
హైదరాబాద్: ప్రియురాలు మోసం చేసిందన్న మనస్తాపం తో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేష న్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ కిందిబస్తీకి చెందిన జి.తని (30) కానిస్టేబుల్‌గా పనిచేస్తు న్నాడు. 2010 బ్యాచ్‌కు చెందిన తని సంతోష్‌నగర్ ఠాణా నుంచి ఐదునెలల క్రితం సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌కు బదిలీ అయ్యాడు.
కొద్దినెలల క్రితం మెడిసిన్ చదివే యువతితో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇటీవల ఆ యువతి పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమెను ఒప్పించేందుకు తని పలు విధాలుగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో గురువారం నైట్‌డ్యూటీకి వెళ్లలేదు. స్నేహితుడు కిషోర్‌ను కలసి వస్తానని చెప్పి రాత్రి 8 గంటలకు బయటకు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లాడు.
హాలులో పడుకున్న కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి తని తాడుతో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబసభ్యులు కిందకి దించి చూడగా అప్పటికే మృతి చెందాడు.
బబ్బు నీకో చాన్స్ ఇవ్వాలనిపిస్తుంది..
తని ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రియురాలిని ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫీవీడియో తీసుకున్నాడు. పోలీసులు తని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘బబ్బు! నీకో చాన్స్ ఇవ్వా లనిపిస్తుంది.. నా ప్రేమ అలాంటిది, అయినా నువ్వు మారవు అనిపిస్తుంది’ అంటూ రెండు నిమిషాలు మాట్లాడి చివరకి ఆడాళ్లు మారరు అని ముగించాడు.
కాగా, ప్రేమ విఫలం కావడంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.