Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Jagan Key Comments At Combined Kurnool District YSRCP Leaders Meet Updates1
వైఎస్సార్‌సీపీ కార్యకర్తను చూసినా బాబుకు భయమే: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: జగన్‌ మంచి చేశాడు కాబట్టి చంద్రబాబు(chandrababu) మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని.. కానీ, నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మంచి చేశాం కాబట్టే ఇవాళ వైఎస్సార్‌సీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం. ఆ ప్రస్థానంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్‌సీపీ(YSRCP) ఎదిగింది. ఆరోజు నుంచీ నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈరెండింటిని చూసి నాతోపాటుగా మీరంతా అడుగులో అడుగు వేశారు. 👉రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవ్వాళ్టికీ కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన ఏ నాయకుడైనా గర్వంగా కాలర్‌ ఎగరవేసుకుని ప్రజల వద్దకు వెళ్లగలడు. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ మన నాయకులకు మాత్రమే ఉంది. మనం రాకముందు రాజకీయాలు ఒకలా ఉండేవి. మనం వచ్చిన తర్వాత రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చాం. ఇచ్చిన మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాలని చెప్పాం. రాజకీయ అవసరాలకోసం గతంలో ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టో ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. మనం వచ్చాక, మేనిఫెస్టోను ఒక పవిత్రమైన గ్రంధం మాదిరిగా భావించాం. ప్రతి అంశాన్నీ నెరవేర్చాలని తపన, తాపత్రయం పడ్డాం. కోవిడ్‌ ఉన్నా సరే అన్ని హామీలను నెరవేర్చాం. సంక్షోభం ఉన్నా, ఏరోజూ సాకులు వెతుక్కోలేదు. 99శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం. గడపగడపకూ ప్రతి ఇంటికీ వెళ్లాం. ఇన్ని చేసినా మనం ఓటమి చెందాం. 👉చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. ప్రతి ఇంటికీ తన మనుషులను చంద్రబాబు పంపాడు. కరపత్రాలు, బాండ్లు చంద్రబాబు పేరిట పంచారు. ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. దీనివల్ల పదిశాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్‌ చేశాడు కాబట్టి, చంద్రబాబుకూడా చేస్తాడని నమ్మారు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మారు. చంద్రబాబు మారాడేమోనని ప్రజలు నమ్మారు. అందుకే 50శాతం నుంచి 40శాతానికి మన ఓటు షేరు తగ్గింది. కానీ, చంద్రబాబు వచ్చి 11 నెలలు అయిపోయింది. రెండు బడ్జెట్లు పెట్టాడు(Chandrababu Budgets). చంద్రబాబు నాయుడు హామీలు నెరవేరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. మాట ఇచ్చాను కాని, ఇప్పుడు భయం వేస్తుందని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. రాష్ట్రానికున్న అప్పులపై అబద్ధాలు చెప్తున్నారు. ప్రతిరోజూ అబద్ధాలు చెప్తునే ఉన్నారు. 👉జగన్‌ ఉన్నప్పుడు నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లాయని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు ఉన్న ప్లేటును చంద్రబాబు లాగేశాడని అనుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తి తిరోగమనం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీకి రూ.3,500 కోట్లు బకాయి పెట్టారు. దీంతో వైద్యం చేయలేమని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడంలేదు. రైతులకు పెట్టుబడి సహాయం అందడంలేదు. ఫీజు రియింబర్స్‌మెంట్‌, వసతి దీవెన అందడంలేదు. పరిపాలనలో పారదర్శకత పూర్తిగా పక్కకు పోయింది. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన(Red book Rule) కొనసాగుతోంది. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు యధేచ్చగా వెలిశాయి. పేకాట క్లబ్బలు, ఇసుక, మట్టి, మైనింగ్‌ మాఫియాలు నడుస్తున్నాయి. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికీ పార్టీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా నిలవాలి. గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పార్టీ ఉండాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలి.