
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సోంపేట: మండలంలోని బేసి రామచంద్రాపురం జాతీయ రహదారి వద్ద గురువారం ఉదయం జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు రుద్రశెట్టి (23) మృతి చెందాడు. బారువ పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సోదరులు రుద్రశెట్టి, బబ్లూ శెట్టి గుంటూరులో క్వారీ పని చేస్తున్నారు. స్వగ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. బేసిరామచంద్రాపురం వద్దకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీకొట్టి పడిపోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన డంతో రుద్రశెట్టి ఘటనా స్థలంలోనే మృతి చెందా డు. బబ్లూశెట్టికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి కి తరలించారు. బారువ ఎస్.ఐ హరిబాబునాయు డు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.