
న్యూఢిల్లీ: ఈనెల 19 నుంచి 25 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లడం మొదలవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ఏటా సాధారణంగా జూన్ ఒకటో తేదీన తొలిసారిగా కేరళను తాకుతాయి. అక్కడి నుంచి విస్తరిస్తూ జూలై ఎనిమిదో తేదీకల్లా దేశమంతా చుట్టేస్తాయి.
తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన తిరోగమనం మొదలై అక్టోబర్ 15 కల్లా వెళ్లిపోతాయి. ఈ నైరుతి సీజన్‌లో దేశంలో సగటున 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం కంటే ఈసారి 8 శాతం ఎక్కువ నమోదవడం గమనార్హం.
ఇదీ చదవండి : ఇయర్‌రింగ్స్‌తో కుట్ర..ట్రంప్-హారిస్ డిబేట్‌పై చర్చ