చంద్రబాబుగారూ.. ప్రజలకు మంచి చేయొచ్చు కదా?. ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు కదా?. ఇంతలా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా?. ఏపీ పూర్వపు బిహార్‌ రాష్ట్రంలా తయారయ్యింది. అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు?. ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తున్నారు?. ఎందుకంటే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే చంద్రబాబు భయం. వైయస్సార్‌ సీపీ కార్యకర్త అంటే కూడా చంద్రబాబుకు భయం. చంద్రబాబు హామీల అమల్లో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. టీడీపీ కేడర్‌, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు దగ్గరకు వెళ్తే కచ్చితంగా నిలదీస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నాం. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్‌ 2.O పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్‌ భరోసాగా ఉంటాడు. విలువలు, విశ్వసనీయతకు దర్పణంలా పార్టీని నిలుపుదాం అని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Former Home Secretary On Tahawwur Rana Role In Mumbai Attacks2
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై

న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్‌ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్‌ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్‌ సయ్యద్‌ గిలానీ(డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ) 1960లో వాషింగ్టన్‌లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్‌ సలీం గిలానీ పాక్‌ దౌత్య వేత్త. తల్లి అలైస్‌ సెర్రిల్‌ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్‌ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. 2008 నవంబర్‌ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్‌లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్‌ డేవిడ్‌ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్‌లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు.

CM Revanth Says Young India Is Congress Brand3
యంగ్‌ ఇండియా స్కూల్‌ నా బ్రాండ్‌: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసులకు యంగ్‌ ఇండియా స్కూల్‌ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్‌ అని అన్నారు. సైనిక్ స్కూల్‌కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపై మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవే. 16 నెలలైనా బ్రాండ్‌ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్‌ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్‌. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు. యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్‌ఇండియా పోలీస్‌ స్కూల్‌కు రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం అంటే వైఎస్సార్‌ గుర్తుకువస్తారు. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. యంగ్‌ ఇండియా స్కూల్‌ నా బ్రాండ్‌. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. పోలీసు స్కూల్‌ విషయంలో రాజకీయం లేదు.వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి.. ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Look At Prithvi Shaw: Ex Pak Cricketer Strong Warning To Yashasvi Jaiswal4
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!

ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఒకడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ తన అద్భుత ఆట తీరుతో టెస్టుల్లో భారత జట్టు ఓపెనర్‌గా పాతుకుపోయాడు.అరంగేట్రంలోనే శతక్కొట్టిన జైసూ.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్‌ సెంచరీలు కూడా విశేషం. టెస్టుల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేసిన జైస్వాల్‌.. ఇప్పటికి 23 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 723 పరుగులు సాధించాడు. అయితే, దాదాపు ఏడాది కాలంగా మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు.మరోసారి విఫలంగతేడాది ఐపీఎల్‌లోనూ యశస్వి జైస్వాల్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున పదహారు ఇన్నింగ్స్‌లో కలిపి 435 పరుగులు చేయగలిగాడు. ఇక ఐపీఎల్‌-2025 (IPL 2025)లో మాత్రం ఇంత వరకు తన మార్కు చూపలేకపోయాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్‌ మొత్తంగా 107 (1, 29, 4, 67, 6 )పరుగులే చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లోనూ జైసూ తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు.తొలి టెస్టులో సెంచరీ (161), ఆఖరి టెస్టులో హాఫ్‌ సెంచరీలు (82, 84) మినహా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. తర్వాత రంజీ బరిలో దిగి విఫలమయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చి జైస్వాల్‌.. అరంగేట్రంలోనే తేలిపోయాడు. తన మొదటి వన్డేలో కేవలం పదిహేను పరుగులే చేశాడు.పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ యశస్వి జైస్వాల్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి కడుపు నిండిపోయింది. అంటే.. ఇప్పటి వరకు సాధించిన దానితో సంతృప్తి పడిపోయాడు. జైస్వాల్‌ ప్రస్తుతం క్రికెట్‌పై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.అతడికి ఇదే నా సందేశం.. క్రికెట్‌ను నిన్ను గొప్ప స్థాయికి చేర్చగలదు. అదే సమయంలో.. అదే రీతిలో ఏడిపించగలదు కూడా! ఒక్కసారి పృథ్వీ షా పరిస్థితి చూడు. ఇప్పటికైనా మునుపటిలా క్రికెట్‌ను ప్రేమించు. అదే ప్యాషన్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టు’’ అని బసిత్‌ అలీ జైసూకు సూచించాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జైస్వాల్‌ స్థానం గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నాడు.విరాట్‌ కాస్త తొందరపడ్డాడు.. కానీభారత్‌లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదువలేదని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకు వస్తున్నారు కాబట్టి జైసూ ఇప్పటికైనా జాగ్రత్తపడాలని బసిత్‌ అలీ సలహా ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా.. ‘‘అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగి రోహిత్‌, విరాట్‌ మంచి పని చేశారు.నాకైతే విరాట్‌ కాస్త తొందరపడ్డాడు అనిపించింది. అయితే.. సరైన సమయంలో అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో ఈ ఇద్దరు రిటైర్మెంట్‌ ప్రకటించి వారికి మార్గం సుగమం చేశారు’’ అని బసిత్‌ అలీ పేర్కొన్నాడు. కాగా చిన్న వయసులోనే సత్తా చాటి భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌ పృథ్వీ షా.. టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించి ఐపీఎల్‌ వేలంలో కూడా అమ్ముడుపోని స్థితికి దిగజారిపోయాడు.చదవండి: అతడికి కాస్త మర్యాద నేర్పండి.. చీప్‌ జోకులు వద్దు: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

AP High Court Angry With Sullurpet Police Granted Relief to Posani5
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి, సాక్షి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ మురళీ కృష్ణపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి(IO) వ్యవహరించారని, కేసులో అదనంగా 111 సెక్షన్ పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది. అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.

Michelle Obama Finally Open Up On Divorce Rumours6
Michelle Obama: ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్‌ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్‌ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్‌ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.నటి సోఫియా బుష్‌ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 3వ తేదీన హమిల్టన్‌ కాలేజీలో ఓ ఈవెంట్‌కు హాజరైన బరాక్‌ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్‌ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు.

KSR Comments Over Yellow Media And Red Book7
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వ అరాచకాలు, రెడ్‌బుక్‌ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు సృష్టిస్తున్న విధ్వంసంపై ప్రజలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డి పల్లిలో హత్యకు గురైన కురబ లింగమమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెళ్లిన సందర్భంగా ప్రజల ఆదరణ చూస్తే కూటమిపై వారి వ్యతిరేకత ఏమిటి? ఎంతస్థాయిలో ఉన్నదీ స్పష్టమవుతుంది.వైఎస్‌ జగన్‌ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం పన్నిన అన్ని కుట్రలూ ఇక్కడ విఫలమయయ్యాయి. పోలీసులు సృష్టించిన అడ్డంకులన్నింటినీ తొలగించుకుని మరీ జనసందోహం ఒక సునామీలా జగన్‌కు తన మద్దతు తెలిపింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలతో జగన్‌ పర్యటన విజయవంతమైంది. ప్రజాగ్రహంపై ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ అయ్యింది!.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు ఇప్పటివరకూ నెరవేర్చకపోవడం.. వీటి గురించి ప్రశ్నించిన వారిని రెడ్‌బుక్‌ పేరుతో అణచివేతకు గురి చేస్తూండటం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం. రాష్ట్రస్థాయి నాయకులు ఒక చిన్న గ్రామానికి వెళితే ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల వారు వెళ్లడం పరిపాటి. కానీ, జగన్‌ పాపిరెడ్డి పల్లి పర్యటనలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉండటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కూటమి చేతిలో మోసపోయిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం తీవ్రత ఏమిటో తేటతెల్లమవుతుంది. జగన్ కార్యక్రమానికి తరలివస్తున్న ప్రజల దృశ్యాలు చూస్తుంటే తెలుగుదేశం వారి గుండెలలో రైళ్లు పరుగెత్తి ఉండాలి. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వందల మంది పొలాలకు అడ్డం పడి మరీ పరుగులు తీసుకుంటూ రావడం కనిపిస్తుంది. ప్రత్యేకంగా సభ ఏమీ లేకపోయినా, ఈ స్థాయిలో జగన్ అభిమానులు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు, లోకేశ్‌ల ప్రభుత్వ అరాచకపు పాలనపై నిరసనను చెప్పడానికే అన్నది స్పష్టం.వైఎస్‌ జగన్‌ మాజీ సీఎం అయినప్పటికీ ఆయనకు తూతూ మంత్రంగా కల్పించిన భద్రత కూడా ఈ పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీరుపై పలు విమర్శలకు కారణమైంది. జగన్ వచ్చిన హెలికాఫ్టర్ వద్దకు జనం చొచ్చుకుపోయారంటే పోలీసుల సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ అంత ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా మొదటి పేజీలో ప్రచురించడాన్ని బట్టి ఏపీలో ఉన్నది పోలీసు రాజ్యం అని, కింది స్థాయి పోలీసులపై అధికారులకు కంట్రోల్ లేదని స్పష్టమవుతుంది. ఇది ఆ ఎస్‌ఐ క్రమశిక్షణ రాహిత్యమైనప్పటికీ రెడ్‌బుక్‌ పాలనలో అలాంటివారికి ప్రోత్సాహం లభిస్తుండటం దురదృష్టకరం. ఆ ఎస్‌ఐ గత ఎన్నికలలో టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించి, లోకేశ్‌తో సహా పలువురు టీడీపీ నేతలను కలిశారని స్పష్టమైనప్పటికీ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోగా, టీడీపీ ఎమ్మెల్యే కోరినట్లు పోస్టింగ్ ఇస్తే, అతను ఆ పార్టీ ఏజెంట్‌గా కాకుండా, ప్రజల కోసం పనిచేసే పోలీసుగా ఎందుకు వ్యవహరిస్తారు? ఇలాంటి వారు టీడీపీకి అనుకూలంగా పనిచేయరన్న గ్యారెంటీ ఏముంటుంది?.పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. ఏపీలో బీహారును మించిన భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి బీహారులో ఇలా రెడ్ బుక్ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై హింసకు దిగడం లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ మాదిరి మారవద్దని బీహారులో అక్కడి రాజకీయ పార్టీలు చెప్పుకోవాలి. తప్పుడు కేసులు ఎలా పెట్టాలి? ప్రతిపక్ష నేతలను, పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని ఎలా వేధించాలి? సినీ నటులను సైతం వదలకుండా ఒకటికి ఇరవై కేసులు పెట్టి, వందల కిలోమీటర్ల దూరం ఎలా నిత్యం తిప్పాలి? ఎప్పుడో ఏదో జరిగిందని, ఏళ్ల తర్వాత మనోభావాలు గాయపడ్డాయంటూ చిత్రమైన కేసులు ఎలా పెట్టాలి? అన్న వాటిలో ఏపీ పోలీసులు ఆరితేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పిచ్చి పాలన ఏపీలో మాత్రమే ఉంటుందేమో!.వైఎస్‌ జగన్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా రెడ్‌బుక్ పాలన సాగుతోందని అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యలకు గురైన తీరు, వారి వివరాలు, తప్పుడు కేసులలో రోజుల తరబడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను జైళ్లలో నిర్భంధిస్తున్న విధానం, స్థానిక ఉప ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యకాండ, బలం లేకపోయినా పోలీసుల సాయంతో గెలవాలన్న దుర్నీతి, మొదలైన వాటిని సోదాహరణంగా వివరించారు. వాటిలో ఒక్కదానికైనా ప్రభుత్వపరంగా మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ, గత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాలను పక్కనబెట్టి, పోలీసులపై జగన్ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ టూర్‌ను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా ఒకటే ఏడుపుతో కధనాలు ఇచ్చిందని చెప్పాలి.పచ్చ చొక్కాలతో పనిచేసే పోలీసుల బట్టలూడదీస్తామని, అధికారంలోకి వచ్చాక చట్టం ముందు నిలబెడతామన్నది జగన్ భావన అయితే ఏదో రకంగా పోలీసులలో తప్పుడు అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వార్తలు ఇచ్చాయి. తమ ఏడుపుగొట్టు వార్తల ద్వారా జగన్ టూర్‌కు జనం అశేష సంఖ్యలో వచ్చారని ఎల్లో మీడియా పరోక్షంగా అయినా ఒప్పుకోక తప్పలేదు. గతంలో చంద్రబాబు, లోకేశ్‌లు, అచ్చెన్నాయుడు తదితరులు విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు, దూషణలు చేసింది అందరికీ తెలుసు. లోకేశ్‌ అయితే రెడ్ బుక్ పేరుతో జిల్లా ఎస్పీలనే బెదిరిస్తూ చేసిన ప్రకటన సంగతేమిటి?.పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలోనే పోలీసుల వ్యాన్‌ పైనే రాళ్లదాడి చేసినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నుపోతే కనీసం సానుభూతి అయినా చూపిందా?. అచ్చెన్నాయుడు కుప్పంలో పోలీసులను బూతులతోనే దూషించారే. ఈ ఎల్లోమీడియా అసలు ఆ ఘటనలపై వార్తలనైనా ఇచ్చిందా?. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అన్నట్లు అధికార టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తుంటే, వారికి ఎల్లో మీడియా భజన చేస్తోంది. ఏది ఏమైనా జగన్ టూర్ ద్వారా ఒక విషయం బోధపడుతుంది. రెడ్ బుక్ అన్న దానిని ఒక పిచ్చికుక్క మాదిరి ఎంత ఎక్కువగా ప్రయోగిస్తే ప్రజలలో అంత నిరసన వస్తుందని, అంత స్థాయిలో తిరుగుబాటు వస్తుందని తేలింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Anand Mahindra Tweet About Dr Nayar8
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్

తన ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. మియావాకి అడవి అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ డాక్టర్ నాయర్ గురించి తెలియదు అని పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక అడవిని చూడవచ్చు. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి అడవిని డాక్టర్ నాయర్ ఎలా సృష్టించారో నాకు తెలియదు. సుస్థిరతకు ప్రాధాన్యం లేని ఈ రోజుల్లో.. మన మధ్య ఇలాంటి హీరోలు ఉండటం గర్వకారణం అని ఆయన ట్వీట్ చేశారు.నాయర్ నిర్మించిన అడవిగుజరాత్‌లోని కచ్‌లో నాయర్ సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో అడవిని నిర్మించారు. ఇందులో 3,00,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఈ అడవిని జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో సహజ పర్యావరణ వ్యవస్థలను అనుకరించడానికి వివిధ రకాల స్థానిక వృక్ష జాతులను దగ్గరగా నాటడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇవి సాధారణ మొక్కలకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.