్టి సొంతంగా సినిమాని విడుదల చేయాలనుకున్నాం. అప్పుడు అసలు యుద్ధం మొదలైంది. నా శత్రువులు బాక్సాఫీస్ దగ్గర నా సినిమా పరాజయం పాలు కావడానికి సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేశారు. అయితే థియేటర్ల నుంచి ఎత్తేసే నాటికి నా సినిమా 58 కోట్లు వసూలు చేసింది. శాటిలైట్ రైట్స్ విషయంలో ఇబ్బందిపెట్టారు. ఇక ఆ తర్వాత నా ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టే పనులు చేశారు. నన్ను బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న స్త్రీలను అత్యాచారం చేస్తామని బెదిరించారు. దాంతో నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. చివరికి 2017లో నా భార్య, నేను విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత కూడా నన్ను వదిలిపెట్టలేదు. బెదిరిస్తూ మెసేజ్‌లు పంపించారు. పోలీస్ స్టేషన్‌కి వెళితే ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. వెనక నుండి నాపై దాడి చేస్తున్నారు. నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సహించేది లేదు. ఓపెన్‌గా చాలెంజ్ చేస్తున్నాను. అమాయకులు బలి కాకూడదు సుశాంత్ సింగ్ వెళ్లిపోయాడు. కానీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నాను. కానీ అలాంటి అమాయకులు ఇక బాలీవుడ్లో బలి కాకూడదు. ఇబ్బంది పడుతున్న నటీనటులు, క్రియేటివ్ పీపుల్ నా ఈ పోస్ట్‌ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి’’ అంటూ ‘మీటూ బాయ్‌కాట్ సల్మాన్‌ఖాన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముగించారు అభినవ్ కశ్యప్. కాగా నో స్మోకింగ్, బాంబే వెల్వెట్, రమణ్ రాఘవ్, మన్మర్జియాన్.. ఇలా ఓ 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్. తన సోదరుడు అభినవ్, సల్మాన్ ఖాన్‌కి మధ్య జరుగుతున్న వివాదం గురించి తాను స్పందించదలచుకోలేదని అనురాగ్ తన ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడటానికి మీడియావారు నాకు ఫోన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే తన విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దని అభినవ్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. అందుకని తను చేస్తున్నవాటికి, చెబుతున్నవాటి గురించి నేను స్పందించలేను’’ అని అనురాగ్ ట్వీట్ చేశారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది – నటుడు వివేక్ ఒబెరాయ్ ‘‘సుశాంత్ తండ్రి కళ్లల్లో బాధ చూస్తుంటే భరించలేని విధంగా ఉంది’’ అంటూ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్వీటర్ ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది అని వివేక్ చెబుతూ – ‘‘ప్రతిభను ప్రోత్సహించే దిశగా సినిమా పరిశ్రమ అడుగులు వేయాలి కానీ ప్రతిభను నాశనం చేసే దిశగా కాదు. నా ఈ ప్రయాణంలో నేను కూడా ఎన్నో బాధలు అనుభవించాను. ఆ బాధలు చెప్పి సుశాంత్ బాధని తగ్గించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మన ప్రయాణం చీకటిలో కొనసాగవచ్చు లేదా ఒంటరి ప్రయాణం కావొచ్చు. కానీ మరణం దానికి పరిష్కారం కాదు. ఆత్మహత్య పరిష్కారం కానే కాదు. సుశాంత్ తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది మంది అభిమానుల గురించి ఆలోచించడం మానేశాడనుకుంటున్నాను. అందుకే ఈరోజు అతన్ని మనం కోల్పోయాం. అతని తండ్రి బాధ వర్ణనాతీతం. ఇక సుశాంత్ అక్క అయితే ‘వెనక్కి వచ్చెయ్’ అంటూ కన్నీటి పర్యంతం కావడం నన్ను కలచివేసింది. సుశాంత్ మరణం సినిమా పరిశ్రమకు ఓ మేలుకొలుపు లాంటిది’’ అన్నారు. – డి.జి.భవాని -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... 50 కలలు
బంగారంలాంటి కెరీర్, మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా తొందరపడ్డాడు. 34 ఏళ్లకే జీవితాన్ని ముగించుకున్నాడు. ఏడాది క్రితం తనకు 50 కలలు ఉన్నట్లు ట్వీటర్ ద్వారా తెలిపాడు. ఆ 50 కలలను ఓ పేపర్లో ‘50 డ్రీమ్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ కౌంటింగ్’ అని రాసి షేర్ చేశాడు కూడా. ఆయనకున్న 50 కలల్లో 11 కలలు నెరవేరాయి కూడా. సుశాంత్ ఆత్మహత్యతో మిగిలిన కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి.. ఆయన కన్న కలల్లో ప్రధానమైనవి కొన్ని... ► విమానాన్ని నడపడం నేర్చుకోవడం ఆయన మొదటి కల ► ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం ► ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం ► మోర్సె కోడ్ నేర్చుకోవడం ► చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం ► ఒక టెన్నిస్ ఛాంపియన్ పాత్రలో నటించడం ► నాలుగు క్లాప్ పుషప్‌లు చేయడం ► ఒక వారం పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం ► ఒక బ్లూ హోల్లో ఈత కొట్టడం ► డబుల్ స్లిట్ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం ► కొన్ని వేల మొక్కలు నాటడం ► ఇంజినీరింగ్ చదివిన ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించి స్నేహితులతో ఓ సాయంత్రం సరదాగా గడపడం ► ఇస్రో లేదా నాసా వర్క్‌షాపులకు వంద మంది పిల్లల్ని పంపించడం. ► కైలాశ్ (పర్వతం)పై ధ్యానం చేయడం ► ఒక పుస్తకం రాయడం ► యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం ► ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్స్ శరీరాన్ని పొందడం ► చూపులేని వారికి కోడింగ్ నేర్పించడం ► అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం ► వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ► డిస్నీలాండ్‌కి వెళ్లడం ► అమెరికాలోని లిగోని సందర్శించడం ► ఒక గుర్రాన్ని పెంచుకోవడం ► కనీసం పది రకాల నృత్యాలను నేర్చుకోవడం ► ఉచిత విద్య కోసం కృషి చేయడం. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరిట ఆయన విద్యార్థులకు సహాయం కూడా చేసేవారు. ► అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం ► మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం ► మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం ► వ్యవసాయం నేర్చుకోవడం ► పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం ► రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం ► తనకు ఇష్టమైన 50 పాటలకు గిటార్ నేర్చుకోవడం ► ఒక ఛాంపియన్‌తో చెస్ ఆడటం ► లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం ► సైమాటిక్స్ ప్రయోగాలు చేయడం ► భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం ► సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడం ► యూరప్ మొత్తం రైలులో ప్రయాణించడం ఆయన చివరి కల సుశాంత్ కలల్లో తీరినవి... విమానాన్ని నడపడం నేర్చుకోవడం, ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం, ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం, యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించడం, బ్లూ హోల్లో ఈత కొట్టడం, సెనోట్లో ఈదడం (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను), డిస్నీల్యాండ్కి వెళ్లడం, అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం, రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం, సైమాటిక్స్ ప్రయోగాలు చేయడం (ప్రకంపనలకు సంబంధించి). -
ముసుగులు తొలగించండి
‘‘ఇక చాలు నీ మాటలు.. మనిషి పోయాక ఈ మొసలి కన్నీరు ఎందుకు? నెపోటిజమ్ జీర్ణించుకుపోయిన మనిషివి నువ్వు. నీ ముసుగుని తొలగించు. ఆలియా.. నువ్వు కూడా?’’ అంటూ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, కథానాయిక ఆలియా భట్‌లపై సోషల్ మీడియా వేదికగా పలువురు మండిపడ్డారు. వారి ఆగ్రహానికి కారణం హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. ‘‘నువ్వు (సుశాంత్) ఒంటరితనం ఫీలవుతున్నావని, నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుంటుందని నేనో సందర్భంలో గ్రహించాను. అయితే ఏడాదిగా నీతో టచ్‌లో లేనందుకు ఇప్పుడు నన్ను నేను నిందించుకుంటున్నాను. ఇక ఎప్పటికీ ఇలా చేయకూడదనుకుంటున్నాను. నిన్ను మిస్ అయినందుకు నన్ను నేను తిట్టుకుంటున్నాను’’ అని కరణ్ ట్వీట్ చేశారు. అయితే ఇదంతా ఉత్తుత్తి బాధ అనేది పలువురి అభిప్రాయం. సినిమా నేపథ్యం లేని కుటుంబాన్నుంచి వచ్చిన సుశాంత్ సింగ్‌కి బాలీవుడ్లో వారసులకు దక్కినంత ప్రేమాభిమానాలు దక్కలేదని పలువురు ట్వీటర్లో పోస్ట్ చేశారు. పైగా సుశాంత్ హీరోగా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో ‘డ్రైవ్’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా విడుదల గత ఏడాది పలుమార్లు వాయిదా పడింది. కరోనాలాంటి మహమ్మారి కారణంగా థియేటర్ల మూత లేనప్పుడు గత ఏడాది ఈ సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేశాడు కరణ్ జోహార్. ‘‘అదే బాలీవుడ్లో సుశాంత్‌కి మంచి బ్యాగ్రౌండ్ ఉండి ఉంటే ఇలా చేసేవాడివా?’ అంటూ ఇప్పుడు పలువురు విరుచుకుపడ్డారు. కథానాయిక ఆలియా భట్ని కూడా విమర్శిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఓసారి ఆలియా పాల్గొన్నారు. అప్పుడు రణ్‌వీర్‌సింగ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ ధావన్‌లలో ఎవరు మంచి నటుడు? అని ఆలియాని కరణ్ అడిగితే, ‘సుశాంత్ అంటే ఎవరు?’ అంది. ఇద్దరూ నవ్వుకున్నారు కూడా. ఇక ఆదివారం సుశాంత్ మృతికి సంతాపంగా ‘‘నువ్వు మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళ్లిపోయావ్. ఎంతో షాక్‌లో ఉన్నాను. మాటలు రావడంలేదు. నీ కుటుంబ సభ్యులకి, నిన్ను ప్రేమించేవారికి, నీ ఫ్యాన్స్‌కి సంతాపం ప్రకటిస్తున్నాను’’ అని ఆలియా ట్వీట్ చేసింది. అప్పుడు ‘సుశాంత్ ఎవరు న్నావు? ఇప్పుడు సంతాపం ప్రకటిస్తున్నావు’ అని మండిపడుతున్నారు. వాస్తవానికి రెండు మూడేళ్లుగా హిందీ పరిశ్రమలో ‘బంధుప్రీతి’ అనే వివాదం చాలా ఎక్కువగా సాగుతోంది. ‘నన్ను బాలీవుడ్లో జరిగే వేడుకలకు పెద్దగా పిలవరు’ అని ఓ సందర్భంలో సుశాంత్ సింగ్ అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. హిందీ పరిశ్రమలో తాను ఒంటరిని అనే భావనలో అతను ఉండిపోయాడని, డిప్రెషన్‌కి ఇదొక కారణం అయ్యుంటుందన్నది కొందరి అభిప్రాయం. ఇక కంగనా రనౌత్, తాప్సీ, హ్యూమా ఖురేషీ లాంటివాళ్లు ఈ బంధుప్రీతి గురించి బాహాటంగానే స్పందించారు. కంగనా అయితే కరణ్‌ని ఉద్దేశించి ‘బాలీవుడ్ మాఫియా, ‘ఫ్లాగ్ బ్యారర్‡ఆఫ్ నెపోటిజమ్’ (బంధుప్రీతిని ముందుండి నడిపించేవాడు), స్నూటీ అండ్ ఇన్‌టాలరెంట్ (ఇండస్ట్రీలోని స్టార్స్‌ను తప్ప బయటవాళ్లను భరించలేడు) అన్నారు. ‘‘సుశాంత్ సినిమాలను అవార్డు షోలకు ఎందుకు అనుమతించలేదు? ‘కాయ్ పోచె, ఎం.ఎస్. ధోని, చిచోరే’ వంటి అద్భుత సినిమాలు చేశాడు. కానీ ఎన్ని అవార్డులు ఇచ్చారు?’’ అని కూడా స్పందించారు కంగనా. ‘రంగీలా’ ఫేమ్ ఊర్మిళ అయితే ‘‘బంధుప్రీతి’ రూల్ చేస్తున్న ఈ ఇండస్ట్రీలో ప్రతిభను, హార్డ్‌వర్క్‌ని నమ్ముకుని నీలా ఒక గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఇంత సాధించిన నువ్వు త్వరగా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం బాధాకరం’’ అని సుశాంత్ మరణం పట్ల తన ఆవేదన వ్యక్తం చేశారు. -
సుశాంత్ చాలా హుందాగా ప్రవర్తించేవాడు
‘ఎం.ఎస్. ధోనీ’ చిత్రంలో సుశాంత్‌కి అక్క పాత్ర చేశారు... తన మృతి గురించి తెలిసి... (మధ్యలో అందుకుంటూ)... షాకయ్యాను. నేను వార్తలు చూడలేదు. ఫోన్లో వాట్సప్ మేసేజ్ ద్వారా తెలుసుకున్నాను. సుశాంత్ అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. చిన్న వయసులోనే ఓ ప్రతిభా వంతుడైన యాక్టర్ మనకు దూరం కావడం చాలా బాధాకరం. ► ఆ సినిమా సెట్లో సుశాంత్ డల్‌గా ఉన్న సందర్భాలు కానీ లేదా అతనిలో కుంగుబాటుకు సంబంధించిన లక్షణాలేమైనా కనిపించాయా? సుశాంత్, నేను 9 నుంచి 10 రోజులు మాత్రమే కలసి పని చేశాం. సుశాంత్ చాలా మంచి నటుడు. ఏ సన్నివేశంలోనైనా సుశాంత్ బాగా నటించగలడని నాకు అనిపించింది. కష్టమైన సీన్స్‌కు కూడా పెద్దగా టైమ్ తీసుకునేవాడు కాదు. సెట్లో కొన్నిసార్లు మేడమ్ అని, కొన్నిసార్లు అక్కా అని పిలిచేవాడు. సెట్లో అందరితోనూ హుందాగా ప్రవర్తించేవాడు. నైస్ పర్సన్. మెచ్యూర్డ్. కాకపోతే కాస్త రిజర్డ్వ్‌గా ఉండేవాడు. ► ఈ మధ్య సుశాంత్‌తో మాట్లాడారా? లేదు. అయితే అతన్ని ట్వీటర్లో ఫాలో అవుతున్నాను. కొన్నిసార్లు ట్వీటర్లో అంత యాక్టివ్‌గా కూడా ఉండడు. ఏడాది క్రితం అనుకుంటా.. ట్వీటర్‌కి దూరం అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత నుంచి ట్వీటర్లో కూడా తనతో టచ్‌లో లేను. ► జీవితాన్ని డీల్ చేయలేని స్థితిలో సుశాంత్ ఉన్నారని అనుకుంటున్నారా? అంత దూరం తన గురించి తెలియదు. అయితే మనందరి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు బంధువులతోనో, మిత్రులతోనే మాట్లాడాలి. అప్పుడు మనం ఆ స్థితి నుంచి బయటకు వస్తాం. ► సుశాంత్‌లా కొందరు యువనటీన టులు ఆత్మహత్య చేసుకున్నారు... యంగ్‌స్టర్స్‌కి మీ సందేశంగా ఏం చెబుతారు? మన జీవితాల్లోని అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కష్టనష్టాలు ఉంటాయి. యంగ్‌స్టర్స్ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఎక్కువగా ఒంటరిగా గడపకూడదు. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులతో వారి సమస్యలను డిస్కస్ చేయాలి. పరిష్కారం ఆలోచించాలి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పక్కవారి సాయం తీసుకోవచ్చు.. తప్పేం లేదు. ► కష్టాలు చెప్పుకునే వ్యక్తి ఒక్కరు కూడా లేనివాళ్లు ఏం చేయాలి? కొన్నేళ్ల క్రితం ఇలాంటి టాపిక్ ఒకటి వస్తే.. నా దగ్గర ఒక వ్యక్తి ఇలా చెప్పారు. ‘మనసు బాగాలేనివాళ్లు దేని మీదా దృష్టి పెట్టరు. అయితే రెగ్యులర్‌గా చేసినట్లే ప్రతి రోజూ స్నానం చేయాలి.. వ్యాయామం చేయాలి.. ప్రార్థించాలి. రోజులో 45 నిమిషాలు ఇంట్లో కాకుండా బయట గడపాలి. అప్పుడు వాళ్ల మనసు కొంచెం తేలిక అవుతుంది’ అని. ఇలా చేయడం వల్ల ఒకే విషయం మీద దృష్టి మళ్లకుండా కొంచెం మనసుని డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సుశాంత్‌కి ప్రముఖుల నివాళి సుశాంత్ మంచి ప్రతిభావంతుడు. చాలా తొందరగా వెళ్లిపోయాడు. – మహేశ్‌బాబు చాలా తొందరగా ఓ గొప్ప ప్రతిభావంతుణ్ణి కోల్పోయాం. – ఎన్టీఆర్ నటుడిగా ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన సుశాంత్ ఇంత తొందరగా మరణించాడని తెలిసి షాకయ్యాను. – రామ్‌చరణ్ కెరీర్లో చాలా దూరం ప్రయాణించాల్సిన సుశాంత్ ఇంత తొందరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. – ప్రకాశ్‌రాజ్ ‘చిచోరే’ సినిమా సెట్స్‌లో సుశాంత్‌ని కలిశాను. సినిమా పూర్తయ్యేసరికి తను నాకో బ్రదర్‌లా దగ్గరయ్యాడు. హిందీలో నాకది మొదటి సినిమా అయినా ఆ భావనను తను ఎప్పుడూ నాకు కలిగించలేదు. నేను నా సోదరుడిని మిస్ అవుతున్నాను. – నవీన్ పొలిశెట్టి వ్యక్తిగతంగా సుశాంత్ నాకు తెలియదు. కానీ అతని సినిమాలు చూస్తే నాకు అర్థమయ్యింది. అతను ఎంత మంచి నటుడో. ఎవరి హృదయంలో ఏ బాధ దాగి ఉందో కనిపెట్టలేం. మానసికంగా ఎవరైనా బలహీనంగా ఉంటే దయచేసి మీ బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు.. ఇలా మీరు నమ్మకం ఉంచిన ఎవరితోనైనా సరే మీ భావాలను పంచుకుని మీ బాధను తగ్గించుకోండి. – అనిల్ కపూర్ సుశాంత్ నన్ను చాలా ఇష్టపడే వ్యక్తి. యాక్టింగ్‌లో అతని ఎనర్జీ, అందమైన చిరునవ్వు బాగుంటాయి. సుశాంత్ మరణం నన్ను బాధించింది. బాగా మిస్ అవుతున్నాను. – షారుక్ ఖాన్ సుశాంత్ మరణవార్త విని షాకయ్యాను. మాటలు రావడం లేదు. మంచి ప్రతిభావంతుడ్ని కోల్పోయాం. – అక్షయ్ కుమార్ ‘సోంచరియా’ చిత్రం కోసం అతనితో కలిసి నటించిన రోజులు ఇంకా నా కళ్ల ముందే కదులుతున్నాయి. మా ఇంట్లో నా చేతి వంట తినాలని సుశాంత్ నాతో ఓ సందర్భంలో చెప్పాడు. అది నెరవేరనందుకు బాధగా ఉంది. – మనోజ్ భాజ్‌పాయ్ గత ఏడాదిగా నీతో నేను సరిగా టచ్‌లో ఉండనందుకు నన్ను నేను నిందించుకుంటున్నాను. నీ భావాలను పంచుకునేందుకు నీ జీవితంలో ఎవరైనా ఉంటే బాగుండేదని అనుకున్నాను. – కరణ్ జోహార్ మంచి నటుడు, నా స్నేహితుడిని కోల్పోయాను. – నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘ధోని’ సినిమా షూటింగ్లో నీతో (సుశాంత్) గడిపిన సరదా సంఘటనలు నాకు గుర్తుకొస్తున్నాయి. అవి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. నీ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. – కియారా అద్వానీ నేను హీరోయిన్గా నటించిన నా తొలి సినిమాలో సుశాంత్ నా కో స్టార్. సుశాంత్ మరణ వార్త విని నా హృదయం బద్దలైంది. – వాణీకపూర్ మరికొందరు సెలబ్రిటీలు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించి, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. -
సినీనటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య
సాక్షి, చెన్నై : సీనియర్ నటి వాణిశ్రీ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెంగల్పట్టు జిల్లా తిరుక్కళుకుండ్రంలోని ఫాంహౌస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అభినయ్ బెంగళూరు నుంచి వచ్చాక హోం క్వారంటైన్లో ఉన్నారు. అయితే ఆయన అనూహ్యంగా శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా అభినయ్ భార్య కూడా వైద్యురాలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు అభినయ్ మృతిపై తిరుక్కళుకుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హోం క్వారంటైన్లో ఉన్న ఆయన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కాగా వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. అభినయ్ గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది. కుమారుడు హఠాన్మరణంతో వాణిశ్రీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (‘తనే విడాకులు కోరుకున్నాడు’) -
పెళ్ళైన ఆరు నెలలకే..!
సాక్షి, తాడేపల్లి రూరల్: పెళ్ళైన ఆరు నెలలకే అత్తమామలు, కట్టుకున్న భర్త, తోడికోడళ్ల వేధింపులకు ఓ యువతి ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అత్తమామలు, భర్త వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ యువతి తల్లి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత టోల్గేట్ ఎదురు రోడ్డులో నివాసం ఉంటున్న తాడిగడప శ్రీనివాసరావు గతంలో విజయవాడలోని పడమటలంకలో ఉండేవాడు. ఆరు నెలల కిందట అదే ప్రాంతంలో నివాసం ఉండే చీమలదిండి కొండయ్య, మల్లేశ్వరిల కుమార్తె వెంకటదుర్గ (20)ను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం తాడేపల్లికి కాపురాన్ని మార్చాడు. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి తక్కువ కట్నం ఇచ్చారు.. ఇస్తామన్న నెక్లెస్ ఇవ్వలేదంటూ వెంకటదుర్గను భర్త శ్రీనివాసరావు, అత్తమామలైన దుర్గారావు, లక్ష్మి, తోడికోడలు తరచు వేధించడం మొదలెట్టారు. శ్రీనివాసరావు కూడా కొట్టడంతో తల్లిదండ్రులకు కష్టాన్ని వివరించింది. శుక్రవారం రాత్రి శ్రీనివాసరావు ఫోన్ చేసి ‘నీ కూతురును తీసుకువెళ్లాలని.. ఒక గంటలో రాకపోతే చంపుతామని బెదిరించి’నట్లు మల్లేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే కదా అని మల్లేశ్వరి తాడేపల్లికి రాలేదు. ఉదయం కల్లా తన కూతురు చనిపోయిందని చెప్పారని, వెంటనే తాడేపల్లి వచ్చి చూడగా కింద పడుకోబెట్టారని కన్నీరుమున్నీరైంది. అత్తమామలు, భర్త వేధింపుల వల్లే తన కూతురు ఉరి వేసుకొని చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మార్వో సమక్షంలో పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి సీఐ అంకమ్మరావు తెలిపారు. -
లాడ్జిలో యువతీయువకుల ఆత్మహత్య
సాక్షి, తెనాలి: రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో యువతీ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువకుడిది అమరావతి మండలం జూపూడి గ్రామం కాగా, యువతిది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు సమీపంలో గొల్లగూడెం. పోలీసుల కథనం మేరకు.... జూపూడికి చెందిన ఏకుల సాగర్‌బాబు (25), గొల్లగూడెంకు చెందిన గాలంకి తేజస్వి (23) బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తెనాలి వచ్చారు. ఓవర్ బ్రిడ్జి వైపు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డులోని ఓ లాడ్జికి వెళ్లి రూం తీసుకున్నారు. సాయంత్రం ఆరు గంటలవుతున్నా ఉలుకూ పలుకు లేకపోవడంతో, అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపు సందులో నుంచి గదిని పరిశీలించారు. మంచంపై తేజస్వి అచేతనంగా పడి ఉంది. అలానే గదిలో రక్తం కారి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెళ్లి తలుపులు తెరచి చూడగా, తేజస్వి ఎడమ చేతి మణికట్టు వద్ద గాయమై మంచంపై మృతి చెంది ఉంది. సాగర్‌బాబు బాత్రూమ్లో మృతి చెంది పడి ఉన్నాడు. గదిని పరిశీలించిన పోలీసులు పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగడమే కాకుండా, తేజస్వి చేయి కోసుకుంది. త్రీ టౌన్ ఎస్ఐ చల్లా సురేష్ మతదేహాలను పరిశీలించారు. లభించిన ఓటరుకార్డు, లాడ్జి సిబ్బందికి ఇచ్చిన ఫొటో ఐడీ ఆధారంగా మృతులను గుర్తించారు. ఈ నెల 7వ తేదీన కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో తేజస్వి మిస్సింగ్ కేసు నమోదైనట్టు తెలిసింది. వీరిద్దరూ ప్రేమికులా, లేక బంధువులా అన్నది విచారణలో తెలియాల్సి ఉందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సమాచారమిచ్చామని తెలిపారు. వారు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతులిద్దరూ విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని పేర్కొన్నారు. సాగర్‌బాబుకు వివాహమయి, ఇప్పటికే ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భవతి అని సమాచారం. -
పబ్జీ మత్తులో విద్యార్థి ఆత్మహత్య
-
కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య
శ్రీనగర్: కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 33 ఏళ్ల అరవింద్ శనివారం ఉదయం ఎవరూ లేని సమయంలో తుపాకీతో కణతపై కాల్చుకుని అత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి సంబందించి కారణం మాత్రం ఇంకా తెలిసిరాలేదు. ఈనెల 14న సెలవులను ముగించుకోని విధుల్లో చేరిన అరవింద్ పదిరోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ, వ్యక్తిగత సమస్యల కారణంగానే జవాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2014లో సీఆర్పీఎఫ్లో చేరిన అరవింద్ ప్రస్తుతం అనంతనాగ్‌లోని సర్ధార్ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతదేహాన్ని ఆయన స్వగృహానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య
సాక్షి, గుంటూరు(మాడుగుల) : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత మహిళ గనిపల్లి మరియకుమారి (24) మంగళవారం అర్ధ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడుగుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి అన్నారావు తన అక్క కూతురైన మరియకుమారిని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. బడ్డీకొట్టు నడుపుతూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గనిపల్లి దిలీప్‌లెవి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా దిలీప్‌లెవి తన సెల్ ఫోన్‌ను పిల్లలతో మరియకుమారి వద్దకు పంపించి ఆమెతో మాట్లాడాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దిలీప్‌లెవి గతంలో రెండు మొబైల్స్‌ను పంపించగా మరియకుమారి భర్త అన్నారావు తీసుకొని గొడవపడ్డారు. మంగళవారం సాయంత్రం మరో మొబైల్‌ఫోన్ పిల్లలతో పంపించగా గమనించిన భర్త తీసుకొని ఆమె తల్లి, తమ్ముడికి విషయం తెలిపాడు. తమ్ముడు దారివేముల సునీల్ అక్కను మందలించగా తనకు ఏ పాపం తెలియదని, దిలీప్‌లెవి తనను చాలా కాలంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. అనంతరం మనస్తాపానికి గురైన మరియకుమారి అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రపోతుండగా ఇంట్లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నిద్రలేచిన భర్తకు భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలికి తొమ్మిదేళ్ల మానసిక దివ్యాంగుడైన కుమారుడు అశోక్, పదేళ్ల ప్రమీళ, మూడేళ్ల లతిక, 14 నెలల రుషి ఉన్నారు. అమ్మా...లే అంటూ పిల్లలు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణం నేపథ్యంలో ఆయన గ్రూప్ సంస్థల రుణ భారం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థతో పాటు ఆయనకు చెందిన పలు సంస్థలు .. వివిధ ఆర్థిక సంస్థలు మొదలుకుని బ్యాంకుల దాకా చాలా చోట్ల నుంచి ఎంత దొరికితే అంత అన్నట్లుగా రుణాలు సమీకరించాయి. అత్యంత తక్కువగా రూ. 1 లక్ష నుంచి అనేక కోట్ల దాకా తీసుకున్నాయి. స్టాక్ ఎక్సే్చంజీలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్ ద్వారా ఈ వివరాలు ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. బీఎస్ఈలో లిస్టయిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రుణభారం 2019 మార్చి 31 నాటికి రూ. 5,251 కోట్లుగా ఉంది. ఇది గతేడాది మార్చి ఆఖరున ఉన్న రూ. 2,457 కోట్లతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. ఇక సీడీఈఎల్ ప్రమోటర్ కంపెనీలు దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్, కాఫీ డే కన్సాలిడేషన్స్, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్, సివన్ సెక్యూరిటీస్ మొదలైనవి కూడా పలు దఫాలుగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయి. సోమవారం అదృశ్యమైన సిద్ధార్థ.. బుధవారం నేత్రావతి నదిలో శవంగా తేలిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యం కావడానికి ముందు ఆయన రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలోని అంశాలు సిద్ధార్థ ఆర్థిక సమస్యల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ఆయన సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్‌లోని విషయాలు బైటికి వస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే.. ► టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ (గతంలో జీఈ మనీ ఫైనాన్స్ సర్వీసెస్), షాపూర్జీ పల్లోంజీ ఫైనాన్స్ (ఎస్పీఎఫ్) వంటి సంస్థల నుంచి కూడా సిద్ధార్థ రుణాలు తీసుకున్నారు. ఇందులో టాంగ్లిన్ డెవలప్మెంట్స్ అనే అనుబంధ సంస్థకు ఎస్పీఎఫ్ రూ. 12 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు 2018 ఏప్రిల్‌లో ఎంసీఏకు సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. ► ఇక మరో ఫైలింగ్‌లో కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు ‘రూ. లక్ష దాకా టర్మ్ రుణ సదుపాయం కల్పించేందుకు‘ క్లిక్స్ క్యాపిటల్ అంగీకరించిన డీల్ గురించిన ప్రస్తావన ఉంది. ► సిద్ధార్థకు చెందిన అన్‌లిస్టెడ్ కంపెనీలు (ఆతిథ్య, రియల్టీ రంగాలవి) ఎంత మేర రుణాలు తీసుకున్నాయన్నది ఇంకా ఇథమిథ్థంగా తెలియనప్పటికీ.. వీటి అప్పుల భారం కూడా సీడీఈఎల్ స్థాయిలోనే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017 తర్వాత సిద్ధార్థ రుణాల పరిమాణం గణనీయంగా పెరిగింది. అయితే, గడువులోగా వీటిలో ఎన్ని రుణాలను చెల్లించారు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని మొండిబాకీలుగా మారా యన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి వుంది. ► ఎంసీఏ డేటా ప్రకారం 2018 మార్చి ఆఖరు నాటికి కాఫీ డే కన్సాలిడేషన్స్ స్వల్పకాలిక రుణాలు, తక్షణం జరపాల్సిన చెల్లింపుల పరిమాణం రూ. 36.53 కోట్లుగా ఉన్నాయి. ► వీజీ సిద్ధార్థ, సీడీఈఎల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు తమ వద్ద ఉన్న షేర్లలో మూడొంతుల షేర్లను తనఖా పెట్టాయి. ఇటీవలే రెణ్నెల్ల క్రితం జూన్‌లో కూడా సిద్ధార్థ కొన్ని షేర్లను అదనంగా తనఖా పెట్టారు. జూన్ ఆఖరు నాటికి సీడీఈఎల్‌లో సిద్ధార్థకు 32.7 శాతం, ఆయన భార్య మాళవిక హెగ్డేకు 4.05 శాతం, నాలుగు ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 17 శాతం మేర వాటాలు ఉండేవి. ► ప్రమోటింగ్ సంస్థలు తమ మొత్తం హోల్డింగ్‌లో 75.7 శాతం (సుమారు 8.62 కోట్ల షేర్లు) తనఖాలో ఉంచాయి. జూన్ ఆఖర్లో కూడా సిద్ధార్థ కొత్తగా మరో 1.39 శాతం (29.2 లక్షల షేర్లు) తనఖా పెట్టారు. గ్రూప్ కంపెనీలు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తుగా వీటిని కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరిట తనఖా పెట్టారు. ► ఇక సీడీఈఎల్‌లో సివన్ సెక్యూరిటీస్‌కి ఉన్న మొత్తం వాటాలు (0.21 శాతం) వాటాలు తనఖాలోనే ఉన్నాయి. అటు సీడీఈఎల్‌లో కాఫీ డే కన్సాలిడేషన్స్‌కు ఉన్న 5.81 శాతం వాటాల్లో 95.96 శాతం షేర్లు తనఖాలో ఉన్నాయి. ► దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్ వాటాల్లో 83.07 శాతం, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్ వాటాల్లో 78.9 శాతం వాటాలు తనఖాలో ఉన్నాయి. పార్లమెంటులోనూ సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన.. దివాలా స్మృతి (ఐబీసీ)పై చర్చ సందర్భంగా పార్లమెంటులో కూడా సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన వచ్చింది. వ్యాపార వైఫల్యాలనేవి జరగరానివేమీ కాదని, వ్యాపారవేత్త విఫలమైనంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపారం సజావుగా సాగని పక్షంలో వ్యాపారవేత్తలు గౌరవప్రదంగా తప్పుకునేందుకు తగు పరిష్కారమార్గం చూపడమే ఐబీసీ ఉద్దేశమని వివరించారు. అటు.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ విషాదాంతాన్ని ప్రస్తావిస్తూ వ్యాపారపరమైన వైఫల్యాల కారణంగా పరిశ్రమలు మూతబడుతున్నాయని వైసీపీ ఎంపీ ఎం శ్రీనివాసులు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. వ్యాపారాలు నడపడంలో కష్టాలు మరింతగా పెరుగుతున్నాయన్నారు. వ్యాపారసంస్థల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాయితీగా పనిచేసే సంస్థలను, తప్పుడు విధానాలు పాటించే సంస్థలను ప్రభుత్వం ఒకే రీతిగా చూస్తోందంటూ ‘గుర్రాలు, గాడిదలను ఒకే గాటన కట్టేయడం సరికాదు’ అని శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పూచీకత్తు కారణంగా ఒక పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకోవాల్సిన తీవ్ర పరిస్థితులు తలెత్తడం సరికాదని టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. -
క్యూనెట్ బాధితుడు అరవింద్ ఆత్మహత్య
హైదరాబాద్: రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ ఓ యువకుడిని బలి తీసుకుంది. క్యూనెట్‌లో పెట్టుబడి పెట్టిన బాధితుడు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన అడపు అరవింద్ (31) చందానాయక్ తండాలోని సీఎస్ఆర్ ఎస్టేట్‌లో రెండేళ్లుగా నివాసం ఉంటున్నాడు. లిగిన్ ఫెర్నాండేజ్ అనే అతనితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఫెర్నాండేజ్ డ్యూటీ కి వెళ్లగా అరవింద్ ఇంట్లోనే ఉన్నాడు. డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన ఫెర్నాండేజ్ డోర్ కొట్టగా స్పందించలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా అరవింద్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి వద్ద క్యూనెట్ ఐడీ కార్డు లభించింది. కాగా, అరవింద్ అసెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి 2017లో ఉద్యోగం మానేశాడు. క్యూనెట్‌లో 2017లో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాడు. రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న అరవింద్‌కు పెట్టిన డబ్బులు రాకపోగా ఉద్యోగం కూడా లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: జిల్లాలోని యాడికి మండలం నగరూరులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరూరుకు చెందిన వినోద్, సుచరిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహాం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెద్దల అనుమతితో వివాహాం చేసుకుందామనుకున్న వారికి ఇద్దరి కుటుంబ పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమికులు శనివారం అర్థరాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇద్దరి ప్రేమికుల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. ఇరు కుటుంబాల తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఇదే జిల్లాలోని కంబదూరులో ప్రేమ వ్యవహారానికి ఓ నిండు ప్రాణం బలైన విషయం తెలిసిందే. మండల కేంద్రం కంబదూరుకు చెందిన ఎరుకల రవి (20) హత్యకు గురయ్యాడు. రవిని అమ్మాయి కుంటుంబ సభ్యులు గొంతు, ముఖంపై కత్తులతో నరికి చంపేశారు. ఇలా ఓకే రోజు వరుస ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. -
రెవెన్యూ అధికారులే చంపేశారు
ఒంగోలు సబర్బన్/నాగులుప్పలపాడు: రెవెన్యూ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం రైతును బలితీసుకున్నాయి. నాగులుప్పలపాడులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఎలుకల మందు తిని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు నడిపినేని రత్తయ్య (68) ఆత్మహత్య చేసుకోవడానికి స్థానిక రెవెన్యూ అధికారులే కారణమని అతని కుటుంబ సభ్యులు, కుమారుడు శ్రీనివాసులు ఆరోపించారు. రైతు మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో బుధవారం పోస్టుమార్టం పూర్తికాగా, అతని కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నాగులుప్పలపాడు మండలంలోని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన నడిపినేని రత్తయ్యకు భార్య వరమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రామంలో తమకు ఉమ్మడిగా ఉన్న 4.54 ఎకరాల పొలంలో రత్తయ్య వ్యవసాయం చేస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరుస కరువుతో పంటలు చేతికిరాక పెద్ద మొత్తంలో అప్పుల చేయాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా వర్షాలు లేక కనపర్తి ఎత్తిపోతల పథకం కింద మాగాణి సాగు నిలిచిపోయింది. గుండ్లకమ్మ ఎడమ కాలువ కింద గత నాలుగేళ్లలో అధికారులు చుక్క నీరు వదల్లేదు. దీంతో భూములు బీళ్లుగా మారాయి. దీంతో అప్పు తీర్చే దారి లేక ఉన్న ఇంటిని తెలిసిన వారి వద్ద రత్తయ్య తాకట్టు పెట్టాడు. అప్పుకు సంబంధించి ప్రతి నెలా వడ్డీలు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు రూ.15 లక్షలు దాటడంతో తమకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి అప్పులు తీరుద్దామని అనుకున్నాడు. కానీ, ఆ పొలం ఆన్లైన్లో తన తండ్రి రంగయ్య పేరుతో ఉంది. వెబ్ ల్యాండ్ నమోదులో ఏర్పడిన పొరపాటును సరిదిద్దాలని నాగులుప్పలపాడు రెవెన్యూ అధికారుల చుట్టూ రెండేళ్లుగా రత్తయ్య ప్రదక్షిణలు చేస్తున్నా వారు కనికరించలేదు. అవినీతికి అలవాటుపడిన రెవెన్యూ అధికారులు.. రత్తయ్య నుంచి మామూళ్లు అందలేదన్న కారణంతో అతని పని గురించి పట్టించుకోలేదు. ఒకవైపు అప్పులోళ్ల ఒత్తిళ్లు.. మరోవైపు రెవెన్యూ అధికారుల వేధింపులు వెరసి చివరకు తనువు చాలించడమే పరిష్కారమార్గమని రత్తయ్య భావించాడు. గత సోమవారం రాత్రి పొద్దుపోయాక నాగులుప్పలపాడులోని మండల కార్యాలయాల సముదాయంలో గల గృహనిర్మాణ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి రాగా, సీఐ సుబ్బారావు, ఎస్సై సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, బుధవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలి : రైతు సంఘాల నేతల డిమాండ్ రైతు రత్తయ్య ఆత్మహత్యకు కారణమైన నాగులుప్పలపాడు మండల రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వివిధ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక రిమ్స్‌లో రత్తయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ధనదాహం వల్లే రైతు రత్తయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. ఆన్లైన్ అక్రమాలతో రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రత్తయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో రైతు సంఘాల నేతలు చుండూరు రంగారావు, వడ్డె హనుమారెడ్డి, చావల సుధాకర్, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బైరపనేని సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
పెళ్లింటా విషాదం..
సాక్షి, వరంగల్ : పెళ్లింట్లో విషాదం నెలకొంది. కొద్దిరోజుల్లో తమ్ముడి వివాహం నిర్వహించనుండగా సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీ ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్త జక్కుల రాధాకృష్ణ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని కోమటిపల్లి– చింతగట్టు మార్గమధ్యలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం గుర్తించారు. ఈమేరకు స్థానికుల సమాచారం మేరకు కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం నుజ్జునుజ్జయి ఉంది. సమీపంలో నిలిపి ఉన్న వాహనంతోపాటు మృతుడు ధరించిన షర్ట్ ఆధారంగా రాధాకృష్ణగా ధ్రువీకరించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన జక్కుల రాధాకృష్ణ (32) శ్రీఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. అతడు అవివాహితుడు. రాధాకృష్ణకు రెండేళ్లుగా ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి సాక్షిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు పెళ్లి విషయమై రెండుమూడు సార్లు అమ్మాయితో మాట్లాడారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందా? లేదా.. అమ్మాయి తరఫువారు బెదిరించారా? అనే విషయమై మృతుడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయే రాధాకృష్ణ మృతికి కారణమని ఆయన సోదరుడు విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరో ఐదు రోజుల్లో తమ్ముడి పెళ్లి.. ఈనెల 26న రాధాకృష్ణ చిన్న తమ్ముడి వివాహం నిశ్చియమైంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికలు కూడా చేరాయి. ఇంతలో రాధాకృష్ణ రైలు కింద పడి మృతి చెందాడనే సమాచారం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
బ్రెజిల్ స్కూల్లో కాల్పులు.. 8 మంది మృతి
సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో నగర శివార్లలోని ఓ పాఠశాలలోకి బుధవారం ఇద్దరు దుండగులు ప్రవేశించి కాల్పులు జరిపి 6 మందిని పొట్టనబెట్టుకున్నారు. దుండగులిద్దరూ కౌమార దశలో ఉన్నవారని అధికారులు చెప్పారు. కాల్పులు జరిపిన అనంతరం వారే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు. సంఘటన స్థలంలో ఐదుగురు చిన్నారులు, ఓ టీచర్, ఇద్దరు దుండగులు సహా మొత్తం 8 మృతదేహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారని బ్రెజిల్‌కు చెందిన ఓ వార్తా వెబ్సైట్ తెలిపింది. -
యువకుడు ఆత్మహత్య
సాక్షి, అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : ‘నాకు బతుకు మీద ఆశలేదు.. నేను చనిపోతాను..’ అంటూ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు చెప్పినంత పని చేశాడు. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్ ప్రాంతానికి చెందిన అమర్లపూడి సుశీలకుమారికి కూతురు, కొడుకు సంతానం ఉన్నారు. కొడుకు అవినాష్ (22) డిగ్రీ వరకూ చదువుకున్నాడు. కొంతకాలం నుంచి ఆయనకు మతి స్థిమితం సరిగా ఉండడం లేదు. దీంతో శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అవినాష్ తన అక్కకు ఫోన్ చేసి తనకు బతకాలని లేదని, తాను చనిపోతానంటూ ఫోన్ చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన అతని తల్లి, అక్క చుట్టుపక్కల ప్రాంతాలు, నగరంలో పలు చోట్ల వెతికి నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కృష్ణా నదిలో ఆదివారం ఓ యువకుడి శవం లభ్యమైనట్లుగా సమాచారం అందింది. విషయాన్ని అవినాష్ కుటుంబ సభ్యులకు తెలుపగా వారు వెళ్లి చూసి చనిపోయిన ఆ వ్యక్తి అవినాషేనని తేల్చారు. పోలీసులు మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా మార్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. తమ కుమారుడు మృత్యువాతపడ్డాడని తెలుసుకున్న ఆ తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అవినాష్ (ఫైల్) -
వరంగల్ : పెళ్లికి అప్పుచేసి.. ఆత్మహత్య
సాక్షి, వెంకటాపురం(ఎం): కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చే స్థోమత లేక మనస్తాపం చెంది అజ్మీర లక్ష్మి (40) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బావుసింగ్‌పల్లిలో సోమవారం జరిగింది. వెంకటాపురం ఎస్సై నరహరి కథనం ప్రకారం... బావుసింగ్‌పల్లికి చెందిన లక్ష్మికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. భర్త లక్ష్మణ్ పదేళ్ల క్రితమే మృతిచెందాడు. పెద్ద కూతురు రమ్య వివాహానికి అప్పు చేసింది. ఆ అప్పును తీర్చే స్థోమత లేక మనస్థాపం చెందిన లక్ష్మీ ఆదివారం రాత్రి ఇంటి వద్దనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు లక్ష్మిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెం దింది. మృతురాలి కూతురు రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
అంజినరెడ్డి కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం
వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా ప్రభుత్వం ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోలేదు. అనంతపురం జిల్లా రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన కురుబ నారాయణప్ప కుమారుడు అంజినరెడ్డి(38)అనే రైతు అప్పులు తీర్చే దారి లేక ఈ ఏడాది జూన్ 26న తన ఇంటిలోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి పేరున 4 ఎకరాల భూమి ఉంది. వర్షాభావం వల్ల నాలుగేళ్లుగా పంటలు సరిగ్గా పండలేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ. 9 లక్షలకు పైగా ఉన్నాయి. కోగిర కెనరా బ్యాంకులో మృతుడి పేరు మీద రూ. 1.40 లక్షలు, తండ్రి పేరున రూ. 2 లక్షలు, మృతుడి భార్య పేరున రూ. 1.40 లక్షల అప్పుంది. వడ్డీ వ్యాపారుల దగ్గర రూ. 5 లక్షలు అప్పు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వీరి రుణాలు మాత్రం మాఫీ కాలేదు. వ్యవసాయ బోరులో భూగర్భ జలాలు అడుగంటడంతో వేరుశనగ, మల్బరీ పంటల దిగుబడి దెబ్బతిన్నది. అప్పులు ఎలా తీర్చాలని అంజినరెడ్డి భార్య అశ్విని, తండ్రి నారాయణప్పతో చెప్పి ప్రతి రోజూ మథనపడేవారు. ఈ నేపథ్యంలో గాలివాన బీభత్సానికి పట్టుపురుగులు పెంచే రేషం షెడ్డు కూలిపోయింది. రూ. 4 లక్షలు నష్టపోవడంతోపాటు షెడ్డు కూలిన సంఘటనలో మృతుడి కాలు విరిగింది. పంటలు సరిగ్గా లేకపోయినా ఆర్థికంగా చేదోడుగా ఉన్న పట్టుపురుగుల పెంపకంతో ఇల్లు గడిచేది. అయితే, షెడ్డు కూలిపోవడంతో అదీ లేకుండా పోయింది. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన అంజినరెడ్డి అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ఆడపిల్ల ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు ఆత్మహత్య చేసుకోవడంతో ఆడ పిల్లను ఎలా పోషించుకోవాలో తెలియక మృతుడి భార్య దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చి గ్రామంలో విచారణ కూడా చేసుకు వెళ్లారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఈ కుటుంబానికి ఎటువంటి పరిహారం అందలేదు. – కె.ఎల్. నాగరాజు, సాక్షి,రొద్దం, అనంతపురం జిల్లా -
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నర్మెట: గుర్తుతెలియని ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలం లోని లోక్యాతం డా శివారులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకోగా వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతదేహం వేలాడుతూ కనిపించింది. స్థానికులను విచారించగా వ్యక్తి వివరాలు తెలియరాలేదని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు.మృతుడు ఎర్రని చారల చొక్కా, చెవి పోగుతో గుండు చేయించుకున్న చామనచాయ రం గు కలిగి సుమారు 40 ఏండ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. స్థలంలో తెల్లని ప్లాస్టిక్ సంచి, టార్చిలైటు, నల్లని ప్యారాగాన్ చెప్పులు, దు ప్పటి, బొంతలు లభించాయని తెలి పారు. ఈ వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నుట్ల ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. -
కువైట్‌లో వైఎస్సార్ జిల్లా వాసి ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ : కవైట్‌లో నివసిస్తున్న వైఎస్సార్‌జిల్లా వాసి ఓ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుండుపల్లె మండలం గుట్టకింద రాచపల్లి గ్రామానికి చెందిన గండికోట ఆనంద్ (44) కువైట్‌లో మహాబుల్లా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో తను నివసిస్తున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. -
కడప జిల్లావాసి కువైట్‌లో ఆత్మహత్య
-
అమెరికాలో కాల్పులు... ఐదుగురు మృతి
లాస్ ఏంజిలెస్: అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఉన్మాది గురువారం జరిపిన కాల్పులో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో అతని భార్య కూడా ఉంది. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఉన్మాది మొత్తం 5 ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మొత్తంగా 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. -
కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?
30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొని ఆత్మహత్య పాలైన ఏడాదిన్నరకు కూడా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కొపూరి పున్నారావు (50) 2017 మే 13న ఇంట్లోనే పురుగులమందు తాగారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్తెనపల్లిలోని ఆస్పత్రికి తరలించగా.. 17న చనిపోయారు. సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. 2017లో ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో రూ. 5 లక్షల అప్పు తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు కూడా భూమి లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధార పడి జీవిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు. – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు -
ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: రోజా
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకుంటారంటూ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. గతంలో ఏపీ హోదా కోరుతూ మునికోటి అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాన్ని ఇప్పటివరకూ ప్రభుత్వం ఆదుకోలేదనే విషయాన్ని రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలా ఎంతా మంది ప్రాణాలు తీసుకుంటారంటూ ప్రభుత్వాన్ని రోజా నిలదీశారు. శనివారం ప్రత్యేక హోదా కోరుతూ మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్ బలవన్మరణానికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. సుధాకర్‌ది ఆత్మహత్య కాదని.. ఇది ముమ్మాటికీ సర్కార్ చేసిన హత్యేనన్నారు. వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ-చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమాయ్యాయని ప్రశ్నించారు. హోదాపై ఉద్యమాలు చేస్తుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రోజా పేర్కొన్నారు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారే తప్ప హోదాపై నిలదీయడం లేదని రోజా విమర్శించారు. -
ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : భర్త పెడుతున్న చిత్రహింసలకు తాళలేక బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఎయిర్‌హోస్టెస్ అనిస్సియా బత్రా(32) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు అనిస్సియా బత్రా భర్త మయాంక్‌కు గతంలోనే వివాహం అయినట్లు విచారణలో తెలిసింది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదాలు ముదిరి చివరకు అనిస్సియా ఆత్మహత్యకు దారి తీశాయంటున్నారు పోలీసులు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసాధికారి ఒకరు ‘విచారణలో భాగంగా మయాంక్‌కు అనిస్సియా కంటే ముందే మరో మహిళతో వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని మయాంక్ అనిస్సియాకు చెప్పకుండా రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. అనిస్సియా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నెల రోజుల ముందు మయాంక్ మొదటి వివాహం గురించి ఆమెకు తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సున్నిత మనస్కురాలైన అనిస్సియా ఈ విషయాన్ని తట్టుకోలేక పోయింది. ఈ కారణం వల్లే ఆమె బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది’ అని తెలిపారు. కట్నంగా బీఎమ్‌డబ్య్లూ కార్... వివాహ సందర్భంగా అనిస్సియా తల్లిదండ్రులు దంపతులకు బీఎమ్‌డబ్య్లూ కార్ బహుకరించారు. అడిగినంతా కట్నం కూడా ఇచ్చారు. కానీ మయాంక్ మాత్రం వివాహం అయిన రెండో రోజు నుంచే తమ కూమార్తేను వేధించడం ప్రారంభించాడని అనిస్సియా తల్లిదండ్రులు వాపోయారు. హనీమూన్‌కు వెళ్లిన రెండో రోజునుంచే తమ కుమార్తేను కొట్టడం ప్రారంభించాడని, అదనపు కట్నం కోసం వేధించాడని పోలీసులకు తెలిపారు. మయాంక్‌తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలని అనిస్సియా తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేశారు. -
కులం పేరుతో దూషించారని వివాహిత ఆత్మహత్య
సాక్షి, హిందూపురం అర్బన్ : కులం పేరుతో దూషించారని మనస్తాపం దళిత సామాజిక వర్గానికి చెందిన అరవింద (24) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వీవర్స్కులానికి చెందిన ప్రసాద్, దళిత అరవింద(24)ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆరు నెలల కలిసిబాగానే ఉన్నప్పటికి సీమంతం సమయంలో అరవిందను కులంపేరుతో భర్త వేధింపులకు గురిచేశాడు. మనస్తాపానికి గురైన అరవింద బుధవారం ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటేశులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు వెంకటరాముడు, గంగాధర్, శివశంకర్‌లు మృతురాలి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వివాహిత మృతికి కారకులైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
నిట్‌లో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
కాజీపేట అర్బన్: వరంగల్‌లోని నిట్‌లో ఎంటెక్ తొలి ఏడాది విద్యార్థి అమిత్‌కుమార్ (31)మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్ రాష్ట్రంలోని నవాడాకు చెందిన శంకర్ ప్రసాద్, లలితాదేవి దంపతుల కుమారుడు అమిత్ నిట్‌లో ఎంటెక్ ట్రిపుల్ఈ విభాగంలో ‘పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్’ కోర్సు చదువుతున్నాడు. నిట్‌లోని 1.8కే అల్ట్రామెగా హాస్టల్లోని ఏ8–27 గదిలో ఉంటున్న అమిత్.. రోజూ తండ్రితో ఫోన్లో మాట్లాడేవాడు. 2 రోజులుగా ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో తండ్రి శంకర్‌ప్రసాద్.. అమిత్‌మిత్రుడు రాహుల్‌కు ఫోన్ చేసి తన కొడుకుతో మాట్లాడించమని అడిగాడు. అమిత్‌ను కలిసేందుకు వెళ్లిన అతడి మిత్రులు హాస్టల్ గదిలో అమిత్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటం గమనించారు. వెంటనే వారు నిట్ యాజమాన్యం, కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఇటీవల పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం, స్టైఫండ్ ఆగిపోవడంతో మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఇన్స్పెక్టర్ అజయ్ తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే కాటసానికి పుత్రశోకం
సాక్షి, బనగానపల్లె : వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి పుత్రశోకం కలిగింది. పెద్దకుమారుడు నాగార్జునరెడ్డి(26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులకు కుమార్తెలు ప్రతిభ, ప్రణతి, కుమారులు నాగార్జునరెడ్డి, ఓబుళరెడ్డి ఉన్నారు. కుమార్తెలద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భార్యే ప్రతిభ. నాగార్జునరెడ్డి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్, బెంగళూరులో రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు వచ్చాడు. రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఆప్యాయంగా మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. అయితే ఉదయం 10 గంటలైనా గది నుంచి బయటకురాకపోవడంతో కుటుంబ సభ్యులు గది వద్దకు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. కన్నీటి పర్యంతమైన కాటసాని దంపతులు పెద్దకుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండడంతో కాటసాని రామిరెడ్డి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి వద్దకు చేరుకొని కాటసాని దంపతులను ఓదార్చారు. విషయం తెలిసిన క్షణాల్లోనే కాటసాని నివాసం జనసంద్రమైంది. ప్రముఖుల నివాళి.. కాటసాని నాగార్జునరెడ్డి మృతదేహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్సీపీ పత్తికొండ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నేత గంగుల నాని, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసార«థిరెడ్డి, నంద్యాల టీడీపీ నాయకులు శ్రీధర్‌రెడ్డి, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. దహన సంస్కారాలు: పట్టణ శివారులోని అవుకు రోడ్డులో ఉన్న కాటసాని సొంత స్థలంలో నాగార్జునరెడ్డికి సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో నేర వార్తలు..
దొంగా..దొంగా ఇది మణిరత్నం సినిమా కాదు. నేడు రాజధానిలో ప్రతి వీధిలోనూ ఈ పిలుపు వినని వారు లేరు. ఒకవైపు దోపిడీలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. మరోవైపు హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్నో వృత్తిగా, ప్రవృత్తిగా భావిస్తూ డబ్బును దోచేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పొగ తాగిన వాడు దున్నపోతై పుట్టున్.. భాద్యతలు మరిచి, వ్యసనాలకు బానిసై పూటుగా మద్యం సేవిస్తున్నారు. ఆపై గంజాయి సేవిస్తూ, గుట్కాను తీసుకుంటూ ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఇళ్లు గుల్ల చేస్తున్నారు. చివరకు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. చిన్న వయసులోనే అసువులు భాస్తున్నారు. తెలంగాణలో.. సాక్షి, తిరుమలగిరి : దోపిడీ దొంగలు మరో మారు రాజధానిపై తమ పంజా విసిరారు. తిరుమలగిరిలోని దారుంము మిడ్ మైట్‌లోని అపార్ట్మెంట్లో సీనియర్ సిటిజన్ సులోచన ఇంట్లో దొంగలు భీబత్సం సృష్టించారు. నగలు, డబ్బును దోచుకోవడమే కాకుండా అడ్డువచ్చిన ఆమెను పాశవికంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీపుటేజీలను పరిశీలించి, దొంగల కోసం తనిఖీలు చేపట్టారు. సాక్షి, మంచిర్యాల : దండేపల్లి మండల కేంద్రానికి చెందిన బూసిరాజుల నగేష్ (27) అనే యువకుడు కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్నిపంచనామాకు తరలించారు. సాక్షి, సూర్యాపేట : చివ్వేంల మండలం దూరాజ్పల్లి గ్రామంలో ఇంట్లో అక్రమంగా గుట్కా పాకెట్లను నిల్వ ఉంచారు. వీటి విలువ దాదాపు 12 లక్షల రుపాయాలు ఉంటుంది. వీటిని ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా ఆటోను పట్టుకున్నారు. అందులోని గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాక్షి, పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి యాదవనగర్ వద్ద వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ వ్యక్తి వివరాల కోసం అన్వేషించారు. ఇది ఆత్మహత్య లేదా హత్య అనేది విచారణలో నిగ్గు తేలుస్తామని తెలిపారు. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లో.. సాక్షి, వైఎస్సార్ : సుండుపల్లి మండలం పెద్దబలిజపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో మద్యం సేవించి ఇద్దరు యువకులు మృతి చెందారు.వారి కుటుంబ సభ్యులు భోరున విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. కల్తీ మద్యం త్రాగడం వల్లే చనిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయచోటి ఆసుపత్రికి తరలించారు. సాక్షి, వైఎస్సార్ : కమలాపురం మండలం పెద్దచెప్పలిలో గుట్కా అమ్మకాలు జరుపుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు ఒక లక్షా యాభై వేలరూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కరీంనగర్లో విషాదం
సాక్షి,కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కుతుర్లు మృతి చెందారు. తల్లి అనసూర్య(85), కూతురు విజయ (55) శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
రూ.10 వేలు కోసం ప్రాణం తీసుకున్నాడు
ఏటూరునాగారం : తన అవసరాలను తీర్చుకోవడానికి తల్లిని రూ.10 వేలు అడిగితే ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు జంపన్నవాగు సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఆకులవారి ఘణపురంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన భూక్య రాజు, విజయ దంపతుల కుమారుడు భూక్య బాలాజీ (23) బుధవారం రాత్రి తల్లిని రూ.10 వేలు కావాలని అడిగాడు. తల్లి ఇవ్వకపోవడంతో బాలాజీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి పలుచోట్ల వెతికినా అతడి జాడ కనిపించలేదు. గురువారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఉండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ బెట్టింగ్ కారణమా ? ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన బాలాజీ మృతికి ఐపీఎల్ బెట్టింగ్ కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందని బెట్టింగ్‌లు ఏటూరునాగారం ప్రాంతంలో జరుగుతున్నాయని సమాచారం. ఈ మేరకు తన మిత్రులతో ఐపీఎల్ బెట్టింగ్ పెట్టిన బాలాజీ, తాను చాలెంజ్ చేసిన జట్టు ఓడిపోవడంతో రూ.10 వేలు మిత్రుడికి బాకీ పడినట్లు తెలిసింది. డబ్బులు ఎలాగైనా ఇవ్వాలని మిత్రులు ఒత్తిడి చేయడంతో డబ్బులను ఇంటి వారి నుంచి రాబట్టలేక, ఇటు స్నేహితులతో మాటపడలేక తనువు చాలించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో పోలీçసులు బెట్టింగ్‌కు పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేసి జరిమానా విధించారు. అయిన బెట్టింగ్‌లు అదుపులోకి రాకపోవడం గమనార్హం. -
డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
జడ్చర్ల : వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని కోడ్గల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యమ్మ, శేఖర్ దంపతుల కూతురు అలివేలు(19) జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనై శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే డిగ్రీ వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలివేలు ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. -
టాపర్ కాలేదని... గన్‌తో కాల్చుకుంది
సాక్షి, న్యూఢిల్లీ : తాను ఆశించినట్టుగా టాప్ ర్యాంక్ రాలేదని మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. జింద్ జిల్లాలోని ఓ స్కూల్ బాలిక...పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలుస్తుందని ఆశించింది. కానీ తీరా టాపర్ కాలేదని తెలిసి సోమవారం తన తండ్రి వద్ద ఉన్న గన్‌తో కాల్చుకుని తనువు చాలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివాహ గ్రామ సర్పంచ్ వేద్‌పాల్ సింగ్ కుమార్తె అంజలి కుమారి ఇండస్ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతోంది. తాజాగా వెలువడిని ఫలితాల్లో తాను ఆశించినట్టుగా టాప్ ర్యాంక్ రానందుకు తీవ్ర మనస్తాపానికి లోనయింది. భావోద్వేగం నియంత్రించుకోలేక తన తండ్రి వద్ద ఉండే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం నాడు ఆ కుటుంబం అంతా దగ్గర్లోని వేరే గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో అంజలి ఇంటి వద్దే ఉంది. తొందరగా ఇంటికి రమ్మని తన తండ్రికి ఫోన్ చేసింది. కానీ వచ్చేసరికి బాత్రూమ్లో కాల్చుకుని పడి ఉంది. ఆస్పత్రికి తరలించ క్రమంలో మరణించిందని వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కాగా హరియాణా ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు ఆ స్కూల్ యజమాని కావడం గమనార్హం. -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
హైదరాబాద్: భూవివాదంలో న్యాయం జరగక పోవడంతో ఆత్మహత్యకు యత్నించిన బాధితు రాలు వెంకటవ్వ(65) ఆదివారం మృతి చెం దింది. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లకు చెందిన కేతిరెడ్డి బాల్‌రెడ్డి, వెంకటవ్వ(65) దంపతులు హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఈ నెల 17న పురుగుల మందు తాగిన విషయం విదితమే. అప్పటి నుంచి దంపతులు ఇక్కడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వెంకటవ్వ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. బాల్‌రెడ్డి కోలుకుంటున్నారు. కాగా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వెంకట్‌రెడ్డితోపాటు రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లేపల్లి యాదిరెడ్డి, భారతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన బాల్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం వెంకటవ్వ మృతదేహాన్ని సందర్శించారు. బాల్‌రెడ్డి మూడుసార్లు సర్పంచ్‌గా, ఒకసారి సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేశారని చాడ చెప్పారు. వారికి అయిన వైద్యఖర్చులను ప్రభుత్వమే భరించాలని, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రేమకోసం..ప్రాణ త్యాగం
ఇద్దరూ ఇష్టపడ్డారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జీవితాంతం తోడు నీడగా బతకాలని నిర్ణయించుకున్నారు. ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ప్రేమికుల కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ.. చదువు, ఉద్యోగం, అంతస్థులు సరితూగవంటూ అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. ఇక చేసేదిలేక పెద్దల ఒత్తిడితో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే ప్రేమికులిద్దరూ తమ అనుబంధాన్ని మరచిపోలేకపోయారు. కలిసి జీవించలేకపోయినా.. కలిసి మరణించారు.. విశాఖ,ఆనందపురం/రోలుగుంట: ప్రేమ ఎంత మధురమో.. అంత కఠినం.. మనసు పడ్డ మనిషిని అందుకోలేకపోతే బతుకు వృథా అనిపిస్తుంది.. అందుకే బతుకంతా ఆనందంగా గడపాల్సిన జంట ఊరు కాని ఊరిలో ఆనందపురం మండలంలోని గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాలకు సమీపంలోని జీడి తోటలలో విగత జీవులుగా మిగిలారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి హరిబాబు అలియాస్ శ్రీను (32), బంటు రేవతి (28)ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హరిబాబు ఇంటర్ వరకు చదువుకున్నాడు. రేవతి డీ ఫార్మశీ చేసింది. ఎం ఫార్మశీ చదువుతూ.. నర్సీపట్నంలోని ఒక మెడికల్ షాపులో నాలుగేళ్ల నుంచి పనిచేస్తోంది. ఇద్దరూ ప్రతి రోజు కలుసుకునేవారు. వారిది ఒకే సామాజికవర్గం. అంతేకాక ఇరు కుటుంబాలకు బంధుత్వం ఉంది. వారి ప్రేమ విషయం తెలిసిన శ్రీను తల్లిదండ్రులు రేవతి పెద్దల వద్దకు వెళ్లి పెళ్లి విషయం మాట్లాడారు. చదువు తక్కువని, చిన్న ఉద్యోగమని వారు నిరాకరించారు. దాంతో గతేడాది శ్రీను తల్లిదండ్రులు కోటవురట్ల మండలం కలవలపూడి గ్రామానికి చెందిన యువతితో వివాహం చేశారు. ప్రేమను మరచిపోలేక.. పెళ్లి జరిగినా శ్రీను రేవతిని మరచిపోలేకపోయాడు. వారి మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఇది వారి కుటుంబాల్లో ఘర్షణకు దారి తీసినట్టు సమాచారం. దీంతో కలిసి జీవించలేమని ఒక నిర్ణయానికి వచ్చిన ప్రేమికులు చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈనెల 17న శ్రీను నర్సీపట్నంలో రేవతి పనిచేస్తున్న మెడికల్ షాపు వద్దకు వెళ్లి ఆమెను మోటార్‌బైక్‌పై ఎక్కించుకొని వెళ్లాడు. రెండు రోజులైనా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 19న నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గుడిలోవ కొండ ప్రాంతంలోని జీడి తోటలో ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండడాన్ని గమనించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ ఆర్.గోవిందరావు, ఎస్ఐ గణేష్, డీటీ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అక్కడ లభ్యమైన బ్యాగ్‌లోని గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇరువురి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని శ్రీను, రేవతిలుగా గుర్తించారు. వారి మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని ఇద్దరి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సీఐ ఆర్.గోవిందరావు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలోనే బైక్ మృతదేహాలు లభ్యమైన జీడి తోటల్లోనే మృతుడి బైక్, మృతురాలి హ్యాండ్ బ్యాగ్ లభ్యమయ్యాయి. ప్రియురాలి చున్నీతో శ్రీను ఉరి వేసుకోగా.. రేవతి మృతదేహం మాత్రం నేలపై పడివుంది. ఆమె ఏ విధంగా మరణించిందో తెలియరాలేదు. ఇద్దరి మృతదేహాలు బాగా ఉబ్బి ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలంలో కూల్ డ్రింక్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు లభించాయి. హ్యాండ్ బ్యాగ్, హెల్మెట్ ,సంఘటన స్థలంలోనే బైక్ ఒకే చోట దహనం చేయాలి.. మృతుల చివరి కోరిక! తమ మృతదేహాలను ఒకే దగ్గర దహనం చేయాలని మృతులు ఫోన్లో వారి స్నేహితులకు, బంధువులకు సంక్షిప్త సందేశం పంపినట్టు తెలుస్తోంది. వీరి మరణాలతో ఇరువురి తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో ప్రేమానుబంధాలతో జీవితం సాగించాల్సిన ప్రేమికులు విగత జీవులుగా మారడం గ్రామస్తులను సైతం కంట తడి పెట్టిస్తోంది. -
తండ్రీకూతురి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్: తండ్రి, కూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ మండలంలోని అనంతారం గ్రామ శివారు, మొగిలిచర్ల గ్రామానికి వెళ్లే దారిలో గల వ్యవసాయ బావి వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మానుకోట జిల్లా కేంద్రంలోని పాతబజార్ నేతాజీ స్కూల్ గల్లీలో బంగారం షాపు నడుపుకునే తుమ్మనపల్లి శివకుమార్ (36)కు భార్య సరిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కళవర్షిత(12) వికలాంగురాలు. శివకుమార్ శనివారం అమావాస్య కావడంతో బంగారం షాపుకు సెలవు ఉండటంతో షాపుకు వెళ్లలేదు. వీరబ్రహేంద్రస్వామి దేవాలయంలో జరిగిన పరపతి సంఘం, పట్టణంలోని ఓ చిట్‌ఫండ్ కంపనీలో జరిగిన వ్యక్తిగత పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ...పెద్ద కుమార్తె కళవర్షితను తన వెంట తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో మాహబూబాబాద్ మండలంలోని అనంతారం గ్రామ శివారు, కురవి మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి వెళ్లే దారిలో గల ఓ వ్యవసాయ బావి పక్కన రెండు మృతదేహాలు ఉన్నట్లు మహబూబాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ సంఘటన స్థలానికి వెళ్లి వారి వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా తుమ్మనపల్లి శివకుమార్, అతడి కుమార్తె కళవర్షితగా గుర్తించారు. అయితే కుమార్తె కళవర్షితకు కూల్ డ్రింక్ బాటిల్లో బంగారం పనికి సంబంధించిన కెమికల్ కలిపి ఆమెకు తాపించి, తాను మద్యంలో కలుపుకుని తాగి మృతి చెందినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించామని ఎస్సై తెలిపారు. మృతదేహాలను 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మృతికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని ఎస్సై జితేందర్ తెలిపారు. -
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో జగిత్యాల జిల్లా విద్యానగర్‌కు చెందిన మేడిశెట్టి మహేశ్(24) మంగళవా రం హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీఏ పూర్తి చేసిన మహేశ్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నరేశ్ అనే వ్యక్తి రూ.2 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా అతను ఉద్యోగం చూపించకపోవడంతో మనస్తాపానికి గురైన మహేశ్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కాగా, మహేశ్ స్వగ్రామంలో సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని ఉంచడానికి నిరాకరించారు. దీంతో శవాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా గొల్లపల్లి రోడ్‌లోని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతుడి తండ్రి మూడేళ్లక్రితం ఆత్మహత్య చేసుకోగా.. తల్లి పద్మ ఉన్నారు. -
అప్పుల బాధతో నేతన్న బలవన్మరణం
సిరిసిల్లటౌన్: అప్పులబాధ భరించలేక గాజంగి సాయి(23)అనే యువ నేతకార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన సాయి ఓ వస్త్రపరిశ్రమ యజమాని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఐదేళ్లక్రితం తండ్రి ప్రభాకర్ కూడా అప్పుల బాధతో ఉరివేసుకుని చనిపోయాడు. తల్లి వసంత బీడీలు చుడుతూ కుమారుడు సాయి, కూతురు రేఖను పోషిస్తోంది. మూడేళ్లుగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయి.. ఏడునెలల క్రితం చెల్లెలు రేఖ వివాహం జరిపించాడు. ఈ క్రమంలో ఇందుకోసం కొంత అప్పు చేశాడు. కుటుంబపోషణ, వివాహంకోసం తెచ్చిన అప్పు మొత్తంగా రూ. 2 లక్షలకు చేరింది. అప్పు ఇచ్చినవారిలో సమీప బంధువులు, స్నేహితులు ఉండటంతో వారి బాకీ సమయానికి తీర్చలేనన్న బెంగతో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో సాయి ఉరివేసుకుని చనిపోయాడు. బంధువుల ఇంటికి వెళ్లిన సాయి తాత దత్తు బుధవారం ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి మనవడు విగతజీవిగా దూలానికి వేలాడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో నేత కార్మికుల వరుస ఆత్మహత్యలతో సిరిసిల్ల తల్లడిల్లింది. ఈ క్రమంలోనే కార్మికులకు ధైర్యాన్ని అందిస్తూ.. వైఎస్ విజయమ్మ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
ఉద్యోగం రాలేదని దివ్యాంగుడి ఆత్మహత్య
హైదరాబాద్: ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ దివ్యాంగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కోదాశపల్లికి చెందిన బి.మహేందర్(28) వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెడికేర్ ఆస్పత్రి సమీపంలోని దివ్యాంగుల వసతి గృహంలో పదేళ్లుగా ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్న ఆ యువకుడి యత్నాలు తరచూ విఫలమ వుతుండటంతో మనస్తాపానికి గురై మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థులు కిటికీలో నుంచి చూడగా మహేందర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో కిల్లర్ ఆటో శంకర్ ఆత్మహత్య
-
ఒంటరైన చిన్నారి
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ దేవేంద్ర పిల్లలు ఒంటరిగా మిగిలారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ రామలక్ష్మణులపల్లెకు చెందిన ఊబిది లచ్చవ్వ, మల్లయ కూతురు దేవేంద్రకు దోమకొండకు చెందిన రఘుతో వివాహం జరిపించారు. రఘు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లగా.. దేవేంద్ర సమీప బంధువు కాశీరాంకు దగ్గరైంది. పెద్దల పంచాయతీతో ఇరువురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దేవేంద్ర కూతురు శ్రీవల్లి, కుమారుడు ఒంటరయ్యారు. శ్రీవల్లిని అమ్మమ్మ ఊరు రామలక్ష్మణుపల్లెకు తీసుకువచ్చారు. కుమారుడు తండ్రి రఘు ఇంట్లో ఉన్నాడు. -
ఉరి వేసుకొని విద్యార్థిని అత్మహత్య
-
నేను చచ్చిపోతున్నా...
సారంగాపూర్(జగిత్యాల): ‘అమ్మ కు డబ్బులు పంపలేకపోతున్నాను. మా అమ్మను, నాన్నను, తమ్ముణ్ణి బాగా చూసుకోండ్రి’ అం టూ మిత్రులకు వాట్సాప్ మేసేజ్ పంపి గల్ఫ్‌లోని దోహా ఖతార్‌లో జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సారంగాపూర్ మం డలం పెంబట్లకు చెందిన తోట నాగరాజు (24) స్వగ్రామం మంచిర్యాల జిల్లా బాదంపల్లి. నాగరాజు దోహ ఖతార్‌కు ఐదేళ్లుగా వెళ్లి వస్తున్నాడు. నాగరాజుకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు శంకర్, కళావతి సంబంధం కూడా చూసి పెట్టారు. అక్కడ వాహనాల క్లీనిం గ్ పనులు చేసే నాగరాజుకు కం పెనీ నెలకు 500 దిర్హమ్స్ (రూ.8779) చెల్లించాలి. కానీ, మిషన్లు చెడిపోయాయంటూ నెల కు 100 దిర్హమ్స్(రూ.1756) ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం రాత్రి తాను పనిచేసే చోటే ఉరేసుకొని ఆత్మ హత్య చేసు కున్నాడు. అంతకు ముందు మిత్రులకు వాట్సాప్ వాయిస్ ద్వారా తన ఆత్మహత్యకు గల కారణాలను పంపాడు. -
ఎంపీ రాయపాటి కూమారుడి డ్రైవర్ ఆత్మహత్యయత్నం
-
వివాహిత ఆత్మహత్య
గార : కొర్లాం పంచాయతీ కొమురవానిపేటలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ గ్రామానికి చెందిన పుక్కళ్ల్ల ధనం(26) అనే వివాహిత సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తనచీరనే కట్టుకుని ఉరివేసుకుంది. భర్త దత్తాత్రేయ సీమెన్‌గా పనిచేస్తూ రెండు నెలల కిందట విధులు ముగించుకొని సెలవులపై ఇంటికి వచ్చాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు నిఖిల్(4), లోకేష్(8నెలలు) ఉన్నారు. తల్లి మృతితో ఇద్దరు చిన్నారుల రోదన మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఒడిశా రాష్ట్రం జబల్పూర్ గ్రామానికి చెందిన మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు. భర్త వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బలివాడ గణేష్ కేసు నమోదు చేశారు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రామాగౌడ్ ఉదంతంలో బాధ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రాష్ట్రంలోనే చర్చనీయాంశమైన ఈ కేసును బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ విచారణ చేస్తున్నారు. బుధవారం ఆయన నెన్నెలకు వెళ్లి స్వయంగా రామాగౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడడంతోపాటు రామాగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్ అనే వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన అంశమే ఈ ఘటనలో ప్రధానమైనదిగా మారింది. సబ్ కలెక్టర్ విచారణ కూడా అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసిన మహేష్ ఎస్టీనా లేక బీసీనా అనే కోణంతో పాటు ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, సంబంధిత ఎస్ఐ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు తీసుకోగా, విచారణాధికారిగా వ్యవహరించిన ఏసీపీ దానిని సమర్థించి, రామాగౌడ్ ఎస్టీ గౌరవానికి భంగం కలిగించినట్లుగా నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ, ఏసీపీ ఎంతమేర నిజాయితీగా వ్యహరించారనే అంశాన్ని కూడా సబ్ కలెక్టర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్‌గా ఆర్వీ.కర్ణన్ మేడారం జాతరను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జాతర ప్రారంభమయ్యే 31వ తేదీ లోపే ఆయనకు నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తహసీల్దార్‌పై తొలివేటు? పల్ల మహేష్ అనే వ్యక్తి రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రాథమిక విచారణలోనే తేలిపోయింది. అయితే మహేష్ ఎస్టీ కాదని, పితృస్వామ్య దేశంలో తండ్రి కులమే సంతానానికి సంక్రమిస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య విషయంలో కూడా ఇదే వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నెన్నెల తహసీల్దార్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని మహేష్‌కు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారనే అంశాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా 2017 సెప్టెంబర్ 18న జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్ నేరుగా సర్టిఫై చేయడం గమనార్హం. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు మొదలు, ఆత్మహత్య వరకు చోటు చేసుకోవడంతో విచారణాధికారి కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయంగా బెల్లంపల్లిలో హైటెన్షన్ రామాగౌడ్ ఆత్మహత్య ఉదంతం బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా టెన్షన్ వాతావరణానికి కారణమైంది. ఈ ఆత్మహత్యకు అధికార పార్టీ నాయకులే కారణమనే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాయి. నెన్నెల గ్రామ సర్పంచ్, మండల కో అప్షన్ సభ్యుడు, ఎంపీటీసీతో పాటు ఎమ్మెల్యేను కూడా ఇందులోకి లాగాయి. అఖిలపక్షం పేరుతో అన్ని పార్టీలు ఆందోళనలు జరుపుతుండడంతో స్వయంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశం పెట్టి తనకే సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రామాగౌడ్ తన కుటుంబంలో సభ్యుడి వంటి వాడని ఆయన చెప్పినప్పటికీ, రామాగౌడ్ మృతి తరువాత ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులెవరూ బాధితుని కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రతిపక్షాలు అవకాశంగా మార్చుకున్నాయి. ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నేతలకు ఈ అంశంతో సంబంధం లేకపోయినా... వారి ప్రోద్బలంతోనే ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు వంటివి జరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు జనంలోకి తీసుకెళ్లడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ నివేదికపైనే కేసు ఆధారపడి ఉంది. ఎస్ఐ, ఏసీపీల విచారణ ఏమైంది..? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని రూఢి చేసుకున్న తరువాతే కేసు నమోదు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈ కేసులో పాటించలేదని సబ్ కలెక్టర్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. ఎస్ఐ కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడం కూడా కీలకంగా మారింది. కేసు నమోదు చేసిన తరువాత గౌడ కుల సంఘాలు, రామాగౌడ్ కుటుంబసభ్యులు ఏసీపీ, కలెక్టర్లను కలిసి వాస్తవాలు తెలియజేసినా, ఎందుకు స్పందించి అట్రాసిటీ కేసు నుంచి సాధారణ కేసుగా మార్చలేదనేది ప్రశ్న. ఈ విషయాలపై విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక పైనే బాధ్యులపై తీసుకునే చర్యలు ఏంటనేది తేలనుంది. -
హుజూరాబాద్‌లో విషాదం
హుజూరాబాద్: పిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదని హైదరాబాద్‌లో ఓ తల్లి కూతురుతో సహా ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా హుజూరాబాద్‌లో విషాదం నెలకొంది. మంగళవారం పట్టణంలో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్‌కు చెంది న రిటైర్డు ఉపాధ్యాయుడు సత్యనారాయణ తన కూతు రు స్వాతి(31)ని ఇదే పట్టణానికి చెందిన మేనల్లుడైన ప్రదీప్‌కుమార్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరు హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పీజేఆర్‌ఎస్‌క్‌లైవ్‌లోని సాయి పెరల్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ప్రదీప్‌కుమార్ సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, స్వాతి హౌస్‌వైఫ్‌గా ఉంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు అరుష్‌రాం(5), కుమార్తె శ్వాని(తొమ్మిది నెలలు) ఉన్నారు. మేనరికంతో సంపూర్ణ ఎదుగుదల లేని పిల్ల లు జన్మించారని స్వాతి ఎప్పుడూ మనోవేదనకు గురయ్యేది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయేది. మానసికంగా కుంగిపోయిన స్వాతి ఈ నెల22న వారు నివాసం ఉంటున్న భవనంపై నుంచి కుమార్తెను తోసేసి, తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఇద్దరి మృతదేహాలను హుజూరాబాద్ తీసుకురాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
సిరికొండ (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేర్వేరుగా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలానికి చెందిన సల్ల మోహన్‌రెడ్డి మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఆరు బోర్లు వేయగా, ఒక్కదాంట్లోనూ సరిపడా నీళ్లురాలేదు. దీంతో వరి పూర్తిగా ఎండిపోయింది. గల్ఫ్ వెళ్లగా, ఏజెంట్ మోసంతో నెల రోజులకే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో రూ. 10 లక్షల వరకు అప్పులు అయ్యాయి. భూమి అమ్మినా అప్పు తీరడం లేదని, ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు ఎలా చేయాలనే ఆందోళనకు గురైన మోహన్‌రెడ్డి సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అయ్యవారిపల్లికి చెందిన నాగయ్యల రాములు(45) ఉపాధి కోసం దుబాయికి వెళ్లి పని లేక తిరిగి వచ్చాడు. గల్ఫ్ వెళ్లేందుకు, కూతురి పెళ్లి చేసేందుకు అప్పు చేసిన రాములు.. అవి తీర్చే దారి కనిపించక మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
హత్యా..? ఆత్మహత్యా..?
సైదాపూర్(హుస్నాబాద్): ఓ యువకుడు ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఘటన మండలంలోని ఎలబోతారం గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. యువకుడి మృతికి సదరు మహిళే కారణమని, వివాహేతర సంబంధం నెరిపి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన మ్యాకల ముత్యాలమ్మ, రాజయ్య కుటుంబం మండలంలోని ఎలబోతారం గ్రామానికి ఏళ్ల క్రితమే వలసవచ్చింది. వీరి కుమారుడు హరీష్(23) చింతలపల్లి గోదాములో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులిద్దరూ హరీశ్ చిన్నతనంలోనే చనిపోయారు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో హరీష్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సదరు వివాహిత భర్త రాజన్నసిరిసిల్ల జిల్లాలో పనిచేస్తుండగా.. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎలబోతారంలోనే ఉంటోంది. హరీష్‌తో వివాహేతర సంబంధముందన్న విషయం తెలిసి ఆమె భర్త తరచూ గొడవపడుతున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా.. కొద్దిరోజులకు మళ్లీ ఎప్పటిలాగే వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి హరీష్ మద్యంతాగి తన ఇంటికి వచ్చాడని సదరు వివాహిత పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించింది. బ్లూకోట్ సిబ్బంది వచ్చేసరికే.. ఇంట్లో దూళానికి ఉరేసుకుని కనిపించాడు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హరీష్‌ను సదరు మహిళే హత్య చేసి ఉంటుందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని ఆందోళనకు దిగారు. అనుమానితులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో సదరు వివాహితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
‘ఆసరా’ కానరాక ఆగిన గుండె
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ ఏడాది కాలంగా ఆగిపోయింది.. ఆహార భద్రత కార్డులోనూ పేరు తీసేశారు.. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు కనికరించలేదు.. ప్రభుత్వ సాయం కనుచూపు మేరలో కనిపించలేదు.. దీంతో బతుకుపై భరోసా దొరక్క ఆ వృద్ధుడు తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ అలీ (62) గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే అలీకి సర్కారు ఇచ్చే పింఛన్ ఏడాది కాలంగా నిలిచిపోయింది. రేషన్ కార్డులో అతని పేరునూ తొలగించారు. మళ్లీ చేరుస్తారో లేదో కూడా తెలియదు. పుట్టకతోనే ఒక కన్ను కనబడని తనకు దివ్యాంగ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఆయన కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కానరాలేదు. దీంతో అతనికి కుటుంబ పోషణ భారమైంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తితో తనువు చాలించాడు. ఇటీవలే అప్పు చేసి పెద్ద కూతురు వివాహం చేసిన అలీకి పెళ్లీడుకొచ్చిన మరో కూతురు ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రకుమార్ తెలిపారు. కాగా పింఛన్ రావడంలేదన్న విషయాన్ని అలీ ఎప్పుడూ తన దృష్టికి తీసుకురాలేదని పంచాయతీ కార్యదర్శి తాండ్ర అశోక్ పేర్కొన్నారు. -
బొగ్గుల కుంపటి కొంపముంచిందా?
రాజాపేట (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులోని పౌల్ట్రీఫాంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మరణం చిక్కుముడి వీడటం లేదు. వీరు తిన్న ఆహారం కలుషితమైందా.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారా..? ఎవరైనా హత్య చేశారా..? అన్నది ఇంకా తేలడం లేదు. అయితే.. బొగ్గుల కుంపటి వీరి ప్రాణాలు తీసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజాపేటలోని పౌల్ట్రీఫాంలో సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు (44), నిర్మల(40), వారి కుమార్తె శ్రావణి(14), చింటు(12), బన్ని(8), అత్తమామలైన జనగామ జిల్లా చిలుపూరు మండలం లింగంపల్లికి చెందిన బచ్చలి బాలనర్సయ్య(68), బచ్చలి భారతమ్మ(60) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మరణాల మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. బొగ్గుల కుంపటే కారణమా? బాలరాజు కుటుంబ సభ్యులు గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. రాత్రి బాగా చలిగా ఉండటంతో పౌల్ట్రీఫాంలో కోడిపిల్లలకు వెచ్చదనం కోసం ఉపయోగించే బొగ్గుల కుంపటిని వేడి కోసం వారు పడుకునే గదిలో పెట్టుకున్నారు. అసలే చిన్నగది. గాలి చొరబడకుండా దానికి ఉన్న కిటికీని, తలుపులు బిగించి నిద్రించారు. గదిలో ఉన్న బొగ్గుల కుంపటి వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో గదిలో ఉన్నవారికి ఊపిరాడక కుటుంబ సభ్యులంతా నిద్రలోనే విగత జీవులై ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందు వీరు తెచ్చుకున్నది కాదు పురుగు మందు కూడా వీరు తెచ్చుకున్నది కాదని తెలుస్తోంది. పక్క గదిలో దొరికిన క్రిమి సంహారక మందులు కాకల్ల ఐలయ్య పత్తి చేను కోసం తెచ్చుకున్నట్లు పౌల్ట్రీయజమాని చెప్పడం చూస్తుంటే బొగ్గుల కుంపటే కారణమన్న దానికి మరింత బలం చేకూరుస్తోంది. పోస్టుమార్టం నివేదికలోనూ తెలియని కారణం? పోస్టుమార్టం నివేదికలోనూ వీరి మరణానికి గల కారణాలు పూర్తి స్థాయిలో లభించలేదని విశ్వసనీయ సమాచారం. మృతుల శరీరాల నుంచి షాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం కూడా పౌల్ట్రీఫాం వద్ద మరికొన్ని ఆధారాల కోసం ప్రయత్నించారు. ఏది ఏమైనా ఒకే కుటంబానికి చెందిన ఏడుగురి మరణం మిస్టరీగా మారింది. శరీరం నుంచి సేకరించిన షాంపిల్స్ నివేదిక వచ్చాకగానీ కేసు చిక్కుముడి వీడే పరిస్థితి కనిపించడం లేదు. -
వ్యాపారి ఆత్మహత్య, సెల్ఫీ వీడియో వైరల్
సాక్షి, పుత్తూరు : ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం బజారువీధికి చెందిన మదన్ కుమార్ అనే వ్యాపారి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో తనకు ఎవరెవరు అప్పు ఉన్నారో వివరించాడు. అందులో అధికార పార్టీ నేతలు ఉండడం సంచలన రేపుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పుత్తూరు ఎంపీపీ గంజి మాధవయ్య రూ.25 లక్షలు, స్వర్ణకుమారి రూ.5 లక్షలు, పిచ్చాటూరుకు చెందినరో డాక్టర్ రూ.50 లక్షలు తనకు బకాయి ఉన్నారని మదన్ కుమార్ ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. వ్యాపారి ఆత్మహత్య, సెల్ఫీ వీడియో వైరల్ -
వదినతో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
సాక్షి, పట్నా : పెళ్లయిన రెండు రోజులకే పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీహార్‌లో కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్య గురించి భిన్న కథనాలు వినవస్తున్నా.. వదినను పెళ్లి చేసుకోవడంఇష్టంలేక.. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని వినోబా నగర్లో 9వ తరగతి చదవుతున్న 15 ఏళ్ల మహదేవ కుమార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకన్నా వయసులో పదేళ్లు పెద్దదయిన వదిన రూబీ దేవి(25)తో మూడు రోజుల కిందట మహదేవ్ కుమార్‌కు పెద్దలు వివాహం చేశారు. ఇది వరకే రూబీ దేవికి మహదేవ కుమార్ అన్న సంతోష్ కుమార్‌దాస్‌తో వివాహం జరిగింది. సంతోష్‌కుమార్ దాస్ 2013 కరెంట్ షాక్‌తగిలి మరణించడంతో.. మహదేవ్ కుమార్, రేబీ దేవికి మూడు రోజుల కిందట పెళ్లి చేశారు. వదినను పెళ్లి చేసుకోవడం మహదేవ కుమార్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని తెలిసింది. ఈ పెళ్లికి సమీప బంధువులు, గ్రామంలోని కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా.. మహదేవ కుమార్ తల్లిదండ్రులు, రూబీ దేవి కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా రూబీ దేవిని మహదేవ్ కుమార్ తన తల్లిలా భావించేవాడని అతని మిత్రులు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ వివాహం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంతోష్ కుమార్ కరెంట్ షాక్‌తో చనిపోయినపుడు.. అతని కుటుంబానికి ప్రభుత్వం రూ. 80 వేలను ఇచ్చింది. ఈ మొత్తం తమకే కావాలని.. రూబీ దేవి కోరింది. అయితే సంతోష్ కుమార్దాస్ తండ్రి అయిన చండేశ్వర్‌దాస్ మాత్రం రూ. 27 వేలను ఇచ్చారు. ఈ క్రమంలోనే తన చిన్న కొడుకు అయిన మహదేవ్ కుమార్-రూబీ దేవిల పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరించడంతో.. మూడు రోజులు కిందట ఇద్దరికీ పెళ్లి చేశారు. మహదేవ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
రాయికల్ (జగిత్యాల): అనుకున్న ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని కుర్మపల్లికి చెందిన షెట్టి రాజు (26) హైదరాబాద్‌లోని గ్లోబల్ కాలేజ్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. అక్కడే పలు కంపెనీల్లో పనిచేశాడు. ఆగస్టు 9న ఆస్ట్రేలియాకు వెళ్లి కొంతకాలం పనిచేసి తిరిగి జనవరిలో స్వగ్రామానికి వచ్చాడు. ఇటీవల హైదరాబాద్‌లో జపాన్ దేశంలోని ఓ హోటల్‌కు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కాగా.. ఒక్క మార్కుతో అందులో ఫెయిల్ అయ్యాడు. 15 రోజుల క్రితం అన్నీ సర్దుకొని ఇంటికొచ్చాడు. తిరిగి తాను ఎక్కడికీ వెళ్లనని కుటుంబసభ్యులకు తెలిపాడు. గురువారం జగిత్యాలకు వెళ్లి వస్తానని చెప్పిన రాజు మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించగా పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని శవమై కనిపించాడు. చేతికందివచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
‘రియల్’ వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్/నెల్లికుదురు: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లికుదురుకు చెందిన నల్లబెల్లి తిరుమల్(45) ఓ ప్రైవేట్ స్కూల్‌ను నిర్వహించేవాడు. అతడి సమీప బంధువైన సీఐ ఎర్ర మోహన్, ఏఎస్సై నిమ్మల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తొర్రూర్, నర్సింహులపేటలో వెంచర్లు చేశాడు. నర్సింహుల పేటలో ప్లాట్లను అమ్మగా వచ్చిన రూ.3.50 లక్షలు సీఐ మోహన్‌కు ఇచ్చాడు. అంతలోనే సీఐ మోహన్, ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి మధ్య మనస్పర్ధలు వచ్చా యి. ఈ క్రమంలో ప్లాట్లను ఏఎస్సై తన కుమారుడి పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీ జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. వెంచర్లో నష్టం వచ్చినందున మీరే భరించాలని, లేకపోతే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయనని ఏఎస్సై అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు. ప్లాట్లను కొనుగోలు చేసిన నర్సింహులపేట మండలం కొమ్ములవంచ తండాకు చెందిన సంతోశ్, మంగ్యా, రంగమ్మ, శిరీష శుక్రవారం ఉదయం తిరుమల్ ఇంటికి వచ్చి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని గొడవ చేశారు. మనస్తాపానికి గురైన తిరుమల్ తన చావుకు సీఐ మోహన్, ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి కారణమని సూసైడ్ నోట్ రాసి శుక్రవారం ఉరేసుకొన్నాడు. తిరుమల్ తన పాఠశాలను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం విక్రయించి కార్యాలయ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. అందులోనే ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు సీఐ, ఏఎస్సై, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సదరు సీఐ మోహన్ ఇటీవలే డీఎస్పీ పదోన్నతి పొంది, హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నట్టు సమాచారం. -
ప్రాణం తీసిన పంచాయితీ
పెద్దేముల్: పెద్దలు నిర్వహించిన పంచాయితీ ఓ యువకుడి ప్రాణం తీసింది. బాలికతో ప్రేమాయణం నడిపించిన యువకుడు.. రెండెకరాల భూమి, డబ్బులు అమ్మాయి కుటుంబీకులకు ఇవ్వాలని చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్‌లో శుక్రవారం జరిగింది. తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బక్కని మొగులప్ప, లాలమ్మ దంపతుల మూడో కుమారుడు అశోక్ (23) డిగ్రీ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు, యువకుడితో పెళ్లి విషయమై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, గురువారం సాయంత్రం హన్మపూర్‌లో సర్పంచ్ నర్సింలు గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, రెండు ఎకరాల భూమి అశోక్ ఇవ్వాలని తీర్పు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన అశోక్ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. మృతుడి సోదరుడు రమాకాంత్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ నర్సింలు, రాములుపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. బాల్యవివాహాన్ని అడ్డుకున్నందుకే..: సర్పంచ్ బాల్య వివాహం చేసుకుంటే చట్టపరంగా కేసు నమోదు అవుతుందని ఇరు కుటుంబాలవారికి నచ్చచెప్పానని సర్పంచ్ నర్సింలు తెలిపారు. అమ్మాయి మేజర్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని చెప్పడంతో తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించారన్నారు. -
అదనపు సీనియర్ సివిల్‌జడ్జి ఆత్మహత్య
తిరుపతి లీగల్: తిరుపతిలో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తూ గతేడాది సస్పెన్షన్‌కు గురైన పి.వి సదానందమూర్తి బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన భార్య అన్నపూర్ణమ్మ ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదానందమూర్తి 2013లో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చారు. తర్వాత అదనపు సీనియర్ సివిల్ జడ్జిగానూ పనిచేశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ క్రమంలో తరచూ మానసిక కుంగుబాటుకు గురవుతున్నట్టు సమాచారం. గతంలో తిరుమలకు వెళ్లిన ఆయన ఓ పూజారి దురుసుగా ప్రవర్తిం చాడని పోలీసులకు ఫిర్యా దు చేశారు. అయితే సదానందమూర్తి ప్రవర్తన సరిగా లేదనే కారణంతో చిత్తూరు జిల్లా జడ్జి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జీల నివేదికల ఆధారంగా గతేడాది మార్చి 6న హైకోర్టు ఆయన్ను సస్పెండ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు అందేవరకు తిరుపతి వదిలి వెళ్లకూడదంది. సస్పెండ్ కావడంతో న్యాయమూర్తుల క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయి విద్యానగర్‌లోని ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు. ప్రమోషన్ రాకపోవడం, సస్పెండ్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. దీన్ని ఆయన భార్య అన్నపూర్ణమ్మ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆయన కుమారుడు ఐఐటీ బెనారస్‌లో, కుమార్తె యూఎస్‌లో ఎంఎస్ చదువుతున్నారు. న్యాయమూర్తి భౌతికకాయానికి రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి స్వస్థలం మచిలీపట్నం తరలించారు. -
చదువుల ఒత్తిడి తట్టుకోలేక..
-
చదువుల ఒత్తిడితో సంధ్య ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్ : చదువుల ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఆదివారం పూట కూడా క్లాసులు నిర్వహిస్తుండటంతో మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని జడ్చర్లలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గోపాల్‌కు కూతురు సంధ్య(15) ఉంది. పట్టణంలోని ఉదయ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం కూడా పాఠశాలలో తరగతులు నిర్వహించడంతో మనస్తాపానికి గురై తమ కూతురు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
ఫొటో కోసం.. ఆత్మహత్య
లండన్ : పిచ్చి పతాక స్థాయి.. ఇంతకు మించి అనడానికి.. ప్రపంచ భాషల్లో పదాలు కూడా ఉండవు. సెల్ఫీలు వచ్చాక.. యువత వాటికి బానిసలుగా మారారు. అందులో సందేహం లేదు. సెల్ఫీల మోజులో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. తాజాగా ఒక్క ఫొటో కోసం కొరియా యువతి ఆత్మహత్య చేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ససెక్స్ ప్రాంతాన్ని స్వర్గంగా పర్యాటకులు భావిస్తుంటారు. ఎత్తయిన మైదాన ప్రాంతాలు.. హోరెత్తె అలలో సాగే ఇంగ్లీష్ ఛానెల్ సముద్రం.. దూరం నుంచి మంచు పర్వతాలు.. ఇలా ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అందరిలాగే దక్షిణ కొరియా నుంచి హేవోన్ కిమ్ (23) అనే యువతి వచ్చింది. ఎత్తయిన మైదాన ప్రాంతం.. తల వంచి చూస్తే.. సముద్రం.. అలలు కనిపిస్తాయి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసిన ఆమెకు 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకితే.. అన్న ఆలోచన వచ్చింది. అదే తడవుగా.. అక్కడ ఉన్న ఒక వ్యక్తి చేతికి తన మొబైల్ ఇచ్చి ఫొటోలు తీయమని కోరింది. అతడు మొబైల్‌తో ఫొటోలు తీస్తుండగా.. అడుగులు వెనక్కి వేసుకుంటి.. నా కిందకు దూకుతున్నా.. ఫొటోలు తీయండి.. అని గట్టిగా చెప్పింది.. అతడు దగ్గరకువచ్చే లోపు.. కిందకు దూకేసింది. ఆమెను రక్షించేందుకు తీరప్రాంత నౌకాదళ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. 200 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో.. కిమ్ నీళ్లలో పడేలోపు మరణించింది. కిమ్ కిందకు దూకే సయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి మాట్లాడుతూ.. ఆమె ఫొటోల కోసం కిందకు దూకుతున్నా అనే మాట అన్నదని చైనాకు చెందిన టూరిస్ట్ జియాంగ్ జాంగ్ అన్నారు. -
ప్రియురాలు మోసం చేసిందని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియురాలు మోసం చేసిందన్న మనస్తాపం తో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేష న్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ కిందిబస్తీకి చెందిన జి.తని (30) కానిస్టేబుల్‌గా పనిచేస్తు న్నాడు. 2010 బ్యాచ్‌కు చెందిన తని సంతోష్‌నగర్ ఠాణా నుంచి ఐదునెలల క్రితం సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌కు బదిలీ అయ్యాడు. కొద్దినెలల క్రితం మెడిసిన్ చదివే యువతితో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇటీవల ఆ యువతి పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమెను ఒప్పించేందుకు తని పలు విధాలుగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో గురువారం నైట్‌డ్యూటీకి వెళ్లలేదు. స్నేహితుడు కిషోర్‌ను కలసి వస్తానని చెప్పి రాత్రి 8 గంటలకు బయటకు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లాడు. హాలులో పడుకున్న కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి తని తాడుతో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబసభ్యులు కిందకి దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. బబ్బు నీకో చాన్స్ ఇవ్వాలనిపిస్తుంది.. తని ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రియురాలిని ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫీవీడియో తీసుకున్నాడు. పోలీసులు తని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘బబ్బు! నీకో చాన్స్ ఇవ్వా లనిపిస్తుంది.. నా ప్రేమ అలాంటిది, అయినా నువ్వు మారవు అనిపిస్తుంది’ అంటూ రెండు నిమిషాలు మాట్లాడి చివరకి ఆడాళ్లు మారరు అని ముగించాడు. కాగా, ప్రేమ విఫలం కావడంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అన్నదాతల మృతి..
సాక్షి, కరీంనగర్/ వర్గల్: తెలంగాణలో వేర్వేరు ఘటనలో సోమవారం ఇద్దరు అన్నదాతలు మృతి చెందారు. అప్పుల బాధతో ఒక రైతు బలవన్మరణం చెందగా మరో రైతు విద్యుదాఘతానికి గురై మరణించాడు. కరీంనగర్జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన రైతుకు 2 లక్షల అప్పు అయింది. పంటలు సరిగ్గా పండక అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరెంట్ షాక్‌తో రైతు మృతి.. మెదక్‌జిల్లా వర్గల్ మండలం నాచారంకు చెందిన రైతు పర్సా రమేష్(32) వ్యవసాయ బోర్డు స్విచ్ ఆఫ్ చేస్తుండగా కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. కాగా, సంఘటనా స్థలంలో రమేష్‌ను కాపాడేందుకు యత్నించిన మేనత్త సుభద్రకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. -
యువజంట ఆత్మహత్య
వివాహేతర సంబంధమే కారణం? ప్రేమికుడు పురిగొల్పడంతో వివాహిత ఆత్మహత్య తనపై కేసు పెడతారన్న భయంతో భర్త కూడా.. అత్తింటివారే తన కుమార్తెను చంపారని తండ్రి ఆరోపణ కాకినాడ రూరల్ : భార్యపై అనుమానం, ప్రైవేటు ఉద్యోగం మానేసి, జల్సాలకు ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు ఖర్చు చేయడం, నిత్యం కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు.. దీంతో పాటు వివాహేతర సంబంధం ఉందని భావిస్తున్న ఆటో డ్రైవర్ పౌరుషం ఉంటే చావు అన్న మాటకు పట్టించుకున్న ఓ యువ జంట శుక్రవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ గొడారిగుంట మూడుగుళ్ల సెంటర్ సమీపంలో శాస్త్రి నగర్లో నివాసం ఉంటున్న బయ్యపురెడ్డి దుర్గా ప్రసాద్ (34), మంగాదేవి (25)లు ఈ ఘటనలో మృతి చెందారు. వీరికి ఏడేళ్ల సాయిలోకేష్, ఐదేళ్ల ధీరజ్ పిల్లలు ఉన్నారు. సామర్లకోటకు చెందిన కె సత్యనారాయణ కుమార్తె మంగాదేవిని, 2010లో కాకినాడ గొడారిగుంటకు చెందిన బయ్యపురెడ్డి దుర్గాప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో రూ. 4 లక్షలు కట్నం, 8 కాసుల బంగారు ఆభరణాలు కట్న కానుకలుగా అందించారు. దుర్గాప్రసాద్ ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసేవాడు. భార్యపై అనుమానం పెంచుకున్న దుర్గాప్రసాద్ ఏడాదిన్నరగా తాను చేస్తున్న పని మానేసి భార్యను సూటిపోటి మాటలు అంటూ గొడవకు దిగేవాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేయడమే కాకుండా పెళ్లి సమయంలో అత్తింటివారు బ్యాంకులో వేసిన రూ. 1.5 లక్షలను కూడా ఖర్చు చేసేశాడు. తాకట్టులో ఉన్న బంగారు ఆభరణాలను అమ్మేస్తానంటూ భార్యతో గొడవకు దిగేవాడు. మంగాదేవికి స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్ అప్పన్నతో వివాహేతర సంబంధం ఉందని, ఇది తన భర్తకు తెలిసిపోయిందని ఆమె అప్పన్నకు చెప్పిందని, దీంతో అతడు ఆమెను పౌరుషం ఉంటే చచ్చిపో అని ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పాడని, తనపై ఎక్కడ కేసు పెడతారోనన్న భయంతో దుర్గాప్రసాద్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న లక్ష్మణ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాలను జీజీహెచ్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. సర్పవరం సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణతో ఎస్ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అభంశుభం తెలియని చిన్నారులు అమ్మా, నాన్నలు ఎక్కడికి వెళ్లారంటూ దీనంగా అడగడం అక్కడివారిని కలచివేసింది. ఏ బాధలున్నా తమకు చెప్పుకుంటే పరిష్కరించేవారమని, కనీసం ఏం జరుగుతోందో కూడా తమ దృష్టికి తేలేదంటూ మంగాదేవి బంధువులు విలపిస్తున్నారు. చనిపోయేటప్పుడయినా పిల్లలు గుర్తుకురాలేదే అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రతిఒక్కరికీ తలలో నాలుకలా ఉండే దుర్గాప్రసాద్ చనిపోయాడంటే జీర్ణించుకోలేకపోతున్నామంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాగా మంగాదేవి తండ్రి కె.సత్యనారాయణ మాత్రం తన కుమార్తెను కావాలనే తన అల్లుడు దుర్గాప్రసాద్ ఉరేసి చంపేశాడని, తన కుమార్తె ఏ తప్పు చేయదని, చనిపోయేంత పిరికిది కాదని, కావాలనే చనిపోయిన వ్యక్తిపై అభాండాలు వేస్తున్నారన్నారు. తన అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కావాలని తన కూతుర్ని ఉరేసి చంపేశారన్నారు. కేసు పెడతామన్న భయంతో అతను ఉరేసుకున్నాడన్నారు. తన కుమార్తెను ఎంతో గారాభంగా పెంచుకున్నానని, ఇప్పుడు తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ కన్నీరుమున్నీరుగా మృతురాలి తండ్రి సత్యనారాయణ విలపిస్తున్నాడు. -
కలసి రాని సాగు కాటికి తరిమింది
అప్పులు తీర్చలేక కౌలురైతు ఆత్మహత్య వీకే రాయపురం (సామర్లకోట) : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండల పరిధిలో వీకే రాయపురం గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు అప్పులు తీర్చలేక, దాతలకు ముఖం చూపలేక పురుగుల మందు తాగి మంగవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మలిరెడ్డి సూరిబాబు (33) 10 ఏళ్లుగా సుమారు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. ప్రకృతి వైపరీత్యాలతో తరచూ పంట నష్టం జరుగుతుండడంతో రైతులు కౌలు చెల్లించలేక సుమారు రూ.6 లక్షలు అప్పులపాలయ్యాడు. దీంతో మంగళవారం పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో పడి ఉన్న సూరిబాబును అతని బంధువులు గమనించి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. సూరిబాబుకు భార్య, ఐదేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ న్యాయం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కౌలు రైతులకు రుణాలు, ప్రభుత్వ నుంచి అందే సహాయం సక్రమంగా అందక పోవడంతోనే తరుచూ ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరిబాబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు దర్యాప్తు చేస్తున్నారు. పంట నష్టాలే ముంచాయి.. కుటుంబానికి పెద్ద అయిన తండ్రి గంగరాజు చని పోవడం, తమ్ముడు వీర్రాజుకు పెళ్లి కాకుండానే చని పోవడంతో కుటుంబంలో అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మానసిక దౌర్బల్యానికి గురవడం, గ్రామానికి చెందిన ఐదుగురి నుంచి తీసుకున్న సుమారు రూ.ఆరు లక్షలు అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. వారి నుంచి ఎటువంటి ఒత్తిడీ లేకపోయినా వారికి ముఖం చూపలేక ఇబ్బందిపడేవాడని బంధువులు, భార్య సత్యగౌరి తెలిపారు. కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక పోవడం, తరుచూ పంట నష్టం జరగడంతో అప్పులు పెరిగి పోయాయని కుటుంబ సభ్యులు తలారి దొరబాబు, అడబాల శివయ్యనాయుడు తెలిపారు. గత ఆరు నెలల క్రితం కౌలు కార్డు తీసుకున్నా గ్రామంలో ఉన్న బ్యాంకు అప్పు ఇవ్వక పోవడంతో బయట వ్యక్తుల నుంచి అప్పులు చేసి పంటకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని వారు తెలిపారు. సూరిబాబు ఆత్మహత్యతో భార్య సత్య గౌరిని ఓదార్చడం కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది. ఇంటిలో అందరూ కంట తడి పెట్టుకోవడంతో ఏం జరిగిందో తెలియక కుమారుడు రిషాల్, కుమార్తె వైష్టవి మహాలక్ష్మీ బిత్తర చూపులు చూడడం స్థానికుల హృదయాలను కదిలించింది. పోలీసుల విచారణ.. కౌలు రైతు సూరిబాబు పురుగుల మందు తాగి చనిపోవడంతో ఇంద్రపాలెం పోలీసులు బుధవారం రాత్రి గ్రామానికి వచ్చి బాధితుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆధారం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు తెలిపారు. 26పీటీపీ53: సూరిబాబు మృతితో రోదిస్తున్న కుటుంబ సభ్యులు 26పీటీపీ46: కుటుంబ సభ్యులతో మలిరెడ్డి సూరిబాబు (పాత చిత్రం) -
హోటల్ గదిలో యువ జంట ఆత్మహత్య...
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ఓ యువజంట ఆత్మహత్య కలకలం రేపింది. ఓయో ఆన్లైన్ హోటల్ సర్వీస్ ద్వార రూమ్ ను బుక్ చేసుకున్న ఆ జంట శుక్రవారం ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పిడింది. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారఖా సెక్టార్ 17 లో చోటుచేసుకుంది. ఓ యువకుడు(20), యువతి(19) గురువారం ఆన్లైన్ బుకింగ్ ద్వార గది బుక్ చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హౌస్ కీపింగ్ సిబ్బంది పదేపదే తలుపు తట్టినా సమాధానం రాలేదు. దీంతో హోటల్ సిబ్బంది తలుపు పగలకొట్టి లోపలి వెళ్లి చూశారు. అయితే అప్పటికే వారు ఉరేసుకొని విగతజీవులుగా ఉన్నారు. హోటల్ మేనజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆత్మహత్యగా భావించారు. పలుకోణాల్లో విచారణ జరిపాక ధృవీకరిస్తామని తెలిపారు. యువకుడు ద్వారకా సెక్టార్16 కు చెందినవాడని, అమ్మాయి ఢిల్లీ రోహిని ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని, వీరు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారి ఆత్మహత్యకు గల కారణాలను త్వరలో తెలియజేస్తామన్నారు. -
9లో ప్రేమ విఫలం.. బలవన్మరణం
ములకలచెరువు: పట్టుమని 15 ఏళ్లు కూడా నిండకనే ప్రేమలో పడ్డాడు. ఇష్టపడిన బాలికకు తాను పంపిన బహుమతి నిరాకరించిందని మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ములకలచెరువు హాస్టల్లో చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగుట్టకు చెందిన బాలుడు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఒక బాలికను ప్రేమించాడు. బాలిక అతడి ప్రేమను తిరస్కరించడంతో మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లో గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాస్టల్ సిబ్బంది గమనించి అతడిని 108లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ హరిబాబు వివరణ కోరగా.. ఆత్మహత్యకు యత్నించిన బాలుడు హాస్టల్లో ఉండడానికి దరఖాస్తు మాత్రమే చేసుకున్నాడని, అనుమతి ఇవ్వనప్పటికీ హాస్టల్లో ఉంటున్నాడని పేర్కొన్నారు. సంఘటనపై ఉన్నతస్థాయి అధికారులు సమాచారం చేరవేశామని వార్డెన్ చెప్పకొచ్చారు. -
దేవుడిదగ్గరకు వెళ్లాలంటూ...
కరప(కాకినాడరూరల్): ఆర్థిక ఇబ్బందులు లేవు, ముందురోజు కుమారుడు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు..ఏం కష్టం వచ్చిందో ఏమో ముగ్గురు (అక్కా, చెల్లెలు, కుమార్తె) మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేవుడు వద్దకు వెళ్లాలి, టైం అయిపోతోంది అంటూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అంటున్నారు. ప్రార్థనలు చేస్తామని లోపలికెళ్లిన వారు తనువు చాలిస్తారని అనుకోలేదని తల్లి చంద్రం ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కరపలోని నీలయ్యతోట వీధిలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరపలోని నీలయ్యతోట వీధికి చెందిన కరెడ్ల చంద్రం కుమార్తెలు రాసంశెట్టి సత్యవేణి (48), సత్తి ధనలక్ష్మి (40), ధనలక్ష్మి కుమార్తె సత్తి వైష్ణవి (18). సత్యవేణి, ఇద్దరు కుమారులతో అదే వీధిలో సొంతిల్లు కట్టుకుని ఉంటున్నారు. తల్లి చంద్రం పెంకిటిల్లులో ఒక పోర్షన్లో ఉంటోంది. అదేఇంటిలో పక్కపోర్షన్లో ధనలక్ష్మి భర్త, ఇద్దరు కుమారులతో ఉంటోంది. వీరు క్రైస్తవ మతం తీసుకుని నాలుగేళ్లుగా చర్చికి వెళ్లి, ప్రార్థనలు చేసుకుని వస్తుంటారు. ఎవరితోను మాట్లాడరు, దైవభక్తి ఎక్కువగా ఉండటంతో వెళితే చర్చికి, లేకపోతే ఇంటివద్ద ప్రార్థన చేసుకోవడం వీరికి అలవాటు. ఈ నేప«థ్యంలో ధనలక్ష్మి కుమారుడు రఘువీర్ పుట్టిన రోజును ఆదివారం జరిపి, ఇంటివద్దనే అందరికీ భోజనాలు పెట్టి, పాస్టర్ నాగరాజు డాక్టర్‌తో ప్రార్థనలు చేయించారు. దేవుడు వచ్చేస్తున్నాడు, దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలి అంటూ మాట్లాడుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం జరుగుతోంది. ఆదివారం రాత్రి ముగ్గురు మహిళలు చర్చికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఉదయం పాస్టర్ నాగరాజు లేచిన తర్వాత ప్రార్థన చేసి, పండ్లుపెట్టగా సత్యవేణి, ధనలక్ష్మి, వైష్ణవిలు ఇంటికి వచ్చేశారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో తల్లి చంద్రంతో ఇంటిలో దుష్టశక్తులు తిరుగుతున్నాయి, అవి పోయేందుకు ప్రార్థనలు చేస్తామని ఒక గదిలోకి వెళ్లి, గడియపెట్టారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో ధనలక్ష్మి కుమారుడు రఘువీర్ తలుపు తట్టగా ఇంకా ప్రార్థన పూర్తవ్వలేదని లోపలనుంచే బదులిచ్చారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో రఘువీర్ తలుపులు కొట్టినా తీయలేదు. అనుమానంతో ఇంటి వెనుక వైపున తలుపుపైకెత్తి తీసి చూసేసరికి ఉరివేసుకుని ఉన్నారు.అక్క వైష్ణవిని కిందికి దింపితే చనిపోయి ఉంది. వెంటనే పాస్టర్ దగ్గరకెళ్లి ఇంటికి తీసుకొచ్చి చూపించాడు. పాస్టర్ కరప ఎస్సై మెల్లం జానకిరాంకు సమాచారం అందించారు. కాకినాడ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఇంటిలిజెన్స్ సీఐ నూనె రమేష్, కాకినాడ పోర్టు సీఐ రాజశేఖర్‌తో కల్సి క్లూస్‌టీంతో ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు మహిళల ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తు తేలాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కరప ఎస్సై జానకిరాం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తామని వెళ్లిపోయారా.. ప్రార్థనలు చేస్తామని గదిలోకి వెళ్లి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతారను కోలేదంటూ ఇద్దరు కుమార్తెలు, మనుమరాలు మరణాలు తలుచుకుని చంద్రం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాకపోయింది. ఇలా జరుగుతుందంటే పనిలోకి వెళ్లేవాడినికాదు ఇలా జరుగుతుందని ముందుగా ఊహించి ఉంటే కాకినాడ పనిలోకి వెళ్లేవాడిని కాదని భార్య ధనలక్ష్మి, కుమార్తె వైష్ణవి మరణించడంపై సత్తి శ్రీనివాస్ గుండెలవిసేలా విలపించాడు. భార్య మృతదేహంపై పడి కొడుకుని, నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ బోరున విలపిస్తుంటే బంధువులు, ఇరుగు పొరుగువారు ఆపలేకపోయారు. -
మరీ ఇంత రాక్షసత్వమా...!
- పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్య - రౌడీ షీటర్ నెపంతో అధికార పార్టీ అండ, దండలతోనే అఘాయిత్యం - ఎమ్మెల్యేపై కేసు నమోదుకు ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు - ఏడుగంటలపాటు మృత దేహంతో ధర్నా - ఉద్రిక్తంగా మారిన పరిస్థితి ... పోలీసుల మోహరింపు - చర్చలు అనంతరం ఫిర్యాదుల స్వీకరణతో ఆందోళన విరమణ. శహపురం (పెదపూడి): మండలంలోని శహపురంలో వృద్ధుడి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీంతో ఎమ్మెల్యే కేసు నమోదు చేయాలని, ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సత్తి సర్యనారాయణలు రెడ్డిలు ఆందోళనలో పాల్గొనడంతో పోలీసులు దిగిరాక తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ గాజంగి వెంకటరమణ మేనమామ రాయుడు సత్యనారాయణ (64) సోమవారం ఆడదాని రేవు వంతెనపై నుంచి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు లోవరాజు, మురళీకృష్ణ ఇద్దరు కొడుకులున్నారు. గాజంగి వెంకటరమణ వారికి మేనమామ కావడంతో గ్రామంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే గత రెండున్నరేళ్ల కిందట ఈ కుటుంబంలోని పురుషలందరిపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు లోవరాజు, మురళీ, తండ్రి సత్యనారాయణపై పోలీసులు రౌడీ షీట్‌ను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెదపూడి పోలీస్టేషన్‌కు కొత్తగా ఎస్ఐ కె.కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రతి ఆదివారం మండలంలోని రౌడి షీట్లో ఉన్న వారందరూ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న ఉదయం అందరితోపాటు మృతుడు సత్యనారాయణ కూడా పోలీస్టేషన్‌కు వెళ్లాల్సి ఉండగా పక్షవాతానికి గురై వెళ్లలేదు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేసినా రావల్పిందేనని పట్టుబట్టడంతో ఆటోలో తీసుకుని వెళ్లడంతో మనస్థాపానికి గురై ఆడదాని రేవు వంతెన వరకు నడుచుకుంటూ వచ్చి ... రెయిలింగ్‌పైకి ఎక్కి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. విషయం తెలిసిన కుమారులు పరుగున వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు వంతెనకు వంద మీటర్ల దూరంలో నాలుగు గంటలకు మృతదేహం లభ్యమైంది. ఉద్రిక్తంగా మారిన సత్యనారాయణ ఆత్మహత్య సంఘటన... సత్యనారాయణ ఆత్మహత్య సంఘటనతో మండలవ్యాప్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారన్న ఆగ్రహంతో మృతదేహాన్ని తీసుకుని పెదపూడి పోలీస్స్షేషన్ వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరగా పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ శ్రేణులతో పోలీసులు మృతదేహాన్ని అడ్డుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. సుమారు 20 నిమిషాలపాటు పోలీసులు నిర్బంధించడంతో మృతదేహాన్ని చేతులపైనే మోసి సుమారు రెండు కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్యనారాయణ మృతికి కారణమైన స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని మొదటి ముద్దాయిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండదండలతో హింసకు గురి చేసిన ఎస్సై కిశోర్‌బాబును సస్పెండ్ చేయాలని నిలదీశారు. అక్రమంగా రౌడీషీట్లు తెరచి వేధింపులకు పాల్పడడం దారుణం రాష్ట్రంలో పోలీసులు అధికారపక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 64 ఏళ్ళ వృద్ధుడిపై రౌడీషీట్ తెరచిన ఘనత పెదపూడి పోలీసులకే దక్కుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ రౌడీషీట్లు ఉన్నప్పటికీ అనపర్తి నియోజకవర్గంలో దాని మోతాదు మించుతోందన్నారు. మృతుడిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి అ«ధికార తెలుగుదేశం పార్టీ చేయించిన హత్యేనని ఆరోపించారు. పచ్చ చొక్కాల నాయకుల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు... నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు పచ్చ చొక్కాలు తొడిగిన టీడీపీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణకు పక్షవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నా స్టేషన్‌కు పిలిపించి అవమానించడం దారుణమన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు సీఐలు పవన్ కిశోర్, చైతన్య కృష్ణలు కన్నబాబు, సూర్యనారాయణరెడ్డిలతో చర్చలు జరిపారు. అనంతరం బంధువులు ఎమ్మెల్యే, ఎస్సైల పై చేసిన ఫిర్యాదులను స్వీకరించడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఎవరీ నందు, నవీన్?
శిరీష కేసులో తెరపైకి మరో రెండు పేర్లు ► వారితో జరిపిన సంభాషణలు వెలుగులోకి.. శిరీష స్నేహితులుగా అనుమానం ► ముందు తేజస్విని విషయం వారికే చెప్పిన శిరీష ► అంతా అయిపోయిందంటూ ఫోన్లో చెప్పిన ఇరువురూ ► అయినా ఫలితం లేకపోవడంతో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వివాదం ► రాజీవ్, శ్రవణ్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు ► తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియోల్లో ఉన్న అంశాలివీ.. హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. నందు, నవీన్ అనే ఇద్దరితో శిరీష మాట్లాడినట్లు భావిస్తున్న రెండు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాల్ రికార్డింగ్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. వెలుగులోకి వచ్చిన ఆడియోలను పరిశీలిస్తే.. తనకు, రాజీవ్‌కు తేజస్వినితో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా శిరీష తొలుత నందును కోరినట్లు తెలుస్తోంది. అతడితో పాటు అతడి స్నేహితుడైన నవీన్ సైతం తేజస్వినితో మాట్లాడామని, విషయం సెటిల్ అయి పోయిందని, ఇక ఆమె మీ జోలికి రాదంటూ శిరీషతో చెప్తున్న మాటలు ఆడియోల్లో ఉన్నాయి. వీరిలా చెప్పినా తేజస్వినితో ఇబ్బందులు కొనసాగిన నేపథ్యంలోనే శిరీష మరో స్నేహితుడైన శ్రవణ్ సహాయం కోరి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శిరీష–రాజీవ్.. శ్రవణ్ ద్వారానే కుకునూర్‌పల్లి వెళ్లడం, అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని కలవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. రాజీవ్ ఇబ్బంది పడకూడదని.. రాజీవ్‌ను శిరీష ఎంతో సన్నిహితంగా భావించినట్లు ఈ ఆడియోల్లో స్పష్టమవుతోంది. ఫోన్ సంభాషణలో నందు.. రాజీవ్‌ను ఉద్దేశించి ‘వాడు’అని సంబోధించగా.. దీన్ని శిరీష తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతి సందర్భంలోనూ రాజీవ్ ఇబ్బంది పడకూడదని, అతడికి ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదని శిరీష ప్రయత్నించినట్లు ఆడియో రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. తేజస్విని నుంచి ఎదురైన ఇబ్బందుల వల్ల ఆమెపై పెంచుకున్న ద్వేషంతోనే నందు, నవీన్ ఆమెను ఫోన్లో ఏమని దూషించారో తెలుసుకోవాలని శిరీష భావించింది. వారు తేజస్వినితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ పంపమని వారిని పదేపదే కోరడం ఆడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరూ ఎవరు.. నందు, నవీన్ ఎవరు? శిరీష కోరిన మీదట వారు తేజస్వినితో మాట్లాడారా? లేక మాట్లాడామంటూ శిరీషతో చెప్పారా? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. శిరీష కాల్ డిటైల్స్ ఆధారంగా వీరిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అరెసై్టన రాజీవ్, శ్రవణ్‌లను తదుపరి విచారణ నిమిత్తం ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరు కస్టడీలోకి వచ్చిన తర్వాత నందు, నవీన్ వివరాలు రాబట్టాలని నిర్ణయించారు. ఎక్కడివా ఆడియోలు? మీడియాలో హల్చల్ చేస్తున్న శిరీష –నందు –నవీన్ సంభాషణల ఆడి యోలు ఎక్కడివనేది ఇప్పు డు కీలకంగా మారింది. వీటిని ఎవరో ఉద్దేశపూర్వ కంగా లీక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంభాషణను బట్టి అవి శిరీష, ఆమె స్నేహితుడు నందు ఫోన్ల మధ్య జరిగినట్లు తెలు స్తోంది. వారి ఫోన్లలోనే వీటి రికార్డింగ్‌కు ఆస్కారం ఉంది. శిరీష చనిపోయిన రోజే ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేసిన శుక్రవారం వారి ఫోన్లతో పాటు శిరీష ఫోన్‌ను సీజ్ చేశామని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని పేర్కొంటున్నారు. అయితే మంగళవారం రాత్రి నుంచి ఈ ఆడియోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో వచ్చిన తర్వాతే ఆడియోల విషయం తమకు తెలిసిందని, కొత్తగా తెరపైకి వచ్చిన నందు, నవీన్‌ల విషయం రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీలోకి తీసుకున్నాక ఆరా తీస్తామని పోలీసులు చెపుతున్నారు. శిరీష ప్రవర్తనపై మచ్చ తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వీటిని కొందరు లీక్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఫోన్ నుంచి లీక్ అయ్యాయా? లేక రాజీవ్ స్నేహితులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. శిరీష ఫోన్లో అనేక ఆడియోలు ఉండగా.. వాటిలో ‘ఎంపిక’చేసిన వాటినే లీక్ చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కస్టడీ పిటిషన్లో పలు అంశాలు.. శ్రవణ్, రాజీవ్‌ల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని కోణాలు వెలికి తీయాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో తేజస్విని పాత్రపై ఆరా తీయాల్సి ఉందని, ఆమెకు, శిరీషకు ఉన్న గొడవలకు కారణాన్ని వెలికితీయాల్సి ఉందని, రాజీవ్–తేజస్విని మధ్య సంబంధాలను ఆరా తీయాల్సి ఉందన్నారు. శిరీష–శ్రవణ్–రాజీవ్ కారులో కుకునూర్‌పల్లి వెళ్లే దారిలో ఏమైందనే దానిపై అనుమానాలు ఉన్నాయని, వాటినీ నివృత్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కుకునూర్‌పల్లి వరకు ఉన్న మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు వాటిని నిందితులకు చూపించి ధ్రువీకరించుకోవాల్సి ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్లో జరిగిన అంశాలను రూఢీ చేసుకోవాల్సి ఉందని, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి నిందితుల్ని విచారించాలని పేర్కొన్నారు. మొదటి కాల్ రికార్డింగ్ నందు: డార్లింగ్. నాకు రికార్డింగ్ అయితే కనపడట్లేదు. శిరీష: నీ పక్కన రవికి ఫోన్ ఇయ్. నందు: రవియా..? నా పక్కన రవి ఎవరూ ఉండరు. నా పక్కన ఉండేది నవీన్. శిరీష: ఊ.. వాడికివ్వు.. నవీన్: హలో.. శిరీష: హలో.. వాడు.. ఇందాక మాట్లాడింది నీతోనే కదా..? నవీన్: ఆఆఆ శిరీష:గుర్తుందా..శిరీషఇందాక మాట్లాడాను.. నవీన్: బాలకృష్ణ.. నాకైతే గుర్తుంది.. నీకైతే గుర్తుందా..? శిరీష: ఆ.. నవీన్: గుర్తుంది.. ఇందాక మాట్లాడా శిరీష నీతోనే.. నేను నవీన్ మాట్లాడేది.నువ్వొక కాల్ రికార్డింగ్ పంపియ్యమన్నావు.. నువ్వే కదా? శిరీష: నేనే నేనే.. వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట. ప్లీజ్ కొంచెం వెతికి పంపించవా? కావాలంటే నంబర్ చెప్తాను దీనిది(తాను మాట్లాడుతున్న ఫోన్‌ది).. నవీన్: ఇప్పుడు ఎవరు.. ఇందాక మాట్లాడిందా? దాన్నైతే(తేజస్విని) గలీజ్ గలీజ్ తిట్టి ––––– ఓకేనా.. శిరీష: తిట్టాడు కానీ నాకు ఆ రికార్డు కావాలి నవీన్: ఓకే తను నీకేమవుద్ది? ఫ్రెండా? ఎనిమీ అయిద్దా? శిరీష: ఎనిమీ.. నా ఎనిమీ అది(తేజస్విని) నవీన్: ఇంక నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్ చూపెట్టాం దానికి.. దానికైతే టార్చర్ చూపెట్టాడు నందు. శిరీష: నాకు రికార్డు కావాలి. ప్లీజ్.. అర్థం చేసుకోండి. ఎందుకు నన్నిలా చేస్తున్నారు? నవీన్: శిరీష, శిరీష.. కాల్ రికార్డింగ్ ఆల్రెడీ ఆన్ ఉందా?(నందుని ఉద్దేశించి అడిగిన నవీన్). సారీ కొత్త ఫోన్ కదా మనోడు ఇంకా రికార్డింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోలే.. శిరీష: ఇందాక దాంట్లో రికార్డింగ్ నోక్కాడు. రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడికి (నందుకు). ఫోన్లో రికార్డు అయింది ఆ.. నవీన్: ఒక్క నిమిషం శిరీష నేనే చెక్ చేస్తా.. ఒక్కసారి లైన్లో అట్లానే ఉండు. నువ్వు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపు అట్లానే.. శిరీష: ఆ.. సరే.. రెండో కాల్ రికార్డింగ్.. శిరీష:హలో..హలో..(వెనక నుంచి గందర గో ళంతో కూడిన శబ్దాలు) ఏహే.. వాడు ప్రతి కాల్‌రికార్డింగ్ చేసుకుంటున్నా అన్నాడు నాతో.. నవీన్: లైన్లో అట్లానే ఉండు.. దానికి (తేజస్వినికి) ఫోన్ చేసి కలుపుతా.. నువ్వు కామ్‌గా ఉండు. శిరీష: ఇంకా కెలికితే అది ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు చేస్తదేమో.. నవీన్: –––– ఏం కాదు. నందు ఉన్నాడు. నేనున్నాకదా. హైదరాబాద్ తోపులం. ఎట్లా అంటే హైదరాబాద్ మనదే ఓకేనా.. శిరీష: ఆహ్హా .. మీద ఫైర్ అవుతుంది కదా.. నవీన్: అట్లంటావా మామూలుగా అయితే దాన్ని కెలుకుతా. లైన్లో కలుపుతా ఓకేనా? శిరీష: ఏయ్ వద్దు ఇంక వదిలేసెయ్యండి. నవీన్: ఏం లేదు ఇప్పుడే మాట్లాడి పెట్టేసినం. అందరం మాట్లాడినం.. నేను, నందు. శిరీష: ఏం మాట్లాడారు? నవీన్: నువ్వెంత? నీ బతుకెంత అని మాట్లాడాడు నందు శిరీష:దాన్నా..? నవీన్: ఆ.. శిరీష: అయితే నువ్వేం మాట్లాడావు? నవీన్: నేను.. నేను ఎవరు నువ్వనుకున్నా? ఈళ్ళ ఫ్రెండేమో అని గుంజుకుంది నేనే ఫోను. ఇప్పుడెందుకులే అని.. నందు మాట్లా డతాడు అంట మాట్లాడు..(ఫోన్ నందుకు ఇచ్చాడు) శిరీష: హలో.. నందు: ఆ చెప్పు.. శిరీష: ఏమని తిట్టావురా దాన్ని.. నందు: నీ కెందుకు.. నీ –––, నీ––– అని తిట్టా ఓకేనా? శిరీష: నా నంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? ఏం చెప్పావు? నందు: అదేమీ మాట్లాడలా.. నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు అంది శిరీష: ఏమంది? నందు: నాకు ఆడు తెలుసు ఈడు తెలుసంది.. శిరీష:ఎవడు తెలుసంట? ఏమంటుంది? నీకు నంబర్ ఎవరిచ్చారు? చంపిస్తా? బెదిరిస్తా అంటోందా? నందు: ఎవర్నీ నన్నా.. ఏంటి? శిరీష: ఏమంటోంది అసలు..? నందు: ఏం లేదు సైలెంటైపోయింది. ఇంకోసారి నీకు కాల్ చెయ్యదు. శిరీష:ఆ..నాక్కాదు రాజీవ్‌కి కాల్ చేసి బెదిరిస్తే.. నందు: చెయ్యదు. చేస్తే నాకు చెప్పు.. శిరీష: ఆ.. నందు: చెయ్యదు అన్నాగా..? శిరీష: రాజీవ్‌కు నాకు ఇద్దరికీ చెయ్యదుగా.. ష్యూర్.. నందు: చెయ్యదు. ఓసారి రాజీవ్‌తో ఈ నంబర్‌కు కాల్ చెయ్యమని చెప్పు. శిరీష: ఊ.. సరే చెప్తాలే. ఎందుకు పాపం తనను ఇన్వాల్వ్ చెయ్యడం, తన టెన్షన్స్ తనకు ఉన్నాయి. నందు:ఒకసారి కాల్ చెయ్యమని చెప్పవే వాణ్ణి శిరీష:ఆడు అంటా వేంట్రా? చంపేస్తా.. నందు: కుర్రోడే కదా.. మనోడే కదా.. శిరీష: మనోడైతే రాజీవ్ అనొచ్చుగా.. నందు: నీ––– శిరీష: సరే.. నేను చెయ్యమంటాలే. ఆడు గీడు అనకు నాకు కోపం వస్తది. నువ్వైతే అది నా జోలికి, రాజీవ్ జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా.. హలో.. నందు: ఆఆఆ శిరీష: మా ఇద్దరి జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతా.. నందు: సరే సరే.. -
హోంగార్డు ఆత్మహత్య
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్లో అనుముల సంతోష్(30) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
‘తప్పులు చేశా.. చావే పరిష్కారం’
గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య చెడు వ్యసనాలు, కుటుంబ కలహాలే కారణం ! రాజమహేంద్రవరం క్రైం : తప్పులు చేశాను..నాకు చావు ఒక్కటే పరిష్కారం అంటూ మరణ వాగ్మూలంలో పేర్కొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం, లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న జొన్నాడ వెంకట్రావు (38) మండపేట రూరల్, ద్వారపూడి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య వరలక్ష్మి, ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. మండపేట రూరల్, ద్వారపూడి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకట్రావు సీఎం క్యాంప్ కార్యాలయంలో డ్యూటీ నిర్వహిస్తున్నారు. సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకట్రావుకు అతిగా మద్యం తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సీఎం క్యాంప్ ఆఫీసులో డ్యూటీకి హాజరు కావలసి ఉంది. ఇంటి వద్ద నుంచి డ్యూటీకి వెళ్లి వస్తున్నానని చెప్పి బయటకు వచ్చి పుష్కర ఘాట్‌లో నదిలోకి దిగి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు మరణ వాగ్మూలం (సూసైట్ నోట్)లో ‘నేను తప్పులు చేశాను.. చావు ఒక్కటే పరిష్కారం ..నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను లేకపోయినా అమ్మను నాన్నను బాగా చూసుకో అంటూ భార్య వరలక్ష్మికి లేఖ రాసి ఆత్మహత్యకు ప్పాల్పడ్డారు. సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రీటౌన్ ఎస్సై వెంకటేశ్వరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది సంతాపం కానిస్టేబుల్ వెంకట్రావు మృతికి మండపేట రూరల్, ద్వారపూడి పోలీస్ స్టేషన్ ఎస్సై విద్యా సాగర్, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి సంతాపం వ్యక్తం చేశారు. డ్యూటీలో చురుగ్గా ఉండే వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడడంపై విచారం వ్యక్తం చేశారు. కన్నీటి వీడ్కోలు పెదపళ్ల (ఆలమూరు) : ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ జొన్నాడ వెంకటేశ్వరరావు (43)కు పెదపళ్లలో పోలీసు అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ప్రస్తుతం మండపేట రూరల్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో రాజమహేంద్రవరంలో ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని స్వగ్రామమైన పెదపళ్లకు శుక్రవారం తీసుకువచ్చారు. మండపేట రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్ పర్యవేక్షణలో అధికారులు అధికార పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మండపేట రూరల్ సీఐ వి.పుల్లారావు, ఎస్సైలు పి,దొరరాజు, సీహెచ్.విద్యాసాగర్ తదితరులు వెంకటేశ్వరరావు బౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. -
కేసు ఉపసంహరణకు బెదిరింపులు
రూ.2 లక్షలు తీసుకోమన్న విశ్రాంత పోలీసు అధికారి నిరసనగా మృతురాలి బంధువుల ఆందోళన ప్రియుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌కు చెందిన శిరీష ప్రాణానికి ఓ విశ్రాంత పోలీసు అధికారి వెల కడుతున్నారు. ఆమె మృతికి పరిహారంగా రూ.2 లక్షలు తీసుకుని కేసు ఉపసంహరించుకోవాలంటూట ఒత్తిడి తెస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు ఉపసంహరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని బెదిరించినట్టు వారు ఆరోపిస్తున్నారు. దీంతో వారు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పిఠాపురం/కొత్తపల్లి : బాధితులకు రక్షణ కల్పించి, న్యాయం చేయాల్సిన పోలీసు శాఖలో 30 ఏళ్లకు పైగా పనిచేసి రిటైరైన ఒక అధికారి.. శిరీష మృతి కేసుపైఒత్తిడి చేస్తున్నారంటూ మృతురాలి బంధువులు, ఆనంద్‌నగర్ గ్రామస్తులు బుధవారం కొత్తపల్లి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. సామర్లకోటకు చెందిన విశ్రాంత ఏఎస్సై మంగళవారం రాత్రి తమ ఇంటికి వచ్చి ‘పోయిన పిల్ల ఎలాగూ తిరిగిరాదు.. డబ్బులు ఇస్తాను తీసుకోండి కేసు వల్ల ఒరిగేది ఏమీ లేదంటూ’తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు మృతురాలి తల్లి ఆరోపించింది. డబ్బులు వద్దని, కూతురి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని చెపితే.. కేసు ఉపసంహరించుకోపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్టు ఆమె ఆరోపిస్తోంది. కన్నకూతురు కళ్ల ముందే చనిపోయి పుట్టెడు దుఃఖం ఉంటే ఆదుకోవాల్సింది పోయి ప్రాణాలకు వెల కడుతూ బెదిరింపులకు దిగుతున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. కుమార్తెను మోసం చేసి ఆత్మహత్యకు పురిగొల్పి ప్రాణాలు తీసుకునేలా చేసిన నలుగురు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి డిమాండ్ చేసింది. కేవలం వేధింపులకు పాల్పడినట్టుగా సెక్షన్లు పెట్టడమే కాకుండా మరిన్ని సెక్షన్లు పెట్టి శిక్ష పడేలా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఆ సెక్షన్లో అన్ని కోణాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అన్యాయం జరిగితే చట్టాన్ని ఆశ్రయించండి అని చెప్పిన పోలీసులు అదే చట్టానికి ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఒక అమాయకురాలి ప్రాణానికి వెల కడుతుంటే పోలీసులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితుల అరెస్ట్ శిరీష ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపర్చారు. ప్రియుడు ఇసకోటి విజయరత్నం అలియాస్ కన్నా, అతని తండ్రి ఇసకోటి సుందర్‌సింగ్, తల్లి కమల, సాకా రత్నం అలియాస్ బేబమ్మ లను పిఠాపురం మండలం కోలంకలో అరెస్టు చేసి కోర్టు హాజరుపరుస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన ఈ కేసులో.. వేధింపులకు పాల్పడినట్టుగా నిందితులపై (ఐపీసీ సెక్షన్ 306) ప్రకారం మార్పు చేసినట్టు ఆయన తెలిపారు. -
మాయమయ్యిందా.. మాయం చేశారా?
యువతి ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన సెల్‌ఫోన్ కనిపించకుండా పోవడంపై అనుమానాలు పోలీసుల అదుపులో నిందితులు పిఠాపురం : కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఆదివారం బక్కే శిరీష (19) ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమెకు చెందిన సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ఆమె చనిపోయినప్పటి నుంచి సెల్‌ఫోన్ కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ప్రేమించి మోసం చేసినట్టు చెబుతున్న నిందితుడికి సంబంధించిన ఈమెయిల్స్, ఫేస్బుక్ అకౌంట్స్, వాట్సాప్‌కు సంబంధించిన సమాచారం ఆఫోన్లో ఉంటుందని మృతురాలి బంధువులు, స్నేహితులు చెబుతుండగా ఆఫోన్ మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ ఆమె వద్దే ఉండే సెల్‌ఫోన్ ఆత్మహత్య చేసుకున్నాక గల్లంతవ్వడం, ఆ నంబర్‌కు కాల్ చేస్తే రింగయినా ఎవరూ రిసీవ్ చేసుకోపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికే పోలీసులు ఆసెల్ఫోన్ కోసం మృతురాలి ఇంట్లో సోదాలు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి సోదాలు చేసి లేదా నెట్వర్క్ ద్వారా సెల్‌ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కునే పనిలో ఉన్నారు. శిరీష చనిపోయే ముందు తన ఫోన్ ఎక్కడైనా పెట్టి వదిలేసిందా ? లేక ఆ హడావుడిలో ఎవరైనా దానిని తీసి ఎవరికైనా ఇచ్చారా? ముందు రింగయిన సెల్ తరువాత స్విచ్ఛాఫ్ కావడం చార్జింగ్ అయిపోవడం వల్లా లేక ఎవరైనా ఆపేసారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌ను ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. కేవలం ప్రేమ విఫలం అవ్వడం వల్లే శిరీష మృతి చెందిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమె సూసైడ్ నోట్లో తన చావుకు కారణంగా చెబుతూ పేర్కొన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిఠాపురం సీఐ అప్పారావు ఆధ్వర్యంలో కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిసింది. ‘తల్లి’డిల్లే తనువు చాలించిందా ? ప్రేమించానని నమ్మించి శారీరకంగా అవసరం తీర్చుకుని వదిలేయడం వల్ల తల్లి కాబోతున్నానన్న చేదు నిజం తెలిసి తట్టుకోలేకే ఆమె తనువు చాలించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆ అనుమానంతోనే గర్భ నిర్ధారణకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకండి సమాజంలో అనేక రకాలు మనుషులు ఉంటారు. కొందరు తమ అవసరాలు తీర్చుకోడానికి అనేక వక్రమార్గాలు పడతారు.అటువంటి వారి బారిన పడినప్పుడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను హరించడంతో పాటు ఆ కుటుంబాలను వీధుల పాలు చేస్తాయి. శిరీష మాదిరిగా ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టం, న్యాయం ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. తమ బాధను పోలీసులకు చెప్పుకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విద్యావంతులు కూడా ఇలా అనాలోచిత చర్యలకు పాల్పడ కూడదు. ఎవరు మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం అని సీఐ అప్పారావు సూచించారు. -
హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు
-
హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: భర్తతో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను అధికారులు చాకచక్యంగా రక్షించారు. ఈ ఘటన చైనాలోని అన్హుయ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ 15 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది. ఇది చూసిన కొంతమంది పౌరులు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆమెను చాకచక్యంగా రక్షించాలని వ్యూహం రచించారు. అందులో భాగంగా ఓ అధికారి నడుముకు తాడు కట్టుకుని చప్పుడు చేయకుండా నడుచుకుంటూ వెళ్లి.. అంచున ఏడుస్తూ కూర్చున్న ఆమెను ఒక్కసారిగా పట్టుకున్నాడు. అనుకోని సంఘటనతో షాక్‌కు గురైన ఆమె తనను వదిలేయాలని.. చచ్చిపోతానని కేకలు పెట్టింది. అధికారి ఆమెను పట్టుకోగానే పక్కనే ఉన్న బాల్కని నుంచి వచ్చిన మరో నలుగురు అధికారులు ఆమెను సురక్షితంగా పైకి లాగారు. ఈ దశలో ఆమె చేతి నుంచి సూసైడ్ నోట్ జారి కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఎంతో ధైర్యంతో మహిళను రక్షింంచిన ఫైర్ ఫైటర్‌ను నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు. -
ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి
తల్లి, పెద్ద కుమారుడిని రక్షించిన కల్లుగీత కార్మికుడు గల్లంతైన చిన్న కుమారుడు అనపర్తి : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో తనువు చాలించాలని ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకింది. ఇటీవల కొత్తపేట సమీపంలో కాలువలో దూకి అక్కాచెల్లెళ్లు బిడ్డలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ముగ్గురు పిల్లలు, తల్లి మృతి చెందిన ఘటన మరువక ముందే అనపర్తిలో మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, భర్తతో తగాదాతోనే తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తల్లిని, పెద్ద కుమారుడిని కల్లుగీత కార్మికుడు రక్షించగా, చిన్న కుమారుడు కాలువలో పడి గల్లంతయ్యాడు. బాధితుల బంధువులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అనపర్తి గంగన్నగారి వీధికి చెందిన తంగేటి లోవకుమారి, శివగణేష్‌లు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల రోహిత్ వీరేంద్రనా«థ్, మూడేళ్ల కుష్యంతరాజు అనే కుమారులు ఉన్నారు. ఆరేళ్లుగా ద్వారపూడిలో నివాసం ఉన్న శివగణేష్ కుటుంబం ఏడాది క్రితం అనపర్తికి వచ్చింది. శివగణేష్ స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఈ కుటుంబం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య ఇటీవల తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నెల 10న లోవకుమారి, శివగణేష్‌ల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఈమెను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన ఇద్దరు కుమారులను తీసుకుని లోవకుమారి కెనాల్ రోడ్డులోని వీర్రాజు మామిడి వద్దకు చేరుకుంది. తొలుత చిన్నారులను కాలువలోకి విసిరేసి తాను కూడా దూకింది. ఈ తతంగాన్ని సమీపంలో కల్లు అమ్ముకుంటున్న గీత కార్మికుడు గమనించాడు. పరుగున వచ్చి తొలుత లోవకుమారిని, అనంతరం పెద్ద కుమారుడు రోహిత్ వీరేంద్రనాథ్‌ను ఒడ్డుకు చేర్చాడు. చిన్న కుమారుడిని రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే కుష్యంత్‌రాజు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లోవకుమారిని, పెద్ద కుమారుడిని స్టేషన్‌కు తీసుకు వచ్చిన అనంతరం వైద్య పరీక్షల కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. సమాచారం అందుకున్న శివగణేష్ పోలీస్టేషన్‌కు చేరుకుని బోరున విలపించాడు. ఆత్మహత్య చేసుకునేంత పెద్ద పాటి తగాదాలు లేవని, ఆర్థిక సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని తెలిపాడు. అనపర్తి అడిషనల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం.. కుష్యంత్‌రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధవళేశ్వరం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి వారి సాయంతో బాలుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో హోలీ రోజున ఇద్దరు బాలురు నల్లకాలువలో పడి మృతి చెందిన ఘటనను అనపర్తి ప్రజలు మరువక ముందే కుష్యంత్‌రాజు ఈ రూపంలో గల్లంతవ్వడం స్థానికంగా పలువురిని కలవరపరుస్తోంది. -
కుటుంబ కలహాలతో.. కడతేరిపోవాలని..
-
కుటుంబ కలహాలతో.. కడతేరిపోవాలని..
ముగ్గురు బిడ్డలతో కాలువలోకి దూకిన అక్కాచెల్లెళ్లు బాలుడి మృతదేహం గుర్తింపు ముగ్గురి గల్లంతు సురక్షితంగా బయటపడ్డ చెల్లెలు కొత్తపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ ముగ్గురు బిడ్డల సహా కాలువలో దూకిన వైనమిది. ఒక బాలుడి మృతదేహాన్ని గుర్తించగా ఒక మహిళ సహా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. మరో మహిళ ప్రాణాలతో బయటపడింది. ఘటనకు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఐదుగురు కొత్తపేట మండలం పలివెల లాకుల వద్ద బొబ్బర్లంక– అమలాపురం కాలువలో దూకారు. కొత్తపేట గ్రామానికి చెందిన వెత్సా బుచ్చిరాజు పెద్ద కుమార్తె విజయవాడకు చెందిన మానేపల్లి పుష్పావతి (35), ఆమె కుమారుడు అంజన్ (9), కుమార్తె మాన్విత (7), బుచ్చిరాజు రెండో కుమార్తె రాజమహేంద్రవరానికి చెందిన 30 ఏళ్ల నల్లమిల్లి ప్రమీల, ఆమె కుమార్తె శ్రీగోదా అలివేలు మంగతాయారు (5) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో నల్లమిల్లి ప్రమీల వంతెన సమీపంలో మునిగిపోతుండగా స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్చారు. పలివెల పెట్రోలు బంకు సమీపంలో పుష్పావతి కుమారుడు అంజన్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెవెన్యూ, పోలీసు సిబ్బంది గాలిస్తున్నారు. తల్లిదండ్రులను విజయవాడ వెళ్లనిచ్చి అఘాయిత్యం స్థానిక మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న వెత్సా బుచ్చిరాజు – కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పుష్పావతిని విజయవాడకు చెందిన మానేపల్లి రణధీర్ గుప్తకు ఇచ్చి సుమారు పదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి అంజన్, మాన్విత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో కుమార్తె ప్రమీలను రాజమహేంద్రవరానికి చెందిన నల్లమిల్లి వెంకటరత్నానికిచ్చి 2010 అక్టోబర్‌లో వివాహం చేశారు. వారికి శ్రీగోదా అలివేలు మంగతాయారు అనే కుమార్తె ఉంది. వెంకటరత్నం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలలు కాపురం సజావుగా సాగగా అనంతరం భార్యాభర్తల మధ్య అదనపు కట్నం విషయంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ నేపథ్యంలో ఏడాది క్రితం తన కుమార్తెతో పుట్టింటికి కొత్తపేట వచ్చేసింది. గతంలో మూడుసార్లు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా వుండగా విజయవాడకు చెందిన పెద్ద కుమార్తె పుష్పావతిని భర్త అనుమానించడంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఆమె కూడా మూడుసార్లు పుట్టింటికి వచ్చేయగా తల్లిదండ్రులు నచ్చచెప్పి పంపిం చారని సమాచారం. శనివారం భార్యాభర్తలు మళ్లీ గొడవ పడగా తండ్రికి ఫోన్ చేసింది. రేపు తాను వచ్చి మాట్లాడతానని చెప్పి ఆదివారం ఉదయం బుచ్చిరాజు తన భార్యను తీసుకుని విజయవాడ వెళ్లాడు. పుష్పావతి తన పిల్లలిద్దరినీ తీసుకుని కొత్తపేట వచ్చింది. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ముగ్గురు పిల్లల సహా అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే తహసీల్దార్ ఎన్ శ్రీధర్, రావులపాలెం సీఐ బి. పెద్దిరాజు, ఎస్సై డి. విజయకుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కాలువ పొడవునా గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పెద్దిరాజు తెలిపారు. ఆర్ఎస్ పరామర్శ, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరా ఈ సమాచారం తెలిసిన వెంటనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్) కొత్తపేట ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రమీలను పరామర్శించి ఓదార్చారు. సంఘటనపై అధికారులను ఆరా తీశారు. స్థానికేతర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫోన్లో ఈ సంఘటనపై రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆరా తీశారు. సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. తన ప్రతినిధిగా జిల్లా వైఎస్సార్సీపీ సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావును అప్రమత్తం చేసి ఆస్పత్రికి పంపించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంఘటనా స్థలికి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
అనుమానం పెనుభూతం
భార్యను చంపి, భర్త ఆత్మహత్య కాకినాడ రూరల్ : అనుమానం పెనుభూతంగా మారడంతో భార్యను చంపి తాను ఉరివేసుకొని చనిపోయిన సంఘటన కాకినాడ రూరల్ మండలం తమ్మవరం పంచాయతీ పోలవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన పినపోతుల రవి (26)కి పోలవరం గ్రామానికి చెందిన భూలక్షి్మతో 2015లో వివాహమైంది. వీరికి 14 నెలల పాప ఉంది. భూలక్ష్మి ప్రస్తుతం ఏడు నెలలు గర్భిణి. ఏడాదిగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య భూలక్ష్మిపై రవి అనుమానంతో గొడవ పడుతున్నాడు. ఇరవై రోజుల క్రితం ఏటిమొగ నుంచి కొందరు పెద్దలు వచ్చి భార్యాభర్తల మధ్య తగవు తీర్చి కాపురాన్ని చక్కదిద్దారు. కొన్ని రోజులు బాగానే ఉన్న వారు శుక్రవారం ఉదయం మళ్లీ ఘర్షణ పడ్డారు. ఏం జరిగిందో ఇద్దరు శవాలై ఉండడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు రవి హార్బర్‌పేటలో కోళ్ల మేతకు, రొయ్యల చెరువులకు ఉపయోగించే చేపల గుండ తయారు చేసే పనులు చేస్తుం టాడని స్థానికులు తెలిపారు. భూలక్ష్మి అన్న ప్రసాద్ పక్క గదిలోనే ఉంటున్నాడు. ఇతను పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం కంపెనీ నుంచి తమ్మవరం ఎస్సీపేటలో స్నేహితుని పెండ్లికి వెళ్లేం దుకు గిఫ్టు తీసుకొని ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చే సరికి చెల్లెలు కుమార్తె పెద్దగా ఏడుస్తోంది. తలుపులు తీసి చూసే సరికి బావ రవి ఇంట్లో ఫ్యాన్ హుక్కుకి ఉరేసుకొని కన్పించాడు. వెంటనే ఆ మార్గం గుండా వెళ్తున్న వ్యక్తుల సాయంతో కిందికి దింపగా అప్పటికే రవి మరణించాడు. అదే గదిలో మంచం కింద తన చెల్లెలు శవమై కనిపిం చింది. భూలక్షి్మని రవి ముందుగా గొంతు వస్త్రంతో బిగించి చంపేసి మంచం కింద పెట్టేసి, తాను భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ వి.పవన్‌కిశోర్, తిమ్మాపురం ఎస్సై బి.తిరుపతిరావుతో పాటు ట్రైనీ ఎస్పీ అజితా వెజెందలా తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపురం పోలీసులు తెలిపారు. -
దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్‌పల్లిలోని కళింగ ఎన్‌క్లేవ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సందీప్ యాదవ్(35), రుక్మిణి(30)దంపతులు గురువారం రాత్రి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు వారిని రక్షించడానికి యత్నించినా లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన కలహాలు
శివ్వంపేట: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ వీరయ్య, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంతి గ్రామానికి చెందిన మామిళ్ళ నర్సింలు(26) సోమవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని ఓ కుంటవద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన సమీప రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నర్సింలుకు గత ఏడాది డిసెంబర్లో మూగ యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన నర్సింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అవినీతి రక్కసి కోరలకు మరో ఎస్సై బలి!
-
అవినీతికి మరోఎస్సై బలి!
- దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్య - సర్వీసు రివాల్వర్‌తో భార్యను కాల్చి, తానూ కాల్చుకున్న వైనం - అవినీతి డబ్బు కోసం అధికారుల వేధింపులు? - 20 రోజులుగా మానసిక వేదన అనుభవించిన ఎస్సై - చేయని తప్పుకు సస్పెన్షన్ ఉత్తర్వులపై ఆందోళన - బాసుల తీరుపై పోలీసు వర్గాల్లో నిరసన గళం - ఘటనపై మెదక్ అదనపు ఎస్పీ నేతృత్వంలో విచారణ - చిట్టిబాబు ఆత్మహత్యకు పైఅధికారుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు సాక్షి, సిద్దిపేట చూస్తుండగానే మరో ఘోరం జరిగిపోయింది. రాష్ట్రంలో అవినీతి రక్కసి కోరలకు మరో ఎస్సై బలైపోయారు. ఉన్నతాధికారుల వేధిం పులు భరించలేక, తాను చేయని తప్పును తనపై వేసుకోలేక సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు (54) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీసు రివాల్వర్‌తో తన భార్యను కాల్చి తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దుబ్బాక పోలీసు క్వార్టర్స్‌లో శుక్రవారం పట్టపగలే ఈ ఘటన జరిగింది. గత తొమ్మిది నెలల్లో ఒకే పోలీసు డివిజన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న రెండో ఎస్సై చిట్టిబాబు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా కడప పట్టణానికి చెందిన చిట్టిబాబు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రాకాసిపేటలో స్థిరపడ్డారు. 1984లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి కొన్నేళ్ల కిందే ఎస్సైగా పదోన్నతి పొందారు. ఆయనకు భార్య సరోజ (48), ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రేమ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె స్వర్ణ ఎంబీఏ చదువుతున్నారు. సరోజ హైదరాబాద్‌లోని తమ కుమారుడి వద్ద ఎక్కువగా ఉంటుంటారు. తరచూ దుబ్బాకకు వచ్చి వెళుతుంటారు. అయితే గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లిన చిట్టిబాబు... శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్యతో సహా దుబ్బాకలోని తమ పోలీస్ క్వార్టర్‌కు చేరుకున్నారు. తర్వాత రెండు గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా మంచంపై నిద్రపోతున్న భార్య సరోజ (48)ను కణతపై పాయింట్ బ్లాంక్ దూరం నుంచి కాల్చి.. తర్వాత తాను గదమ భాగంలో కాల్చుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఓ హోంగార్డు చూడటంతో.. మధ్యాహ్నం భోజనం కోసం ఏం తీసుకురావాలో అడిగేందుకు ప్రభాకర్ అనే హోంగార్డు ఎస్సై చిట్టిబాబు క్వార్టర్ వద్దకు వచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న ఎస్సైని, ఆయన భార్యను చూసి వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందికి చెప్పారు. పోలీసులు వచ్చేటప్పటికే సరోజ చనిపోయి ఉండగా.. చిట్టిబాబు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పిస్టల్ రక్తపు మడుగులోనే పడి ఉంది. పోలీసులు చిట్టిబాబును సిద్దిపేట సురక్షా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. కాగా ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ తెలిపారు. ఉన్నతాధికారులు విచారణాధికారిగా మెదక్ అదనపు ఎస్పీ రాంచంద్రారెడ్డిని నియమించారని ప్రకటించారు. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం చిట్టిబాబు ఆత్మహత్యకు సంబంధించి ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మెదక్ అదనపు ఎస్పీ రాంచంద్రారెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ సైదులు ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. పంచనామా పూర్తయ్యే వరకు డీఐజీ అకున్ సబర్వాల్ అక్కడే ఉన్నారు. చిట్టిబాబు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్యహత్యకు పాల్పడ్డారని.. కుటుంబ సభ్యులు ఏవిధంగా ఫిర్యాదు చేస్తే అదే విధంగా కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. సెట్ కాన్ఫరెన్స్ నుంచి ఆత్మహత్య వరకు.. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఖర్చుల కోసం ప్రతి పోలీసు స్టేషన్ నుంచి నెలకు రూ.ఐదు వేలు, పైఅధికారులు వచ్చినప్పుడు డీజిల్ ఖర్చులు ఇవ్వాలనే నిబంధన అమలవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని చిట్టిబాబు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా పోలీసు బాస్‌తో జరిగిన ఓ సెట్ కాన్ఫరెన్స్‌లో వివాదం తలెత్తి ఆత్మహత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. చిట్టిబాబు తీరును మనసులో పెట్టుకున్న జిల్లా అధికారి.. దుబ్బాక మండలంలో బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని, ఇసుక దందా నడుస్తోందని, వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చిట్టిబాబును నిలదీసినట్టు సహచర పోలీసులు చెబుతున్నారు. దీనిపై చిట్టిబాబు దీటుగానే స్పందించి... తన పోలీస్‌స్టేషన్ పరిధిలో బెల్టు దుకాణాలు లేవని, దాదాపు 60 మందిపై కేసులు పెట్టానని, మీరు అనుమతిస్తే పీడీ యాక్ట్ పెట్టడానికైనా సిద్ధమేనని బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన అనంతరం గత నెల 3న శిక్షణ నిమిత్తం చిట్టిబాబు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. పనిగట్టుకుని ప్రతీకారం! తిరిగి 20వ తేదీన విధుల్లోకి చేరడానికి వచ్చిన చిట్టిబాబును విధుల్లో చేరకుండా అడ్డుకుంటూ ఐడీ పార్టీకి అటాచ్ చేశారు. ఇదే సమయంలో స్పెషల్ పార్టీ పోలీసులతో పనిగట్టుకొని దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తనిఖీలు చేయించారు. చివరికి తిమ్మాపూర్ అనే గ్రామంలో ఒక బెల్టు దుకాణాన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆ దుకాణం, ఇసుక రవాణాలను కారణంగా చూపిస్తూ చిట్టిబాబును సస్పెండ్ చేసినట్టు సమాచారం. గురువారం సాయంత్రం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని, కానీ వాటిని తీసుకోవడానికి చిట్టిబాబు నిరాకరించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ డైరీలో ఏముందో? చిట్టిబాబుకు నిత్యం తన కార్యకలాపాలు డైరీలో రాసుకునే అలవాటు ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు తనను వేధించిన అంశంపై ఆయన తన డైరీలో, హ్యాండ్ బుక్‌లో రాసే ఉంటారని అంటున్నారు. చిట్టిబాబుకు చెందిన కారులో నలుపు రంగులో ఉన్న స్పైరల్ డైరీ ఒక దానిని గుర్తించారు. కారు లాక్ చేసి ఉండడంతో శుక్రవారం సాయంత్రం వరకు దానిని తీయలేదు. ఆ డైరీని పరిశీలిస్తే కొంత సమాచారం దొరకవచ్చని భావిస్తున్నారు. మా నాన్నను వేధించారు: ఎస్సై చిట్టిబాబు కుమారుడు ప్రేమ్‌కుమార్ ‘‘మా నాన్న చాల ధైర్యవంతుడు. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. కానీ ఆయనను ఉన్నతాధికారులు వేధించారు. ఆయనను దోషి అని చూపడానికి ప్రత్యేక పోలీసులతో గ్రామాల్లో సోదాలు చేయించారు. 30 ఏళ్లు డిపార్టుమెంటుకు సేవ చేసిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే నాన్న నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని చెప్పారు..’’మీడియాకు చెప్పారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన కూడా ధర్నాలో కూర్చున్నారు. ఆరోపణలు అవాస్తవం: సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ‘‘చిట్టిబాబు మృతిపై సీనియర్ పోలీసు అధికారితో విచారణ చేపట్టాం. ఆయన ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమనే ఆరోపణల్లో నిజం లేదు. 1984లో కానిస్టేబుల్‌గా నియమితుడైన చిట్టిబాబు 2012లో ఎస్సైగా ప్రమోషన్ పొందారు. 2004లో ఒకసారి సస్పెండయ్యారు. ఆరు రోజుల క్రితం ఓ క్రైమ్ దర్యాప్తులో భాగంగా సిద్దిపేటకు అటాచ్ చేశాం. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మూడు రోజుల క్రితం సస్పెండ్ చేశాం. కానీ చిట్టిబాబు ఆ ఆదేశాలను ఇంకా తీసుకోలేదు. ఎస్సైగా విధుల్లోనే ఉన్నారు..’’ పోలీసులు మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు: మంత్రి హరీశ్‌రావు ‘‘శాంతి భద్రతలను పరిరక్షించి ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులు మనోస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలేమైనా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పాలి. వారి వద్ద కూడా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పోలీసులు రక్షణ కోసం వాడే తుపాకులతోనే తమ ప్రాణాలు తీసుకుంటుంటే గుండె తరుక్కుపోతోంది..’’ అతినీతి మంచి ఎస్సైని బలి తీసుకుంది: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘‘అవినీతి ఒక మంచి ఎస్సైని బలి తీసుకుంది. దళిత కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి ఇలా అర్ధంతరంగా తనువు చాలించటం తీవ్రంగా కలచివేసింది. నాకు తెలిసినంత వరకు ఎస్సై చిట్టిబాబు మచ్చ లేని పోలీసు అధికారి. ఆయన ఆత్మహత్యపై, పోలీసు శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి..’’ ఎస్సైల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలి: చాడ సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా ఎస్సై స్థాయి అధికారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోనే నలుగురు ఎస్సైలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. చిట్టిబాబు తన భార్యను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇలా ఎస్సైలు ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖకు మచ్చ అని విమర్శించారు. -
పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య
మధురానగర్(విజయవాడ సెంట్రల్): పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన విజయ మేరీ జర్షిత్ ఆర్సీఎం స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈమె కుమార్తె జాన్సీమౌనిక (17) ఇంటర్ చదువుతుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న జాన్సీ ఇంటర్ పరీక్షలు రాయనని చెప్పడంతో తల్లి సైక్రియాటిస్ట్‌కు చూపించగా అక్కడ పరీక్షలు రాసేందుకు అంగీకరించింది. గురువారం ఉదయం 7.30గంటలకు జాన్సీ మౌనిక ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. పరీక్షలు రాయటం ఇష్టం లేక ఇంట్లో తలుపు వేసుకుని పడుకుందని భావించిన తల్లి విధులకు వెళ్లిపోయింది. తరువాత విజయ మేరీ మరదలు తలుపు కొట్టినా తెరవకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరచి చూసేసరికే ఆమె మృతిచెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరణంలోనూ నీ వెంటే..
వారిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం..భర్త సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో అన్యోన్యంగానే జీవిస్తున్నారు..పచ్చని ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. మాయదారి కడుపునొప్పి ఇంటిపెద్దను కబళించగా..పతి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ ఇల్లాలూ బలవన్మరణానికి ఒడిగట్టడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో బుధవారం చోటు చేసుకుంది. ► అనారోగ్యంతో భర్త బలవన్మరణం ► పతి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు తీసుకున్న సతి ► అనాథలైన ఇద్దరు చిన్నారులు ► సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో విషాదం మేళ్లచెర్వు: మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ముడెం రాజమోహన్‌రెడ్డి(38) స్థానిక మైహోం సిమెంట్ పరిశ్రమలో డ్రిల్లింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యర్రం వెంకట్‌రెడ్డి కూతురు సరిత(28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీమంత్‌రెడ్డి (7), శ్రీజ(6) ఇద్దరు సంతానం. రాజమోహన్‌రెడ్డి రెండేళ్లుగా కడుపునొప్పితో పాటు మానసికంగా బాధపడుతున్నాడు. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కూడా చేయించుకుంటున్న ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి రాజమోహన్‌రెడ్డికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటికి దగ్గరిలోని కాలువకట్ట వద్దకు వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవుడైన భర్తను చూసి.. తెల్లవారుజామున భర్త ఇంట్లో కనిపించకపోవడంతో సరిత ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని బంధువులకు తెలిపి వెతకసాగింది. చివరకు గ్రామ శివారులోని కాల్వకట్ట వద్ద భర్త విగతజీవుడిగా పడి ఉండడాన్ని సరిత గమనించి బోరున విలపించింది. నీవులేని లోకంలో నేనూ ఉండలేనంటూ మృతదేహం పక్కనే ఉన్న పురుగులమందు డబ్బాను తీసుకుని తాగింది. బంధువులు గమనించి సరితను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా మృతిచెందింది. అనాథలైన ఇద్దరు చిన్నారులు రాజమోహన్‌రెడ్డి, సరిత ఆత్మహత్యకు పాల్పడడంతో వారి పిల్లలు శ్రీమంత్‌రెడ్డి, శ్రీజలు అనాథలుగా మారారు. తమ తల్లి దండ్రులు చనిపోయారన్న సంగతి వారికి అర్థంగాక అమాయకంగా అక్కడికి వచ్చిన వారి వైపు దీనంగా చూస్తుండడం చూపరులను కంటతడిపెట్టించాయి. తల్లిదండ్రుల క్షణికావేశానికి ఇద్దరు పిల్లలు దిక్కులేని వారుగా మిగిలారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దంపతుల మృతితో గ్రామంలోవిషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు కోదాడ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి తండ్రి యర్రం వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.రవికుమార్ తెలిపారు.