
న్యూఢిల్లీ: అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాని మోదీ నాయకత్వంలో వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటిలాగే దేశం, ప్రజల భద్రతకు కట్టుబడి ఉంటుందన‍్నారు.
మోడీ 3.0 భారతదేశ భద్రత కోసం తన ప్రయత్నాలను తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. తిరుగుబాటు, నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు.
మోదీ దార్శానికతకు అనుగుగుణంగా రైతులకు సాధికారత కల్పించడం, గ్రామీణ జాతీయ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా సహకార మంత్రిత్వ శాఖ పనిని కొనసాగిస్తుంది. లక్షలాది మందికి కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.