ఎవరీ డాక్టర్ నాయర్డాక్టర్ నాయర్ పర్యావరణవేత్త & ఎన్విరో క్రియేటర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. 2014లో ఈయన 1500 చెట్లతో.. మియావాకి అడవిని ప్రారభించడం మొదలుపెట్టారు. ఇలాంటి అడవులను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నిర్మించారు. వీటిలో చెప్పుకోదగ్గది కచ్‌లోని స్మృతివన్ మియావాకి అడవి. దీనిని 2001 గుజరాత్ భూకంప బాధితులకు నివాళిగా నిర్మించారు. కాగా 2030 నాటికి 100 కోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా డాక్టర్ నాయర్ ముందుకు సాగుతున్నారు.మియావాకి పద్దతి1970లో జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో మొక్కలను దగ్గరదగ్గరగా నాటుతారు. కాబట్టి ఇవి సాధారణ చెట్ల కంటే 10 రేట్లు వేగంగా పెరుగుతాయి. ఈ పద్దతిలో మొక్కలను పెంచడం వల్ల మట్టి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది.I knew what a Miyawaki forest was but had no idea about Dr Nair and how he had created the world’s largest such forest in India. At a time when the U.S has taken sustainability off its priority list I am just grateful that we have such heroes amongst us…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/WNra4TnhVP— anand mahindra (@anandmahindra) April 9, 2025

Chhaava Movie OTT Streaming Details Now9
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్‌ సర్‌ప్రైజ్‌

బాలీవుడ్‌ హిట్‌ సినిమా 'ఛావా' ఓటీటీ ప్రకటన సడెన్‌గా వచ్చేసింది. విక్కీ కౌశల్‌,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. అయితే, సినిమాకు మంచి ఆదరణ రావడంతో మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదలపై మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) 'ఏప్రిల్‌ 11'న విడుదల కానుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, హిందీ, తెలుగు రెండు భాషలలో విడుదల చేస్తారా లేదా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్‌ చేస్తారా..? అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రెండు భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్‌ కావచ్చని సమాచారం. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.750 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్‌ చేసిన ఛావా కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్‌ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్‌ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్‌ (విక్కీ కౌశల్‌). మొగల్‌ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్‌ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd— Netflix India (@NetflixIndia) April 10, 2025

Worlds Most Expensive Bottled Waters: Why Celebrities Drink This10
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!

ప్రతి మనిషికీ ప్రాణవాయువు తరువాత అత్యంత ప్రామాణికమైనది నీరు. మనిషి దేహంలో సుమారు 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో కానీ, నీరు అందకుంటే మాత్రం ప్రాణాపాయమే. అయితే ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారిన విషయం విదితమే. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం, మనం కొనడం సాధరణమైపోయింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలో ప్రముఖ టాలీవుడ్‌ సినీ హీరో ఓ వాటర్‌ బాటిల్‌తో నీరు తాగడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ వాటర్‌ బాటిల్‌ ధర అక్షరాలా 130 నుంచి 160 రూపాయలట. అంటే ఆ బ్రాండ్‌ ఒక లీటర్‌ నీరు సుమారు రూ.500. నిజంగా హైదరాబాద్‌లో వందలు, వేలు ఖర్చు చేసి ఒక లీటర్‌ నీటిని కొంటున్నారా.. అంటే? ఔననే సమాధానం వస్తుంది. వందలు వేలు కాదు.. కొందరు ప్రముఖులు ఏకంగా లక్షల రూపాయలు విలువైన వాటర్‌ బాటిళ్లు కొని మరీ తాగుతున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నగరంలో ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.20లు. ఫ్లేవర్డ్‌ వాటర్‌ బాటిల్‌ లేదా స్పార్లి్కంగ్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది. వాటర్‌ బాటిళ్ల అమ్మకం ఐఎస్‌ఐ మార్క్, బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాల పై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి సహజ వనరైన నీటిని ఇంత ధరల్లో అమ్మడం కూడా అనైతికమని పలు సంస్థలు, సామాజిక వేత్తలు నినదిస్తున్నారు. కానీ హైదరాబాద్‌ వంటి మహానగరంలో నీటిని వేలకు వేలు పెట్టి మరీ తాగున్నారనే విషయం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా కొన్ని రెస్టారెంట్లకు వెళితే బయట 20 రూపాయలకు లభించే లీటర్‌ వాటర్‌బాటిల్‌ ధర 40 నుంచి 80 ఉంటుంది. దీనికి సొంత బ్రాండింగ్, నీటి స్వచ్ఛత, మినరల్స్‌ మిక్సింగ్‌ వంటి అంశాలను వెల్లడిస్తారు. దీనికి మించి నగరంలోని కొన్ని స్టార్‌ హోటళ్లలో 250 నుంచి 300 మి.లీ వాటర్‌బాటిల్‌ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నేచురల్‌ మినరల్‌ వాటర్‌ అని, నేచురల్లీ ఆల్కలైన్‌ వాటర్‌ అనీ విభిన్న పద్ధతుల్లో ఈ నీటిని అందిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్లీ సర్టిఫైడ్‌ బ్రాండ్స్‌ అంటూ లీటర్‌కు సుమారు వెయ్యిరూపాయల వరకూ ధర నిర్ణయిస్తున్నారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్‌ హోటళ్లలో జరిగే బిజినెస్‌ మీటింగ్స్, ఫంక్షన్స్‌లో ఈ తరహా వాటర్‌ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అంతే కాదు.. సాధారణంగా లంచ్‌ లేదా డిన్నర్‌ కోసం వెళ్లిన నగరవాసులు సైతం ఈ నీటిని సేవిస్తుండటం విశేషం. నార్వేలోని భూగర్భ జలాల నుండి సేకరించిన వోస్‌ ఆర్టేసియన్‌ వాటర్‌ (12 బాటిళ్ల ప్యాక్‌ సుమారుగా 6,600), ఆరావల్లి పర్వత శ్రేణి నుంచి సేకరించిన ఆవా సహజ అల్కలైన్‌ వాటర్, క్రికెటర్‌ కోహ్లీ తాగే ఎమియన్‌ వంటి ఖరీదైన బ్రాండ్స్‌ నగరంలో లభిస్తుండటం విశేషం. వజ్రాల బాటిల్స్‌లో తాగే నీరు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్‌ 90 ఏ20 డైమండ్‌ ఎడిషన్‌ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్‌ లగ్జరీ కలెక్షన్‌ డైమండ్‌ ఎడిషన్‌ బాటిల్‌ ధర రూ.65 లక్షల వరకూ ఉంది. ఈ బాటిల్‌లో 600 జీ/వీఎస్‌ తెల్ల వజ్రాలు, 250కు పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్‌ ఉంటుంది. ఆక్వా డీ క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడిగ్లియాని అనే బ్రాండ్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.44 లక్షలకు పైమాటే. ఈ బాటిల్‌ 2010లో అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును దక్కించుకుంది. ఫిజియన్, ఫ్రెంచ్‌ స్ప్రింగ్స్‌–ఐస్లాండ్‌ హిమ నదీ నుంచి సేకరించిన ఈ నీటిని 750 మి.లీ పరిమాణంలో 24–క్యారెట్ల బంగారు బాటిల్‌లో అందిస్తారు. దక్షిణ కాలిఫోరి్నయాలోని పలోమర్‌ పర్వతం నుంచి సేకరించే బ్లింగ్‌ హెచ్‌20 ధర 2 లక్షల వరకూ ఉంది. నెవాస్‌ గ్లో–ఇన్‌–ది–డార్క్‌ బాటిల్‌ వాటర్‌ మాగ్నమ్‌ ధర దాదాపు రూ.1.32 లక్షలు. వంద శాతం సహజమట..! వందలు వేలు కాదు.. ప్రపంచవ్యాప్తంగా తాగే నీటిని లక్షల విలువ చేసే బాటిళ్లలో అమ్మడం కూడా మొదలైంది. ఇంతటి ఖరీదైన వాటర్‌ బాటిళ్లు మన దేశంలో కూడా కొని తాగుతున్నారు కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు. ప్రముఖ భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకునే ఏవియన్‌ నేచురల్‌ స్ప్రింగ్‌ వాటర్‌ మాత్రమే తాగుతాడు. ఈ నీరు వంద శాతం సహజ నీరు, ఫ్రాన్స్‌లోని ఏవియన్‌–లెస్‌–బెయిన్స్‌ సమీపంలోని సహజ వనరుల నుంచి సేకరించినవి. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలంటాయని, అంతేకాకుండా ఎలాంటి రసాయనాలతో కలుషితం కాదని నిర్థారించినవి. విరాట్‌ కోహ్లీ ప్రతి యేటా సుమారు రూ.4.3 లక్షల వరకూ ఈ నీటి కోసం వెచ్చిస్తాడని సమాచారం. (చదవండి: 'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ..అనుబంధాలకు ప్రతీక..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement