
సాక్షి, వైఎస్సార్ : కవైట్‌లో నివసిస్తున్న వైఎస్సార్‌జిల్లా వాసి ఓ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుండుపల్లె మండలం గుట్టకింద రాచపల్లి గ్రామానికి చెందిన గండికోట ఆనంద్ (44) కువైట్‌లో మహాబుల్లా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో తను నివసిస్తున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment