
బంగారం నుంచి చీరల దాకా ఉబర్ క్యాబ్‌ల్లో వదిలేస్తున్నారు
ముంబై నగరంలో మరీ ఎక్కువ
ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్. రోజంతా కష్టపడి షాపింగ్ చేశాక ఇంటికొచ్చే దారిలో పెళ్లి చీర. కష్టించి సంపాదించిన డ బ్బుతో కొన్న బంగారు బిస్కెట్. ఇలాంటివన్నీ క్యాబ్‌లో మర్చిపోతే! అంత విలు వైన వస్తువులు ఎవరైనా మర్చిపోతా రా అని కొట్టిపారేయకండి. భారతీయులు ఉబర్ క్యాబ్‌ల్లో మర్చిపోయిన వస్తువుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఉబెర్ 9వ ‘లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్’విడుదల చేసిన గణాంకాల్లో ఇ వన్నీ ఉన్నాయి. భార త్‌లో అత్యంత మతిమరుపు నగరంగా ముంబై నిలిచిందని నివేదిక తేల్చింది.
బ్యాగులు, పర్సులు, తాళాలు, కళ్లద్దాలు, ఇయర్ ఫోన్స్ వంటివాటిని మర్చిపోవడం పరిపాటే. కానీ కొందరు మాత్రం మతిమరుపును మరో లెవల్‌కు తీసుకెళ్లారు. వీల్ చైర్, 25 కిలోల నెయ్యి డబ్బా, యజ్ఞకుండం, పెళ్లి చీర, బంగారు బిస్కెట్ల వంటివాటిని కూడా క్యాబ్‌లో మర్చిపోయారు. వినియోగదారులు కోల్పోయిన వస్తువులను గుర్తించే ఇన్–యాప్ ద్వారా ఆయా వస్తువులను ఉబర్ వారికి తిరిగి చేర్చిందన్నది వేరే విషయం. 2024లో అత్యంత ’మతిమరుపు’ నగరాల జాబితాలో ముంబై తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యధిక ‘మతిమరుపు’నగరాల్లో పుణే, బెంగళూరు, కోల్‌కతా కూడా ఉన్నాయి. హైదరాబాద్ మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రయాణికులు వస్తువులను మర్చిపోయింది చాలా తక్కువట.
2024లో అత్యధిక మతిమరుపు రోజులు
→ ఆగస్టు 3 (శనివారం, శివరాత్రి), సెపె్టంబర్ 28 (శనివారం), మే 10 (శుక్రవారం, అక్షయ తృతీయ)
మరిచిన టాప్ 10 వస్తువులు
→ బ్యాక్ ప్యాక్/బ్యాగ్, ఇయర్ ఫోన్స్/స్పీకర్, ఫోన్, వాలెట్/పర్స్, కళ్లద్దాలు/సన్ గ్లాసెస్, తాళంచెవులు, బట్టలు, లాప్‌టాప్, వాటర్ బాటిల్, పాస్‌పోర్ట్
మర్చిపోయిన అరుదైన వస్తువులు
→ విగ్, టెలిస్కోప్, గ్యాస్ బర్నర్ స్టవ్, 25 కిలోల నెయ్యి, వీల్‌చైర్, పిల్లనగ్రోవి, పెళ్లి చీర, గోల్డ్ బిస్కెట్, కుక్కలు మొరగకుండా నియంత్రించే పరికరం, యజ్ఞకుండం
శనివారం జాగ్రత్త
శనివారం ప్రయాణాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండండి. వారంలో అత్యంత మతిమరుపు రోజు ఇదేనని ఉబర్ నివేదిక తేల్చింది. అందులోనూ శనివారం సాయంత్రాలు మతిమరుపు పీక్స్‌లో ఉంటోందట. ప్రయాణికులు అత్యధికంగా వస్తువులను క్యాబ్‌ల్లో మర్చిపోయింది ఆ రోజే. ఈ విషయంలో పండగ రోజులూ తక్కువేమీ కాదు. పర్వదినాల్లో కూడా ప్రయాణికులు ఉబర్‌లో అత్యధికంగా వస్తువులు మరిచిపోయారు. ‘‘మర్చిపోయిన వస్తువులను సులభంగా తిరిగి పొందేందుకు ఉబర్ క్యాబ్‌ల్లో ఇన్–యాప్ ఆప్షన్ ఇచ్చాం. అయినా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి’’అని ఉబర్ ఇండియా దక్షిణాసియా కన్జ్యూమర్ అండ్ గ్రోత్ డైరెక్టర్ శివ శైలేంద్రన్ సూచించారు. వస్తవులన్నింటినీ ఒకే బ్యాగ్‌లో వేసుకోవడం, క్యాబ్ దిగేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మేలని చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్