
సాక్షి, చెన్నై : సీనియర్ నటి వాణిశ్రీ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కళుకుండ్రంలోని ఫాంహౌస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అభినయ్ బెంగళూరు నుంచి వచ్చాక హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఆయన అనూహ్యంగా శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా అభినయ్ భార్య కూడా వైద్యురాలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరోవైపు అభినయ్ మృతిపై తిరుక్కళుకుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కాగా వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. అభినయ్ గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది. కుమారుడు హఠాన్మరణంతో వాణిశ్రీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (‘తనే విడాకులు కోరుకున్నాడు’)
Comments
Please login to add a commentAdd a comment