
పుణే: సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్(84) అనారో గ్యం బారినపడ్డారు. తీవ్రమైన దగ్గు కారణంగా మా ట్లాడటం కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే 4 రో జుల్లో ఆయనకున్న కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.
ఆరోగ్యం బాగోలేకున్నా ఆయన గురువారం పుణే లోని వసంత్‌దాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగించారు. ఆ సమయంలో తరచూ దగ్గుతూనే 18 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు. ‘శరద్ పవార్ జీ ఎడతెగని దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే, వచ్చే నాలుగు రోజుల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి’అని శనివారం ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ చెప్పారు.