
బిజూ విగ్రహ ప్రతిష్టపై తొలగిన వివాదం
కొరాపుట్:
బిజూ పట్నాయక్ విగ్రహ ప్రతిష్టపై ఎట్టకేలకు జయపూర్‌లో వివాదం తొలగిపొయింది. ఈ విగ్రహం ప్రతిష్ట పై ఈ నెల 17వ తేదీ లోపు చర్యలు ప్రారంభించకపోతే ఆందోళనకి దిగుతామని బీజేడీ పార్టీకి చెందిన మాజీ మంత్రి రబి నారాయణ నందో హెచ్చరించిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత తాము సూచించిన స్థల ప్రతిపాదనలపై మున్సిపల్ ఈఓ చార్జిలో ఉన్న సబ్ కలెక్టర్ ఆకవరం శశ్యా రెడ్డికి లేఖ రాశారు. దీనికి సబ్ కలెక్టర్ అంగీకరిస్తున్నట్లు బదులిచ్చారు. 15 నుంచి 20 రోజుల్లోపు విగ్రహ ప్రతిష్ట పూర్తి చేస్తామన్నారు. గురువారం జయపూర్ విక్రం నగర్ లో బీజేడి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రబీ నందో, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ బాలారాయ్ లు మాట్లాడారు. ఈ స్థల సేకరణతో పాటు ప్రతిష్ట పనులు ప్రారంభించినందుకు వైస్ చైర్మన్ బి.సునీతతో పాటు బీజేడి కౌన్సిలర్లను అభినందించారు. దీంతో వివాదానికి తెర పడింది. మరో వైపు గురువారం ఉదయం బీ.సునీత నేతృత్వంలో కౌన్సిలర్ల బృందం పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో విగ్రహ ప్రతిష్ట చేయాల్సిన ప్రదేశంలో జరిగిన పనులు పర్యవేక్షించారు. ఈ బృందంలో కౌన్సిలర్లు పద్మా రెడ్డి, లక్ష్మీ నారాయణ చౌదరి, దేవో చౌదరి, సుశ్మా మహాపాత్రో, అజిత్ బెహరా ఉన్నారు.

బిజూ విగ్రహ ప్రతిష్టపై తొలగిన వివాదం

బిజూ విగ్రహ ప్రతిష్టపై తొలగిన వివాదం