
ప్రతికాత్మక చిత్రం
సాక్షి, టీ.నగర్(చెన్నై): మైలాపూర్ ట్రాఫిక్ ఎస్‌ఐ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. సైదాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ట్రాఫిక్ స్పెషల్ ఎస్‌ఐ బాలాజీ (50) నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలాజీ మధుమేహానికి చికిత్స పొందుతున్నారు. ఇలావుండగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనవసరంగా సెలవులు పెట్టరాదని డీజీపీ త్రిపాఠి ఉత్తర్వులిచ్చారు. దీంతో బాలాజీ సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు సమాచారం. సోమవారం ఉదయం మైలాపూర్ ఆలయంలో భద్రతా పనులు అప్పగించారు. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన బాలాజీ తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిభారం కారణమా? లేక కుటుంబ సమస్య? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.