
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుత పాలన అధ్వానంగా ఉందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. ఔరంగజేబు పరిపాలన ఆనాటి పాలన కంటే నేటి రాష్ట్రంలోని బీజేపీ పాలనే అధ్వానమన్నారు. కేవలం బీజేపీ వల్లే ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నాయని సంజయ్ రౌత్ విమర్శించారు.
ఒక్క రైతులే కాదని, నిరుద్యోగులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పుడుతన్నారన్నారు. ఔరంగజేబు ఇక్కడ 400 ఏళ్ల చరిత్ర ఉంది. మనం దాదాపు ఆయన్ని మరిచిపోయాం. మరి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు అప్పటి ఔరంగజేబు కారణమా?, మీ వల్లే(బీజేపీ) రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహాయుతి కూటమి వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఆనాటి మొఘల్ చక్రవర్తి దౌర్జన్యాలు చేస్తే, మరి నేటి ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు.