Bollywood Art Director Nitin Desai Passes Away - Sakshi
Sakshi News home page

Nitin Desai: స్టూడియోలో శవమై కనిపించాడు.. అసలేం జరిగింది?

Aug 2 2023 12:15 PM | Updated on Aug 2 2023 12:42 PM

Bollywood Art Director Nitin Desai Passed Away - Sakshi

ఇండస్ట్రీలో మరో విషాదం. ఓవైపు గుండెపోటు, మరోవైపు అనారోగ్య సమస్యలతో పలువురు సీనియర్ యాక్టర్స్ చనిపోతున్నారు. అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులు బాధపడ్డారు. సరే వీటి గురించి మెల్లమెల్లగా మర్చిపోతున్నాం అనుకునేలోపు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అనుమానాస్పద రీతిలో చనిపోవడం సంచలనంగా మారింది.

(ఇదీ చదవండి: సమంత ట్రీట్‌మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?)

గత కొన్ని దశాబ్దాల నుంచి బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా నితిన్ చంద్రకాంత్ దేశాయ్(58) గుర్తింపు తెచ్చుకున్నారు. సలాం బాంబే, 1942 ఏ లవ్ స్టోరీ, కామసూత్ర, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, స్వేడ్స్, స్లమ్ డాగ్ మిలియనీర్, జోధా అక్బర్.. ఇలా ఎన్నో సినిమాల్లోని సెట్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు.

ఆర్ట్ డైరెక్టర్‌గానే కాకుండా మరాఠీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన, కొన‍్నిచిత్రాల్లో అతిథిగా మెరిసిన ఈయన.. ముంబయి ఊరిచివర్లో ఎన్‌డీ స్టూడియోస్‌ని సొంతంగా పెట్టుకున్నారు. ఇప్పుడు అందులోనే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనుకు తానుగా చనిపోయారా లేదా వేరే ఏమైనా కోణం ఉందా అనే విషయాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏదేమైనా మంచి ఆర్ట్ డైరెక్టర్ ఇలా తనువు చాలించడంతో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement