ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: రోజా | YSRCP MLA Roja takes on Chandra Babu Naidu | Sakshi
Sakshi News home page

ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: రోజా

Published Sun, Jul 29 2018 10:48 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP MLA Roja takes on Chandra Babu Naidu - Sakshi

తిరుపతి: ఆంధ్రప‍్రదేశ్‌ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకుంటారంటూ ప్రభుత్వంపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. గతంలో ఏపీ హోదా కోరుతూ మునికోటి అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాన్ని ఇప్పటివరకూ ప్రభుత్వం ఆదుకోలేదనే విషయాన్ని రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలా ఎంతా మంది ప్రాణాలు తీసుకుంటారంటూ ప్రభుత్వాన్ని రోజా నిలదీశారు. శనివారం ప్రత్యేక హోదా కోరుతూ మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్‌ బలవన్మరణానికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం రోజా మీడియాతో మాట్లాడుతూ..  సుధాకర్‌ది ఆత్మహత‍్య కాదని.. ఇది ముమ్మాటికీ సర్కార్‌ చేసిన హత్యేనన్నారు.

వెంకన్న  సాక్షిగా నరేంద్ర మోదీ-చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమాయ్యాయని  ప్రశ్నించారు. హోదాపై ఉద్యమాలు చేస్తుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రోజా పేర్కొన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారే తప్ప హోదాపై నిలదీయడం లేదని రోజా విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement