
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్ కుమార్‌లు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులు మజ్జి మదన్మోహన్, ఎస్.కిషోర్ కుమార్, చౌదరి రవీంద్ర, లండ బాబురావు, టెంక చలపతిరావు, బి.రవి కుమార్, ఎస్వీ రమణమూర్తి, పూజారి హరి ప్రసన్న, కొమ్ము అప్పలరాజు, వాల్తేటి సత్యనారాయణ, జి.రమణ, సీర రమేష్ బాబు, జగన్మోహన్ ఆప్తా, బలివాడ ధనుంజయరావు, కొత్తకోట శ్రీహరి, గొంటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.