
గనుల తవ్వకాలపై ఎంపీ ఆగ్రహం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో కొడింగా మాలిలో గనుల తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కేంద్రంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రామ సభ, పల్లె సభ తీర్మానాలను ఉల్లంఘించి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. గత తీర్మానాలను పక్కన పెట్టి తవ్వకాల పరిధిని పెంచారన్నారు. అందుకు కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో మోహన్ మజ్జి ప్రభుత్వాలు గనుల తవ్వాకాలకు రాజ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. గిరిజనులకు మిగిలేది కేవలం కాలుష్యమేనన్నారు. తాము అంబెడ్కర్ ఆశయాల సాధన కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో బలహీన వర్గాలకు అండగా నిలబడతామన్నారు. కొడింగా మాలిలో బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఎంపీ సప్తగిరి ఉల్క హెచ్చరించారు. ఈ సమావేశంలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, ఎంపీ ప్రతినిధి మనోజ్ ఆచార్యలు పాల్గొన్నారు. అంతకు ముందు నియోజకవర్గ పర్యటనలో భాగంగా అంబెడ్కర్ సంఘాలతో సమావేశమయ్యారు.

గనుల తవ్వకాలపై ఎంపీ ఆగ్రహం